34. నిర్గమకాండ ధ్యానము

ఎన్నిక జనాంగము - 3



నిర్గమ. 19: 3-7.

ప్రార్ధన:

తండ్రీ! నీ ఏర్పాటు గొప్పది. నీ ఏర్పాటులో మేముండవలెనేగాని మమ్మును ఎట్టివారుగా మార్చుదువో, మేము ఊహించలేము. మాకు నీవిచ్చిన ఆశీర్వాదములు, మేళ్ళు మేము ఎంచలేము. అన్నిటి నిమిత్తమై నిన్ను వందించుచున్నాము. నీ ఆశీర్వాదములతోపాటు, నీ వాక్య వర్తమానమునుకూడ అందించుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్.


ఎన్నిక జనము చేసిన తప్పు:

  • 1. అన్యులతో కలసిపోయి ఇచ్చి పుచ్చుకొనుట జరిపిరి.
  • 2. ఐగుప్తులో బానిసత్వముచేసి, అక్కడి విగ్రహారాధన చూచి, మోషే కొండ ఎక్కగానే బంగారు దూడను చేసిరి.

దేవుడు భటులుగాను, యాజకులుగాను, రాజులుగాను చేసినప్పుడు ఆ తలంపు వారి మనసులో ఉన్నది గాని ఇప్పుడు బైటికివచ్చెను. యూదులు మలాకీముందు ఖైదులో ఉన్నారు. ఆ తర్వాత రోమావారి పాలనలోను ఖైదులో ఉన్నారు. ఈ రెండు ఖైదులు కాగానే వారి దేశములో విగ్రహారాధన చూచినను, వారు విగ్రహారాధన చేయలేదు. ఈ రెండు శిక్షలు వారిని మార్చెను. వారు మారుటకు ఎంత కాలము పట్టినదో చూడండి. ఒక మనిషిలో ఒక చెడుగు ఉండిపోయిన మరలావచ్చును. ఏదో ఒక శిక్ష ద్వారా అది గుణపడును.

దేవుడు, ఎన్నిక జనమునకు చేసిన మేళ్ళలో:

  • 1) అభివృద్ధి అనగా మగ బిడ్డల సంతానమును వృద్ధిచేయుట. ఈలాగు వారి సంఖ్య, ఆరు లక్షలవరకు పెరిగినది. ఫరో ఆపుచేయగలిగెనా? లేదు.
  • 2) ఆకాశమునుండి మన్నాను కురిపించుట; బండలోనుండి సమృద్ధిగా నీరు రప్పించుట.
  • 3) 40 సం॥లు వారి కాళ్ళు వాయలేదు, బట్టమాయలేదు.
  • 4) మాంసము కొరకు పూరేడు పిట్టలనిచ్చుట
  • 5) దేవుడెప్పుడునూ వారిమధ్య ఉండేవారు.
  • 6) మార్గమునకు ముందు దూతను పంపిస్తాను అని గొడుగుపెట్టి లైటువేసి చూపించెను.
  • 7) అరణ్యములో ఉప్పు, కారము, చింతపండులేదు. అయినను, వారు అన్ని భోజన పదార్థములు అనుభవించిరి.

ఆలాగు దేవుడు తన జనమునకు అన్ని ఉపకారములు చేసాడు. ఎన్నిక జనమునకు సదుపాయములు ఎన్నైనా కుమ్మరించి వేస్తాడు. ఎన్నిక జనమునకు ఎన్ని సదుపాయములు చేసెనో అవి అన్నియు సంఘమునకు చేయును. అన్నీ కుమ్మరింపులే కావలసిన వాటికంటే ఎక్కువగా ఇచ్చును. తిన్నగా ఉంటే దావీదు. 28లోని సంగతులు మన అనుభవములోనికి వచ్చును.


ఎన్నిక జనాంగమునకు దేవుడు చేసిన మేళ్ళు:

  • 1. దేవుడు వారికి సంతానాభివృద్ధి చేసెను. ఆరు లక్షలవరకు పెరిగిరి. ఫరో తగ్గించ ప్రయత్నించినను దేవుడు వృద్ధిచేసెను. (యూదులు వేటిని పెంచినా మందలు మందలైపోవుట తుదకు వారు మందలు మందలైపోయారు). తప్పులుచేస్తే శిక్షించిరిగాని, జనము వృద్ధిపొందుచూనేయున్నారు. వర్తకము చేస్తే వృద్ధి పొందిరి. రాజులై పోవుచున్నారు. వారేకాదు. వారు పెంచిన జీవరాసులుకూడా అభివృద్ధి పొందినవి.

  • 2. మోషేను ఉపాధ్యాయునిగా ఇవ్వడము.

  • 3. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నంతకాలము దేవుడు మోషేద్వారా మాత్రమే మాట్లాడెను. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఒక పిటిషన్ పెట్టుకొన్నారు. మోషే నీవు మాతో మాట్లాడితే చాలు. దేవుడు మాతో మాట్లాడితే చస్తామనిరి. గనుక ఆలాగు మోషేద్వారా 33 1/2 సం॥లు అందరికి కనబడిపోయిరి. దీని అర్ధము ఏమనగా నేను అందరికి కనబడే దేవుడనని బుజువు పర్చుటకు ఇక్కడనుండి రాకడవరకు దేవుడే మాట్లడుతాడు.
  • 4. ఆకాశమునుండి మన్నా
  • 5. బండనుండి మంచినీరు కుమ్మరించుట ఇది మహోపకారము.
  • 6. మాంసముకూడా ఇచ్చెను.
  • 7. ఇంకొకటి కాళ్ళు వాయలేదు బట్టమాయలేదు. వారికి చాకలిలేడు. ఇది ఎక్కువ ఆశ్చర్యకరముగానున్నది.
  • 1. సంతానాభివృద్ధి
  • 2. మోషేద్వారా మాట్లాడుట
  • 3. మన్నా
  • 4. బండలోనుండి నీరు,
  • 5. కాళ్ళువాయలేదు. బట్టలుమాయలేదు
  • 6. ముందుగా దూతను పంపుతాను
  • 7. మాంసము.
  • 8. చీకటిలోనుండి అగ్నిస్థంభము.
  • 9. ఎండలేకుండా మేఘపు గొడుగు బాటసారులను సాగనంపేటప్పుడు గొడుగు పడతారు. లైటు పట్టుకొందురు.

దేవుడు తన జనమునకు అన్ని సదుపాయములు చేస్తారు. మన కాలములోను అలాగే చేయును. ఎన్నక జనమునకు ఎన్నెనా సదుపాయములు చేయును. సదుపాయములు కుమ్మరించారు. వారికి వచ్చిన కష్టములన్ని తోలిపారవేసినారు. ఇవన్ని మేళ్ళు, కుమ్మరింపులు, అందుకనే యెహోవా “నా కాపరి నాకు లేమికలుగదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది” అంటే కావలసినవాటికంటే ఎక్కువ చేయగలడని అర్ధము.

దీవెన:

ఈలాగు నకల సదుపాయములను ఈ లేమికాలములో పెండ్లికుమారుడు మీకు కల్గించి, తన సమృద్ధితో పోషించి, రాకడకు సిద్ధపర్చుకొనునుగాక! ఆమేన్.