రాకడ ప్రత్యక్షత - వేగు చూచుట

( 22-10-1948వ సం| |లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము )

దా. కీర్తనలు 106: 13; మత్త. 24:13; హెబ్రీ. 3:6 -11
"ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి" ( దా.కీర్త. 106:13 ).

ప్రియులారా! పాశ్చాత్య దేశములో బట్లర్ అనే దొరగారు యేసుప్రభువు దేవుడని బోధించే, చాలా పుస్తకములు వ్రాసెను. తర్వాతాయనకు జబ్బుచేసెను. అప్పుడా జబ్బులో - " నేను ఇంత కష్టపడి వ్రాసినాను. ఇది ఎంతమట్టుకు నిజమో! అది నిజమైతే బాగుండును. అయినా 99 పాళు జరుగదు. నేను వ్రాసినది పొరపాటే" అనెను. చివరకు "యేసుప్రభువు దేవుడుకాడు , అసలు దేవుడున్నాడనునది, మోక్షమనునది, నరకమనునది నిజమా? అనే సందేహమునకు వచ్చెను. అలాగే ఆదికాండములో సైతాను ఆదాము అవ్వలకు వేసిన ప్రశ్న ఇదియే. ' ఇది నిజమా?' దీనినుండి అనేక ప్రశ్నలు వచ్చెను.

పరమార్ధ జ్ఞానియైన యోహాను పత్మసులంకలో పరవశుడైనప్పుడు వృద్ధుడైయున్నాడు. ఆయన మనస్సు - " నేను ఎఫెసులో నున్నప్పుడు వాక్యమును ప్రకటించితిని. సువార్త గ్రంధమును వ్రాసితిని. నాతోటివారందరు వెళ్ళిపోయిరి. ఇక నేను జీవించను, నా పని అయిపోయినది " అని పరలోకమునకు సిద్ధపడుతూ, లంకలో శ్రమపడుతూ, ' త్వరగా నన్ను తీసుకొని వెళ్ళవలసినది" అని ప్రభువును ప్రార్ధించెను. తన మనస్సుకు , తలంపునకు , జ్ఞానమునకు ఏమియు పనిలేదు. రోమా చక్రవర్తి, నన్ను ఎప్పటికి బయటికి తీస్తాడో! అని అనుకొనెను. అంతలో పరవశుడైనాడు. ప్రభువు ప్రత్యక్షము కావలయునంటే స్వప్నము , దర్శనముద్వారా ప్రత్యక్షత కాగలురు. ఈ క్రింది పద్ధతులు, సాధనముల ద్వారాకూడ ప్రభువు ప్రత్యక్షము కాగలరు.

  • 1. వాక్యము చదువుటను బట్టి,
  • 2. జ్ఞామమునుబట్టి,
  • 3. మనస్సాక్షినిబట్టి
  • 4. స్వప్నమునుబట్టి,
  • 5. దర్శనమునుబట్టి,
  • 6. వ్రాతనుబట్టి,
  • 7. పరవశుడై యుండుటనుబట్టి;
ఆత్మతండ్రి వచ్చి యోహాను శరీరాత్మలను వశపరచుకొనగా, ప్రభువు ప్రత్యక్షమాయెను. శరీరము దీనమనస్సులోనికి వస్తేనేగాని ప్రత్యక్షతరాదు. యొహాను తన శరీరమును కట్టిపెట్టెను గనుక ప్రభువు ప్రత్యక్షత కలిగెను. యోహాను తన శ్రీరమునుకట్టిపోయెను గనుక ప్రభువు ప్రత్యక్షత కలిగెను. యోహాను తన శరీరానికి, క్రియలకు , జ్ఞానానికి పనిలేదునుకున్నాడుగాని ఆత్మ అన్నీ స్థలములకు వెళ్ళును. శరీరము అక్కడనేయున్నది.

ప్రభువు -

  • 1 ) చేతితో యోహానును ముట్టకొనెను.
  • 2 ) భయపడకు మనెను. 30సం ||లు ప్రభువుతో నున్నను ప్రభువు మహిమతో వచ్చినందున భయపడెను. ప్రభువు చెప్పిన విషయములు:
    • 1. సజీవుడను, ఎప్పుడు జీవించువాడను.
    • 2. మృతుడనై లేచియున్నవాడను;
    • 3. జీవించుచున్నవాడను.
    సృష్టికాలము నందు దేవుడు వాక్యమైయుండెను. ఆదికాలము అల్ప; ఓమెగ = వెయ్యేండ్లు పరిపాలన, తీర్పు అయిన తర్వాత అంతము.

    ప్రభువు రాకడ, ఆ తర్వాత ఏడు సంవత్సరములు శ్రమలు ఇవన్నియు ఒకవిధమైన అంతములు. వెయ్యేండ్ల పరిపాలన మనిషి జీవితముయొక్క మెట్లు అనగా ఉన్నత స్థితికి మార్గము. ఆ తర్వాత వచ్చు తీర్పు ఒక అంతము.అల్ఫా అనగా మనుష్యులు ఎల్లప్పుడు జీవించుట. ఓమెగా అనగా మన బ్రతుకును అంతము. ఎప్పుడు ఆరంభించినా, ఎప్పుడు జీవితమునకు ముగింపో అది అల్ఫా, ఓమెగయైయున్నది. ఈ మాటలు బైబిలునందు రెండు పర్యాయములున్నవి. గనుక రెండు అర్ధములున్నవి. ఇంతకుముందు జీవించుట అనగా ఎప్పుడును జీవించుట అని అర్ధము. ఉన్నవాడను, అనగా సమాధిలోనుండి లేచినప్పటినుండి జీవించుచు ఉన్నవాడను అని అర్ధము. సముద్ర స్నానము చేయుచున్నప్పుడు మునుగుట, తేలుట ఉండును. అలాగే ఇప్పుడుండేవారు అనుదినము సమాధిలోకి వెళ్ళుట, మరలా జీవించుట ఉండును. అనగా మునుగుట, తేలుట; మృతులలోనుండి లేచి జీవించుటయు జరుగుచున్నవి. 'అల్ఫా' అనునది గ్రీకులో మొదటిమాట. ఓమేగ అనునది చివరిమాట. సువార్తలన్నియు గ్రీకు భాషలో వ్రాయబడియున్నవి గనుక శిష్యులకు గ్రీకు భాషలో వాక్యము బోధించుట వచ్చును అని తెలియుచున్నది.

    సాదృశ్యము:- మనలను పాలించినది ఇంగ్లీషు ప్రభుత్వము అయినందున ఇంగ్లీషులో అర్జీ వ్రాస్తాము. ఆ కాల మందు గ్రీకు ప్రపంచ భాష కావున అందరికి వచ్చేయుండును. గనుక శిష్యులందరు సువార్తలను అందరు చదువుటకు గాని ప్రపంచభాషయైన గ్రీకులో వ్రాసిరి. ఒక అబ్బాయిని అ, ఆ, లు మొదలు య, ర,ల, వ, ల వరకు వ్రాయండి అంటే, అన్ని వ్రాయాలా అని మొదటనుండి చివరకు వ్రాస్తాడు, అలాగే గ్రీకుభాషలో మొదటి అక్షరము 'అల్ఫా, చివరి అక్షరము 'ఓమెగా అయియున్నది. సిలువపై ప్రభువు ఉన్నప్పుడు రోమా ప్రభుత్వము ఆయన ( యేసు) యూదులకు రక్షకుడని మూడు భాషలలో వ్రాయించెను. ఆ మూడు భాషలు ఏవనగా:-

    • 1 ) గ్రీకు
    • 2 ) హెబ్రీ
    • 3 ) రోమా



    ఈ మూడు భాషలలో యేసు యూదులకు రాజని వ్రాయబడెను. మూడు భాషలలో వ్రాయించుట ఎందుకనగా ప్రప్రంచమంతటికి క్రీస్తు రక్షకుడని తెలుపుటకు వ్రాయించెను.

    మనకు పాఠము:- జబ్బుపడిన వారు స్వస్థ త. పొందుటకు సోమవారము ; అల్ఫ ' ప్రభువున్నాడు జబ్బుపోయింది గనుక ఓమేగ అనే ప్రభువున్నారు. జబ్బుపోయ్న దినమున ఓమెగ అను ప్రభువు ఉన్నారు. ఇవి అన్నియు ప్రభువు చెప్పినందున జబ్బును గూర్చిన భయము పోయింది. మొదట తెలియక భయపడిరి. ' ' భయపడవద్ద ' నుమాటకు ఇవన్నియు సహాయకారులే.

    ప్రకటనలో యోహాను ప్రభువును చూడగా భయపడెను. భయము చివరి వరకు ఉంటే ప్రకటన వ్రాయలేదు. భయము తీర్చుటకొరకు ప్రభువు ఇవన్నియు చెప్పెను.

    ఉదా:- పిచ్చికుక్క తరిమినందున పిల్లవాడు భయముతో ఉన్నప్పుడు పుస్తకము చదువుమంటే చదువలేడు, చదువడు. భయము తీరిన తరువాత చదువుమంటే చదువును.

    • 1 ) మరణముయొక్క తాళము
    • 2 ) మృతుల లోకము యొక్క తాళము నా చేతిలో ఉన్నవి.
    • 3 ) నీవు నాయొక్క చేతిలో ఉన్నావు.
    గనుక నీవు
    • ( ఎ ) విన్నవాటిని,
    • ( బి ) ఉన్నవాటిని
    • సి ) వీటివెంట కలుగబోవు వాటిని వ్రాయమనెను.
    ఉన్నవాటిని అనగా ఆ ఏడు సంఘములున్నవి , పద్మసు లంకయున్నది; వాటిని ఎత్తుకొని యోహానుకు పరలోకములోని సంఘములను చూపిస్తూ వ్రాయమనెను. ఇకముందు కలుగబోవు వాటినికూడ చూచి యోహాను వ్రాయవలెను. అయితే అన్నిటికి కుశల ప్రశ్నలు వేయుటకు వీలున్నదని, యోహాను ప్రశ్నలు వేయకుండా చేయుటకు ప్రభువు ఆత్మ వశుడగునట్లు చేసెను. ప్రకటనలో వ్రాయబడినవన్ని పరలోకమునకు సంభంధించినవి. ఆదికాండము మొదలు ఏడు సఘములవరకు భూలోక చరిత్ర సంగతులు వ్రాసెను. యోహాను ఎఫెసులో నున్నప్పుడు ఆ సంఘములో బోధచేస్తు ఉన్నప్పుడు ఆత్మ నడిపించెను. ఆత్మ సహాయముతో యున్నాడు, గాని ఆత్మవశుడుకాలేదు. పత్మసులో ఆత్మవశుడై యున్నాడు గనుక ఇక శరీరముయొక్క ఆటలుసాగవు.

    ఉదా: - నాకు బజారు వెళ్ళవలెననియున్నను , ఆత్మ వద్దంటే నేను వెళ్ళగలనా? వెళ్ళలేను. అట్లే అన్నియు ఆత్మ చెప్పినట్లే చేయవలయును, నడువవలయును.

    • 1 ) బైబిలు చదువుటలో,
    • 2 ) ఆత్మను పొందుటలో ,
    • 3 ) ఉపవాసములుంలుండుటలో,
    • 4 ) పరలోకములోనివన్నియు; అంతస్థులే.
    • 5 ) పరలోకములో డిగ్రీలు పొందుటకు, అంతస్థు పొందుటకు ప్రతీవారు ప్రయత్నము చేయుదురు.
    7 స్థంభములు = 7సంఘములు. 7 సంఘములు= 7దీపస్థంభములు . 3 కాలములలోను సమ్హ్గములు 7 మాత్రమే ఉండును.మిషనులు ఎన్నైనా ఉండునుగాని సంఘము మాత్రమె మాత్రము ఏడే. ఉదా: - ఇచ్చట అచ్చు ఆఫీసులో గదులుంటాయి. మొదటి గదిలో ఆ, ఆ, లు. 2వ గదిలో య,ర,ల,వ, ఉంటాయి. అక్షరాలు అక్కడక్కడ ఉన్నప్పుడు అవసరమునుబట్టి వాటిని పొందిక చేసినట్లు; అన్నికాలములలో ఉన్న ప్రజలను ప్రభువు ఏడు సంఘము లలోనే నిలువబెట్టుచుండెను. మనము ఇక్కడయున్నాము. ప్రభువు మనలను తయారు చేయును. ఏ సంఘమునకు తయారైతే ఆ సంఘములోనికి చేర్చును. లవొదికయ సంఘములో ఉన్నవారికి అన్ని కష్టములు ఉండును. ఎవరు జయించుదురో, వారు ఆయన సిం హాసనముమీద కూర్చుందురు. పెండ్లి కుమార్తె సంఘము ఏడు తరగతులు. 7 అంతస్థులుగా పరలోకము వెళ్ళగా ఆయన సిం హాసనము ఎదుటే యుందును.యోహాను పత్మసు ద్వీపములో ఉండుట వలన శరీరముతో నడచుట, చూచుట, అన్నీ కష్ట ముగానే యుండును, కాని ప్రభువు ఇంతగొప్ప గ్రంధమును వ్రాయించెను. ప్రభువు రాకడను గురించి ప్రకటన, 1:7లో ఉన్నది. 3 రాడలు: -
    • 1 ) బెత్లెహేములో ( అవతారరాక ),
    • 2 ) రేప్చర్ = రెండవ రాకడప్పుడు,
    • 3 ) హర్మగెద్దోను యుద్ధమునకు వచ్చేరాక.
      • 1 ) మొదటిరాక :- సంఘమును సంపాదించుటకు,
      • 2 ) రెండవరాక:- సంఘమును తీసికొని వెళ్ళుటకు,
      • 3 ) మూడవరాక :- దుష్టత్వముయొక్క కథను కనుగొనుటకు. మీరు ఇంతకాలము వరకును నా సంఘమును, నా సృష్టిని పాడుచేసిరి. ఇప్పుడు మీ కథను కనుగొంటాను అని ప్రభువు హర్మెగెద్దోను యుద్ధమపుడు భూమిమీదకు వచ్చును. ఈ విషయములు యోహానుకు విపులముగా ప్రభువు తెలిపెను.
      • ( 1 ) మొదటి రాకడలో సంఘమును భూమిపై విడిచివెళ్ళెను.
      • ( 2 ) రెండవరాకడలో పెండ్లి కుమార్తెను, తీసికొని వెళ్ళుటకు వచ్చును.
      • ( 3 ) మూడవ రాకడలో పెండ్లికుమాత్రెతో తిరిగి వచ్చును. వరుడు వధువు ఇరువురు కలసి వస్తారు. అనగా క్రీస్తుప్రభువు కలిసి , పరిశుద్దుల పక్షముగా యుద్ధము చేయుటకు వస్తారు.
      మరియొక వరుస:
      • 1వ రాకడ:- ఆదికాండము మొదలుకొని ప్రకటన వరకు ప్రభువు వచ్చుట ఒక రాకడ.
      • 2వ రాకడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉందురో, అక్కడకి వచ్చుట
      • 3వ రాకడ ఇప్పుడు ప్రార్ధించితే, యోహానుకు కనబడట్టు కనబడుట; ఇది దర్శనమిచ్చుటకు వచ్చే రాకడ.
      • 4వ రాకడ: ఏడు సంవత్సరములలో తయారైన సంఘమును తీసికొని పోవుటకు అనగా పరిగె యేరుకొనుటకు వచ్చే రాకడ. అసలైన వారు పోగా, మిగిలినవారిని తీసికొనిపోవుటకు వచ్చే రాకడ.
      • 5వ రాకడ వెయ్యేండ్ల పరిపాలన చేయుటకు వచ్చుట.

      అంత్యతీర్పు:- దూతలుండును. తండ్రి, పరిశుద్ధాత్మలుండరు. ఆ తీర్పు ఎక్కడ జరుగునో ఎవరికిని తెలియదు. ఆ దినముయొక్క మహిమ ఎవరు సహించలేరు. ఆయన ప్రభావమువల్ల వారిని నిలువబెట్టి , తీర్పు తీర్చి పంపియేయును మోక్ష, నరకములకు ). అన్నీ ఆయన ప్రభావముల వల్లనే జరుగును. ఆది. 6:8 తీర్పుదినమున పరిశుద్ధాత్మ తండ్రి విచారము ఈలాగు చెప్పబడినది. ( అయ్యగారికి ప్రభువు దర్శనములో, పరిశుద్ధాత్మ పావురము అంత్యతీర్పు సమయమందు పడుబాధ ఇట్లు వివరించిరి ) ఒక వేటగాని బాణము పక్షియొక్క గుండెకు తగులగా, ఆ పక్షి క్రిందికి పడిపోయి , నోరు తెరచి రక్తము కార్చును. (నోరు తెరుస్తూ, మీద పడుతున్నట్లు , రెక్కలు కొట్టుకొనుచున్నట్లు చూపిరి ) ప్రభువు రాకడకు కనిపెట్టే వారందరు ఒక గుంపు, కనిపెట్టనిది ఒక గుంపు.

      కనిపెట్టువారిలో 3 గుంపులు ఉన్నవి. అవి ఏవనగా - 1గుంపువారు ' ఎదురు ' చూస్తున్నారు. 2వ గుంపువారు ' వేగం ' చూస్తున్నారు. 3వ గుంపువారు సిద్ధపడుచున్నారు.

