(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
వాయుమండల లోకము
-
1) భూలోక సృష్టి:- దేవుడు ఆకాశమును, భూమిని, వాటిలోని సమస్తమును మనకొరకే నరజన్మమునకు పూర్వమే సృజించెను. దేవుడు
ఆకాశములో
దీపములను పెట్టెను. అవే సూర్య, చంద్ర, నక్షత్రములు, భూమి అను మన ఇంటికి పైకప్పు ఆకాశము, భూమి మన ఇల్లు, జ్యోతులు మన
దీపములు,
నీరు - బహిరంగ మష్టును శుద్ధిచేయు వస్తువు మరియు మానవులమైన మనకు సమస్త జీవులకు దాహ శాంతినిచ్చును. పక్షులు, చేపలు,
జంతువులు
-
ఇవి మన వినోద జీవులు. గాలి మన ప్రాణాధారము. మందులకు కావలసిన వనమూలికాదులను కూడ దేవుడు చేసెను. ధనమునకు కావలసిన లోహములను
చేసెను. దేవుడు భూమిలోనుండి చెట్లు మొలిపించెను. వాటిపండ్లు మనకు ఆహారమాయెను. జంతువులు మనకు పనిచేసి పెట్టుటకు
కలుగజేసెను.
దేవుడు ఇవన్ని కలుగజేసినప్పుడు మహాశుభ్రముగా నుండెను. ఎక్కడా కళంకములేదు. దేవుడు మానవుని కొరకు కలుగజేసినవన్ని తెలిసి
కొనుటకు లోకాంతము పట్టును. "ఈథర్" అనునది దేవుడు గాలిలో ఆదిలోనే పెట్టెనుగాని అది ఉన్నట్టు మొన్ననే శాస్త్రజ్ఞులు
కనిపెట్టిరి. దేవుడు ఆదిలో సృజించిన వాటిని లోకాంతము వరకు తేలిసికొనుచునే ఉందుము. లోకములన్నిటిని చేసిన తర్వాత దేవుడు
చివరకు మనిషిని చేసెను. మనిషికి దేవుడు తన గుణములు దయచేసినాడు. ఆయనలో నుండే ప్రేమ, జ్ఞానము, పరిశుద్ధత, స్వతంత్రత ఈ
మొదలైన
లక్షణములన్నియు మనిషికి దయచేసెను. అందుచేతనే దేవుడు మనిషిని తన పోలిక చొప్పున చేసెనని బైబిలు గ్రంథములో నున్నది. దేవుడు
మనిషి ఒక్కరైయున్నారు. మనిషి దేవునిని చూచేవాడు, దేవుడు మాట్లాడిన మనిషి వినేవాడు. మనిషి ఎంతో ఆనందముగా నున్నాడు. నరుడు
దేవుని గుణములు గలవాడు గనుకనే దేవరూపము గలవాడని అందురు. మనుష్యుడు భూమిమీద కొంతకాలమును, పరలోకములో కొంతకాలమును ఉండుటకు
దేవుడు చేసెను. ఏమి లేనప్పుడు అన్ని తండ్రి ఇస్తాడు దేవుడు ఆదాము అను ఒక పురుషుని, హవ్వ అను ఒక స్త్రీని కలుజేసెను. వారు
పరిశుద్ధులు. భూమ్యాకాశములకు వారే పాలకులు. వీరు మహా పవిత్రులుగా దేవుని సన్నిధినే నివసించువారు. పాపానంతరము
జన్మించిన మనము వారి పవిత్రతను గ్రహింపలేము. వారిద్దరిని శృంగారమైన వనములో దేవుడు పెట్టెను. (ఆది. 1,2 అధ్యాయములు).
-
2) పరిశుద్ధలోకము:- పరిశుద్ధుడైన దేవుడును, పరిశుద్ధుడైన ఆదామును, పరిశుద్దురాలైన అవ్వను, పరిశుద్ధమైన
జంతువులమధ్యను
పరిశుద్ధమైన పక్షుల మధ్యను, పరిశుద్ధమైన భూమిమీద సహవాసముగా జీవించుచుండిరి. (సజీవుల తీర్పు అయిన తర్వాత ఇట్టి స్థితి మరల
లోకమునకు వచ్చును) ఈ పరిశుద్ధ లోకములో దేవుడును, మనుష్యులును కలిసియుండువారు. దేవుడు వారితో మాట్లాడుచుండువాడు,
జీవరాసులును,
నరులును స్నేహభావము కలిగియుండిరి. సృష్టి యావత్తు మహా పరిశుద్ధముగా నుండెను. ఆది. 1:27. నరుడు దేవుని లక్షణములు
కలిగియుండెను. అందుచేతనే దేవుడు నరుని తన పోలికగా చేసెనని చెప్పుదురు. ఈ లోకములో అంతము అన్నియు పరిశుద్ధములే,
జంతువులకును,
మనుష్యులకును ఎవరిలో ఉండవలసిన పరిశుద్ధత వారిలో ఉండెను. ఒకదానికొకటి హానిచేయవలెనని ఉద్దేశము లేదు. పరిశుద్ధత అనగా
పవిత్రత.
చెడుగు లేకుండ నుండుట. పరిశుద్ధత అనగా అపవిత్రతకు సందులేదు. పరిశుద్ధత అంటే పరిశుద్ధత, అసలులో అట్టి పరిశుద్ధతయే
నుండెను.
-
3) పాపప్రవేశము:- సైతాను మాయ బోధనుబట్టి ఆ మొదటి దంపతులు పాపాత్ములైరి. పాపము దూత (సైతాను)లో పుట్టెను.
అతనిలోనుండి
అవ్వకు,
అవ్వలోనుండి ఆదాముకు, ఆ ఇద్దరిలోనుండి అందరికి వచ్చెను, గనుక అందరి రక్షణ కొరకు రక్షకుడు రావలసి వచ్చెను, గాని సైతాను
కొరకుకాదు. అంత్య దినమందు మారనివారితో దేవుడిట్లనును - సైతానుకును అతని దూతలకును ఏర్పరచబడిన నరకములోనికి వెళ్ళుడి అని
చెప్పును. నరకము సైతానుకును దాని దూతలకును గాని నరునికికాదు. నరుడు “నేలకుపోయేది నెత్తిన రాసుకున్నాడు” సైతాను స్త్రీకి
కొన్ని
మాయమాటలు చెప్పి దేవుడు నరులను తినవద్దన్న పండ్లు తినిపించెను. స్త్రీ సైతానుయొక్క దగాలో పడిపోయెను. స్త్రీ వెళ్ళి
పురుషనికిచ్చెను. ఇద్దరు పాపాత్ములైనారు దేవుని వాక్యప్రకారము చేయక, దయ్యముయొక్క వాక్యప్రకారము చేసి పాపాత్ములైరి.
ఇప్పుడుకూడ లోకములో ఈ విధముగానే జరుగుచున్నది. దేవుని మాటలు మనుష్యులు వినరు. దయ్యము మాటలు వింటారు ఫలానపని చేయవద్దని
దేవుడు
ఆ మొదటి నరునికి చెప్పి ఉంచినాడు. అది సైతాను తెలిసికొన్నాడు. చేయవచ్చునని సైతాను చెప్పినాడు. నరులు సైతాను మాటే
విన్నారు.
మా తండ్రి చేయవద్దన్నాడు, అని స్త్రీ అంటే సైతాను ఏమిచేస్తాడు కాని ఆ స్త్రీ అనలేదు. దైవాజ్ఞ మీరినందున వారు దేవునికి
దూరమైరి. సృష్టి అంతటికి శాపము కలిగెను. కాబట్టి జీవరాసులు నరునిమీద ఎదురు తిరిగెను. భూమి ముండ్లు మొలిపించినది. విషము,
వ్యాధి, కరవు, భూకంపము అన్ని చిక్కులు, కీడులు లోకములో ప్రవేశించెను. సాతాను హవ్వతో ఫలాన, ఫలాన అని చెప్పినప్పుడు అవ్వ ఈ
విధముగా చెప్పియున్న పాపము లేకపోవును. నీవు చెప్పినది సరియైతే అనవచ్చునుగాని, దేవుడు తినవద్దని చెప్పినాడు గనుక నేను
తిననని
చెప్పిన పాపము లేకపోవును. మనిషి పాపములో పడగలడు. దేవదూతలుకూడ పడగలరు. గాని దూతలు పాపములో పడనందున దేవుడు వారికి పాపము
చేయలేని వరమిచ్చెను. పరలోక ప్రార్ధనలో పరలోకమందున్న దేవదూతలు పాపము చేయనందున నీ చిత్తము ఎట్లు అక్కడ నెరవేరుచున్నదో
అట్లే
భూమిమీద నుండు మేమును పాపము చేయకుండ ఉండి నీ చిత్తము నెరవేర్చునట్లు చేయుమని ప్రార్ధించుచున్నాము. సృష్టికి
అధికారయైయుండిన
మనుష్యుడు చెడిపోయినందున సృష్టి అంతయు చెడిపోయి, చెడుగు అన్నిటిలో అంతటిలో ప్రవేశించెను. సృష్టియావత్తు
క్షయాదీనదాస్యములోపడి ప్రసవ వేదనపడుచు, మూలుగుచు విడుదల కోరుచున్నది. పెండ్లికుమార్తె ఎత్తబడిన తర్వాత ఈ దాస్యము
కొంతవరకు
తగ్గును.