ఆది. 6:13-22; యెహా. 14:6; రోమా. 2:5-9
"విశ్వాసమునుబట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను." హెబ్రీ. 11:7
ప్రియులారా! దేవునివాక్య బోధ వినునప్పుడు మనోనిదానము కలిగియుండవలెను. క్రీస్తు ప్రభువును నమ్మువారు తూలిపోరు.తోమాకు అనుమానము అను గాలితుఫాను, లోతుభార్యకు సంసారమను గాలితుఫాను కలిగెను. కాని నోవాహు కాలములోనిది నిజమైన గాలితుఫాను. నోవాహును దేవుడు ఏర్పరుచుకొని రెండు సంగతులు చెప్పెను.
- ( 1 ) జలప్రళయము వచ్చును. అందరు చనిపోవుదురు, జీవరాసులన్నియు చనిపోవును.
- ( 2 ) ఎవ్వరును మునిగి చనిపోవనక్కరలేదు.
నోవాహు ఓడ కట్టించుచున్నాడు, బోధ చేయుచున్నాడు. ఆయన చేసిన బోధ - 'గాలివాన వచ్చును, నావలోనికి వచ్చిన బ్రతుకుదురు. అప్పటికాల ప్రజలు ఈ మాటలు విన్నారుగాని నమ్మలేదు. ముసలివాడు ఏదో చెప్పుచునాడుగాని వాని మాటలు నమ్మరాదు. వచ్చిన అంత పెద్ద వర్షము వచ్చిన చెట్లు ఎక్కవచ్చును అని వారు నోవాహు బోధకు లోబడలేదు. వారు ఆయన యొద్దకు రాలేదు. అయిననూ, ఆయనే వారిదగ్గరకు పోయెను. వారియొక్క చెవులలో నోవాహు వర్తమానము పడెనుగాని, వారి హృదయములలో పడలేదు. ఇప్పుడునుసంఘ్రమ్మంటేఅట్టిమాటలేఅనుచున్నారు.అములోనికి రమ్మని చెప్పినప్పుడు రానంటే ఏమి చేయవలెను. వారు రాకపోతే నోవాహు, నిలబడవలెనా? వర్షము వచ్చువరకు . ఆలాగున్నయెడల నోవాహుకూడ మునిగిపోవును.120 సం|| లు నోవాహు చెప్పెను, గాని వారు వినలేదు. వినకపోగా నీవు బ్రతుకుదువా! మేము నశించిపోతామా! అని ఎదిరించిరి. దేవుడు నోవహుతో ఇంకా 7 దినములకు జలప్రళయము వచ్చునని చెప్పెను. గనుక ఏడవదినమున ఓడలోనికి పోవుటకు నోవహు సిద్ధపడుచుండెను. తర్వాత ఎవ్వరును ఓడలోనికి పోవుటకు వీలులేదు. ఆ కాల ప్రజలు 120 సం | |లు వినకపోయిననూ 7 రోలలోనైన వింటే బ్రతికి యుందురు.ప్రజలందరు చూచుచుండగా అన్నియు ఓడలోనికి పోవుచున్నవి. పక్షులు, జంతువులు, జంతువులు, జీవరాసులు మగది, ఆడది జతలుజతలుగా ఓడలో ప్రవేశించుట పక్షులు,, జంతువులు, జీవరాసులు మగది, ఆడది జతలుజతలుగా ఓడలో ప్రవేశించుట వారందరు చూచిరి. అన్ని ఓడలో ప్రవేశించెనుగాని మనుష్యులే మిగిలిరి. అప్పుడు వచ్చిననూ ఆయన రానిచ్చును, గాని వారు నవ్వి హేళనచేసిరి . జళప్రళయము ఏమిరాదు, ఆయనకు పిచ్చిపట్టినదనిరి. దేవుడు 120 సం ||లు కనిపెట్టెను, ఏడు దినములుకూడ కనిపెట్టెను గాని వారిలో ఎవరును రాలేదు, పశువులు, పక్షులు, జీవరాసులు, నోవాహు కుటుంబము ఎనమండుగురు ఓడలో ప్రవేసించిరి. మిగతా వారికి శిక్షరావలెను, జలప్రళయము రావలెను. గనుక దేవుడు ఓడ తలుపు బిగించెను. తలుపు వేసిన తర్వాత ఎవరైన వచ్చినను లాభములేదు. దేవుడు ప్రవేశించి తలుపు బిగించెను. ఓడలోపల జీవరాసులు, నోవాహు కుటుంబము, సామానులు, ఆహారము మరియు ప్రభువు కూడ వారితో నుండెను. ప్రభువే తలుపు వేసెను. వారికి భయమున్నదా? ప్రభువు వారితో లోపల ఉన్నాడు గనుక భయములేదు. తలుపువేసిన వెంటనే గాలివాన వచ్చెను.
ఆది. 19:10లో దూతలు లోతును లోపలికిలాగి తలుపు బిగించగానే బయటనున్న వారి కన్నులు గ్రుడ్డివాయెను. తలుపువేయబడగా శ్రమ తప్పదు. తరువాత గాలివాన వచ్చినది. కొందరు ఇండ్ల పైకి, తర్వాత చెట్లమీదికి, తర్వాత కొండలమీదికి వెళ్ళిరి. నీరుకూడపొంగి, వీటన్నిటిని ముంచివేసెను. ఇంకెక్కడికి వెళ్ళగలరు, ఈదుకొని వెళ్ళినారు. కడకు అందరు చనిపోయిరి. జలప్రళయము వచ్చువరకు వారు ఎందులో మునిగియున్నారు? పాపములో మునిగియున్నారు. గనుక 'ఈ వేళ మునిగిపోయినను పరవాలేదూ అనే అజ్ఞానములో వారు మునిగిపోయిరి. అవిధేయత, అపనమ్మిక, హేళనచేయుట వీటన్నిటిలో వారు మునిగిపోయిరి. వారు మునుగుటకు ఒప్పుకొన్నారుగాని బ్రతుకుటకు ఒప్పుకొనలేదు. అటువంటివారు మన కాలములోనున్నారా? ఉన్నారు. ఈనాడు ప్రజలుకూడ రండి అని భొధకులు చెప్పుచున్నారు. కాని ఎందరు వస్తున్నారు.
"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సంస్త జనులారా నా యొద్దకు రండి" ( మత్త. 11:28 ) అని ప్రభువు పిలుచుచున్నాడు, భోధకులుకూడ పిలుచుచ్న్నారు.
- 1. ఆలయము లోనికి రండి.
- 2. బైబిలులోనికి రండి.
- 3. మతములోనికి రండి.
- 4. మోక్షములోనికి రండి.
మోక్షమునకు వెళ్ళువారు రెండు భాగములు:
- ( 1 ) నూతన యెరూషలేమునకు వెళ్ళువారు, అక్కడ ప్రభువుయొక్క సిం హాసనము ఉండును. మతములోనికి వచ్చిన తర్వాత మేఘము వచ్చును. ఎక్కువ భక్తి గలవారు ఈ మహిమ మేఘమెక్కి నూతన యెరూషలేము వెళ్తారు
- ( 2 ) ఆ తర్వాత మిగిలిన క్రైస్తవులు రక్షితుల మోక్షములోనికి వెళ్ళుదురు.