7. నిర్గమకాండ ధ్యానము

ఒప్పుదల క్రమము



ఎజ్రా. 10: 1-9.

ప్రార్దన:- తండ్రీ! నేటి దినమున మా దుస్టితిని నీయెదుట ఒప్పుకొని, మమ్మును సంపూర్ణముగా శుద్దిచేసికొనుటకు నీయెదుటకు వచ్చియున్నాము. సర్వసంపూర్ణుడవైన నీయెదుట భూలోక వాసులమైన మేము ఏలాగున లోపరహితులమై ఉండగలము! నీ ప్రేమనుబట్టి నీయెదుటకు రాగలుగుచున్నాము. గాని మా యోగ్యతనుబట్టికాదు. గనుక మమ్మును నీచెంతకు చేర్చుకొని, శుద్దీకరించి, సంపూర్ణులనుగా చేసికొనుటకు నీ వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.

ప్రార్ధనమెట్లలోని రెండవ మెట్టు ఒప్పుదల మెట్టుయై ఉన్నది. ఈ ఒప్పుదల మెట్టులో నాలుగు ఒప్పుదలలున్నవి. అవి:

  • 1. పాపములు ఒప్పుకొనవలెను. అనగా జన్మపాపము, క్రియలు (ఆయుష్కాల సారములోని పాపములు ఒప్పుకొనవలెను).
  • 2. అయోగ్యత ఒప్పుకొనవలెను.
  • 3. నెరవేర్పు లేకపోవుట ఒప్పుకొనవలెను.
  • 4. అవిశ్వాసము ఒప్పుకొనవలెను.

ముందుగా త్రియేక దేవుని తలంచుకొని ప్రభువా! ఈవేళ నా నడక, సరిగా నడిచే కృప అనుగ్రహించుము అని ప్రార్థించవలెను.ఇశ్రాయేలీయులు తమ

  • 1) జన్మపాపము,
  • 2) ఆయుష్మాలసారము,
  • 3) క్రియ,
  • 4) ఆలోచన,
  • 5) దృష్టి
  • 6) వినుట,
  • 7) మాట,
  • 8) క్రియలు వీటన్నిటిలోని దోషమును ఒప్పుకొన్నారు.

ఇవి ఎంత మంచివైనను ఎక్కడో ఒకచోట పాపమైయున్నవి. అలాగే అన్నియును మనము ఒప్పుకొన్నప్పుడు ఆయన క్షమించును. అప్పుడు మనము పరిశుద్ధులము కాగలము.

1. ఒప్పుకొనుట:- మనస్సులోని కళంకమంతయు, హృదయములోనున్నవన్నియు ఒప్పుకొనవలెను. మనము పరిశుద్ధులముగా ఉండవలెనంటే కళంకమంతయు ఒప్పుకొనవలయును. పరిశుద్దులే రక్షితులు. ఒప్పుకొంటే అపరిశుద్ధులు కారు. సంపూర్ణముగా ఒప్పుకొన్నవారే సంపూర్ణ పరిశుద్ధులు. పది యాజ్ఞలలో తొమ్మిది ఆజ్జలకు సంబంధించిన పాపములు ఒప్పుకొని ఆనందింపవచ్చును గాని ఒకటి మిగిలిపోయినది. గనుక రక్షణలేదు. రక్షణ లేనేలేదు. తొమ్మిది ఆజ్ఞలలో శుభ్రపడుట, క్షమించుమని ఒప్పుకొనుట మంచిదే. క్షమాపణ పొందుట మంచిదేగాని ఆ మిగిలిన ఒక్కటి ఒప్పుకొనకపోవుట వలన రక్షణలేదుగాని పాతాళమే.


ఆయన ఇశ్రాయేలీయులకు పది ఆజ్ఞలను ఇచ్చారు గనుక గదులలో ఆ పాపములు ఒప్పుకొనవచ్చును. ఏ ఆజ్ఞకు విరోధమైన పాపములు నాలో ఉన్నవా? అని పరీక్షించి ఒప్పుకొనవచ్చును. దానికి బోధకుడక్కరలేదు. అవే అనగా ఆ పది ఆజ్ఞలే బోధకులు. బైబిలంతా చదివితే ఇంకా ఆజ్ఞలున్నవి. రక్షణ పొందుటకై పాపములు ఒప్పుకొనుట అవసరము.


షరా:- ఓ తండ్రీ! పాపములొప్పుకొనుటకు ఒక క్రమమున్నది. అది మేము ఏర్పర్చుకొన్నది. అది మేము చేసినపుడు నీవు సంతోషింతువు. నీవు రక్షింపబడినావా? అని కొందరు అడుగుచున్నారు. అది చేస్తే (ఒప్పుకొంటే) ఔనని చెప్పవచ్చును. నీవు ఆత్మను పొందినావా? అని మరికొందరు అడుగుచున్నారు. అదికూడ పూర్తిగా చేస్తే ఔనని చెప్పవచ్చును. అన్నీ ఒప్పుకొని ఒకటి ఒప్పుకొనకపోతే ఎలాగు? భూలోకములో రక్షణ పొందినాను. రేపు ఆ రక్షణకు కూడా సిద్ధమే. భూలోకములో రక్షణ పూర్తిగా పొందనివారు పై లోకములో ఎట్లు పొందగలరు! లేనిచో ఏమి లాభము? భూలోకములో రక్షణ పొంది, కడ వరకు పోగొట్టుకొనకుండా ఉండవలెను. పాపములన్నీ ఒప్పుకొని ఒకటి ఒప్పుకొనకపోయినయెడల తాను మోసపోయినట్లే. మనుష్యునితో, దేవునితో అబద్ధమాడినట్లే. అటువంటి దౌర్భాగ్య దుస్థితి ఎవరికి రాకుండునట్లు చూచుకొనవలెను.


2. మానవలెను: ఒప్పుకొనవలెను, మరలా చేయకుండా మానవలెను, ఒప్పుకొని గంతులు వేయుటకంటే మానివేసి గంతులువేయవలెను. సాతాను చెడు తలంపులు కలిగించునపుడును, తన పని చేసినప్పుడును, మనపని మనము చేయవలెను, అనగా దానికి లోబడకుండ ఎదిరించవలెను.

  • 1) అన్నిటిని ఒప్పుకొనవలెను,
  • 2) మనవి చేయవలెను,
  • 3) ఒప్పుకొనేటప్పుడు సరదాగా ఉండక మనోవిచారము కలిగి ఉండవలెను. ఈ మూడు కలిపితే ఒప్పుదలమెట్టు సమాప్తి అయినట్లు.
  • (1) పాపమును,
  • (2) పాపస్థితిని,
  • (3) అయోగ్యతను, అనగా నీ కృపకు అపాత్రుడను, అనర్హుడను అని ఒప్పుకొనుట.
  • (4) అశక్తిని తలంచుకొనవలెను. అనగా పాపమును మానుటకు శక్తిలేదని ఒప్పుకొనుట.
  • (5) అజ్ఞానము ఒప్పుకొనవలెను.

"ఏదితప్పో, ఏదిఒప్పో తెలియదు. దావీదు చేసిన తప్పు నాతాను ప్రవక్త చెప్పేవరకు తెలియదు. ముందు ఒకసారి రక్షణ సంపాదించుకొని, తరువాత దానిని పోగొట్టుకొన్నవారుకూడ ఉంటారు. అట్టి దుస్థితిని ఒప్పుకొనవలెను. పోగొట్టుకొనుట, సంపాదించుకొనుట జరుగుచున్నవి. పైవన్నీ ఒప్పుకొని, రక్షణ సంపాదించుకొని, రేపు పోగొట్టుకొనుటవలన ఏమిలాభము?

  • 1) రక్షణ సంపాదించుట,
  • 2) దానిని పోగొట్టుకొనుట.

ఈ రెండు ప్రతివానిలో జరుగుచున్నవి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?


పాట: దేవ దేవ రావె నిన్న - సేవజేయుదు - నను - బావనునిగ జేయవె నే పాపనరుడను ||వినరమ్ము||.


"తండ్రీ, నా యావత్తు శరీరశక్తి, మనోశక్తి, జ్ఞానశక్తి, విశ్వాసము, మనస్సు స్థిరపర్చుకొని ప్రార్ధనచేసికొనగల కృప దయచేయుము" అని ప్రార్థింపవలెను.

  • (1) పాపములనుగూర్చి విచారపడవలెను.
  • (2) ఏది పాపమో ఏదికాదో! ఎవరికి విరుద్ధముగా ఏమి చేసినామో అనితలంచవలెను.
  • (3) ఇంకా నా పాపవుస్థితి తెలిసినా భాగుందును అని కోరుట.
  • (4) రక్షణ పోగొట్టుకొని, ఇక లేదని ఎవరనుకొందురో వారు వృధాగా ఆ కాలము వెళ్లబుచ్చుదురు. ప్రతి వారికి విచారముండవలెను.

విచారములేనిదే రక్షణలేదు. లూథరు చిన్న ప్రశ్నోత్తరిలో ఎక్కడ పాపక్షమాపణ ఉండునో అక్కడ మోక్షమని వ్రాసెను (జీవము, మోక్షము). ఎవరు విచారపడరో, పాపము ఒప్పుకొనరో వారికి రక్షణలేదు. మనోవిచారముతో నిండిన ఒప్పుదల, తండ్రికి అవసరము. "అయ్యో! రక్షణ సంపాదించుకొన్నాను గాని పాపము మరలా వచ్చెనని విచార పడినయెడల పిశాచి పారిపోవును. మహోప్రభో యేసుప్రభువా! అని అనినయెడల అక్కడ పిశాచి నిలువలేదు. పాపము చేయించే సాతాను ఉండలేదు. పాప జీవిని గనుక ఒప్పుకొంటున్నాను గనుక నన్ను పావనునిగా చేయుము. నీ సేవ చేస్తాను అని తీర్మానము చేయుము. పరలోక డాక్టరువచ్చి పరీక్షిస్తే ఏమి కళంకముండరాదు. మూలమూలలో ఉన్న పాపములుకూడా కడిగివేసికొనవలెను. తలంపు, చూపు, వినికి, ప్రయత్నము, "క్రియ తలంపులో ఉన్న పాపములన్నీ లోనికి వచ్చును". గనుక ఒప్పుకొనవలెను. తలస్తే పాపము. పాపము ఆమడ దూరములో బైలుదేరును. అక్కడ దాని మకాము అక్కడనుండి నా శరీరమంతా వ్యాపించును గనుక అక్కడ అనగా అది బైలుదేరిన దగ్గరే ఒప్పుకొన్న యెడల వ్యాపించదు.


తలంపు, అనగా జ్ఞప్తి. ఇదిచెడ్డది. ఇదివరకు నీవు చేసినవి, ఇతరులు చేసినవి జ్ఞాపకము వచ్చిన పడిపోవుదువు. జ్ఞాపకము వచ్చినా ఏమి కీడు కలుగును? దానివలన ఆలోచన కలుగును. ఇక దాని ప్రయాణము సాగును. తప్పు ఒప్పుకొనేటప్పుడు జ్ఞాపకము చేసికొనవచ్చునుగాని ఇతర సమయములలో జ్ఞాపకము చేసికొనరాదు. జ్ఞప్తీకి వచ్చిన యెడల పాతాళద్వారము తెరువబడును. మోక్షద్వారము మూయబడును. అవి హృదయములో జరిగి, బైటికివచ్చును గాన

  • (1) పాపజ్ఞాపకము వద్దు,
  • (2) పాపజ్ఞాపకములో సంతోషము వద్దు.
  • (3) పాపమునుగూర్చి ఆలోచనలోనికి దిగినయెడల, ఈ మూడు ఉన్నయెడల అదే పాపము. చూస్తేనే, తలస్తేనే పాపము.

పైకి ఒప్పుకొనేటప్పుడు మనోవిచారము లేనిచో వృధా. ప్రతి నిమిషము పాపతలంవు వచ్చినవుడు వ్రతినిమిషము ఒమ్హుకొనవలెను. ఎందుకనగా పాపము సాగును, నడుచును.


పాట: దోషములను బైట బెట్టుదమ - కపట వేషభాషల గ్రుంగ - బట్టు దమ ||యేసు||


రక్షణ సంపాదించుకొనలేనపుడు అనగా పూర్తిగా పాపములన్నీ ఒప్పుకొనలేనపుడు మోక్షములోనికి ఏలాగు వెళ్ళగలము? మోక్షములో మనకు ఏ అంతస్థులోనికి వెళ్ళుదుమో ఏలాగు తెలుసుకొనగలము!

మోక్షములో అంతస్థులు:

  • 1) సామాన్యుల అంతస్థు,
  • 2) సేవకుల అంతస్థు,
  • 3) హతసాక్షుల అంతస్థు,
  • 4) పెండ్లికుమార్తె అంతస్థు.
కన్యకలవలె తయారుకావచ్చును గాని వారు పెండ్లికుమార్తెకాదు.

అంచెలు:
  • 1. ఇక్కడే ఒప్పుదల కుదరవలెను.
  • 2. ఇక్కడే క్షమాపణ పొందవలెను.
  • 3. ఇక్కడనే రక్షణ పొందవలెను.
  • 4. ఇక్కడే పోగొట్టుకొన్న రక్షణ నిలుపుకొనవలెను.
  • 5. ఇక్కడే పరలోక రక్షణ పొందవలెను.

ఉదా:- కంసాలి బంగారమును మరలా మరలా అగ్నిలోవేసి శుద్ధిచేయుచుండును. అప్పుడు బంగారము నికరముగా ఉండును.


తలంపు:- తలంపు పాపములే అన్నిటికన్నా ఎక్కువ భయంకరమైనవి. అవి లోపల ఉండి మనిషిని నాశనముచేయును. అందుకే ప్రభువు - "చూస్తేనే పాపము" అన్నారు. పౌలు - "ప్రభువా! తలంపులకు కావలియుండుము" అని అనెను. తలంపు రైటు అయితే అన్నీరైటు అగును.


షరా:- ప్రభువా! నా హృదయ పాపములొప్పుకొనే కుదురు దయచేసినావు స్తోత్రము. హృదయశుద్ధి ఒకవంతు అయిపోవలెను. అనగా మనము చేయవలసిన వంతు అయిపోవలెను. మనంతట మనమే ఒప్పుకొనే గొప్పపని పూర్తిఆయెను. ఇప్పుడు ఇంకొకరు వచ్చి శుద్ధి చేయవలెను. అనగా ప్రభువేవచ్చి తన రక్తముతో శుద్ధిచేయవలెను.

  • 1) మన ఒప్పుదలనుబట్టి నీళ్లతో, జ్ఞానసంబంధమైన నీళ్ళతో ఆయన మనలను కడిగివేసెను.
  • 2) పిమ్మట ఆయన రక్తముతో శుద్ధిచేసినపుడు సంపూర్ణశుద్ధి కలుగును.
    • 1. మొదట మనము
    • 2. తర్వాత ప్రభువు.

ఈ శుద్ధికార్యము చేయవలెను. మరలా మనోనిదానము అనగా క్రీస్తుప్రభువు తలంపు కలిగియుండవలెను. బాగుగా ఉన్న బంగారమును కంసాలి, తన కుమారునిమాట వినక కొలిమిలోవేసినట్లు, ఆయన మరలా మన హృదయమును శుద్ధిచేయును. ఇక్కడి మన శుద్ధి. నరలోకమునకు చాలును అనగా సరిపోవును కానీ పరలోకమునకు చాలదు.


ఉదా:- భిందె ఎవరు కడిగితేనేమి? నేను మరలా కడుగుతాను అని అనుకొందుముగదా! అలాగే యేసుప్రభువు మరలా మనలను కడుగవలెను.


అమూల్య రక్తప్రార్ధన: ప్రభువా! సిలువమీద నీవు ధారపోసిన రక్తధారతో నా హృదయము కడుగుము. అప్పుడు పరిపూర్ణముగా శుద్ధియగును. హృదయము పైన, అడుగున, లోపల అన్నీ భాగములలో శుభ్రముచేయుము. అన్ని ప్రక్కల, మధ్యను శుభ్రముచేయుము. నీవు వచ్చి శుద్దీకరించుము. ఆ శుద్ధి జరిగినయెడల అదే నాకు జీవము, నాకు మోక్షము. నీవైతే సంపూర్ణముగా శుద్ధిచేయగలవు. వంటగదిలో కుర్రవాడు బాగా కడుగును. గాని ఆమె అనగా యజమానురాలైతే ఇంకా బాగా కడుగును. అట్లే మేము శుద్ధిచేసికొన్నాము గాని అది చాలదు. నీవే స్వయముగా పరిశుద్ధపరుచుము. నీ సింహాసనమువద్ద అంగీకరించబడునట్లు కడుగుము. ఆమేన్.


షరా: శుద్ధి అయినట్లు అనగా ఆయన పూర్తిగా కడిగినట్లు బుజువు ఏదనగా,

  • 1. సంతోషము,
  • 2. ధైర్యము
  • 3. నిరీక్షణ సంపూర్ణముగా కలుగును.

అదే గొప్పగుర్తు. ఈ గుర్తు సులువుకాదు.


ఆ పిదప స్తుతిచేయవలెను:- యేసు రక్తమునకు జయము. సాతాను పనులకు లయము. నేను హృదయము శుద్ధిచేసికొంటిని గనుక సంతుష్టి ఆయన రక్తముతో శుద్ధిచేసినందుకు మరీ సంతుష్టి.

పాట : "పొందబోయెది ముక్తి ఈ భువియందేగాంతును. ఆనందమగు ఇంటిలోపల ఊడ్చిన తరువాత, వాకిలి ఊడ్వవలెను. హృదయము ఇల్లు; పై అవయవములు వాకిలి గనుక అవికూడా ఊడ్వవలెను.


దీవెన: ఆలాగు సంపూర్ణముగా మన పాపములు ఒప్పుకొని, ఆయనచేత పరిపూర్ణముగా కడగబడి, ఈ మానవ హృదయములను; ఆయనను ఆనందపరచు దేవ మందిరములుగా మార్చుకొను ధన్యత పెండ్లికుమారుడైన క్రీస్తుప్రభువు నేటిదినమున మీకు దయచేయును గాక. ఆమేన్.