నిర్గమకాండధ్యానము 32

ఎన్నిక జనాంగము - 1



నిర్గమ. 4:21-23.

ప్రార్ధన:

తండ్రీ! నీవు అబ్రాహామును ఏర్పాటు చేసికొని, ఆయన గర్భములో నుండి వచ్చినవారిని నీ ఏర్పాటు జనాంగముగా మార్చుకొన్నందుకు వందనములు. నీ పిల్లలను ఎంత ప్రత్యేకమైన శ్రద్ధతో సిద్ధపర్చినావో, మా మానవ జ్ఞానముతో మేము తలంచలేము, గ్రహించలేము. అట్టి నీ అద్భుత కృప మాకును దయచేయుటకు నీ ఏర్పాటు వర్తమానమిమ్మని ఏర్పాటు నామమున యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


ఎన్నిక జనము:- ఈ పేరునకు యూదులు ఆరంభ జనము. అన్యజనములోవారు వీరిలోనుండి వేరైపోయినందున, వారు ఇశ్రాయేలీయులుగా మిగిలిరి. యూదులనినను, హెబ్రీయులనినను, ఇశ్రాయేలీయులు అనినను, పాతనిబంధన జనమనిననూ, ఎన్నిక జనమనిననూ ఒక్కటే. రక్షకుని జన్మ జనాంగము ఎన్నో తిప్పలు పడితేనేగాని (దేవుడు) రక్షకుడు పుట్టలేదు. ఈ జనమును సిద్ధపరచుటకు దేవుడు అన్యులను వాడుకొనవలెను.

  • 1) పాపుల గుంపు,
  • 2) రక్షణగుంపు,
  • 3) సిద్ధపడిన గుంపు,
  • 4) పెండ్లి గుంపు

ఇశ్రాయేలీయులు ఎంత ఎన్నిక జనమైననూ, ఎంత భక్తులైనను, తప్పుచేసిన యెడల శిక్షింపవలసివచ్చెను. అందుచేత దేవుడు న్యాయమైన దేవుడు కనుక వారిని శిక్షించెను.

  • 1) బానిసత్వములో ఉంచెను,
  • 2) కష్టపడి పనిచేయుటకు నేర్పించెను
  • 3) ఇకముందుకు రాజులై పరిపాలించెదరు గాన బానిసత్వములో బాగా నేర్చుకొని, కూలీలను కనికరించుట నేర్చుకొనవలెను.

భిషప్ అవ్వవలెనంటే క్రీస్తుకొరకు కూలివని పని బాగా చేయాలి. అప్పుడు ప్రజల పరిస్థితులు బాగుగా తెలిసియుండును.

  • 1) శిక్షావిధి,
  • 2) బానిసత్వము,
  • 3) విధేయత,
  • 4) కష్టపడి పనిచేయుట నేర్చుకొనవలెను.


ఇవన్ని ముందుకు వారికి అక్కరకు వచ్చును. ముందుకు వారు రాజులగుదురు. మొదటిసారి దావీదు, సొలొమోనుల తరువాత 22మంది రాజులు, అనగా ఫరో రాజును మించిన రాజులుగా వారు కాబోవుచున్నారు. ఇది దేవుని ఉద్దేశము గాని ఇశ్రాయేలీయులకు ఈ సంగతి తెలియదు. ఇది ఒక రకమైన ట్రైనింగు (శిక్షణ) పైనాలుగు విషయములలో ఆయన వారికి శిక్షణ ఇచ్చును.


"2) బోధనా ట్రైనింగు 5 ఖండములలోని ధ్యాన విధులన్నీ నేర్పించెను. బానిసవారు విద్యార్థులైరి. 10 ఆజ్ఞలు నేర్చుకొనిరి, కనాను వెళ్ళిరి. ఇక్కడితో వారికి రెండు ట్రైనింగులు అయినవి.


3) రాజులు కాబోవు ముందు, ఇశ్రాయేలీయులు పటాలమువారు కావలెను. ఐగుప్తులో రాజుగారియొక్క పటాలమున్నది. అప్పుడు పటాలములోని సిపాయిలవలె వారు తమ శత్రువులతో యుద్ధముచేసి వారిని జయించెదరు. యెహోషువా నాయకత్వములో వారు యుద్ధవిద్యలు నేర్చిరి. మోషే రెండు చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచిరి. క్రిందికి దింపితే అమాలేకీయులు గెలిచిరి. ఐగుప్తులో యెహోషువ పటాలముయొక్క విద్య నేర్చుకొన్నాడు. ఐగుప్తులో ఎన్నిక జనముయొక్క ఫోటో అనగా రూపము ఏదనగా ఏడ్చుట ఏడ్చేవారిగా ఉండుట; అరణ్యములో వారి ఫోటో విద్యార్దులుగా ఉన్నది. పాలస్తీనాలో వారి రూపము లేదా ఫోటో సిపాయిలుగా ఉన్నది. అప్పుడు వారికి సౌలు రాజైనాడు.

  • 1. బానిసవారు:
  • 2. విద్యార్థులు:
  • 3. భటులు:
  • 4. రాజులు:
  • => అరణ్యములో వారు బైబిలు నేర్చుకొని గుడారము వేసి, గుడి సేవచేయుచు పూజారులైరి. బానిసలైన వారు పూజారులైనారు. ఈ ప్రకారము దేవుడు వారిని ఏర్పాటు జనాంగము అంతస్థుకు లాగుకొని వచ్చినారు.
    అరణ్యములో పూజారులైనవారే, కొండక్రింద భటులయ్యారు, చివరికి వాగ్ధానదేశంలో రాజులయ్యారు.

ఈలాగు ఇశ్రాయేలీయులు సౌలుతో రాజులును, అహరోనుతో యాజకులైరి. అలాగే మనమును వెయ్యేండ్లపాలనలో రాజులును, యాజకులును అవుతాము. పేతురు పత్రికలో మనము దేవునియొక్క రాజులమనియున్నది. మనము వెయ్యేండ్ల పరిపాలనలో గుడిలో ఆరాధనయు, బైటకు వస్తే రాజరికము చేయుదుము.


ప్రశ్న: వెయ్యేండ్లలో ఎన్నిక జనాంగము ఎందుకు ఉంటారు?
ఎన్నిక జనములోనుండి యూదులను, వారిలోనుండి క్రైస్తవులను, వారిలోనుండి పెండ్లికుమార్తెను ప్రభువు బయటకు తీసెను. 1కొరిం. 15వ అధ్యా॥, కొలస్సె. పత్రిక అంతయు చదవండి. పెంతెకొస్తు అయిన తరువాత పౌలు బర్నబాలు వచ్చెను. ప్రభువు పుట్టువరకు ఎన్నిక జనము యూదులు. దేవుని దృష్టిలో ఎన్నిక జనము క్రైస్తవులు. అసలు ఎన్నిక జనము పెండ్లికుమార్తె సంఘము. ఇది ఎఫెసిలో ఉన్నది. ఆనాడు మోషేను, అహరోనును ఇశ్రాయేలీయులు హింసించలేదా? ఆలాగే ఆయనను సిలువ వేయలేదా? కనుక అన్యులలో నుండి యూదులను వేరుచేసినట్టు, క్రైస్తవులలోనుండి పెండ్లికుమార్తెను శ్రమలద్వారా వేరుచేయును. (ఇది దేవుడే వేరు చేయు కార్యము). తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా చూచుకొనవలెను. "పెండ్లికుమార్తె వరుసలో లేకుండా ఆ వరుసలో ఉన్నాను" అనుకునే వారినిగూర్చి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. వెయ్యేండ్ల పాలనలో పెండ్లికుమార్తె వరుసలోనివారు రాజులును, పూజారులునై ఉందురు. అపో.కార్య. 2:16లో ఉన్నట్లు అన్ని దేశముల వారును వెయ్యేండ్లలో ఉంటారు. పెంతెకొస్తు లోకమంతట ఉన్నది. ఆత్మ సంఘమును పెంచినది. ఆ సంఘమే నేటివరకు వచ్చినది.

దీవెన:

ఆలాగు బానిసలనుండి రాజులుగా తయారై మేఘమెక్కు ఎన్నిక జనముగా పెండ్లికుమారుడు నేటి ధ్యానాంతమున మిమ్మును స్థిరపర్చునుగాక! ఆమేన్.