నిర్గమకాండము 13 - నూతన దేశం - దేవుని సూచనలు
ప్రార్థన: ఇశ్రాయేలును విడిపించిన దేవా! మీకువందనములు. నేడును మా బంధకములనుండి మమ్మును విడిపించుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
1. ప్రధమ సంతతిని దేవుడు కోరుకొనుట
దైవరాజ్య నిర్మాణము కొరకు ప్రతీ కుటుంబమునుండి "జ్యేష్టకుమారుని దేవునికి సమర్పించుట" అను అభ్యాసమును దేవుడు ప్రారంభించెను. ప్రధమ సంతతి లేదా జ్యేష్టకుమారుడు అనగా శ్రేష్టమైన అధికారమును దేవునికి సమర్పించుట.
ఈ జ్యేష్టకుమారాధికారులకు దేవుడు గొప్ప బాధ్యతను పెట్టెను. అదేదనగా దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించినది మొదలుకొని దేవుడు చేయు ఘన కార్యములను పిల్లల తరమునకు విశదపర్చి తెలియజెప్పుట.
బైబిలు పని: దేవుని ఆజ్ఞలను బట్టి నిర్మింపబడిన దేశముల ఆశీర్వాద సమృద్ధి; దైవాజ్ఞలను మీరుట వలన కలిగిన వినాశనము, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞల పునరుద్ధరణ, తద్వారా కలిగిన సంఘ చరిత్ర నేటి బైబిలులో ఉన్నవి. లోకమునకు దేవుని సమాధానముల సంకలనమైన ఈ బైబిలు ఇంకను ఆ జ్యేష్టకుమారులను తయారుచేయుచున్నది. "పులిసిన బ్రతుకును వదిలి దైవవాక్కులోని తాజా శక్తిని పొందుట" దేవుడు తన ప్రజలకు నేర్పించెను.
సమస్త దేశములకు, సకల ప్రజలకు, రాజ్యాంగములకు బైబిలు ఆధారము. దేశమనగా ప్రజలని నిర్గమకాండ సారాంశము. దైవరాజ్యము(తియోక్రాటిక్) ఈ ప్రపంచములోనున్న అన్నిరాజ్యములకు (అనగా ప్రజాస్వామ్యం, గణతంత్ర/వ్యవస్థ్తీకరణ, రాచరికం, కమ్యూనిజం, నిరంకుశం మొదలగు పరిపాలనకు) తీర్పు తీర్చునది. ప్రపంచ దేశములలో ఏ రకమైన రాజ్యాంగములున్నను అవన్నియు దైవరాజ్య నియంత్రణలో కొనసాగుటకు దేవుడు దైవప్రజల ప్రధమ సంతతి సమర్పణను కోరుకొనెను.
2. వాగ్ధాన కాడిని మోయుట
ఈ అద్యాయములో ఇశ్రాయేలు దేశము ఐగుప్తు కబంధహస్తములనుండి పూర్తిగా బయటకు వచ్చినది. "దేవుడు నిశ్చయముగా మిమ్మును దర్శించి వాగ్ధాన దేశమునకు కొనిపోవును" అని తమ పితరుడైన యోసేపు మాటలను గుర్తుచేసుకొని యోసేపు యెముకలను తీసుకొనిపోయిరి. నేడు కేవలం మన అవసరార్థమును బట్టి మాత్రమే కాక, దేవునియందు సంపూర్ణ సమర్పణతో మన పితరులైన దైవజనులు చెప్పిన మాటల మూటలను మనము మన హృదయములలో మోసికొని పోవుదము గాక!
3. దేవుని కాపుదల
దేవుని మేఘస్తంభము, అగ్నిస్తంభము వారికి రక్షణగా నిలిచినది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాక్షి సమూహము మేఘమువలే మనమద్య నివసించుచున్నందున మన రక్షణ భారము ప్రభువుపై వేసి, ఆయన ఆత్మ శక్తితో ముందుకు కొనసాగుదము గాక! ఆమేన్.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet