యెషయా 3: 8; దా,కీర్త. 106: 13; మత్తయి 10:28; ఎఫెసీ. 6:10-18
"యెహొవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా " యెష. 3:8.
సిద్ధబాటు కొరకైన తోడ్పాటు కొరకు వచ్చిన ప్రియులారా! ఈ వాక్యభాగము యూదా జనాంగము అనగా యెరూషలేము ప్రజలనుగూర్చి వ్రాయబడినది. వారు ఏర్పాటు జనము అనగా దేవిని ప్రజలు. అటువంటి వారు తిరుగబడిరి. రాబోవు దినములలో, నేడు ఏర్పాటు జనాంగముగానున్న సన్నిధి కూటస్థులుకూడా తిరుగబడేటట్లు శోధింపబడెదరు. కొందరు తిరగబడెదరుకూడా! "యెహొవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలును, క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి" అని యెషయా 3:8లో వ్రాయబడియున్నది.
బైబిలు అంతటిలో రక్షణ సువార్తగల గ్రంధము యెషయా గ్రంధమే. నాలుగు సువార్తలతో తులతూగే గ్రంధము యెషయా గ్రంధము. క్రీస్తుయొక్క జన్మచరిత్ర యావత్తు ఈ యెషయా గ్రంధములోనే ముందుగా వ్రాయబడి యున్నది. ఈ వాక్యభాగ ముఖ్య ఉద్ధేశము "శోధన కలుగుతుంది" జాగ్రత్త!.
- 1. గొప్ప అంతస్థునుండి పడిపోయేటందుకు ముందు శోధన కలుగుతుంది.
- 2. రక్షణపోగొట్టుకొనేటందుకు శోధన కలుగుతుంది.
- 3. పాపములో ప్రవేశించేటందుకు శోధన కలుగుతుంది.
ఉదా:- మామూలుగా వేచే గాలికి తలుపు ఊడి క్రిదపడదు. అదిపడినా, పడకపోయినా ఎట్లు కదులుతుందో , మనకు వచ్చే శోధన కూడా అట్లే మనలను కదుల్చును. కదిలితే ఏమన్నమాట? పడేస్థితిలోనికి వచ్చినట్లు. గనుక జాగ్రత్తగా ఉండకపోతే తలుపుపడుట నిజమే. ఇక్కడున్న వారిలో అనేకమందికి పడిపోయేటట్లుగానే, సుళువుగా పడిపోయెటట్లుగానే ఉన్నట్లు తోస్తుంది. తాడిచెట్టు పడవేయుటకు ముందు, చెట్టు మొదలు కొట్టుదురు.అప్పుడు అది పడిపోటట్లు ఊగిసలాడును. అదే దెబ్బమీద మరల మరల కొట్టగా పడిపోవును. అలాగే మనుష్యులు శోధన కలిగినప్పుడు పడిపోవుదురు.
- 1) ఈ వచనములో ఆ కాలానికి సంబంధించిన యూదులయొక్క దుస్థితి కనబడుచున్నది.
- 2 ) అలాగే కొన్ని సంవత్సరములనుండి సాతాను పడగొట్టుటకు పనిచేస్తున్నది. వచ్చే మీటింగునకు ఏంతమంది వస్తారో! డబ్బులేదని కొందరు రాకుండా ఉందురు. అది పడిపోవుటకు ముంగుర్తు.
ఇటలీ, జర్మనీ దేశాలు ఎందుకు పడిపోయినవి? వారి దేశములో ఉన్న మతము, ఆ మత పద్ధతులు సరిగా లేనందున పడిపోయినవి. ప్రభువా! ఏడు శిరస్సులు, పదికొమ్ములయొక్క శక్తులతో సైతాను మా ఏడుగురిమీద పడనైయుంటే మాకేమి భయము? అతనికే భయముగాని మాకు భయములేదు. ఎందుకంటే అతడెలాగో ఓడిపొతాడుగా ! మేము నిజముగా జయం పొందుదుము.
యేసూప్రభువా! మాకు బదులుగా వచ్చిన బదలీవాడవైన నీవు మాకు గెలుపునిస్తావు. మీకు ఇలలో ఉన్న భయము కలలోనికి వచ్చినది అని అనుచున్నారు. గనుక మీకు ఎన్ని శ్రమలు వచ్చినను విచారపడకండి భయపడకండి. ఆ ఏడు శిరస్సులు, పదికొమ్ములయొక్క బలమును యేసుప్రభువు తన గోటితో గెంటివేయును. ఆయుధములు ఆయనకు అక్కరలేదు. హర్మగెద్ధోను యుద్ధములో ఆయన ముఖశ్వాసే ఆయన ఆయుధము. ఏమైనా రానివ్వండి! విచారముగాని, భయముగాని మీలోనికి రానివ్వకండి. ఎందుకనగా విచారము, భయము సైతానునుండే వచ్చును. మిమ్ములను అందరిని నాశనము చేయవలెనని ఎప్పటినుండో సైతానుకు ఉన్నది. వాడికి, అయ్యగారినే నాశనముచేయాలని ఉన్నది. అయినను వాడి పన్నాగములేమియు, పరిశుద్ధాత్ముని యెదుట పారవు.
సన్నిధి కూటములలో ఇంత గొప్ప దర్శనములు ఉంటుండగా తప్పిపోవడము ఏమిటి? బుద్ధిలేని కన్యకలు తగ్గిపోవుటకు కారణమేమిటి? బైబిలుమిషనను రూపుమాపుదునని సైతాను అంటే దానికి జవాబు "బైబిలుమిషనును నా తండ్రి ఎత్తి చూపించుము" అని అన్నారుగాన సాతాను బైబిలుమిషనును రూపుమాపలేదు. ఒకోసారి నేను చావనుగాని, చచ్చినంత జబ్బు వచ్చును. అట్టి సమయములో ఎవరు పరిచర్య చేస్తారు! తప్పుకొంటారు. అట్టి పరిచర్య ఎవరు చేస్తానంటారో వారు ఇప్పుడే పూనుకొనవలెను. అయ్యగారిమీద అభిమానము లేకుండా ఎవరు పూనుకుంటారో వారికి శ్రమ మరీ ఎక్కువగును. అయ్యగారికి ప్రతి నిత్యము అందుచున్న దేవుని సహాయము, దేవదూతల సహాయము, పరిశుద్ధుల సహాయము సరేసరి కాని అట్టి కీలక సహాయములో పరిచర్య చేయువారెవరు? తెలియదు. ఎవరుకూడ రారు. రాకడ సమీపము గనుక కష్టాలుకూడా సమీపమే, దయ్యాలు కూడా సమీపమే, నాలుగు దినముల క్రితం అయ్యగారు గదిలో ప్రార్ధనలోనుంటే ఒక దయ్యము వరండామీదికివచ్చి నేను ఎలాగు వెళ్ళాలో , ఎలా వెళ్ళాలో తెలియుటలేదు అనెను. అప్పుడు అయ్యగారుఎలా వచ్చావో అలాగే ఫో! అన్నారు. అది పారిపోయింది. పేరుకైనా అయ్యగారు భయపడలేదు. మీ కూటములన్నిటిలోనికి దయ్యము వచ్చును భయపడకండి. దేవుని వాక్యమునకు విశ్వాసిని కౌగలించుకొనే స్వభావమున్నది. గనుక చిన్న వాక్యము చదివితే గంటలకొలది వర్తమానము వచ్చును. వాక్యము విశ్వాసిని కౌగలించుకొంటున్నది, గనుక మనము దేవిని వాక్యమును కౌగలించుకొనే విశ్వాసులుగా ఉండాలి. అనగా వాక్యములోని అంతరంగ అర్ధమును, పూర్ణ హృదయముతో మన వ్యక్తిగత జీవితములో స్వీకరించి, ఆ భావముతో మనలను సరిపోల్చుకొని, దిద్దుకొని,ఇముడ్చుకొని ఆ విధముగా నడచుకొనవలెను. నేటికి దైవసన్నిధి 20వేల మందికి అందినది, గాన 20వేల మది సన్నిధి కూటములు పెట్టవలసినదే.
ఉదా:- సోల్జరును ( సైనికుని ) తుపాకి పట్టుకొని మనుష్యులను చంపమంటే , తుపాకి గురిచూడకుండా పేల్చెనుగాని మనిషిని చంపలేదు. అలాగే సైతాను ఎదిరింపులు చేసేవారు, గురిచూడకుండా తుపాకి పేలుస్తున్నారు. గనుక వీరినిచూచి అసలు నాయకుడు ( సైతాను ) అనుకుంటున్నాడు- మాకు బాగా కొట్టుచున్నారని అనుకొంటున్నారు. కాని మాకు తగులుటలేదు. మీరు చేయు ఎదిరింపులు, వేయు బాణము బాణములు సైతానుకు తగులుతాయన్నట్లు మీరనుకుంటున్నారు కాని మీరు దేవుని బాణములను గురిగా వేయుటలేదు. గనుక వాడికి అవి తగులుటలేదు. ఈ యెషయా గ్రంధము 3వ అధ్యాయములోని గతి ఏర్పాటు జనముయొక్క గతి. భయపడుటకు కాదుగాని, జాగ్రత్తపడుటకు చెప్పితిని.
ఇక్కడ ఉన్నవారిలో ప్రార్ధనకు మంచి గది ఉన్నవారెవరు? దైవసన్నిధికై ప్రత్యేక గది ఏర్పరచుకొనుట ప్రాముఖ్యము. ఏమిటి ప్రభువా! వారికి ఎక్కువ డబ్బు ఇస్తున్నావు! ఆలగున మాకు ఇస్తే సువార్త పని ఎక్కువ చేస్తాముగదా! అని మనము అంటే, మీకే నేను ఎక్కువ ఇస్తున్నాను అని ప్రభువు అంటున్నారు.
పూర్వకాలము ప్రత్యక్షపు గుడారములో- 1. అతి పరిశుద్ధ స్థలము
- 2. పరిశుద్ధ స్థలము
- 3. ఆవరణ స్థలము అని మూడు భాగములు ఉన్నవి.
- ( i ) నేర్చుకొనుటకు వచ్చువారు ఆవరణములో ఉండవచ్చు.
- ( ii ) ప్రభువు మాట వినేవారు, ప్రార్ధన చేసేవారు, వాక్యము చదివేవారు, వివరించుకొనేవారు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళతారు.
- ( iii ) నిత్యము ప్రభువు ముఖము చూస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన చెప్పినవి వ్రాసికొనువారు అతిపరిశుద్ధ స్థలములోనివారు.
ఈ మూడవ అనుభవము కొరకే సన్నిధి కూటములు వచ్చినవి. ఈ ( సన్నిధి ) కూటాలు స్థాపించారు గాని, అందులోని అంతస్థును అందుకొనుటకు సంబంధించిన తర్ఫీదు చాలదు. ప్రభువు బైబిలులో ఏమి చెప్పినాడో అని చదువకుండా ఆలాగు చేయకుండ ఉన్నదానిని అశ్రద్ధ చేస్తున్నారు అదే తప్పు. మీరు తక్కువే చదవండి, ఎక్కువే చదవండి కాని ప్రభువు మీతో మాట్లాడుచున్నట్లు భావించుకొని చదవండి. ఇప్పుడు ఎవరి సన్నిధి కూటము జయకరముగా, ముమ్మరముగా జరుగుచున్నదో చెప్పండి ! అన్ని కూటములు బాగానే జరుగుచున్నాయి.
- 1 ) కొంచెము బెదురు,
- 2 ) కొంచెము అపనమ్మిక,
- 3) కొంచెము అశ్రద్ధ ఉన్నది.
ప్రభువు ఈవేళ నాకు ఏమి చెప్పలేదు అని దేవునిమీద నేరారోపణ చేయుదురు. నాకేమి చెప్పలేదని ప్రభువుమీద ఇలాగు నేరారోపణ చేయుట హాని. మీరు కూటములలోనికి వెళ్ళినప్పుడు నాయకులమీదకాని, మెంబర్లమీదనైనను విసుగుకొనకూడదు. పేరుకైనను కారణముగల విసుగుదలసహా కూడదు. క్రైస్తవ సంఘమునకు, చాలా ముందు కాలములోఉన్న ఎస్తేరుకు దేవుని స్వరములేదు, వ్రాతలేదు ఇప్పటి కాలములో స్వరము, దర్శనము, వ్రాత ఉన్నది. విశ్వాసము ఉన్నది. గాని విశ్వాసమునకు తగిన సహవాసములేదు గనుక సన్నిధిలో వృద్ధిలేదు. ప్రతికూటములో విశ్వాసమునకు తగిన సహవాసము లేదు గనుక, వచ్చే నెలలో ప్రతి కూటమునకు ఇద్దరు వస్తే చాలు. నెలకు ఒకసారి సన్నిధి కూటములోని ఇద్దరు వచ్చి నోట్సు వ్రాసికొని, వెళ్ళి చెప్పవచ్చును ఇది సుళువైన పని. వారి ఖర్చులు కూటస్థులు భరించవలెను.
