ఐగుప్తు శ్రమలు - దేవుని కృపాసాధనములు
నిర్గమ. 10:1-20.
ప్రార్దన:
తండ్రీ! ఈ మానవ చరిత్రలో నీవుచేయు ప్రతి పనిలోను, రాబోవు తరములకు కావల్సిన సందేశములను, పాఠములను ఇమిడ్చినావు గనుక నీకు స్తోత్రములు. నిన్నెరుగని అన్యులకు ఏవైతే శ్రమకరములో, అవి నీ పిల్లలకు నీవు సదుపాయములుగా మార్చినావు. ఇట్టి గొప్ప కృప నిమిత్తమై నీకు ఆనందవందనములు, తరుగని స్తోత్రములు. రానున్న మహాశ్రమలనుండి మమ్మును తప్పించుటకు నీ వాక్య వర్తనూనమందించునుని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.
యెహోవా ఆజ్ఞ మోషేకు అభయమిచ్చినది. ప్రభువుకు వ్యతిరేకముగా నడిచినా, ఎదురు తిరిగినా, ఆయన మాట తిరస్కరించినా; ఐగుప్తీయులకు కలిగిన పెద్ద శ్రమలు నేడును వచ్చునని ఈ చరిత్ర బుజువు పర్చుచున్నది. చీడపురుగులు - నానారకములైన పురుగులు, తెగుళ్ళు; అన్నిటికి ప్రభువు ఆజ్ఞ ఇచ్చారు.
ఈ అన్ని కార్యములు మోషే కర్ర చాపుటవలన జరిగినవి. వడగండ్లు ఐగుప్తు దేశముమీదిపడు విషయములో మోషే తన చెయ్యిచాపాడు. మోషేలో శక్తి ఉన్నదని నిరూపించుటకు చెయ్యి చాపాడు. తల మొదలుకొని అరికాలు వరకు మోషే దేవునియొక్క శక్తితో నింపబడ్డాడు. దేవుడు మా పక్షమందున్నప్పుడు మీరు వస్తువులతో చేసినా, చేతితో చేసినా ఆ పని జరుగుతుంది. వడగండ్లు అడ్డములేని స్థలములో గుడ్డిగా పడతాయి. అవి ముక్తి కొరకైన ఒప్పుదల మీలో ఉండాలి. ఐక్యత, ఒప్పందము ఉండాలి.
పచ్చనిస్థితి అనగా జీవితమునకు, ఆత్మ పెంపుదలకు గుర్తు. పైరు - జీవముగల శక్తికి, ఎదుగుదల శక్తికి గుర్తు. ఇక్కడ మరలా మోషే కర్రచూపాడు. ఎందుకు? నాయొక్క ప్రభావము కర్రలోనికి పంపిస్తున్నానని ప్రభువు సెలవిచ్చారు. ప్రభువు ఆజ్ఞను మోషే గైకొన్నాడు. గనుక దేవునిశక్తి ఆయనలోనికి వచ్చి, ఆయన కర్రలోనుండి వెల్లడిచేయబడినది. అయినను, ఫరో, అతని సేవకుల హృదయములు దేవునియెడల సరళము కానందువలన ఆయన మరియొక తెగులును అనగా మిడతలను పంపించెను. ఇది గొప్ప మర్మము.
తూర్పునుండి అనగా దేవునియొద్దనుండి దేవుని సింహాసనము దగ్గరనుండి ఆజ్ఞ ఇవ్వగా ఆ మిడతలు వచ్చినవి. ఐగుప్తు దేశమంతటిని అవి కప్పివేసెను. పాతనిబంధనలో 'తన వారు' అనిపించుకొన్న వారిని ఆయన రక్షించుకొనెను. "సైన్యముల కధిపతియగు యెహోవా" అని తెలియజేసుకొన్న ఆయన అనేక పర్యాయాలు యుద్ధము చేసెను. ప్రభువు అపవాదితో యుద్ధము చేసారు. ప్రభువు తన జనుల పక్షముగా యుద్ధము చేశారు. తూర్పు - సూర్యుని దిక్కునకు గుర్తు. సూర్యునికంటె నీతిసూర్యుడు గొప్పవాడు. ఐగుప్తీయుల పచ్చని పంటలన్నిటిని మిడతలు పాడుచేసెను. నీతిసూర్యుని ఎవరు తిరస్కరించకూడదు. ఎంతైనా ఆయన నమ్మదగినవాడు ఆయనను తిరస్కరిస్తే శ్రమల పాలవుతారు. అన్నిరకములైన అపాయములకు ఆయన సెలవిస్తారు. ఆయన శ్రమలకు మాత్రము సెలవిస్తారు గాని ప్రాణముమీద సెలవు ఇవ్వరు. శ్రమ ప్రభువు చెప్పుచేతులలో యున్నది. ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు ఒకే దేశములో యున్నారు. ఐగుప్తీయుల పంటలకు నష్టము కలిగినది. ఇశ్రాయేలీయులకు ఏ హానియులేదు. ప్రభువు మాట చొప్పున తూర్పుగాలికి మిడతలు వచ్చినవి. అవి వారిని బాధించుటకు, వారి పొలములోని ప్రతి పచ్చని చెట్టును, కాయను నాశనము చేయుటకే ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ప్రాణము తీయుటకు సెలవు ఇవ్వలేదు. ఆకలి బాధతీర్చె మిడతలను ఆయన బాప్తిస్మమిచ్చు యోహానుకిచ్చారు. బాధపెట్టే మిడతలు ఐగుప్తీయులకు ఇచ్చారు.
ప్రభువుకు వ్యతిరేకంగా నడిస్తే, కూర్చోలేరు, నిలువబడలేరు, తినలేరు, త్రాగలేరు ఏ పని చేయలేరు. వడగండ్లు మిడతలు పచ్చనైన పైరులను పాడుచేయగా మిగిలిన వాటిని మిడుతలు తీసివేసెను. ఐగుప్తు బీడు అయినది. ఆ మిడుతల సమూహము సమస్తము తినివేయగా చీకటి కమ్మెను. దేవునికాంతి వారిపైన పూర్తిగా తీసివేయబడినది. ఎక్కడను స్థలములేకుండా, చీకటి ఒక గొడుగువలె వారిదేశాన్ని కప్పివేసినది మీరు సోమరులవలె ఉంటే ఐగుప్తీయులవలె నశించిపోతారు. చీమ, తనకు శ్రమ వచ్చినప్పుడు, అనగా ఆహారం దొరకనపుడు కూర్చొని ఏభయం లేకుండా తింటుంది. ఎందుకనగా ముందుగానే కష్టించి పనిచేసి ఆహారము సమకూర్చుకొన్నది. ఆ చీమ చాలా చిన్నది. గనుక మనమును చీమలవలెనే అపాయమునుండి తొలగి ఉపాయముగా దేవుని కృపలోకి వచ్చి నిలబడాలి. ఇశ్రాయేలీయులవలె ఆయనకృపలో ప్రవేశించండి. భూమి పంటలు దేవుడు కృపచొప్పున ఇచ్చినవి. భూమిమీదనున్న సమస్తము ఆయన అనుగ్రహించును. అయితే ఈ హస్తమును గ్రహించని ఐగుప్తీయులకు మనశ్శాంతి లేదు. తిరిగివారు దేవుని తట్టు తిరిగినపుడే వారికి మనశ్శాంతి ఉంది.
శ్రమ ఉంటే దేవునితట్టు; శ్రమలేకపోతే భూలోకం తట్టు మనము తిరుగుతాము. గనుక శ్రమలలో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
వడగండ్లకు పొలాల్లో ఉన్న చెట్లు నాశనమయ్యాయి. అయితే, వారి ధాన్యపు కొట్లలలో
కొంతధాన్యము దాచబడియున్నది. అవికూడా ప్రభువు మిడతలద్వారా నాశనము చేసారు. దేవుని తిరస్కారము చేస్తే
భుక్తి,
శక్తి, భక్తి, ముక్తి యుండవు. అన్ని తెలిసి తప్పులుచేస్తే చివరికి మరణమే కలుగును. నీవు దేవుని పక్షాన
మాత్రమే స్థిరంగా ఉండవలెను. నీ పొరుగువారిని, నీ యింటివారిని భాధపెడితే అదే పావము అందరిపై అధికారము
చెలాయించేది. పాపమే. గనుక ఆ పాపముపై మనము అధికారము చెలాయించాలి.
జ్యేష్టులు - ఇది మానవులకు సంబంధించిన
మాట.
ప్రధమ సంతానము - ఇది పశువులకు, మృగములకు సర్వపురుగులకు చెందినమాట.
ప్రభువు జ్యేష్టత్వాన్ని ప్రధమ
సంతానాన్ని హతము చేసారు.
ప్రధమ ఫలములకు బలము ఎక్కువ. వారికి ఉన్న బలము ఆఖరి బిడ్డకు ఉండదు. నీలో ఉన్న అహంకారమును ప్రభువు తీసివేస్తారు. బలాన్ని ముందు కొట్టివేసారు. ఐగుప్తులో ఉన్న బలాన్ని కొట్టివేసారు. సముద్రములో ముంచుట ద్వారా ఐగుప్తు బలాధిక్యతను ఆయన కొట్టివేసారు. పదియవతెగులు బలప్రారంభమును కొట్టివేయుట. మొదటిశక్తిని పొంది వచ్చిన మనిషిని వశువును; ఆయన శక్తి తోడుకొని పోయినది. గొర్రె - విశ్వాసికి ముంగుర్తు గనుక గొర్రెలను విశ్వాసులతో పోల్చారు. కాపరి గొర్రెలను నడిపించుకొని పోవునట్లు, ఆయన ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి బయటకు నడిపించుకొని పోయెను. ఒక స్నేహితునివలె ఆయన వారిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఒకడు తన మందను సురక్షితముగా దారి తప్పకుండా నడిపిస్తూ, తప్పిపోయినదాన్ని తన మందలో కలుపుకొని ఏ అపాయము రాకుండా తీసికొనిపోవును. మీరు ఆయనమీద మాత్రమే ఆధారపడితే, ఆ విశ్వాసములో ఆయన మిమ్మును సురక్షితముగా నడిపిస్తారు, తోడుకొనివెళ్తారు. తన దూతలకు ఆజ్ఞయిచ్చి ఏ అపాయములేకుండా నడిపిస్తారు. నీవు స్థిర విశ్వాసివైయుంటే నీవు తప్పకుండా ఆయన తేజస్సుకు నిలువబడగలవు.
దీవెన:
ఆలాగు ఆయన తేజస్సుకు నిలువబడి, లోకమనే ఐగుప్తుకు అడ్డబడి, నూతన యెరూషలేము అనే కనానుకు పెండ్లికుమారుడు మిమ్ములను చేర్చునుగాక! ఆమేన్.