(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

నిరీక్షణకాల కథ



అయితే ఒకటి దేవుడు రక్షకుని పంపిస్తానన్నాడు గదూ? ఆ మాట నమ్మి కొందరు ఎదురు చూచి చనిపోయిరి. ఆ విధముగా చనిపోయినవారు మోక్షానికి వెళ్ళిరి. దేవుని ప్రేమ ఎంతమంచి ఏర్పాటు చేసినదో చూడండి. అనేకులు నమ్మలేదు. వారు వెళ్ళనేలేదు. నమ్మకపోవడముకూడ ఒక పాపమని చదువువారు గ్రహించవలెను. నమ్మకపోవడము అనేదే అన్ని పాపాలకన్న గొప్ప పాపమని నేను అనుకొంటున్నాను. నమ్మితే మాత్రము చెప్పినట్టు చేయకపోవడము రెండవ గొప్ప పాపము. పాపములేని ఆది మానవుల యొద్ద నివసించిన దేవుడు వారి పాపములనుబట్టి, కనబడుట మానివేయగా, తదనంతరము జన్మించిన వారిలో అనేకులు కనబడని దేవుని నారాధింప నిష్టపడక, ప్రత్యక్షముగా కనబడుచు ఉపకార దాయకముగనున్న ప్రకృతిని నారాధింప నారంభించిరి. దేవుడు వారిలో పెట్టిన మనస్సాక్షి మాట వారు వినరైరి. మంచి చెడ్డలను తెలుపునది మనస్సాక్షి సృష్ట్యారాధికులును, దైవారాదికులును చాలాకాలము కలిసియుండిరి. కొన్నాళ్ళకు దేవుడిద్దరిని వేరుచేసెను. ఇప్పటివరకు కలిసియున్న వీరికి

1. మిశ్రమ జనము: అనగా ఆదాము, హవ్వలు పాపములో పడిన తర్వాత, రక్షణ వాక్కు వచ్చిన తర్వాత కథ. ఆదాము హవ్వలు మారుమనస్సుపొంది పరిశుద్దులైరి. ఏనోషు, షేతు పరిశుద్ధులు తరువాత మెతూషెల, నోవహు పరిశుద్ధులే. ఈ వరుసలో దైవభక్తులున్నారు. వీరు కాకుండ ఇంకా దైవభక్తులున్నారు. వారి చరిత్రలు బైబిలులోలేవు. ఇది మిశ్రమ జనాంగములో దైవారాధికుల వరుస. రెండవ వరుస అనగా తప్పిపోయినవారి వరుసలో కయీను తప్పెను. అతని సంతానమువారు లౌకికులైరి. తరువాత నోవహు కాలములో భక్తిహీనులనేకులు గలరు. నోవహుగారి బోధకు మారలేదు జలప్రళభయములో నశించిపోయిరి. కాబట్టి ఆదాము మొదలు అబ్రాహము వరకు భక్తులు, భక్తిహీనులు కలిపి ఉన్నారు. ఎందుచేత దేవుడు వీరిద్దరిని కలిసి ఉండనిచ్చినాడు.


ఉదా:- ఒక తరగతిలో తెలివిగల వారుందురు. తెలివి తక్కువగల వారుందురు. ఎందుకనగా తెలివిగలవారిని చూచి తెలివిలేనివారు నేర్చుకొందురు. వీరందరు కలిసి ఉంటే ఉపాధ్యాయునికి కష్టము. తెలివిగల వారుంటే పంతులుగారికి సుఖము. అలాగే దేవుడు ఆదికాలములో భక్తిపరులను, భక్తిహీనులను కలిపి ఉంచెను. అందులో దేవుని ఉద్దేశమేమనగా వారిని చూచి వీరు నేర్చుకొనవలెనని. భక్తినేర్చుకొనవలెను. అది కొద్దిమందిలో నెరవేరును. ఇదంత ఎందుకు సైతానును చంపిన, ఆదాము హవ్వలను చంపిన బాగుండునుగదా! ఇవి మనుష్యుల పద్ధతులు, దేవుని పద్ధతులుగావు. ఆయన పద్ధతి భక్తులను, భక్తిహీనులను కలిసియుండనిచ్చుట. అనేకులకు ఉపకారము అనేకులకు కీడు. కలుగవచ్చును. మొదటినుండి భక్తిపరులు తమ మనసులో భక్తి నిలుపుకొన్నారు. జలప్రళభయము తర్వాత యాపెతులోనుండి భక్తిహీనులు లేచిరి. భక్తిపరులతో దేవుడు వాగ్ధానము చేసినాడు. వారి పాపములు క్షమించి రక్షకుని వాగ్దానమిచ్చినాడు. ఆదాము, హవ్వలతో మన తల్లిదండ్రులు పుట్టకముందు దేవుడు వారితో కలిసి ఉండేవాడట. పాపములో పడక ముందు ఇది ఉండేదట. వారితో మాట్లాడేవాడట. పాపములో పడిన తర్వాత మునుపు ఉన్న పరిచయములేదు. న్యాయ ప్రకారము భక్తులకు దేవునితో పరిచయముండవలెనుగాని, అప్పుడప్పుడు భక్తులతో దేవుడు మాట్లాడుటగలరు. వీరు భక్తులే, విశ్వాసులే, రక్షణ వాగ్ధానము నమ్మినవారే ఎదురుచూస్తున్నవారే అయినను ఆ మొదటి స్థితిలేదు, ఆదాము హవ్వలకున్న ఆ మొదటిస్థితికాదు. ఇది దేవునికిష్టమైన స్థితిగాని మొదటి స్థితివంటిదికాదు అట్టి పరిచయము, స్థితి, ప్రత్యక్షత, దర్శనము మాటలుకావు. వీరు భక్తులైనను శపింపబడిన భూమిమీద నున్నారు గనుక శోధనలుగలచోట నున్నారు గనుక. మనకు వారికన్న ఎక్కువ తెలుసు గనుక ఆ మొదటిస్థితిరాదు. భక్తిపరులైనా ఎంత భక్తిపరులైనా ఇంకా పాపులమధ్య పాపలోకములో నున్నారు గనుక ఆ మొదటిస్థితిరాదు. అయితే భక్తిహీనులలో కలవరము పుట్టినది. పూర్వము దేవుడు కనబడేవాడు. ఇప్పుడు కనబడుటలేదు. అయితే ఆకాశము, సూర్యుడు కనబడుచున్నవి, వీటివలన మేళ్ళు గలవు. భూమి ఖనిజములవలన ఉపకారము, వీటికి నమస్కరించుట, పూజించుట మంచిదని, నీకు ఉపకారము చేయువారికే నమస్కారము చేయుదువు, అదే న్యాయమని సృష్టిని పూజించుటకు కొందరు మొదలుపెట్టిరి.


నిరీక్షణ కాలము:- మిశ్రమ జనములోనివారు కొందరు కనబడు సృష్టిని పూజించుట మొదలుపెట్టిరి. కొందరు కనబడని దేవుని పూజించిరి వీరు భక్తులు. కనబడని దేవుని పూజించుచున్నారు గనుక భక్తిహీనులు. అదిచూచి దేవుని పూజించు భక్తుల గుంపులోనికి దుమికిపోవలెను. కొందరు ఆలాగే చేసిరి. భక్తులు భక్తిహీనులు కలిసియుండుటనుబట్టి దేవుడు గొప్ప కృపగలవాడని తెలియుచున్నది. మనకాలములో కూడ ఇట్టిగొప్ప కృప ఉన్నది ఇది దుష్టులకు గొప్ప తరుణము. విశ్వాసులను అవిశ్వాసులలోనికి పంపుట అవిశ్వాసులకు గొప్ప తరుణము. రేపు తీర్పు సమయములో మాకు గడువు ఇయ్యలేదు అని దేవుడు అనిపించుకొనకుండ ఈ కృప చూపించును. జల ప్రళయములో (ఆది. 6,7) అందరు నశించిరి. చివరలో కూడ దినములు గడువిచ్చెను. వారికి గడువు, బోధ. భక్తుల మాటలు తక్కువకాదు.

(మనస్సాక్షి చెప్పే జ్ఞానము) దానిమాట విననివారు లోకములో ఇప్పుడున్నారా? భక్తి పరులకున్నది ఒకటే అది దేవుని వాగ్ధానము. భక్తిపరులు వాగ్ధానము కలిగియుండి పైవన్నిటియొక్క మాట విన్నారు. భక్తులు భక్తిహీనులకు మంచి చెప్పి ఉందురు, దేవుడు ఉన్నాడు. ఆయనను మ్రొక్కండి, ఆయనే రెండు గోళములను కలుగజేసెను అని చెప్పిరిగాని, వారు వినలేదు గనుక జలప్రళభయములో చచ్చిపోయిరి. వారు సృష్టిని దేవునిగా ఎంచుకున్నారు గనుక సృష్టి దేవుడు కాదని తెలిసికొనుటకు దానివలననే నాశనమైపోయిరి. వారు ఉపకారములనుచూచి పూజించిరి. గనుక అట్లగుట న్యాయమే. సృష్టిని పూజించుట న్యాయమని తలంచిరి. అయితే ఆ న్యాయము వారిని రక్షించలేదు. వర్షమువలన పంట గనుక వాన దేవుడనుచున్నారు. గనుక దానిచే బుద్ధి చెప్పించవలెను. జలప్రళభయ సమయములో మొదటి దినమున వారనుకొన్నారు. ఇది నోవహు చెప్పిన వర్షముకాదు మామూలు వర్షమే అనుకున్నారు. రెండవ దినము ఇదివరకు కంటే కొంచెము ఎక్కువ వర్షము అని అనుకున్నారు. మూడవ దినము ఇంకా కొంచెము ఎక్కువనుకున్నారు. తర్వాత నీరు ఇండ్లలోనికి, కప్పుమీదికి, చెట్లమీదికిరాగా ఈదుకొన్నారుగాని మహాప్రభో! అని దేవునిని పిలువలేదు. ఈ కాలములో కూడ పాపమువలన శరీరబాధ వచ్చినది. అవమానము ఉన్ననుసరే గుణము మార్చుకొనరు. అలాగే ఉంటారు. క్రీస్తు ప్రభువు కూడ అఖరు దినములలో అలాగే ఉండునని చెప్పెను, గనుక ప్రపంచనాడి చూచి రాకడ సమీపమని తెలిసికొనవలెను. గుర్తుల వలనను మన అనుభవమువలనను దేశములలో అల్లర్లు సముద్రములో అల్లర్లు వీటన్నిటిని చూచి రాకడ సమీపమని తెలిసికొనవలెను. జలప్రళయ సమయములోకన్న ఇప్పుడే ఎక్కువ అల్లరి ఉన్నది. దేవుడెప్పుడును మనిషి విషయములో దయచూపుచునే యున్నాడు. మనిషి ఎల్లప్పుడు దేవునికి వ్యతిరేకమే. దేవుడు మిశ్రమ జనవిషయములో చాలా కృపచూపెను. అప్పుడే విగ్రహారాధన ప్రారంభము. అది విగ్రహారాధన అని మోషేకాలములో సీనాయి కొండవద్ద తెలిసెను. మిశ్రమజనములోనున్న పాపమే ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయులలోనికి, మనకాలము వరకుకూడ వచ్చినది. ఎందుకనగా సాతాను ఉన్నాడు అతని నైజము నేటివరకు ఉన్నది. అయితే ప్రార్థనవలన ఆ నైజముపోవును. వారి మొదటి పాపము విగ్రహారాధన గనుక దేవుడు మొదటి ఆజ్ఞలోనే విగ్రహారాధన కూడదని వ్రాయించెను. ఇది దేవుని గొప్ప జ్ఞానము బైలుపరచుచున్నది. ఆదాము, హవ్వలు ఒకరిమీద ఒకరు నేరస్థాపన చేసిరి. అదే మిశ్రమ జనములోనికి వచ్చెను. భక్తులకు కనబడ్డ దేవుడు మా కెందుకు కనబడడు అని దేవునిమీద నేరము మోపుచున్నారు. ఆదాము హవ్వ మీదనే కాకుండ దేవునిమీద నేరస్థాపన చేసెను. అలాగే మనిషి ఒకరిమీద నేరస్థాపనచేసి చాలక దేవునిమీద చేయుచున్నాడు. అది గొప్ప నేరము. తర్వాత భక్తిహీనులు అన్ని స్థలములకు చెదరిపోయిరి. ఇంకా ఇంకా దూరమైపోయిరి. యాపెతు-ఐరోసా ఖండమునకు, హాము-ఆఫ్రికాకు పోయిరి. వారు వీరి సోదరులని తెలిసికొనలేదు. అది మన దేశములో కులములోనికే దింపెను. ఆదాము హవ్వ పాపముయొక్క ఫలితము వారిలో వారికి ఎడబాపు, వారికి దేవునికి ఎడబాపు కలిగెను.


పాపమువలన

అదే వెయ్యేండ్లలో జరుగును. భక్తులలో మొదటినుండి వాగ్ధానమున్నది, గనుక అది వారి పిల్లల, పిల్లలవరకు దాటి మరియమ్మ వరకు వచ్చెను. భక్తిహీనులు పాపములో పెరిగిపోయిరి. మిశ్రమ జనమును దేవుడు అబ్రాహాము వరకు రానిచ్చి అక్కడనుండి కొందరిని అనగా భక్తులను ఏర్పాటు జనాంగముగాచేసి నిరీక్షణ కాలములో పనిచేసెను. ఈ లోకములో భక్తులకు, భక్తిహీనులతోపాటు శ్రమలుండును. సహించుకొనవలెను. ఇన్నాళ్ళు ఉన్నను భక్తిహీనులు భక్తులు కాలేదు అయినను దేవుడు తాను పెట్టిన మనస్సాక్షిని జ్ఞానమును తీసివేయలేదు. ఎన్నిక జనమును ఏర్పరచి వారిద్వారా అందరికి దేవుని గురించి నేర్పించవలెనుగాని వారట్లు చేయలేదు. అది ఈ కాలములో నెరవేరుచున్నది.