ఆది. 6:13 - 14; యోహా . 2:5; హెబ్రీ. 11:6 - 7
"చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలుపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను." ఆది. 6:13- 14.
నోవాహు చేసిన బోధ:- ప్రళయము వచ్చును. ఓడలోనికి రండి, పాపములు మానివేయండి. ఇంకా పాపము చేసిన వరద వచ్చి మ్రింగియేయును. దేవుడు గోఫెరు కర్రతో ( తెలుగులో "చితిసారకపు మ్రాను" ) ఓడ కట్టుమని చెప్పెను. ఆర్మేనియా దేశములో ఆ కర్రగలదు. అది గట్టిది, విరిగిపోదు, పుచ్చిపోదు, పురుగుపట్టదు. దానిమీద కీలుకూడ పూసెను. 'దేవుడు చెప్పినట్లు చేసిన ఆయన: అది నోవహుయొక్క బిరుదు. రైతు చెప్పినట్లు పాలేర్లు చేయవలెను. తండ్రులు చెప్పినట్లు పిల్లలు చేయవలెను. అది మంచి బుద్ధి, ఘనమైన బుద్ధి. వీటన్నిటికన దేవుడు చెప్పినట్లు చేయుట ఎక్కువ, గనుక మనందరికి ఆ బిరుదు రావలెను. అప్పుడు మేలు కలుగును. చెప్పినట్లు చేయు పిల్లలను చూచినప్పుడు ముద్దు వచ్చును. అట్లే దేవుడు చెప్పినట్లు చేసిన దైవ ప్రేమ కలుగును. దేవుడు ఇంకొక పని చేసెను.పక్షులకు, జంతువులకు, ప్రాకు పురుగులకు మీరు ఫలాని ఓడలోనికి వెళ్ళవలెనని చెప్పెను. వాటి మనసులో దేవుడు ఆలోచన కలిగించగా అవి ఓడలోనికి వచ్చెను.పక్షులు, జంతువులు, పురుగులు కలసి జీవరాసులు అనబడును. ఈ జీవరాసులు దేవుడు చెప్పినట్లు చేసెను. ఓడలోనికి వెళ్ళిన వారు ఎనిమిది మంది. ఒక్కమాటలో
- 1) నోవాహు,
- 2) అతని కుటుంబము,
- 3 ) జీవరాసులు.
ఈ కథ దేవుని గ్రంధమగు బైబిలులో గలదు. దేవుడు చెప్పిన మాటలు అందులో గలవు. ఈ కథ బైబిలులోనిదే. దీనిలో ఇంకొక కథ కలదు. యేసుప్రభువు ఒక ఇంటికి పెండ్లికి వెళ్ళెను. అక్కడ ఆయన తల్లియైన మరియ నీళ్ళు మోయువారితో ఒక మాట చెప్పెను. 'యేసుక్రీస్తు మీకు ఏమి చెప్పునో అది చేయండీ అని చెప్పెను ( యోహాను 2:5). బైబిలు మిషను ఇదే మూలవాక్యము కలిగియున్నది. ఆ నీరు మోయువారు ప్రభువు చెప్పినట్లు చేయగా పెండ్లివిందులోని అక్కర తీరెను. అలాగే నోవాహు దేవుడు చెప్పినట్లుచేయగా వారికి రక్షణ కలిగెను. ఓడలోనికి వెళ్ళిన వారు గుంపులు
- 1) మనుష్యులు,
- 2 ) జీవరాసులకు చెప్పెనో అవే వచ్చును.
ఆ ఓడ అందరికి కట్టబడెను గాని ఒక్క నోవాహు కుటుంబమే అందు ప్రవేశించెను. నేటికాలమున క్రైస్తవమతముకూడా అందరికొరకు ఏర్పాటు చేయబడెను. జీవరాసులన్నియు ఓడలోనికి వచ్చునట్లు అన్ని అందరికొరకు ఏర్పాటు చేయబడెను. జీవరాసులన్నియు ఓడలోనికి వచ్చినట్లు అన్ని కులములవారు క్రైస్తవ మతములోనికి వచ్చుచున్నారు. ముందుకు సంఘమను ఓడ వచ్చునని దేవునికి తెలియును. గనుక దేవుడు నావకథ జరుగనిచ్చెను. ఈ రెంటికిని అనగా ఓడకు, క్రైస్తవ సంఘమునకు ఒకటే పిలుపు "రండి" అని రెండూ చెప్పుచున్నవి. క్రైస్తవమతము అన్ని కాలములకు, అన్ని దేశములకు, అందరికొరకు ఏర్పాటు చేయబడిన మతము. నోవాహు ఓడ కట్టించి, తన కుటుంబమును రక్షించుకొనెను. నశించువారు రెండు గుంపులవారు. అక్కడ ఓడలోనికి రానివారు, ఇక్కడ సంఘములోనికి రానివారు. క్రైస్తవ మతము సార్వత్రిక మతము. అందరిని చేర్చుకొను మతము. అయితే మతములోనికి వచ్చిన తర్వాత అన్ని విషయములు నేర్చుకొందురు.
