(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

సజీవులతీర్పు కథ



వెయ్యేండ్ల పరిపాలన చివరిలో బోధ విన్నవారందరిని యేసు క్రీస్తు వారు పోగుచేసి వారి తీర్మానము వింటారు. ఈ బోధ విననివారు ఏమి తీర్మానము చేసికొందురో తెలిసికొని క్రీస్తుప్రభువు వారికి తీర్పు వినిపిస్తారు.


ఈ భూమిమీద క్రీస్తుప్రభువు సింహాసనమువేసి కూర్చుండి అందరిని పోగుచేయుదురు. దీవెన పొందినవారు కుడివైపున, శాపము పొందినవారు ఎడమ ప్రక్కన నిలువబడి తీర్పును వింటారు.


దీవెన పొందినవారిని గొజ్జెలకు పోల్చవచ్చును, శాపము పొందినవారిని మేకలకు పోల్చవచ్చును. అప్పుడు క్రీస్తుప్రభువువారు ఈ ప్రకారము తీర్పు వినిపించెదరు. దీవెన పొందిన వారలాలా! మీరు ఇతరులకు ఉపకారము చేసియున్నారు. గనుక నాకు చేసినట్లే గనుక నా తండ్రిచేత మీకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకొనండి అని చెప్పును.


శాపగ్రస్తులను చూచి మీరు ఆ విధముగా చేయలేదు గనుక అక్రమము చేయువారలారా, మీ కొరకు సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి పొండి అని తీర్పు విధించును.