(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

రెండవసారి వెళ్ళేవారి కథ



ఇప్పటి వరకు మొదటిసారి ఎగిరి వెళ్ళేవారి కథ విన్నారు. ఇప్పుడు రెండవసారి ఎగిరి వెళ్ళేవారి కథ వినండి.


క్రీస్తువారు సిద్ధపడిన సంఘమునకు తీసికొని వెళ్ళిన తరువాత చాలామంది భూమిమీద మిగిలిపోవుదురు. వారి కథ ఏమిటి? మిగిలిపోయిన వారిలో కొందరు పశ్చాత్తాపపడి ప్రభువా, మేము మొదటి పిలుపునాడు సిద్ధపడకపోవుట మా తప్పే, పశ్చాత్తాపముతో క్షమించుమని ప్రార్థించెదరు.


అప్పుడు ఆయన వచ్చి ఎవరైతే పశ్చాత్తాముతో ప్రార్ధించినారో, అట్టి వారినందరిని తీసికొనివెళ్ళి మోక్షములో వేరొకచోటవారిని చేర్చివేయును.


వారు మొదటిసారి వెళ్ళిన ఆ జట్టువారియొద్దకు వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళిన ఆ స్థలమందున్న మహిమకు ఆగలేరు. ఎలాగైతేనేమి క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చేసమయమునకు చావు తప్పించుకొని ప్రభువుతో వెళ్ళినారు.


రెండవ రాకడలో మహిమతో వెళ్ళిన రెండు జట్టుల వారితో వెళ్ళకపోయినను తరువాత వెళ్ళిరి. అంతే చాలును. మొదటిసారి సిద్ధపడి ఉంటే ఎంతో బాగుండును. శ్రమలు తప్పించుకొని ఉందురు. భూమిమీద ఆరంభించే శ్రమలను దాటికొని వెళ్ళిపోయి ఉందురు.