బడిపెట్టి నేర్పించని యెడల పిల్లలందరు పై తరగతిలోనికి వెళ్ళరు. వారు పాసు కాకపోతే పంతులుగారు ఏమిచెస్తారు. ఓడలోనికి రాకపోతే నోవాహు ఏమిచేస్తాడు? ఆలాగే సంఘములోనికి రానివారిని మనమేమి చేత్సాము! ఆ కాలములో జరిగినట్లు ఈ కాలములో కూడ జరుగును. నోవాహు కాలములో లోకము ఎలాగున్నదో లోకాంతమదుకూడ ఆలాగే యుండునని యేసుప్రభువు చెప్పెను. మత్తయి. 24:38; లూకా 17:26. అప్పుడు నోవాహు చెప్పిన బోధ వినలేదు. ఇప్పుడుకూడ ప్రజలు బోధ వినరు. ప్రభువు రాకడ సమయములోకూడ నోవాహు కాలములో జరిగినట్లు పరిస్థితులు ఉండును. జలప్రళయము వచ్చునని చెప్పిన తర్వాత కొందరు పొలమునకు వెళ్ళిరి. కొందరు మేడలు కట్టుచుండిరి, కొందరు పెండిండ్లు చేయుచుండిరి, కొందరు తినుచుండిరి. నోవాహు చెప్పిననను వారు ఓడలోనికి రాలేదు. తెలివిగల వారైన తన కుటుంబీకులే వచ్చిరి. మిగతవారు నిర్లక్ష్యము చేసిరి.వారు వారి పనులమీద, తుఫాను తన పనిమీద నుండి వారందరిని నాశనము చేసెను. ప్రభువు వచ్చు ఈ కాలములోకూడ పాపము చేయవద్దు అని బోధించినను ప్రజలు మానరు. చివరకు నాశనములోనికి పోవుదురు. నోవాహు కాలములో జరిగినవ్న్నియు ఇప్పుడు జరుగుచున్నవి, గనుక యేసుప్రభువు వచ్చువేళ కూడ అయినది. అందుకే పాపాలు ఎక్కువ, జబ్బులు ఎక్కువ. కంగారు ఎక్కువ. అన్ని దుస్ట స్తితిగతులు ఎక్కువాయెను. నోవాహు కాలములో అతిక్రమము విస్తరించెను, గనుక వరద వచ్చెను.
ఈ కాలములో ఇవన్ని జరుగుచున్నవి గనుక క్రీస్తుప్రభువు వచ్చువేళ అయినది.ఆయన వచ్చి తన్ను నమ్మినవారిని తీసికొనిపొవును. ముందు పాపము వచ్చెను. దానినిబట్టి శిక్ష వచ్చెను. ఇప్పుడు ప్రతి చోట పాపమున్నది గనుక నాశనము సమీపముగా నున్నది. రాకడకొడా సమీపముగా ఉన్నది. 1634సం| | లో భూకంపము వచ్చునని శాస్త్రజ్ఞులు తెలియజేయగా అందరువారిని వేళాకోళము చేసిరి, ఇది గ్రహించి వినిన కొందరు తప్పించుకొన్నరు. వేళాకోలము, హేళనచేసి అక్కడ ఉన్నవారు చనిపోయిరి. గవర్నమెంటువారు ఆ చోటును త్రవ్విచూడగా 18 దినములు తర్వాత బ్రతికిన ఒక మనిషి కనబడెను. అతని రెండు ప్రక్కల మంటి గడ్డలు వంటివి ఉండెను. పైనగడ్డ క్రిందిగడ్డ మధ్య ఆ మనిషి ఉండెను గనుక బ్రతికి ఉన్నాడు. త్వరలోనే ఇట్టి నాశనము రానిఎయున్నడి. గనుక త్వరగా రానున్న యేసు అను కీర్తన పాడుచు పాపము విడిచిన నాశనము తప్పించుకొందుము.
రాకడకు సిద్ధపడు కృప మనకు అనుగ్రహించునుగాక! ఆమేన్.