యెషయా 2:1-4; మార్కు 13:32-37; ప్రక. 22:20-21
"దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము" దా. కీర్తనలు 70:1
త్వరగ నన్నది నరుని యాత్మకు - ప్రవచన మను చున్నది - ఇరువది వందల ఏండ్లయినను - "త్వరగనే"
యను చున్నది - వధువు సిద్ధమను చున్నది - వధువు వధువను చున్నది || వధువు||
మేఘములపై వరుడు క్రీస్తు వేగముగ రాగనే మేఘమ్మీదికి వెళ్ళి మేము నేను హల్లేలూయ పాడెదం "
హల్లేలూయ ..............హల్లేలూయ ............ హల్లేలూయ .......... యేసుకే ||
హల్లేలూయ ........... హల్లేలూయ ...........
హల్లేలూయ .............. ఆమేన్.
రాకడ కొరకు కనిపెట్టుచున్న విశ్వాసులారా! ఈ ఉదయము నేను కొన్ని రాకడ సంగతులు మీకు వినిపిస్తాను. ఇవి ఇదివరకు మీరు విన్నను పద్ధతిమాత్రము ఈ దినము క్రొత్తది. ఈ కాలములో సంఘము, లోకస్థులు రాకడ తలంపు గలవారైయున్నారు.
- ( 1 ) విశ్వాసులు రాకడ వచ్చివేసినట్టే ఆనందించి నిరీక్షించుచున్నారు.
- ( 2 ) అన్యులు, రాకడ సంగతులు తెలుసుకొనుటకు ఆశపడుచున్నారు. మీ ప్రభువు ఎల్లప్పుడు వచ్చును? మాకు కూడ ఆ విషయములు తెలుసుకొనుట ఇష్టమని అనుచున్నారు.
- ( 3 ) మూడవ గుంపువారు ఎవరనగా, క్రెస్తవులలోని అన్యులు, అన్యులలోని క్రైస్తవులు.
వీరెవరంటే రాకడ నమ్మనివారు. వారేమి చేస్తున్నారు? వారు వీరిని కొంతసేపు సందేహముగాను, కొంతసేపు ఆశ్చర్యముగాను చూస్తున్నారు. గనుక మూడు గుంపులవారు రాకడ కాలములో ఉన్నారు.
- 1. విశ్వాసులు
- 2. అభిమానులు
- 3. విమర్శకులు ( హేళన చేయువారు ).
'రాకడ గురించి మాకు తెలియలేదు, మేము చదివాము, మాకు అర్ధము కాలేదు' అనేవారు భూలోకమందు ఉండరు. అనగా పై 3 గుంపులలో ఏ గుంపువారైనా రాకడ తెలిసినవారై ఉంటారు. ఈ మూడు తరగతులవారు భూలోకమందు ఉన్నారు గనుక ఈ మూడు తరగతులవారి అనుభవములు విశ్వాసులు మాట్లాడుకొంటే మంచిది. సంవత్సరము చివరిలో అనగా నవంబరు చివరిలో రాకడ గురించి మాట్లాడవలెనని ఒక ఏర్పాటున్నది. క్రైస్తవ సంఘ కాలమానములో ఈ ఏర్పాటు ఉన్నది. ఈ కాలమునే అడ్వెంటుకాలము అందురు. ఇప్పుడు నేను ప్రవేశ వాక్యముగా ఏర్పర్చుకొన్న వాక్యము యేసుప్రభువు చెప్పినమాట "ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను." ప్రకటన 22:20. ఈ ఒక్క వాక్యము నాలుగు భాగములుగా ఉన్నది. "త్వరగా" అనేమాట మాత్రము పలికి 2వేల ఏండ్లు అయినది. నా ఉపన్యాస వాక్యము ఏదంటే 'త్వరగా', గాలిలో ఈ మూడు అక్షరములు వ్రాసినారని ఊహించండి. కొన్ని భాగములు ఆ మాటకు దిగువనున్నవి. అవేనగా,
- 1 ) ఆయనకే,
- 2 ) ఆయన దృష్టికే,
- 3 ) ఆయన ఆలస్యము ( జాగు ),
- 4 ) సువార్త ప్రకటన,
- 5 ) ఆత్మస్నానము ( బాప్తిస్మము ),
- 6 ) ఎత్తబడవలసిన సంఘము ఎత్తబడవలసిన సంఘము ( సిద్ధపాటు ).
1. "త్వరగా" అన్నమాట దిగువనున్న మొదటిమాట 'ఆయనకే'. 2వేల సంవత్సరముల క్రిదట ఈ మాట చెప్పినపుడు, రెండవ రాకడ ఎప్పుడు వచ్చునో, ఆయనకు తెలుసును. మార్కు సువార్తలో మనుష్య కుమారునికి తెలియదు అని వ్రాయబడియున్నది. మనుష్య కుమారుడుగా ఆయన భూలోకములో ఉన్నారు. రేపు పెండ్లి కుమారుడుగా మేఘాసీనుడై వచ్చును. అయితే ప్రకటనలో "నేను వస్తాను" అని అనెను. భూమిమీద ఉన్నపుడు మనుష్యత్వమునకు తెలియదుగాని ఆయన మహిమలోనికి వెళ్ళెను గనుక త్వరగా వస్తున్నాననెను. ప్రభువు ఈ మాటే సువార్త కాలములో అన్నారు. ఆ మాట వంద సం|| ల క్రిందట కాలములో ( అనగా క్రీ. శ. 33 సం || ల క్రిందట ఆ మాట ) పలికెను.
ఉదాహరణకు :- 'నేను ఎప్పుడు వస్తానో తెలియదు' అని ఊరికి వెళ్ళేటప్పుడు అంటారు. ఊరువెళ్ళినవారు ఎప్పుడు తిరిగి రాగలరో తెలిస్తే 'త్వరగా వస్తానంటారు' అలాగే యేసుప్రభువుకు అది త్వరగానే అన్నట్లు ఆ 'త్వరగా' అనునది మనకుకాదు. మనకు ఆలస్యము, ఎందుకనగా 2పేతురు 3:9లో వ్రాయబడియున్నట్లు 'కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్చయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు.' గాని ఆయనకు త్వరగానే ఉన్నది. మనకు ఆలస్యముగా ఉన్నట్టు చెప్పుదుము. ఆయనకు లెక్కప్రకారము ఆయనకు త్వరగానే. విశ్వాసులు ఆయనవారు, ఆయన విశ్వాస జనమునకు సంబంధించినవాడు. ఆయన విశ్వాసుల రక్షకుడు. విశ్వాసులు ఆయనయొక్క బిడ్డలు. ప్రభువు ఏమనునో, విశ్వాసులును అదే అంటారు. అనగా ప్రభువు అనినదే విశ్వాసులును అదే అంటారు. అదేదనగా 'త్వరగా' అనే మాట.
- 1వ వాదము:- అవిశ్వాసులైతే - ఆలస్యము అంటారు. ( వీరు లోకస్థులు ). గనుక ఈ 'త్వరగా' అనుమాట వారికి అర్ధముకాదు. ఆ మాట యేసుప్రభువునకే ఉన్నది. విశ్వాసులైయున్నా వారిలోకూడ లోకస్థులు ఉన్నారు. ఆయన మనస్సులో "త్వరగా" వస్తాను అని యున్నది అనగా ఆ మాట ఆయనకే. గనుక "త్వరగా" అన్నారు. కొన్ని సమయములలో ప్రభువు భూలోకములో ఉన్న రాకడ విశ్వాసులతో ఆయన మాట్లాడుదురు. అప్పుడు తక్కినవారు అనగా లౌకీకులు మీకు తెలిసిందా? ఆయన త్వరగా వస్తాడని చెప్పారా? అందురు. ఈ విశ్వాసులైనవారు ఆయన చెప్పెను గనుక మేము నమ్ముదుము అందురు. రాకడ విశ్వాసులకును, లౌకికులకును; రాకడ విశ్వాసులకును, రాకడ తెలియని విశ్వాసులకును అదే బేధము. ప్రభువు త్వరగా వస్తానన్నాడు గనుక త్వరగా వస్తాడు, ఇక వాదము అక్కరలేదు.
- 2వ వాదము:- "దృష్టి" అనగా దేవుని దృష్టిలో వెయ్యి సంవత్సరములు ఒక దినమని పేతురు వ్రాసెను. 2పేతురు 3:8 ' ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.' దానినిబట్టి చూస్తే ఈ ఏడువేల సంవత్సరములు ఆయన దృష్టిలో "త్వరగా" అని అర్ధము. అన్ని మాటలలో త్వరగా అనేమాట ఉన్నది. ఆయన దృష్టిలో ఈ రెండు దినములు మాత్రమే ఇప్పటికి అయినట్లు ఉన్నది ( 2000 ). ఆయనకు 'త్వరగా' అని ఇందాక చెప్పాను. ఇప్పుడు ఆయన దృష్టికి ఆయన రాకడ 'త్వరగా'నే యున్నది. గనుక మేము అదే కనిపెట్టుదుము అని విశ్వాస్లు అందురు.
-
3వ వాదము: "ఆలస్యము" పేతురు-'మీ నిమిత్తమేగదా ఆయన ఆలస్యము చేస్తున్నాడు' అనెను. మన నిమిత్తము
ఆలస్యము గాని ఆయన ఆలస్యము చేస్తున్నాడూ అనెను. మన నిమిత్తము ఆలస్యము గాని ఆయన నిమిత్తముకాదు. ఇదంతా
చిక్కులుగాను, మర్మముగాను ఉన్నట్టు ఉన్నదిగాని వాక్యమును వివరిస్తే ఎక్కడా చిక్కులేదు. మనవల్ల తప్ప. ఆయనకు
ఆటంకములు లేవు. ఆయనయొక్క 'త్వరగా' అను మాటను, మనయొక్క ఆలస్యము అనుమాటగా మార్చుకొన్నాము.
యోహాను 20వ అధ్యాయములో వ్రాయబడినట్లు యూదుల భయమువలన శిష్యులు తలుపులు వేసికొని ఉండగా, ఎవరు తలుపులు తీయకుండానే ప్రభువు లోనికి వెళ్ళెను. వారికి తలుపులు ఆటంకముగాని ఆయనకు ఆటంకములేదు. ఆలాగుననే యేసుప్రభువు వచ్చుటకూడ ఆటంకములు ఏవి లేకుండా ఉన్నది. అది మనకు ఆటంకమేగాని ప్రభువునకు కాదు. అనగా శిష్యులు తలుపు వేసికొనుట వారి దృష్టిలో ఆటంకమేగాని, తలుపులు మూయబడి ఉండుట ప్రభువునకు ఆటంకముకాదు. ఆలాగే మన విషయములోను 'ఆయన రాకడ మన దృష్టికి ఆటంకముగాని ఆయనకు అవకాశము.
-
4వ వాదము:- "సువార్త ప్రకటన" కావలెనటే, యేసు ప్రభువు రాకముందు సువార్త ప్రకటన జరగవలసి ఉన్నది.
ఆ కాలమువారు ప్రభువు కొరకు ఎదురుచూచునట్లు సునెయోను మొదటి రాకడకు సిద్ధపడ్డాడు. 'నాధా! నిన్ను చూచు
భాగ్యము కలిగినదని' సంతోషించెను. గనుక సువార్త ప్రకటన కానిదే అందరు సిద్ధపడరు.
- 1. ఆయన "వచ్చాడు" అనేది మొదటి సువార్త.
- 2వ సువార్త "వస్తున్నాడనే" సువార్త. కాబట్టి సంఘము ఈ రెండు సువార్తలు అందరికి చెప్పవలసియున్నది.
ప్రభువు త్వరగా వస్తున్నాడు కాబట్టి మేము త్వర త్వరగా ప్రకటించిచాలి. కొంతమంది మిగిలిపోతే ప్రభువు మమ్మునంటాడు.
( లెక్క అడుగును ) అని సువార్తను అనగా రాకడ సువార్తను ప్రకటించవలెను.
- ( 1 ) వస్తానని చెప్పాడు అదొక సువార్త.
- ( 2 ) వచ్చి 33 1\2 సం|| లు జీవించివేసాడు. ఇదొక సువార్త.
- ( 3 ) ఇక త్వరగా వస్తాడు.
ఈ కాలములోని మనకు మా ప్రభువు త్వరగా వస్తున్నాడు గనుక ఆయమ 'త్వరగా' వస్తే మేము ఎట్లు సిద్ధపడగలము? అని విశ్వాసులు తలంచు చున్నారు. కాబట్టి విశ్వాసులకుకూడా ఒక శక్తి కావలెను. గనుక వారు శక్తికొరకు వేడుకొనవలెను. ఎట్లు సిద్ధపడగలము! అంటూ శక్తి కావలెనని కోరుచున్నారు. శక్తి మనకెందుకు? అనగా త్వరగా వస్తు ఉన్న ప్రభువు రాకడకు సిద్ధపడేటందుకును, రాకడను గూర్చిగూర్చి సువార్త ధైర్యముతో ప్రకటంచుటకును శిష్యులవలె సాక్షులుగా చూచామని చెప్పుటకు మనకు ఆత్మ శక్తి కావలెను. బర్నాబా విషయములో ఏమని ఉన్నది? ' ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు .' అది మనలను గూర్చికూడ అయియున్నది గనుక పరిశుద్ధాత్మతో మనము నింపబడవలెను.
