రాకడగది - రాకడ ప్రేమ

( 17-11-1959వ సం||లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము )

సామె. 13:13; మత్త. 13:19-23: మార్కు. 4:23-25; ప్రక. 20:7-15
" మీరేలాగు వినుచునారో చూచుకొనుడని చెప్పెను" లూకా. 8:18.

ఏడు తరగతులున్నవి నీది - ఏదో తెలిసికొనుము యిప్పుడే - కీడుమాని మంచి చేసిన క్రింది తరగతి దొరుకునేమో ||ఏకాంత||

" వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయులైమనుట ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్వులగుట || యేసుప్రభువు||

రక్షణను అపేక్షించి, రాకడకు సిద్ధపడుచున్న రాకడ జనులారా! రాకడ గదిలో చేరిన గట్టి గింజలవలె పరిశుద్ధాత్ముడు మిమ్ములను తయారు చెయునుగాక. ఆమేన్. నేటి దినమున విత్తనములు విత్తువాని ఉపమానములో నుండి కొన్ని తరగతుల పాఠములను నేర్చుకొందాము. విత్తువాడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. విత్తనములు ఎక్కడ పడ్డాయి? విత్తనాలు పడ్డాయా? ఇక్కడ చెప్పనివారు వీధులలో ఏమి చెప్పగలరు! త్రోవప్రక్కన పడిన విత్తనాలు పిచ్చుకలు తినివేస్తున్నాయా? తినివేస్తున్నాయి. మూడు గదులు:

మూడు గదులు:-

  • 1. రక్షితుల గది,
  • 2. రాకడ గది,
  • 3. శ్రమలగది.
ఈ విధమైన బోధ ఎవ్వరు చేయుటలేదు మనమే చేయుచున్నాము గనుక ఈ రాకడ బోధ వేరే బోధ అయినది.

1. రక్షితుల గది:- ఈ గదిలోనున్నవారిని చివరినుండి మొదటికి చెప్పుదును.

  • 20. అక్కడనుండి రాకడకొరకు కనిపెట్టు రక్షితులు ,
  • 19. రాకడకు ముందు మోక్షమునకు వెళ్ళు రక్షితులు,
  • 18. వధువు సంఘ రక్షితులు,
  • 17. హతసాక్షులైనవారు,
  • 16. ప్రభువునందు నిద్రించిన రక్షితులు. ( వధువు సంఘస్థులు );
  • 15. శ్రమలుపడిన రక్షితులు,
  • 14. మంచి గ్రంధములు చదువు రక్షితులు,
  • 13. ఉజ్జీవ కూటమునకు వెళ్ళు రక్షితులు,
  • 12. అవథలో ఉన్నవారిని ఆదరించు రక్షితులు,
  • 11. రోగులను పరామర్శించు రక్షితులు,
  • 10. బోధకులను చూచు రక్షితులు ,
  • 9. చదావేయు రక్షితులు,
  • 8. గుడికివెళ్ళు రక్షితులు,
  • 7. ఇతరులకు బోధించు రక్షితులు,
  • 6. కీర్తనలు నేర్చుకొను రక్షితులు,
  • 5. అన్ని ప్రార్ధనలు చేయు రక్షితులు,
  • 4. బైబిలు పఠించు రక్షితులు,
  • 3. పరిశుద్ధ ప్రవర్తనగల రక్షితులు,
  • 2. పాపవిసర్జన రక్షితులు,
  • 1. మారు మనస్సుపొంది, పాపములు ఒప్పుకొను రక్షితులు.

2.రాకడ గది :- ఈ గదిలోనున్న వారిని 10 గుంపులుగా చెప్పుదును. వారి క్రింది గుంపునుండి పై వరకు ఉన్న గుంపులు:

  • 10. వధువు సంఘస్థులు మేఘము చేరగానే శేషించినవారికొరకు ప్రార్ధించువారు;
  • 9. మేఘములోనున్న క్రీతు నొద్దకు చేరువారు,
  • 8. గాలిలోమేఘమునకు ఎగురువారు ,
  • 7. మహిమ శరీరము దాల్చువారు,
  • 6. చావులేనివారు,
  • 5. రాకడ ప్రార్ధన చేయువారు,
  • 4. రాకడ విషయములు నేర్చుకొన్నవారు,
  • 3. రోజంతయు ప్రభువు తలంపుగలవారు ,
  • 2. రాకడ తలంపు గలవారు ,
  • 1. రక్షితులు గదిలోనివి నెరవేర్చినవారు. ఈ గదిలోనివికాదు. గాని రక్షితుల గదిలోనివి.

3. శ్రమల గది:- ఈ గదిలో శ్రమ కాలములనుగూర్చి చెప్పుదును.

