(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
అనాది లక్షణముల మహాసభ
దేవుని లక్షణములు :
-
1) ఆదిలేనివాడు: ఆయనను ఎవ్వరును కలుగజేయలేదు. ఆయన అంతట ఆయనే ఉన్నాడు. సృష్టింపబడకుండ ఉన్నవాడు గనుక ఆయన
ముందే ఉండి మన కథలన్నియు చూస్తు మనకు కావలసిన ఏర్పాటులన్నియు చేయుచున్నాడు. గనుక వందనములు.
-
2) అంతములేనివాడు : అనంతదేవుడు
అనగా ఎల్లప్పుడు ఉండగల దేవుడు ఆయన అంతములేనివాడు గనుక అంతములేని తన దగ్గర అంతము లేనంతకాలము మనలను తనదగ్గర ఉంచుకొనును,
గాని
నాశనముచేయడు. స్థలముకాని స్థలములో, కాలముకాని కాలములో ఆయనవద్ద నిత్యము మనము ఉందుము. ఆయన నన్ను అనంతము తన సన్నిధిలో
ఉండనిచ్చును, గనుక స్తోత్రము.
-
3) ప్రేమ: దేవుడు ముగ్గురుగా (త్రిత్వము) నుండకపోయిన దేవుని ప్రేమించుట ఉండదు. జీవరాసులు
ఒకదానినొకటి ప్రేమించుట దేవుని ప్రేమనుబట్టియే. మనుష్యులుకూడ ఒకరినొకరు ప్రేమించుకొనుట కూడ ఆయన ప్రేమయే. భూలోకములో
తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించుటకన్న దేవుడు మానవులను ఎంతో ఎక్కువగా ప్రేమించుచున్నాడు. ఆయన ఎల్లప్పుడు ప్రేమగానే
యుండును. నన్ను కలుగజేసినవాడు నన్ను ప్రేమించకపోతే ఇంకేమి చేయును. దేవుని ప్రేమనుబట్టి మానవులకు కావలసిన సదుపాయములన్ని
ఆలోచించి చేసినాడు. ప్రేమనుబట్టి మనలను సహించుచున్నాడు. ప్రేమనుబట్టియే శిక్షించుచున్నాడు. పాపములు జ్ఞాపకము చేసికొనను
అన్నాడు గనుక నుతులు.
-
4) పరిశుద్ధత : దేవుడు ఎప్పుడును పొరపాటు చేయనేరడు. సమస్త సృష్టిని మానవుని పరిశుద్ధముగానే కలుగజేసెను.
పాప ప్రవేశమునుబట్టి అపరిశుద్ధత మానవునికి కలిగినను దేవుని పరిశుద్దతనుబట్టి మరల పరిశుద్ధత మానవునికి దయచేయున్నాడు.
లోకములో
పాపమున్నను పరిశుద్ధతకూడ ఉన్నది. వర్షజలములలో, కాయలలో, పండ్లలో పరిశుద్ధత కనబడుచున్నది. అపరిశుద్ధుడగుచున్న మానవుని
ఒకదరినుండి శుద్ధిచేయుచుండుట ఆయన పరిశుద్ధతయొక్క స్వభావము గనుక నీకు స్తోత్రములు.
-
5) సర్వశక్తి: ఏదిబడితే అది చేయగలడు ఆయన
చేయలేని పనిలేదు, అయితే పాపము అశక్తియై ఉన్నది గనుక దేవునికి అశక్తిలేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. గనుక మానవులకు,
జీవరాసులకు శక్తి ఇచ్చెను. గనుక నడువగలరు, పనిచేయగలరు, మానవుని విషయములో కష్టమైనపనియైనను, అసాధ్యమైన పనియైనను చేయగలడు.
నాకేమి తెచ్చిపెట్టుమని కోరినను అది ఇచ్చును. నేను తేలేను అని అనడు. ఏది చేయుమన్న చేయలేను అనడు, తండ్రీ పడిపోయినను
లేవనెత్తుము అనిన లేవనెత్తలేననడు. ఎవరైనను నాకు శక్తిలేదు ప్రభువా అన్నయెడల నాశక్తి ఉన్నదిగదా! లేదని ఎందుకంటావు అనును
నీకు
స్తుతులు.
-
6) సర్వజ్ఞాని : మన కష్టములు, కోరికలు మనము చెప్పకముందే ఆయనకు తెలియును. మన ప్రార్ధనలు నెరవేర్చుటకు ఎన్నో
చిక్కులు అడ్డముగానున్నను ఆ చిక్కులన్ని విడదీసి ప్రార్ధన నెరవేర్చగల జ్ఞానోపాయము ఆయనకు గలదు. ఆయన జ్ఞానియైయున్నాడు.
గనుక
దూతలకు, మనుష్యులకు, జీవరాసులకు జ్ఞానము ఇచ్చినాడు. ఆ జ్ఞానమువలననే, మానవులు సృష్టిలోని అనేక మర్మములను
తెలిసికొనుచున్నారు.
నేనెత్తి మెత్తుకొన్నను ఒకొకప్పుడు నా ఇష్టము నెరవేర్చడు, కారణము నాకు తెలియదు. ఆ కారణము దేవుని సర్వజ్ఞానమునకు
తెలియును.
నేననుకొన్నది నెరవేరిన అది నాకు హానియని ఆయన జ్ఞానమునకు తెలియును. ఎందుకు నెరవేర్చలేదు అని నేను అడిగిన నీవు గ్రహించలేవు
అని
చెప్పును. బైబిలులో ఒక సంగతి అర్ధము కానప్పుడు అనేక ప్రశ్నలు వేసికొని మన మనస్సు చెదరకొట్టుకొందుము. అప్పుడు మనము మన
జ్ఞానముమీద ఆనుకొన్నట్లు ప్రభువును అడిగిన ఆయన తప్పక వివరించును.
ఉదా: ప్రభువా నిన్నెరగనివారు అనేకులు చనిపోయిరి. వారి గతి
ఏమిటి అని అడుగగా - హేడెస్సులో వారికి బైబిలు క్లాసు పెట్టినాను బోధించుచున్నాను అని ప్రభువు చెప్పినప్పుడు అయ్యగారికి
కలిగిన
సంతోషము చెప్పలేము (Now it is clear Father) అని సంతోషించి స్తుతించిరి. బైబిలులో ఆధారమగు వాక్యముగలవు గాని మీకు
స్పష్టముగా
తెలియదు. మీరు వచ్చిన అక్కడికి తీసుకొని వెళ్ళుదునని ప్రభువు చెప్పిరి. కొందరిని ఆయన తీసుకొని వెళ్ళుచున్నారు. గనుక నీకు
సంస్తుతులు.
-
7) జీవము : ఆయన జీవమైయున్నాడు. గనుక ఏమియు పనిచేయకుండా ఉండలేడు. ఎప్పుడును పనిచేయుచుండును. మానవునిలోని జీవము
బలహీనతనుబట్టి నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మరల మానవునిలో జీవము ధారపోయును. మరియు నా ప్రార్ధనయు, నేనును జీవము
కలిగియుందుము. మరణము వచ్చిన ఇది మరణమెందుకయినది ఇది జీవమే అనును. అవిశ్వాసులు అలాగు అనరు. మరణమునుచూచి మరణమే అందురు.
విశ్వాసులైన ఇది క్రొత్త జీవము అందురు.
-
8) సర్వవ్యాపకత్వము : మన మెక్కడనున్నను ఆయన అక్కడ ఉన్నాడు గనుక భయపడనక్కరలేదు.
పరలోకములోను, భూలోకములోను, అన్ని స్థలములలోను ఉండగలడు. మనిషి ఎక్కడ ఉన్నను దేవుడు అక్కడ ఉండగలడు. మానవునికి జతగా
ఉండగలడు.
సహాయము చేయగలడు. ఆయన సర్వవ్యాప్తి గనుక ఆయన ప్రభావము, ప్రేమ, జీవము, కాపుదల అన్నిచోట్ల కనబడుచున్నవి. నేనెక్కడ ఉందునో,
నా
నీడ
అక్కడ ఉండును. అలాగే నా నీడవలె ఆయన దగ్గర నుండును. గనుక నీకు ప్రణుతులు.
-
9) న్యాయము : ప్రతివారికి తగిన స్ధితి ఏర్పర్చును.
ఒకరు పొరపాటులోనున్నప్పుడు న్యాయమైన రీతిగా గద్దించి, శిక్షించును, కొందరు దేవుడు తండ్రి అయితే మాకు కనబడకూడదా అని
అడుగుచున్నారు. మనిషికి కనబడకుండుటే దేవునియొక్క న్యాయము. అది మనకు అర్ధముకాదు. ఆయన ఏ కాలములో ఏ భక్తునికి అన్యాయము
చేయలేదు.
నిత్యమంగళ స్తోత్రములు.
-
10) స్వతంత్రుడు : దేవుడు స్వేచ్చపరుడు. ఎవరును ఆయనకు ఎప్పుడును సలహానీయనక్కరలేదు. తన
ఇష్టప్రకారము అన్నియు చేయగలడు. మనకు స్వతంత్రముగా పనిచేయగల శక్తి అనుగ్రహించెను. అన్ని లక్షణములు దేవుడు మనకు ఇచ్చి
స్వతంత్ర
లక్షణము ఇవ్వకపోయిన యెడల తక్కిన లక్షణములిచ్చిన ప్రయోజనములేదు. ఆదాము పాపములో పడినప్పుడు దేవుడు స్వతంత్రుడు గాన
ఊరుకొన్నాడు. ప్రేమనుబట్టి వెళ్ళినాడు. జ్ఞానమునుబట్టి తెలిసికొన్నాడు. శక్తినిబట్టి బయటకు తీసుకొని రావలెననుకొన్నాడు.
న్యాయమునుబట్టి తీసుకొని వచ్చినాడు, దేవుని లక్షణములలో ఎగుడుదిగుళ్ళు లేవు, ఒకటే బంతి, ఒకటే దొంతి, గనుక మనకు శాంతి
దేవుడు
శుభలక్షణములతో అన్నిలోకములను పరిపాలించుచున్నారు.