నిర్గమకాండము 7 - ఐగుప్తుకు ప్రభువు ఫరో - ఫరోకు దేవుడు మోషే



ప్రార్థన: సర్వశక్తివైయున్న దేవా! మీకు స్తోత్రములు. మీ అనాది సంకల్పములో మా రక్షణ ప్రణాళికను సిద్ధము చేసిన దేవా! మీకు వందనములు. మీరు మాకు అప్పగించే గొప్పక్రియలను బట్టి మా హోదాను పెంచుచున్న దేవా! మీకు వందనములు. మీరిచ్చు అధికారము మీ రాకడలో ఎత్తబడుటకు అడ్డంకిగా మారకుండు హృదయమును మాకు దయచేయుమని, మీరు మాకిచ్చు ప్రతీ ఈవిని మీ దైవశక్తితో మీ కాలానుసారముగా ఉపయోగించు ఆత్మను మాకు దయచేయుమని అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

దైవజనులు రెండురకములు;
మోషే, ఏలియా, పేతురు తదితర దైవశక్తిని చూచిన జ్ఞానులు ఘనమైన ఆ దైవ కార్యములు అనుభవములోనికి వచ్చిన తర్వాత దైవకాలమును గూర్చి గ్రహించుదురు.

దానియేలు, యోహాను లాంటి దైవకాలజ్ఞాన భక్తులు దైవ కాలమాన ప్రకారము దైవశక్తిని చూచి ఆ దైవశక్తిని తర్వాత గ్రహించెదరు. దైవశక్తి జ్ఞానియైన మోషే దేవుని సర్వశక్తిని సంపూర్ణముగా ఎరిగినవాడు గనుక దేవుని మాట సెలవిస్తే వెనువెంటనే అన్నీ జరిగిపోవాలి (Ex: కొడితే ఎర్రసముద్రము పాయలైపోవాలంతే) అనే నైజము కలిగి ఉండును. అయితే త్వరలో జరగనైయున్న దైవకాల పట్టిక ఇంకను మోషే గ్రహింపులోనికి రాలేదు; కాని తర్వాత 40 సంవత్సరముల అరణ్యమార్గంలో దైవకాలములను సంపూర్ణముగా గ్రహించెను.

A) దైవశక్తిని, దైవకాలమును ఎరిగిన దైవజనుడు ప్రవక్త అగును. దైవకాల జ్ఞానము ఎంత దీర్ఘ కాలమైతే అంత పెద్ద ప్రవక్త అన్నమాట. మోషే దేవుని ఘనకార్యములు చేయువాడు మాత్రమే కాక తాను విడిపించిన జనాంగముయొక్క భవిష్యత్తు రాకడ మేఘము ఎక్కువరకు తన దైవప్రజలను కాపాడు ఆజ్ఞలు అందుకోగల శక్తి కలిగినవాడు కావున మోషేను ఫరోకు దేవునిగా అభిషేకించెను. ఐగుప్తునకు ప్రభువు ఫరో అయితే; ఫరోకు దేవునిగా మోషేను దేవుడు హెచ్చించెను.

దేవునియొద్ద అందుకొని దానిని దైవోక్తిగా ప్రజలకు అందించుట ప్రవక్త యొక్క పని. మోషే నుండి వచ్చు వాక్కును ప్రజలకు అందించుటకు అహరోనును ప్రవక్తగా అభిషేకించెను.

B) ఈ ప్రపంచములో దైవ సంభూతులుగా పిలువబడుచున్న రాజులకు గల పెద్ద సవాలు(ప్రోబ్లం) ఏదనగా "ఈ భూలోక అధికారులు అణచి వేయు ప్రజల పక్షమున దేవుడు పనిచేయుట". ఐగుప్తు బానిసల పక్షమున దేవుడు పనిచేయుట ప్రారంభించెను. ఫరోను మోషేతో నిమగ్నము చేయుటకు, మొదట మానవులు చేయు మహిమలతో తన అధ్బుతములు దేవుడు మొదలుపెట్టెను. అయితే ఫరో, మోషే చేసిన అధ్బుతములను మనసున పెట్టలేదు. దేవుడు పని మొదలుపెట్టిన తర్వాత ఇక రాజుకు సమస్యలను కోరితెచ్చుకొనుట తప్ప, మరొక దారి లేకపోయెను.

C) కఠినత్వము అనే తెర తొలగక తన్నుతాను దేవునిగా బావించుచున్న ఫరోకు నిజదేవుని ఉనికి ఇంకను బయలుపడలేదు కాబట్టి కఠిన నిర్ణయములు తీసుకొనుచుండెను. దైవకార్యము మొదలైనపుడు లోకం గ్రహింపక వారి హృదయ కాఠిన్యమును బట్టి గొప్ప తెగుళ్ళు, మరణము తెచ్చుకొనును. మారుమనసు పొందుట జీవమునకు మార్గమని, కఠినత్వము నాశనమునకు దారి అని ఈ అద్యాయము సాక్ష్యమిచ్చుచున్నది.

Summary:
విశ్వాసి కఠిన మనస్సును విడిచిపెట్టి దైవలక్షణముల యందు ఆనందించుటయే మారుమనసు. దేవుని మార్గానుసారము ప్రయాణించుటకు ప్రభువునకు లోబడుటయే రూపాంతరము. లోకములోని వాటిని ఆరాధింపక, సర్వోన్నతుడైన దేవుని ఆనుకొని జీవించుట వలన బహు ఘనత కలుగును అని ఈ అద్యాయము చెప్పుచున్నది.

దేవునికే జయము. అహంకారులకు అపజయము. మన ప్రభువైన యేసుక్రీస్తు తన సిలువ మరణము ద్వారా మనకు విడుదలను, సమస్త సమృద్ధిని కలుగజేసెను గనుక ప్రభునికి ఎల్లప్పుడును కృతజ్ఞతా స్తుతులు అర్పింతుము గాక!



జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

Share your thoughts and suggestions

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter

  • Recommend this website on Google +