  • 10. సైతాను వెయ్యేండ్లు మట్టులేని గోతిలో బంధింపబడుకాలము.
  • 9. అంతెక్రీస్తు, అబద్ధ ప్రవక్త, మూడు దయ్యములు అగ్నిగుండములో పడయేయబడుకాలము.
  • 8. హర్మగెద్దోను యుద్ధకాలము.
  • 7. శ్రమలలో కొందరు రక్షింపబడుకాలము;
  • 6. సైతాను నరరూపముతో ( అంతెక్రీస్తుగా ) భూమిమీదికి వచ్చుకాలము;
  • 5. మూడు దయ్యముల కాలము;
  • 4. అబద్ధ ప్రవ్క్తల కాలము;
  • 3. అంతెక్రీస్తు పాలన;
  • 2. శ్రమలు ఏడేండ్లు ఉండుకాలము;
  • 1. పై రెండు గదులలో చేరనివారు ఈ గదిలో చేరుదురు.

మొదటి గదిలోని వీరము: పాపవిసేజన అనగా పది ఆజ్ఞల ప్రకారమును, బైబిలులో ఉన్న ఇతరాజ్ఞల ప్రకారమును, పరీక్షించుకొని; దేవుని దేవుని యెదుటను, మీరు ఎవరికి హాని చేసిరో వారి ఎదుటను, ఒప్పుకొనవలెను. అప్పుడు మీరు రక్షణ మార్గములో పడుదురు. ఇదే మారుమనస్సు. ఇప్పుదు రక్షణ మార్గములో ప్రవేసింతురు. ఒక వ్యక్తిని శిశువైయున్నప్పుడు శిష్యత్వమప్పుడు, బాలుడైయున్నప్పుడు, పెండ్లిచేసి కాపురమునకు ఏర్పాటు చేయరు, కాని అతనికి యుక్తవయస్సు వచ్చినపుడు చేయుదురు. అలాగని యుక్త వయస్సు ఆరంభమందే పెండ్లి చేయరు. కొంతకాలము ఆగుదురు. ఆలాగే అద్దాము మొదలుకొని క్రైస్తవ మతస్తాపన దినము వరకు సంఘమునకు శిష్యత్వమే. అప్పటినుంచి సంఘచరిత్ర ఆరంభమైనది. అప్పుడే సంఘమునకు శిష్యత్వమే. అప్పటినుంచి సంఘచ్చరిత్ర ఆరంభమైనది. అప్పుడే సంఘమునకు యౌవ్వన కాలము ఆరంభమైనది. అప్పటినుంచి, నేటివరకు ఎదిగిన సంఘమునకు పెండ్లి ఆలోచన కలిగినది అందుచేత రాకడకు సిద్ధపడవలెను. ఆ సిద్ధపడినవారే ' వధువు సంఘము; అయితే, రాకడకు ముందే సంఘములో ఉండగా చనిపోయి ప్రభువు వద్దకు వెళ్ళిన వారిలో కొందరు వధువుగా పెండ్లికుమార్తెసంఘములోనికి ప్రవేశించి ఉన్నారు. అయితే వారు వీరు అక్కడ కలిసికొంటారు. రాకడ మనుష్యులును , ఈ పూర్వకాల మనుష్యులును, పైలోకములో కలుసుకొందురు. వారందరు పెండ్లివిందులో కూర్చుంటారు. ఆ పెండ్లి విందులో ఉన్నవారు, మరణము పొందినవారు కొందరు; మరణము లేకుండా ఎత్తబడనినవారు కొందరు; అందరూ కలిసియుందురు. ఎత్తబడినవారు కొందరు; అందరూ కలిసియుందురు. రేపు ఎత్తబడే మనమును, విక్టోరియా రాణియును పెండ్లివిందులో కలిసికొని యుందుము. కాని పెండ్లికుమార్తె సంఘమునకు సిద్ధపడనివారు కూడ పైలోకములో ఉన్నారు. వారికి పెండ్లికుమార్తె అనగా ఈ వధువు సంఘము విందుకు రమ్మని పెండ్లికార్డు పంపును. ఆ వచ్చేవారు వధువు సంఘముకాదుగాని, " విందుకు" పిలువబడేవారు. వారు విందుకాల మహిమ చూడలేరు గనుక వారికి ముసుకు ఇవ్వబడును. ముసుకు లేనిచో కాలిపోవుదురు.

పరిశుద్ధ ప్రవర్తన గల రక్షియులు:- పాపవిసర్జన సమయమందు ఏది పాపమో తెలిసికొని, ఎట్లు విసర్జింతురో, అట్లే ఈ మూడు అంతస్థుల గదులలో ఏది మచిదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది దేవుని చిత్తమై యున్నదో, ఏది బైబిలు ప్రకారము అయిఉన్నదో, అది అది చూచుకొనుచు నడుచు కొనవలెను. అదేకాదు ఆ రెండేకాదు మరియొకటి కలదు.

దృస్టాంతము:- ఒక యవనస్తురాలు ఒక యవ్వనుడు బి. ఎ క్లాసులో విధ్యార్ధులు. వారిద్దరు కలిసి చదుకొనేవారు ( ఇది రాజమండ్రిలో జరిగిందే ) ఇద్దరికి ప్రేమ ఉంది. కాని కొన్నాళ్ళకు తల్లిదండ్రులు వీరిద్దరికి పెండ్లి తలంపు పెట్టినారు. వీరు నవ్వుకున్నారు. అప్పుడు వీరిద్దరికి క్రొత్త ప్రేమ పుట్టును. ఈ క్రొత్త ప్రేమ పుట్టును. ఈ రెండు ప్రేమలలో ఏ ప్రేమ గొప్పది? ( పెండ్లి ప్రేమ గొప్పది ). ఆలాగే యేసుప్రభువుమీద విమోచన, రక్షణ కాలములో ఉన్నప్రేమకంటె; రాకడ తలంపులో పడిన తరువాత క్రొత్తప్రేమ కలిగి, పెండ్లి ఎపుడు జరుగునా? అని ఎదురు చూచుచుండెను. ఇది రాకడ పెండ్లి ప్రేమ. ఆలాగే భక్తులందరు రాకడ తలంపుతో ప్రియుని రాక ఎదురు చూచుచుందురు. ఒక్క నిమిషమైన ప్రభుని తలంచకుండ ఉండలేరు, బ్రతుకలేరు!

వరుని ప్రేమ స్మరణతోనే-పరిపూర్ణమౌచున్నది = వరుని మీద నున్న ప్రేమ - పెరగ నిచ్చు చునది - త్వరగ నీయ కున్నది వరుడు వరుడను చున్నదీ ||వధువుసంఘము||

పెండ్లికాలము ఆలస్యమౌతుంటే, పెండ్లికుమార్తెకు సంతోషముండునా? విచారము కలుగదా! ప్రభువు రాకడ ఆలస్యము అయితే వధువు సంఘ భక్తులకు చాలా కష్టముగా ఉండును.

ఒక ప్రశ్న:- పెండ్లికుమార్తెకేనా అదును! పెండ్లికుమారునికి కూడానా?

జవాబు:- ఆయనకుకూడ అదును ఉండును. అనగా తొందర, ఆశక్తి, ఎదురుచూచుట ఉండును. కాని ఆయనకు త్వరగా తయారు కేకపోవుచున్నది అనే వి.చారమున్నది. అయినను ఆయనకు పెండ్లి తారీఖు తెలుసు. పెండ్లికుమార్తెకు తెలియదు గాని పెండ్లి కుమారునికి తెలుసు. త్వరగా, త్వరగా, త్వరగా అని బైబిలులో ఉన్నడి. త్వరగానా! అని అవిశ్వాసులు అందురు. ' ఇదిగో 'ఇదిగో త్వరగా వస్తున్నాను ' అని ప్రభువు చెప్పి, రెండువేల సంవత్సరములు అయినది. ' ఇంకా రాలేదు ' అని ఎవరనుకొందురో, వారు వధువు సంఘమునకు రాలేరు. కాని ' త్వరగా ' అనుమాటకు మనకు అర్ధము తెలియదు గనుక ' కనిపెట్టడము మన పని, విసుకుకొనుట మనపనికాదు ' అని ఎవరు అనుకొందురో, వారు వధువు సంఘములో చేరగలరు. త్వరగా రమ్ము అని పెండ్లికుమార్తె అనుచుండగా, ' నీవు త్వరగా తయారు కావలెను ' అని క్రీస్తు ప్రభువు అనుచున్నారు. ప్రభువు జన్మించుటే అద్భుతము. పునరుత్థానమగుట మరింత గొప్ప అద్భుతము ఆరోహణమగుట అంతకంటే గొప్ప అద్భుతము. రాకడలో ప్రభువు వచ్చుట. ఇవన్నికలసినంత గొప్ప అద్భుతము. ఇది లోకములోని కథ. అయితే పరలోకములోని విందులో మనకు తెలియని అద్భుతము కలదు. అట్టి అద్భుత విందులో వరుని చెంతనచేరి, సంతోషించు భగ్యము, నేటిదిన ధాన్యముద్వారా పెండ్లికుమారుడు మీకు దయచేయును గాక! ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद