ఆది. 9:17; మార్కు. 13:29; 1కొరింధి. 15:23
"మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును" ( ఆది 9:13 ).
నోవహు మరియు కుటుంబము ఓడలోనుడి బయటికి వచ్చిన తరువాత దేవుడు వారి దగ్గరకు వచ్చి వారితో ఈలాగు చెప్పెను. "మేఘములో నా ధనస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును". దీనిలోని సంగతులు: -
- 1) మేఘము,
- 2 ) ధనుస్సు,
- 3 ) నిబధన,
- 4 ) గుర్తు.
- ( 1 ) నాకును
- ( 2 ) భూమికిని.
- 1 ) మేఘము: - మేఘము చేయ మొదటి పని సూర్యుని కనబడకుండ చేయును. మరియు పొలములోనున్న వారు
మేఘమును చూచి వర్షము వచ్చునని భయపడి ఇంటికి పొవుదురు. ఆలాగే జబ్బు వచ్చినప్పుడు, 'రాకరాక జబ్బు వచ్చినది
వదలుట లేదు. తుదకు నన్నేమిచెయునో' అను మేఘము కమ్ముకొనును. మనిషి అధైర్యపడును. వ్యాధి, శోధన,
కష్టము, ఇబ్బంది మొదలగునవి వచ్చినప్పుడు ఇట్టి మేఘము కమ్మును. వ్యాధిలోనున్నవారు రాత్రి సమయములో
భయపడి ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు సూర్యుని చూతుమా అని అనుకొందురు. తెల్లవారగానే దైర్యము కలుగును.
ఒక కష్టము వచ్చినప్పుడు ఒక రకమైన మేఘము మనలను ఆవరించును. ఇట్టి క్ష్టములు కలిగినప్పుడు
లెక్కచేయనియెడల మేఘము మనుష్యుని ఆవరించదు. జబ్బు, నింద, పాప శోధన వీటన్నిటివలన అదైర్యము
కలిగిన యెడల అది దట్టమైన మేఘమువంటిది. వాటివలన కలిగిన ఆందోళనయే నల్లని మేఘము.
- (ఎ ) వర్షము: - జబ్బు, కష్టము ఎక్కువైన యెడల చివరకు ఏడ్పువచ్చును. కంట నీరు వచ్చును. ఇదియే ఒకరకమైన వర్షము. ఇట్టి వర్షము కురిపించుట దేవునికి ఇష్టము. ఎందుకనిన ఇట్టి పర్థితి వచ్చినప్పుడే మనిషి దేవుని తట్టు తిరుగును. భయమనే నల్లని మేఘము, పశ్చాత్తాపమను కన్నీళ్ళ వర్షము కురిపించును. ఈరెండు అయిన తర్వాత మనిషి బాగుపడును. బాగుగా ఏడ్వనిచ్చి తర్వాత దేవుడు ఆదరించును.
- ( బి ) సూర్యుడు : - మబ్బుపోయిన తర్వాత సూర్యకాంతి ( ఎండ ) వచ్చును. కష్టము బాధపోయిన తర్వాత క్రీస్తుప్రభువుయొక్క ముఖబింబమును చూడగలము. మబ్బులో సూర్యుని చూడలేము. ఆలాగే కష్టములలో ప్రభువును చూడలేము. ఆ కష్టములు తీరిన తర్వాత చూడగలము. మరియు దేవుడు తన ముఖమును తన కుమారునిలో చూపించెను. తుఫాను అయిన తర్వాత ఎండను చూడగానే మనుష్యులకు సంతోషము కలుగును. తుఫాను తర్వాత సూర్యకిరణములు భూమిమీద పడునట్లు, దేవుడు తన మహిమ కిరణములను భూమిమీదికి రానిచ్చును.
- 2. ధనస్సు :- మేఘము, వర్షము, సూర్యుడు - ఇవన్నీ అయిన తర్వాత ధనస్సు కనబడును. ధనస్సు అనగా వాగ్ధానము, నిభందన. అయితే నిబంధనకు ఇద్దరుండవలెను. పెండ్లిలో ఇరుపక్షములవారు మాట్లాడుకొన్నతర్వాత గుర్తుగా ఏదో ఒక వస్తువు పెండ్లికూతురునకు ఇచ్చెదరు. అలాగే దేవుడు యూదుల ద్వారా లోకమునకు ఒక గురుతు ఇచ్చెను. ధనస్సు ద్వారా లోకమునకు నిబందన ఇచ్చినట్లు, యూదుల వంశములోనుండి లోకమునకు రక్షకుని పంపెను. ధనస్సు చూడగానే దేవుడు దయగలవాడు అని జ్ఞాపకము వచ్చినట్లు, ప్రభువును తలంచగానే 'దేవుడు దయగలవాడు, తన కుమారుని ద్వారా నా పాపములు క్షమించి, నన్ను రక్షించెననీ జ్ఞాపకమురావలెను. ఇది కృపా నిబంధనకు గుర్తు.
- 3. నిబధన:- యూదులు పాపము చేసినప్పుడు తండ్రివలె దేవుడు విశ్వాసులను శిక్షించెను గాని నిబధన కొట్టివేయలేదు. దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించి వారిలోనుడి రక్షకుని రప్పించెను. ఆలాగుననే దేవుడు విశ్వాసులను శిక్షించునుగాని రక్షణ మాత్రము తీసివేయడు. మనిషి తనంతట తాను రక్షణ తీసివేసికొనవచ్చును గాని దేవుడు మనిషి పాపముచేసి దేవుడు నన్ను రక్షించడని అవిశ్వాసపడి, తన రక్షణ తానే పోగొట్టుకొనును.దేవుని రక్షణ నిబంధనను మానవుడు తనంతట తానే కొట్టివేసికొనును. మనుష్యునికి రక్షణ పోవుట పాపము వలన కాదుగాని, తన అవిశ్వాసము వలననే. దేవుని నమ్ముట వలన నిబంధనకు దూరమగుట జరుగును. అట్లు దూరమైనను మరల విశ్వాసము కలిగించుకొని నిబంధనలొనిఎకి రావచ్చును.
- 4. గురుతు:- ధనసూనకు 'దేవుని ధనస్సు ' అని గొప్ప బిరుదుగలదు. దీనిపని గురుతుగా నుండుట. ఇది దేవుని నిబంధనకు గుర్తుగా నున్నది. నోవహు కాలము మొదలుకొని, మనకాలము వరకు లోకమంతటిని ముంచివేయు వర్షము రాలేదు గనుక తండ్రి చెప్పిన మాట నెరవేరినది. అక్కడక్కడ వర్షము వచ్చి కొన్ని గ్రామములు పోవుట, మనుష్యులు జీవరాసులు నశించుట్త్త నిజమేగాని మనుష్యులందరు, జీవరాసులన్నియు నశించె బూలోక వరద రాలేదు. బైబిలు నిజమైన గ్రంధమని తెలిసికొనుటకు ఇది ఆధారము. ఆది. 6:7లో నరులను, జంతువులను, పురుగులను తుడిచివేతునని యున్నది. అది నోవహు కాలములో జరిగెను, ఇకను జరుగదు.ఇది బైబిలు నిజమైన గ్రంధమని రుజువు పరచుచున్నది. ఈ నిబహ్దన 'నిత్యనిబంధన ' అని వ్రాయబడియున్నది. ధనస్సు దేవునికి, లోకమునకు మధ్య ఉన్న నిబంధన గుర్తు. ఇది మేఘములలో కనబడును. ఇది వర్షము తరువాత కనబడునని మన అనుభవములో నున్నది. దీనినిచూచి దేవుడు తన నిబధనను జ్ఞాపకము చేసికొనును. 'దేవుని ధనస్సు ' అనగా ఇది దేవిని నిత్యనిబంధన జ్ఞాపకము చేయునది. అనగా 'దేవుడు బూమిని నాశనము చేయడు అనే నిబంధన జ్ఞాపకము చేయును గనుక దేవుడు మనిషిని కూడ జ్ఞాపకము చేసికొనవలసినదే. మనమేమి జ్ఞాపకము చేసికొనవలెననగా, లోకమునకు నీటివలన నాశనము రాదు. ధనస్సుయొక్క స్వరము ఏదనగా, నీటివలన బూమికి నాశనమురాదు. నరులు ఈ సత్యము నమ్మిన యెడల నీటివలనగాని, మరి దేనివలనగాని నాశనము రాదు, నాశనము రాదనుటయే మొదటి సువార్త.
యాకోబు అతని అన్నయైన ఏశావును విడచి దూరముగా పారిపొయినాడు. 20 సంవత్సరములకు తిరిగివచ్చుచూ, అన్నకు 7 మార్లు నంస్కరించెను ( ఆది . 33:3 ). అన్నయొక్క ప్రేమను తనపై కలిగించు కొనుటకు యాకోబు అలాగు చేసెను. చివరకు ఇద్దరు ఎదురైనారు. కౌగలించుకొనుచున్నారు. ఆలాగే మనమును దేవుని ప్రేమను సంపాదించు కొనుటకు దినమునకు అనేకమార్లు దేవునికి నమస్కారము చేయుచుండవలెను. క్షమాపణ 7 మార్లుకాదు 77 మార్లు అని ప్రభువు పేతురుతో చెప్పెను. ఆలాగే నోవహు కాలములో 7 రంగుల ధస్సుతో దేవుడు నిబంధన చేసెను. అది దేవుని దయ. ప్రభువు పత్మసు లంకలో యోహానుకు 7 సంఘములను గురిచి చెప్పెను. ఒక్కొక్కసంఘములో ఒక్కొక్క రకమునకు సంభంధించిన భక్తులు ఉందురు. ఎఫెసు మొదటి సఘము, చివరిది లవొదికయ సంఘము. ఈ సంఘము చివర ప్రభువు సిం హాసనము ఉండును. వేలకొలది భక్తులు ఈ సంఘములలో నుందురు. భక్తి యొక్క అంతస్థులలో తేడాలుండును. ఓడలోనికి అందరు ఏలాగు రాలేదో, ఆలాగే అందరు సంఘములోనికిరారు. ఒకవేళ వచ్చిననూ , వారందరిలోను అనేకులు అవిశ్వాసులుందురు. అందువలనే క్రైస్తవులలో చాలమంది భక్తుల వరుసలో చేరుటలేదు. గనుక ముందు శక్తి పొందవలెను. అనగా ముందు ఆత్మను పొందిన తర్వాత శక్తి వచ్చును. భక్తులలోకూడా 7 రకములు ఉందురు. అందువలనే క్రైస్తవులలో చాలమంది భక్తుల వరుసలో చేరుటలేదు. గనుక ముందు శక్తి పొందవలెను. అనగా ముందు ఆత్మను పొందిన తర్వాత శక్తి వచ్చును. భక్తులలోకూడా 7 రకములు ఉందురు.
పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఈ ఏడింటిలో నీవు ఏ తరగతిలోనున్నది నీకెవ్వరును చెప్పరు. ఎవరు ఏ తరగతికి వెళ్ళవలెనో , ఎవరంతట వారికే తెలిసిపోవును. అనగా వారి వారి అంతరంగ స్థితిని బట్టి ఎవరంతటవారికే తెలిసిపోవును. భూలోక జీవితములో ఎన్ని మెట్లు ఎక్కుదురో పరలోకములోకూడ ఆ తరగతిలోనే ఉందురు. ఒక్కొక్క తరగతిలోను కాంతికూడ ఎక్కువగానుండును. ఒకరు ఎక్కినమెట్టు మరియొకరు ఎక్కవలెనంటే శక్తి చాలదు గనుక ఎక్కలేరు. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును ( 1కొరింధి. 15:23). పరలోకములో 7వ మెట్టు నూతన యెరూషలేము. భూలోక సఘములో భక్తిలో ఏ మెట్టులో అదే మెట్టులో నుందువు. దేవుడు నోవహుతో నిబంధన చేసెను. యోహానుతో నిబధనచేసి, 7 సఘముల స్థితిని చూపించెను. తరగతులు 7, అంతస్థులు 7, ధనస్సు ఒక్కటేగాని రంగులు 7. వారము ఒకటేగాని దినములు 7, యాకోబు ఒక్కడేగాని నస్కారములు7. ధనస్సు తెలియని వారుండరు. ఆలాగే ప్రభువుని ఎరుగనివారు కూడ ఉండరు. రంగులు చూడగా సూర్యుడును, దేవుడును, జ్ఞాపకమునకు వచ్చును. ఆకాశములో సూర్యుడును, మోక్షములో నీతిసూర్యుడైన యేసుప్రభువును ఉన్నారు. ఆ ఓడలో లేనివారు ఓడ బైట నీటిలో మునిగి నశించిరి. ఆలాగే ఈ లోకములో ఉన్న ప్రతివారు 7 సంఘములలో ఏదో ఒకదానిలో చేరవలెను. లవొదికయ సంఘ అంతస్థు అన్ని సంఘ అంతస్థులకంటె ఎక్కువ గనుక చదువరులు అట్టి అంతస్థుకు సిద్ధపడుదురు గాక! ఆమేన్.