      • ( 1 ) ఆకాశములో సూర్య,చంద్ర, నక్షత్రములలో కనబడే గుర్తులు.
      • ( 2 ) మనుష్యులలో దేవుని మాట వినకపోవుట.
      • ( 3 ) భూమిలోను సృష్టి అంతటిలోను మార్పు.
      • ( 4 ) సముద్రములో ఓడలు మునుగుట మొదలగునవి. ఇవన్నియుచూచి రాకడ అదిగో అందురు.

      3వ గుంపువారు ప్రయాణమునకుపోవు వారివలె దిద్ధపడుదురు. అదునుకు పదునుగా నుందురు. ప్రభువు కృప ఎప్పుడు వచ్చినా సిద్ధపడేయుందురు. ఈ మూడు గుంపులను కలిపితే, వారే అన్నియు చేసేవారు. ఒకరోజున ఎదురుచూస్తారు. ఇంకొక రోజున సరందమౌదురు (సంతోషితురు ) . వీరంతా కలసి ఒక తరగతి. వారి పనులు 3 కాని గుంపు ఒకటయే. ఈ మూడు పనులలో ఏదియు మానరాదు.

      ఉదా:- ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు, రైలు బండికి సమయమై .పోయినపుడు చదువుట కంఠతగా వచ్చిన "దీనమనస్సుగలవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిదీ అను చిన్న వాక్యము లేక మనకు కంఠత వచ్చిరేదో వాక్యము జ్ఞాపకము తెచ్చుకొని, బండికి పరుగెత్తవలెను. మరియు బైబిలు విప్పి ఏది వ్స్తే, అదే ఒక వాక్యము చదివి పరుగెత్తవలెను. ఓ తండ్రీ! పూర్వకాలమందు మనుష్యులను జ్ఞాపకము ఉంచుకొన్నావు గనుక వందనాలు. బైబిలులో వారిపేర్లు వ్రాసినట్టు మా పేర్లు పరలోక బైబిలులో వ్రాయుము అని ప్రార్ధన చేసికొంటూ పరుగెత్తవలెను.ప్రభువా!నేడు మేము నేర్చుకొనినదంతయు మా స్వంత ప్రార్ధనగా చేసుకొనే శక్తి దయచేయుము. ఆమేన్. ఇట్లు మనస్సున వాక్యము, ప్రార్ధన, స్తుతులు చేయుచు రాకకై సిద్ధపడవలెను.

      రక్షణ సార్వత్రికము :- దేవుడు అందరి దేవుడు. బైబిలు అందరి బైబిలే. మోక్షము అందరి మోక్షము. అలాగే రాకడ అందరికొరకు. అందరికొరకైన ఈ రాకడను అందరు అంగీకరించుటలేదు. బైబిలు అందరు అంగీకరించుటలేదు. మోక్షము అందరికొరకు ఉద్దేశించినప్పటికిని ఎవరును అంగీకరించుటలేదు.

      పై నాలుగును అనగా దేవుడు, బైబిలు మోక్షము, రాకడ అనునవి; మనిషి కొరకే దేవుడు ఉద్ధేశించెను. గాని మనిషి వాటిని అంగీకరించుటలేదు. గనుక లోపము కనబడుచున్నది. ఉపదేశించుట ఆయనవంతు. అంగీకరించుట మనవంతు. ఆలాగున ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ఈవిని, భాగ్యమును; మరి ముఖ్యముగా రాకడ అంతస్థును, అందులోని సర్వ సౌభాగ్యములను స్వతంత్రించుకొను ధన్యతను ప్రాణప్రియుడు నేడు మీకెల్లరకును దయచేయును గాక. ఆమేన్.

      ప్రార్ధన:- ఈ దినము చెప్పబడిన వర్తమానములో నీ వాక్కును మాకు వినిపించిన తండ్రీ! నీకు స్తోత్రములు. ఆదియు అంతమునై యున్న ప్రభువా! నీరాకడ ఘడియ ఎప్పుడో మాకు తెలియదు. తెలియనందున నీ రాకడ ఆలస్యమైనదని మేము ఇహలోకముతో రాజీపడక, ఆ నీ రాక ఘడియకు తప్పిపోకుండా, మెళకువకలిగి అంతము వరకు సహించిన వారమై ఓపికతో నీకొరకు ఎదురుచూచు దీవెన మాకు అనుగ్రహించుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాము ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद