35. నిర్గమకాండ ధ్యానము

నిర్గమకాండము 1-19 అధ్యా॥లు



ప్రార్ధన:

తండ్రీ! ఈ నిర్గమ కాండమును, మా నిర్గమము కొరకై ఏర్పాటు చేసినావు వందనములు. మేమును నీ పిల్లలవలె ఈ లోకములో యాత్రీకులమై ఉన్నాము. గనుక వారి ప్రయాణమును మీ రాకడ ప్రయాణమునకు ముంగుర్తుగా ఉంచినావు. నీకు స్తోత్రములు. మా ప్రయాణమునకు మమ్మును సిద్దపర్చుటకు నీ పిల్లల ప్రయాణ గ్రంథము వివరించుము. యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్ .

1వ అధ్యాయము

1. యోసేపును అతని అన్నదమ్ములును చనిపోయిరి. క్రొత్తఫరో వచ్చెను. హెబ్రీయులు విస్తరించుచున్నందున వారికి ఎక్కువ శ్రమలు కలిగెను. షిఫ్రా, పూయా అను హెబ్రీ మంత్రసానులు - హెబ్రీయుల మగపిల్లలను నదిలో పారవేయుటకు ఆజ్ఞాపింపబడెను;

2వ అధ్యాయము

2. మోషేజన్మము - రాజకుమార్తె పెంచుట - ఇద్దరు ఇశ్రాయేలీయుల కలహము. మోషే మిద్యాను వచ్చివేయుట. మోషే వివాహము చేసికొనగా కుమారుడు కలుగుట. ఐగుప్తీయులు పెట్టిన శ్రమలను గూర్చి మొరబెట్టగానే దేవుడు వినుట - దేవుడు ఇశ్రాయేలీయులయందు లక్ష్యముంచుట.

3వ అధ్యాయము

3. పొదలో మోషేకు, దేవునికి జరిగిన సంభాషణ.

4వ అధ్యాయము

4 కర్ర, చేయి, అద్భుతములు చూపించుట. మోషే తన మామయైన యిత్రో యొద్ద సెలవు తీసికొని వెళ్ళుట. దారిలో కుమారునికి సున్నతి చేయుట, అహరోనును కలసికొని అద్భుతములు వినిపించుట, పెద్దలందరితో చెప్పుట. అప్పుడు మోషే అహరోనులు ప్రజలయొద్దకు వెళ్ళుట; అహరోను పొద చరిత్ర చెప్పెను. అద్భుతములు చేయగా చూచి ప్రజలు నమ్మిరి.

5వ అధ్యాయము

5. మోషే అహరోనులు ఫరోనుచూచి, సంగతులు చెప్పి ప్రజలను వెళ్ళనీయుడనెను. అతడు ఒప్పక ప్రజలకు ఎక్కువ పని చెప్పెను. గడ్డి ఇయ్యబడలేదు, గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు అంతా ప్రజలు చెదరిపోయిరి. గడ్డిలేదనియు, నాయకులు కొట్టుచున్నారనియు ఫరోకు చెప్పుట. ప్రజలు దారిలో మోషేకు చెప్పుట ప్రజలు మోషేమీద విసుగుకొనిరి కాని మోషే దేవుని ప్రార్ధించెను.

6వ అధ్యాయము

6. దేవుని బలవంతముచేత అతడు పోనిచ్చును. దాసత్వములోనుండి విడిపింతునని ప్రజలతో దేవుడు చెప్పుట మోషే మాట వారు వినకపోవుట, ఫరోయొద్దకు వెళ్లుమని మోషేతో దేవుడు చెప్పెను. ప్రభువా! నామాట అతడెట్లు వినునని మోషే అనెను. పితరుల మూల కుటుంబములు వివరించబడుట.

7వ అధ్యాయము

7. దేవుడు మోషేతో - నీవు ఫరోకు దేవుడవు; అహరోనుకు ప్రవక్త అని చెప్పుట. ఫరోను కఠినపరతును, సూచక క్రియలు చేతును అని చెప్పుట; అహరోను కర్ర, మాంత్రికుల కర్రలను మింగుట, యేటి నీళ్ళు రక్తమగుట.

8వ అధ్యాయము

8. ఏడు రోజులకు కప్పలు వచ్చెను. ఫరో ప్రార్ధన కోరెను. కప్పలు చనిపోయినవి గాని ఫరో ప్రజలను పోనీయలేదు. ధూళి పేలగుట, శకునగాండ్రు ఇది దేవుని శక్తి అనుట - జోరీగలు వచ్చుట - జోరీగలు అంతరించుట.

9వ అధ్యాయము

9. పశువుల తెగులు కలుగుట - ఫరో హృదయము కఠినమైనందున, ప్రజలను పంపలేదు. ఆవపు బుగ్గితో దద్దురులను పుట్టించుట, ప్రజలను పోనీయకుండుట; వడగండ్లు - పిడుగులబాధతో ఫరో ప్రజలను పోనీయలేదు.

10వ అధ్యాయము

10. మిడతల బాధ - ఫరో ప్రజలను పోనీయడాయెను. చీకటి బాధ; ఫరో మోషేతో నా ముఖము చూచు దినమున మరణమౌదువనెను. నేను నీ ముఖము చూడనని మోషే అనెను.

11వ అధ్యాయము

11. ప్రధమ పుత్రుని మరణ ప్రవచనము.

12వ అధ్యాయము

12. పస్కా స్థాపన - ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చివేయుట (430 సం॥లు బానిసత్వమునుండి విడిపించబడుట).

13వ అధ్యాయము

13. తొలిచూలువి యెహోవావైయున్నవి. ఇశ్రాయేలీయులు యుద్ధసన్నద్దులై సుక్కోతు ఏతాము వచ్చిరి. మేఘస్తంభము.

14వ అధ్యాయము

14 ఫరో వారిని తరమగా నేను మహిమపరచుకొందునని దేవుడు చెప్పెను. నేను మా పక్షముగా యుద్ధము చేయుదునని దేవుడు చెప్పెను. సాగిపోవుడని ప్రభువు చెప్పెను. ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. ఐగుప్తీయులు నీటిలో నశించిరి. ఇశ్రాయేలీయుల విశ్వాసము వృద్ధియాయెను. మొదటి సణుగు (11వ. వచనములో).

15వ అధ్యాయము

15. మోషే కట్టిన జయకీర్తన దానిలో రాయి-సీసము-దేవాలయము గమనింపవలసినవి 14-15 జనములు, ఫిలిష్తీయులు, ఎదోమియులు, మోయాబీయులు, కనానీయులు భయపడుదురు. అనునది గమనింపవలసినది. ఐగుప్తీయులు సముద్రములో నశించిరి. మిర్యాము మరియు తన స్నేహితులు పాటపాడిరి. షూరు అరణ్యములో మూడు దినములు ప్రయాణము నీళ్ళులేవు అక్కడ రెండవ సణుగు. మారా (చేదునీళ్లు) దైవిక స్వస్థత - వాగ్ధానము, ఏలీము నీటి బుగ్గలు.

16వ అధ్యాయము

16. సీను అరణ్యమునకు వచ్చిరి - మూడవ సణుగు (ఆహారములేదని) మన్నా వాగ్ధానము - యెహోవా మహిమ మేఘములో వారికి కనబడెను. 7వ వచనము మన్నా ఉండదు. రాబోవు తరములు చూచుటకు మన్నాను దాచుట.

17వ అధ్యాయము

17. రెఫీదీములో నీళ్ళు దొరకలేదు. ప్రజలు సణిగిరి. మస్సా, మెరీబా బండలోని జలము, రెఫీదీములో అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము. కొండమీద మోషే అహరోను, హూరు - కొండక్రింద యెహోషువా సైన్యము - యెహోవా నిస్సీ (ధ్వజము).

18వ అధ్యాయము

18. యిత్రో మోషేయొద్దకు వచ్చుట - మోషే ఇత్రోకు యావత్తు చరిత్ర వినిపించుట, (ఇశ్రాయేలీయుల విషయము) యిత్రో బలులర్పించుట - యిత్రో పెద్దలను ఏర్పాటు చేయించుట - యిత్రో స్వస్థానమునకు వెళ్ళుట.

19వ అధ్యాయము

19. సీనాయి అరణ్యములో దిగిరి - భూమియంతయుమీది అనే అద్భుత వాగ్ధానము అందుకొనుట సీనాయి కొండమీద (దైవ) బాహాట ప్రత్యక్షత, ప్రజలు మేర దాటితే హాని.

దీవెన:

నేటిదిన ధ్యానముద్వారా ఏర్పాటు జనుల దర్శన ప్రత్యక్షతానుభవములు పెండ్లికుమారుడు మీకు కలిగించి ఆయన మహిమ కొరకు ఆయత్తపర్చుకొనును గాక! ఆమేన్.