- ( ఎ ) అతి పరిశుద్ధ స్థలములో ఉండేవారికిని,
- ( బి ) పరిశుద్ధస్థలములో ఉండేవారికిని,
- ( సి ) ఆవరణములో ఉండేవారికిని సంబంధము ఉన్నది. గనుక ఈ మూడు అంతస్థులలోకూడా సన్నిధి కూటస్థులే. ఎలాగంటే ( అప్పటికాలములో 1వ, 2వ, 3వ ఫొర్మ్ ) 8, 9, 10 అను మూడు తరగతులు హైస్కూల్లోనివే.
పై మూడు స్థలములు, మూడు తరగతులు ఇవన్ని వారి వారి ఆత్మీయ స్థితినిబట్టి ఉన్న అంతస్థులు. గనుక ఎవరును నిరాశపడకూడదు. పరిశుద్ధ స్థలములోనివారు అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుదురు. ఆవరణములోని వారు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుదురు. ఒక్కొక్క అంతస్థువారు మెల్లమెల్లగా వారి వారిపై అంతస్థులోనికి వెళ్ళుదురు. ముందే ఈ రూల్స్ అన్ని చెప్పితే వెనుకకు పోవుదురు. 30, 60, 100 అంతస్థులు జ్ఞాపకము తెచ్చుకొనండి. అందరూ 100 అంతస్థులలోనికి రారు. అందరు 60 అంతస్థులలోనికి రారు. కొందరు తమకున్న కష్టములవంకే చూస్తారు. క్రొత్తవారెవరైన మీ మీ గ్రామములో సన్నిధి కూటములు పెడితే రిపోర్టు చేయ్యండి. ఎక్కడైతే పెట్టారో వారు మనతో ( బైబిలు మిషను కేంద్రముతో ) సంబంధము కలిగియుండాలి. వారికి నోటీసు పంపవలెను. సన్నిధి కూటములు నాకు రిపోర్టుచేస్తే నాతో సంబంధము ఉండును.
ప్రభువా! ఈ నెలలో మా కూటములోనుండి ఏ ఇద్దరు వెళ్ళవలెనో వారిపేర్లు చెప్పుము.ఆమేన్! ( నెలలోగాని, 2వారాలలో గాని ఒక వారములోగాని సన్నిధి పరులను ప్రభువే రప్పించును. ఏలూరు కూటములో ప్రవేశించుటకు ప్రభువు 7పేర్లు ఇవ్వలేదా? ఇచ్చినారు. 7గురు పేర్లు ఇచ్చినప్పుడు, 2పేర్లు ఇవ్వలేరా! ఈ సన్నిధి కూటములలో ఒకరికి చెప్పిన ప్రభువు ఇంకొకరికి కూడా చెప్పునట్లు ప్రార్ధిచవలెను. ఈ 5 సన్నిధి కూటములు మంచి స్థితిలోనికివస్తే, ఈ సందేహములు ఏమీ ఉండవు. డబ్బుకు కష్టము ఉండదు. సైతానుకుగాని, అతని దూతలకుగాని, పాపమునకుగాని, ఇబ్బందికిగాని, శీతోష్ణస్థితికిగాని, విషపురుగుకుగాని, మరి దేనికిగాని భయపడని గుణము నేర్చుకొనవలెను. ఆరంభించితేగాని అట్టి స్థితిరాదు. ఎంత తరచుగా సన్నిధి కూటమునకు వస్తే అంత బలమున్నది.
ప్రభువు బైబిలు మిషనులోనికి వెళ్ళమని ఏరోజు చెప్పితే ఆరోజే వెళ్ళవలెను. బుధవారము చెప్పితే
బుధవారమే వెళ్ళవలెను, కాని లక్ష్మివారము వెళ్ళితే అంతస్థు తగ్గును.
ఉదా:- బందు సూర్యకాంతమ్మకు
ప్రభువు మూడు వారముల క్రితము వెళ్ళమంటే నాలుగవవారము బైబిలుమిషనులోనికి వచ్చినది. వస్తే
మంచిదేగాని అంతస్థు తగ్గును. నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రాహాముతో
చెప్పినపుడు ఎన్ని ప్రశ్నలు వేసినాడు? ఎన్ని అడుగులు వెనుకకు వేసినాడువేసినాడు? ఎన్ని రోజులు
ఆలస్యము చేసాడు? ఆలస్యము చేయలేదుగాని దేవుడు చెప్పినపుడే బయలుదేరినాడు. గనుకనే
అబ్రాహాము విశ్వాసజనసంఘమునకు జనకుడైనాడు. గనుక ఆలస్యముగా బైబిలు మిషనులోనికి
వెళ్ళవచ్చునుగాని అంతస్థు పోతుంది.
గవర్నమెంటువారు యుద్ధానికి పటాలపు సిపాయిలను తయారు చేసికొంటున్నారు. అప్పుడు కొందరు
పేర్లు ఇచ్చినారుగాని వెళ్ళలేదు. కొందరు ఆర్డర్ కొరకు కనిపెట్టుచున్నారు వారు ఈ పటాలములో
చేరినట్టా? చేరినట్టే. పేర్లు ఇచ్చినపుడు ప్రవేశించినట్టా? ప్రవేశించనట్టా?
షరా:- యుద్ధమునకు
వెళ్ళవలెనని ఉద్ధేశ్యమున్నది గనుక పేరు ఇచ్చినట్టే. యుద్ధమునకు వెళ్ళవలెనను
ఆలోచనతో ప్రవేశించినపుడు ప్రవేశించినట్టే. పేరు ఇచ్చిన వారు ప్రవేశించారని చెప్పవచ్చు.
ఒక అబ్బాయి పేరు ఇచ్చి యుద్ధమునకు భయపడి వెళ్ళలేదు. అతడు సోల్జరు ( సైనికుడు ) అయ్యాడా? ప్రభువా! బైబిలు మిషనులోనికి వెళ్ళాలని నాకు ఇష్టమున్నది. నీవు వెళ్ళు! అని నీవు నాకు చెప్పలేదు. నీవు వెళ్ళు అని అంటే ఇపూడే వెళ్ళతాను అని ప్రార్ధించవచ్చును. కాని తీరా ప్రార్ధించిన తరువాత వెళ్ళవలసివస్తుందని నీవు ప్రార్ధించనే ప్రార్ధించవు. బైబిలు మిషనులో ఉండి నేర్చుకొనుచున్నాము గనుక మేము నేర్చుకొనే అంతస్థులో ఉన్నాము అనేవారు రాకడ అంతస్థులో ఉండకపోవచ్చు. కొంతమంది నేర్చుకొనుటవరకు ఉంచుదుగాని రాకడకు సిద్ధపడరు. కావున బైబిలుమిషను వారు ఆత్మీయ సంగతులు నేర్చుకొనుచూ రాకడకు సిద్ధ పడవలెను.
బైబిలు మిషనులోనికి రాకుండా ఈ విషయములన్నీ తెలుసుకొని, బైబిలుమిషనులో విశ్వాసము
కలిగి ఉంటున్న వారి విశ్వాసమేమిటి? వారికి ప్రభువు మాట్లాడే అంతస్థు ఉన్నదిగాని, బైబిలు మిషను
అంతస్థు లేదు. గవర్నమెంటువారు యుద్ధానికి పటాలపు సిపాయిలను తయారు చేసికొంటున్నారు. అప్పుడు కొందరు
పేర్లు ఇచ్చినారుగాని వెళ్ళలేదు. కొందరు ఆర్డర్ కొరకు కనిపెట్టుచున్నారు వారు ఈ పటాలములో
చేరినట్టా? చేరినట్టే. పేర్లు ఇచ్చినపుడు ప్రవేశించినట్టా? ప్రవేశించనట్టా?
షరా:- యుద్ధమునకు
వెళ్ళవలెనని ఉద్ధేశ్యమున్నది గనుక పేరు ఇచ్చినట్టే. యుద్ధమునకు వెళ్ళవలెనను
ఆలోచనతో ప్రవేశించినపుడు ప్రవేశించినట్టే. పేరు ఇచ్చిన వారు ప్రవేశించారని చెప్పవచ్చు.
ఒక అబ్బాయి పేరు ఇచ్చి యుద్ధమునకు భయపడి వెళ్ళలేదు. అతడు సోల్జరు ( సైనికుడు )
అయ్యాడా? ప్రభువా! బైబిలు మిషనులోనికి వెళ్ళాలని నాకు ఇష్టమున్నది. నీవు వెళ్ళు! అని నీవు
నాకు చెప్పలేదు. నీవు వెళ్ళు అని అంటే ఇప్పుడే వెళ్ళతాను అని ప్రార్ధించవచ్చును. కాని తీరా
ప్రార్ధించిన తరువాత వెళ్ళవలసివస్తుందని నీవు ప్రార్ధించనే ప్రార్ధించవు. బైబిలు మిషనులో
ఉండి నేర్చుకొనుచున్నాము గనుక మేము నేర్చుకొనే అంతస్థులో ఉన్నాము అనేవారు రాకడ
అంతస్థులో ఉండకపోవచ్చు. కొంతమంది నేర్చుకొనుటవరకు ఉందురుగాని రాకడకు సిద్ధపడరు.
కావున బైబిలుమిషను వారు ఆత్మీయ సంగతులు నేర్చుకొనుచూ రాకడకు సిద్ధ పడవలెను.
పరీక్షలలో పాస్ అవుటకు ఒక విద్యార్ధి చదువుచున్నాడు. చివరిలో అశ్రద్ధ చేసినందువల్ల సరియైన
మార్కులు ఉత్తీర్ణతకై రానందున 6వ తరగతి విద్యార్ధిగా ఉంటాడు. మార్కులు రాకపోయినందువలన
6వ తరగతిలో ఉండిపోవును. గనుక పై తరగతికి వెళ్ళరు. కావున ఉత్తీర్ణులవుటకు నిర్ధేచిన మార్కులు
రాకపోయినందువలన పై తరగతికి పోరు. బైబిలు మిషనులో ఉండికూడా ఫెయిల్ అయిన వారుంటారు.
ఒక్కబైబిలు మిషనువారు మాత్రమే ఎత్తబడుదురా?
జవాబు: తక్కినవారు ఎత్తబడరా? ఎవరు సిద్ధముగా ఉంటారో
వారే ఎత్తబడుదురు. బైబిలు మిషనులో సిద్ధపడినవారు కూడా ఎత్తబడుదురు. అయితే, ఎత్తబడే ఈ ఇద్దరిలో
అనగా బయటి వారిలో, బైబిలుమిషను వారిలో అంతస్థు బేధమున్నది.
అబ్రాహాముయొక్క అంతస్థులోనికి నోవాహుగారు వచ్చారా? రాలెదు. అబ్రాహాముగారికి తెలిసినన్ని విషయములు నోవాహుగారికి తెలియదు. దావీదుయొక్క అంతస్థు రాజుగా ఉండుట, కవీస్వరుడై ఉండుట. ఈ విషయము ఇస్సాకునకు బైలుపరచినాడా? లేదు! 500 సం|| ల క్రితము ఏవరైనా ట్రైన్ ఎక్కినారా? లేదు. నోవాహుయొక్క ఓడలో మెతూషెలా ప్రవేశించినాడా? లేదు. అప్పటికి ఓడలేదుగాన ప్రవేశించలేదు. ఒకవేళ ఓడవస్తే ప్రవేశించవద్దా? "లూథరు మిషను" ఉన్నపుడు "బైబిలు మిషను" లేదు. ఇపుడు "బైబిలు మిషను" అనే ఓడ వచ్చినది గాన అందరూ "బైబిలు మిషను" లోనికి రావచ్చును.
ప్రార్ధన:- ప్రభువా! ఈ ఉదయము నీ లక్షణములు విన్నట్లు, నిజమే అని తెలిసికొని, అట్టి లక్షణములున్న నీవు మాకు బైలుపడినావు అందుకు నీకు వందనములు అని చెప్పే మంచిమనస్సు దయచేయుము. దయగల ప్రభువా! నీవు మంచివాడవు. నీవుచేయునదంతా ఆనందముగా ఉన్నదని అనుకొనే అభిప్రాయము. చెడకుండా ఉండేశక్తి దయచేయుము. నీకున్నశక్తితో నీవు స్వయముగా పనిచేయుచున్నావనియు, మేము స్వతంత్రముగా చేయుచున్న పని, నీవు చేయనిచ్చిన పని, నీ కార్యము నీ శక్తి గనుక నీవు చేయనిచ్చిన పనినిజ్ఞాపకముంచుకొని బలపడేటట్లు కృప చేయుము. మరియొక పని ఏదనగా నేను పాపములో ప్రవేశించినపుడు నీవు అడ్డుపెట్టకుండా ఊరుకున్నావు. ఊరుకున్న పని పరిశుద్ధమైనదే. ఆలాగు ఊరుకొనుట ద్వారా నీవు మా స్వతంత్రతను శుద్ధీకరించు చున్నావు. దేవుడు ఎందుకు ఊరుకున్నాడు అని మేము అనకుండ కృప దయచేయుము. నీ సెలవులేనిదే ఏదియు జరుగదని తెలిసికొనే కృప దయచేయుమని వేడుకొంటున్నాము. ఆమేన్.