నిర్గమకాండము 26 - ప్రత్యక్షగుడార తెరలు
ప్రార్థన: వెలుగువైయున్న ప్రభువా! మీకు వందనములు. మీ వెలుగును మాలో ప్రకాశింపజేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
ఈ అద్యాయమంతా మందిర తెరల గురించి ఉన్నది. ఖచ్చితమైన కొలతలు, ఉపయోగించు సామాగ్రితో పాటు దిశలు అమర్చు విధానము అన్ని వివరములు ఉన్నవి. ఇవన్నియు ధీర్ఘకాల మన్నిక గలవి.
1. నాలుగు దొంతరలు(layers) గల మందిర తెర
-
నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా 10 తెరలు చేయవలెను - అనగా అంతరంగ సౌందర్యము. దేవునిలో ఐక్యత కలిగి సహోదర ప్రేమలో గల ఆనందము. రోమా 12:5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.
మన 5 శరీర ఇంద్రియములు; 5 ఆత్మీయ ఇంద్రియములైన ఆత్మ, మనస్సాక్షి, హృదయము, మనసు, బుద్ధి కలిసి జతకట్టవలెను. - మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; 11 తెరలను చేయవలెను - ఇది అంతరంగ సౌందర్యమునకు రక్షణ కవచము. ఎఫెసీ 6:10-18. ఈ సర్వాంగ కవచములో ఇవ్వబడిన సత్యము, నీతి, సమాధాన సువార్త, సిద్ధ మనసు, విశ్వాస శక్తి, రక్షణ, దైవ వాక్యము, ప్రార్థన, విజ్ఞాపన, పూర్ణ పట్టుదల, మెలకువ అను తెరలు అనగా బహిరంగ కార్యములు దేవుని మందిరమైయున్న మన దేహములోని ఆత్మ యొక్క అంతరంగ సౌందర్యమును కాపాడును.
-
ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును చేయవలెను - ఇప్పుడు ఇది సిలువ సువార్త, యేసుక్రీస్తు నామ స్మరణ. బహిరంగ స్తుతి. రోమా 10:9 - అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. క్రైస్తవసంఘ ఘనకార్యములు లోకములో కనిపించుట సంఘముయొక్క అంతరంగ బలం.
సత్యమైయున్న క్రీస్తును ఒప్పుకొనని వారు మద్యలో పడిపోవుదురు. మత్తయి 10:32. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. 33. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
అంతరంగ భక్తులకు గొప్ప ఉపద్రవము ఏదనగా వారి జీవితంలో ఇంటిలో విభేధముండును. పురుషోత్తము చౌదరి గారు బహిర్గతమై ఆంధ్ర క్రైస్తవ సమాజములో చరిత్ర సృష్టించిరి. - సముద్ర వత్సల(మేక) తోళ్లతో పై కప్పును చేయవలెను: ఇది సంఘము/సహవాసము/మతమునకు గుర్తు. దేవుడే స్వయముగా తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో సాక్ష్యము కలిగి ఉండవలెను. సముద్ర వత్సల మతము, పరిశుద్ధతకు గుర్తు కాదు కాని మత అంతరంగములో వధువు సంఘము ఉన్నది. ఆత్మ కొరకు దేహమును కాపాడుకున్నట్లు, సంఘము కొరకై క్రైస్తవ మతమును ఉజ్జీవింపజేయవలెను.
పై నాలుగు వరసల తెర మందిరము లోపల గాఢ చీకటిని కలుగజేయును. వెలుపలి నుండి ఏ ఫ్రీక్వెన్సీ లైట్ వచ్చినా గాని మందిరము లోపలికి ప్రవేశింపజాలదు. లోపల దేవుని వెలుగు మాత్రమే ఉండును. మత్తయి 6:23 మన లోక ఆకర్శణ కన్ను మూయబడితే, ఆ అంధకారములో దేవుని వెలుగు గొప్పగా కనిపించును.
అయితే మందిరము లోపలున్న వెలుగు గొప్పది గనుక ఇన్ని తెరలను చీల్చుకొని వచ్చినను ఇశ్రాయేలీయులకు హాని కలుగదు. ఉదా: ఏలియా బలిపీఠముచుట్టూ లోతైన కందకములను(గొయ్యి) త్రవ్వి నీరు పోయించెను, లేకపోతే దేవుని అగ్ని సమస్తమును కాల్చివేయును.
ఈ రాకడ సమయములో విశ్వాసి తన అంతరంగ సౌందర్యమును కాపాడుకొనవలెను. ఆత్మను ఆర్పు దేనికైనను తెర వేయవలెను.
2. పునాది
ప్రత్యక్ష గుడారము వెండిపై నిలబెట్టబడినది. వెండి విమోచనకు గుర్తు. మన జీవము విమోచకుడైన యేసుక్రీస్తు అను పునాది మీద కట్టబడినదని దేవుని స్తుతించవలెను.3. స్థానము
34. అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను - ఆత్మాభిషేకము.35. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచ వలెను - 7 సంఘములకు గుర్తు. విశ్వాసి/సంఘము ఈ ఏడు సంఘములగుండా ప్రయాణించి శ్రమ వలన కలుగు మారుమనసు ద్వారా దేవుని సింహాసనమును చేరవచ్చును. శ్రమ లేనిదే మహిమ లేదు. దేవునియందలి శ్రమ ఆనందమునిచ్చును.
36. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను - బాప్తీస్మ ద్వారం. యోహాను 3:5 ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు(మందిర ఆవరణము). నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.
ఇవి దైవరాజ్యములోని భక్తుల స్థానమును సూచించుచున్నవి.
దేవుడు మనకు రక్షణ కవచమును దయచేయును గాక! అమేన్.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
పరిచయం |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
10 |
11 |
12 |
13 |
14 |
15 |
16 |
17 |
18 |
19 |
20 |
21 |
22 |
23 |
24 |
25
26
27 |
28 |
29 |
30 |
31 |
32 |
33 |
34 |
35 |
36 |
37 |
38 |
39 |
40 |
తైలాభిషేకపండుగ
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet