(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
మన కాల కథ
క్రైస్తవమతము సర్వలోక మతము గనుక మొదటినుండి సర్వలోకములో ప్రకటనయగుచున్నది. బైబిలు అనే గ్రంథమొక్కటే సర్వలోకముయొక్క
గ్రంథము గనుక ఆ గ్రంధమునకు సర్వలోక భాషలలోనికి తర్జుమా చేయగల యోగము పట్టినది. దేవుడు ఒక్కడే ఆ దేవుడు సర్వలోకమును
కలుగజేసినాడు, రక్షకుడు ఒక్కడే ఆ రక్షకుడే నరావతారమెత్తగా యేసుక్రీస్తు అను పేరుమీద ప్రసిద్ధి కెక్కినాడు. మతము అంతయు
ఒక్కటే. అవతార పురుషుని గురించి బోధించుచున్న మతము క్రీస్తుమతము. ఆ మత గ్రంథము ఒక్కటే ఆ మత గ్రంథమును గురించి
వ్రాసియున్న ఈ
సంగతులు మరువకండి.
క్రీస్తు శిష్యులు ఒక మత సంఘముగా ఏర్పడి ఏ పనిచేయుచున్నారు? యేసుక్రీస్తుచేసిన పని చేయుచున్నారు.
రక్షకుడు చేసినంత పనిచేయకపోయిన తాము చేయగలిగినంత చేయుచున్నారు. యేసుక్రీస్తు బోధలు బోధించినారు. క్రైస్తవులుకూడ
బోధించుచున్నారు. బడిలో, గుడిలో, వీధులలో బోధించు చున్నారు. కాగితములువేసి, పుస్తకాలు వేసి బోధించుచున్నారు.
క్రీస్తుప్రభువు
తనయొద్దకు వచ్చిన రోగులను బాగుచేసినారు. క్రైస్తవులు ఆసుపత్రులు పెట్టి రోగులకు సహాయము చేస్తున్నారు. కొందరు భక్తులు
మందులు
లేకుండగనే ప్రార్ధనచేసి రోగులను బాగుచేయుచున్నారు. యేసుప్రభువు ఆకలితోనున్న 5 వేలమందిని పోషించారు.
క్రైస్తవులు
బోర్డింగ్
పెట్టి పిల్లలకు ఆహారము పెట్టుచున్నారు. బట్టలు ఇస్తు ఉన్నారు. యేసుక్రీస్తువారు, వారము, వారము దేవాలయమునకు వెళ్ళినారు.
అలాగుననే క్రైస్తవులుకూడ వారము, వారము దేవాలయమునకు వెళ్ళుచున్నారు. ఈ ఆచారము మహామంచిది, ఈ ఆచారము మతమునకు ప్రధానము
వంటిది.
నమ్మి జీవించండి - శ్రీ యేసు క్రీస్తున్ - నమ్మిజీవించండి - నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మినవారికి మోక్షము దొరుకును ॥నమ్మి॥
1. నెమ్మదిగా యిది యంతయు విన్న - నమ్మగలడు ఈ నరుడ కథలు ॥నమ్మి॥
2. నమ్మిక కొరకు ప్రార్ధన చేసిన - నమ్మిక వరమై నడుచును గాన ॥నమ్మి॥