చివరి భాగము గురుతులు:- ఒక భక్తుడు ఇప్పుడు 101 గురుతులు ఉన్నవి అనెను. ఆ 101 గురుతులు ఇప్పటి
కాలములో నెరవేరినవట. ఇప్పుడు ఇంకా ఎన్ని గుర్తులు ఎక్కువగును?
ఉదా:- మేఘము పట్టగానే వర్షము వచ్చేటట్టు
ఉన్నది అంటాము. ఆలాగే ఆ గుర్తులనుబట్టి, ఆయన వచ్చేటట్టు ఉన్నాడని మనము అందుము. ఆ భక్తుడు ఆ గురుతులు
కనిపెట్టి ఏరి వ్రాసెను.
ముఖ్యమైన గురుతులు:-
- 1. పరిశుద్ధాత్మ కొరకు అందరు కనిపెట్టుట,
- 2. భూకంపములు వచ్చుట, ( అక్కడ కరువులు, భూకంపములు వచ్చును అని వాక్యములో ఉన్నది. ) ఆయన రాకడనుగూర్చి మనకు భూమి సాక్ష్యమిస్తుంది.
ఆకాశము మాత్రమేకాదు అనగా భూమికూడ చెప్తుంది. అనగా మన స్వంత గృహమే చెప్పుచున్నది. వాక్యములో రాకడనుగూర్చి వ్రాయబడిన సంగతులు, ఆకాశము, భూమి ఇచ్చే సాక్ష్యము నమ్మకపోతే; జ్ఞాము చెప్పుంటే, శ్రమలు చెప్పుంటే, అదికూడ నమ్మకపోతే, తరువాత అప్పుడు నమ్ముదురా! కాని అపుడు నమ్మిన ఉపయోగముండదు. "త్వరగా" అనుమాట ఆయన మాటే గనుక ఆయన "త్వరగా" వస్తున్నాడు గనుక మనము "త్వరగా" సిద్ధపడవలెను. మనము లోకములో నేర్చుకొనుచున్న గొప్ప వృత్తులకంటె ఈ వృత్తి పొందుటకు శక్తి పొందుదుముగాక.
- షరా: ( ఎ ) రాకడ సమయము తండ్రికి తెలుసు అని ప్రభువే చెప్పినారుగదా! గనుక ఆ సమయము తండ్రికి తెలుసు అని ప్రభువే చెప్పినారుగదా! గనుక ఆ సమయము ఏర్పడే ఉన్నది. అప్పుడు ఆయన తన ఏర్పాటును బట్టి, ఏర్పాటును ( తండ్రి ఏర్పరచిన సమయం దాటిపోక, వెంటనే అనగా త్వరగా వచ్చును.
- ( బి ) మీ నిమిత్తము జాగు చేయుచున్నానని ప్రభువు చెప్పెను గదా! ఆ జాగుయొక్క గడువు అయి పోయినవెంటనే అనగా "త్వరగా" వచ్చును.
- ( సి ) గురుతులైన వెంటనే; అనగా "త్వరగా" వచ్చును.
- ( డి ) రాకడ సువార్త ప్రకటింపబడిన వెంటనే; అనగా "త్వరగా" వచ్చును.
- ( ఇ ) పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుటకు అందరికి గడువు అవసరము. సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతునని యోవేలు ద్వారా చెప్పబడినది. పొందవలసినవారు పొందిన వెంటనే; అనగా "త్వరగా" వచ్చును.
- ( ఎఫ్ ) సంఘము సిద్ధపడిన వెంటనే; అనగా "త్వరగా" వచ్చును. ఇటువంటి 'త్వరగా' లన్ని కలిపినయెడల, ఒక 'త్వరగా' అగును. అదేదనగా 'ఇదిగో నేను "త్వరగా" వచ్చుచున్నాను' ఆమేన్.
ఒకనాడు ఒక మనిషికి ఒక బంతి దొరికినదట. ఆ బంతిని పట్టుకుంటే పేలినది. అలాగే నేను వేసే పత్రికలు మీరు పుస్తకములు వదిలిచూస్తే, అదే పని జరుగును. చెప్పుట మన పని, దేవుని పని దేవుడు దానిని చేసివేయును. ఆలాగు త్వరగా, త్వరగా, త్వరగా రాకడకు సిద్ధపడు, త్వరపడు ధన్యత త్రియేక తండ్రి మీకు దయచేసి, త్వరగా మిమ్ములను కొనిపోవును గాక. ఆమేన్.