(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
క్రైస్తవమత సంఘము కథ
తరువాత ఏమి జరిగినదో వినండి. ఆరోహణమై పరలోకమునకు ఎత్తబడిన రక్షకుని శిష్యులు తేరిచూచి వెనుకకు మళ్ళి యెరూషలేమునందు చేరి
రక్షకుడు చెప్పిన మాట నెరవేరు నిమిత్తము పది దినములు ఏకరీతిగా కూడుకొనిరి. ఆ పిమ్మట శిష్యుల పై దైవాత్మ విభాగింపబడిన
అగ్ని నాలుకలువలె వ్రాలగ వారు దైవాత్మను పొందిరి. ఆ దినమే క్రైస్తవమత ఉద్భవ దినమైయున్నది. శిష్యులు ధైర్యముతో మతబోధకు
బయలుదేరినారు. అనేక దేశములకు చెదరిపోయి క్రీస్తును గురించి ప్రకటించిరి. ఈ బోధలు విని రక్షకుని అంగీకరించి బాప్తీస్మము
పొందిన వారే క్రైస్తవులనబడినారు. వీరి మతమే క్రైస్తవమతము. కాలక్రమేణ శిష్యుల బోధనలు బట్టి క్రైస్తవమతము లోకమంతట
వ్యాపించినది.
క్రైస్తవమత గ్రంధమే బైబిలు గ్రంధము. కొన్నాళ్ళకు రక్షకుని శిష్యులు ఒకరి తరువాత ఒకరు గతించిపోయిరి. తరువాత బైబిలు
చదువుకొనుచున్నవారిలో విబేధములు కలిగినవి. అందుచేత ఎన్నో మిషనులుగా చీలిపోయినవి అందరివద్ద ఉన్న బైబిలు ఒక్కటే.
బైబిలునుబట్టి
చీలికలు కలుగలేదుగాని, బైబిలునుబట్టి అందులో ఉన్న సంగతులను అర్ధము చేసికొనుటలో విభేదము కలిగినది. ఎవరి ఇష్టమునుబట్టి,
ఎవరి
జ్ఞానమునుబట్టి బైబిలు గ్రంథమును అర్ధము చేసికొనుటలో ఈ ముప్పు వచ్చినది.
క్రైస్తవమతము చీలిపోయిన, శాఖలైపోయిన క్రీస్తే
రక్షకుడని బోధించుచున్నది. ఈ విషయములో అన్ని మిషనులు ఒక్కటే. బైబిలు రెండువేల భాషలలోనికి మార్చినారు. ఈ విధముగా ఏ మత
గ్రంథముకూడ తర్జుమా కాలేదు.