మోషే జీవితము - దేవుని జీవము
నిర్గమ. 40: 17-38; ద్వితీ. 34:1-12.
ప్రార్ధన:
తండ్రీ! నీ ఏర్పాటులోనున్న మోషేను నీవు అన్ని స్థితులలో కాపాడినావు. నీ జీవమును ఆయన జీవితములో ధారపోసినావు. ఆలాగున మేమును నీతో నిత్యముండుటకు నేడు నీ వాక్యసారము మాలో పోయుటకు మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్ .
యోసేపు ఐగుప్తుకు ఇశ్రాయేలీయులను తీసికొని పోవుట.
నిర్గమ 2:1. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి తీసికొనివెళ్ళుట:
లేవీవంశమువాడు ఒకడు వెళ్ళి లేవీవంశములో స్త్రీని వివాహము చేసికొనెను. జెకర్యా లేవీ కుటుంబము. యాజక కుటుంబము. అహరోను కుటుంబములోని ఎలీసబెత్తు యాజక కుటుంబము. వారి కుటుంబములో పుట్టిన యోహానువంటి గొప్పవాడు ఎవడునులేడు. మోషేకూడా లేవీకుటుంబములో పుట్టినాడు గనుక మోషేవంటివారు ఎవడులేడు. వానిలో దేవుని ముఖముచూచి వానిలో మూడు నెలలు దాచినారు. చిన్నబిడ్డను మూడు నెలలు దాయుట అద్భుతముగా ఉన్నది. మోషే చరిత్రలో ఆయన జీవితము ఎంత అద్భుతముగా కనుబడుచున్నది. (పక్షులు కొన్ని రోజులలో ఎగురును. జంతువులు కొన్ని దినములలో నడచిపోవును. మనిషి ఎంత కాలము బ్రతికినా తనకుతాను నడువలేడు. మనము క్రీస్తువలన పుట్టినవారముకాము). అయినను నైలునదిలో విడచి దేవుని కాపుదలకు అప్పగించినారు. (ఇప్పుడే కాపాడు. మనలను అన్ని పాపములు చుట్టియున్నవి.) ఎంత అద్భుతముగా కాపాడుచున్నాడో మనకు ఈయన చరిత్రవలన తెలుసును. అయినను శత్రువుల చేతులలో పెంచుచున్నాడు. కూలికి వచ్చిన తల్లి సొంత తల్లి. జీతముమీద వచ్చినది. విద్య చెప్పిన తల్లి రాణి. మిర్యాము తన అక్క రాజుగారియొక్క కూతురు చేతులలో తాను పెరుగగా కత్తిచేతిలోనుంచి తప్పించుకొనుచున్నాడు. దేవుని విద్య మనము నేర్చుకొనకపోతే పిశాచి విద్యకు అప్పగించుట జరుగును.
- 1. పెంపుడు తల్లి విద్య
- 2. సొంత తల్లి విద్య,
- 3. ఐగుప్తు విద్య
- 4. స్వంత పాలిస్తుంది.
ఈ స్వంత తల్లివిద్య పైకి
తీసికొనివచ్చును. మహిమలోనికి వచ్చును. తల్లి ఒకటి. పిల్ల ఒకటి.
తల్లిపాలవలన శరీరములో యూదా వంశములో పెరిగినవాడు. ఐగుప్తు పాలు దొరికిన పాడైపోవును. తల్లిపాలుగల
విద్య
దేవుని గ్రంధమైన బైబిలు. ఇతర పుస్తకములు జ్ఞానము, ఉపాయము ఇవ్వవచ్చును. గాని విశ్వాసము, ప్రేమ ఇవ్వలేదు.
చెరలోనుంచి స్వంతంత్రతలోనికి నడిపించాడు. ఈయన రాజుగారి కొడుకుగా చూపించుకొనాలని వెళ్ళాడు.
అప్పుడప్పుడు మనము పొరపాటులు చేస్తాము. మన స్వంత శక్తితో ఏమి చేయలేము. ఈయన 120సం॥లు బ్రతికాడు. 40
సం॥లు
ఐగుప్తులో, 40 సం॥లు గొర్రెలు కాయుట, 40 సం॥లు ఇశ్రాయేలీయులను నడిపించుట. మన బ్రతుకులో మనము
తెలుసుకున్నవి, అంత ఎక్కువ సహాయము చేయలేవు కాని యేసుప్రభువే ఎక్కువ సహాయము చేయును. (ప్రభువు) భక్తి
ఎక్కువ
ఉన్నందున కీడుచేస్తాం. అది నేరమే. ఈయన ఒకని చంపినందున ఇతనికి శిక్ష రావలసినది. పొద
కాలిపోతున్నట్లున్నది.
కాని కాలిపోలేదు.
దేవుని బిడ్డలకు కష్టములు వచ్చినాగాని వారు నశించరు. కష్టములు విస్తరించుకొలది వారు
ఫలిస్తారు. కష్టములు ఉండుటవలన తన స్థితియంత మనిషి తెలుసుకొంటారు. ఇక్కడ సిద్ధము చేసిన తరువాత దేవుడు
ఐగుప్తు పంపుతున్నాడు. మనము చేసిన పాపములు ఒక్క సం॥లోపోవు. 10సం॥లలో పోవు. మనకు జ్ఞాపకము వచ్చును. దేవుడు
క్షమించిన పాపములు మోషే జ్ఞాపకము తెచ్చుకొన్న యెడల అది మరచి పొమ్మన్ననూ మరువనట్లే. దేవుడు చేయడు.
మనిషికి
ఎంత సహాయం చేస్తాడు. ఎంత ప్రేమిస్తాడు. ఎంత చెడ్డవాడైన లోబడితే ఎంత పనియైన దేవుడు చేయించును. మనిషి
కర్రవలె ఉండి దేవుడు పట్టుకోపోతే పాములాగగును. మనిషి పట్టుకోపోతే మనసును వంకరగా తిరుగును. మనము
కర్రవలే లేవాలి. కర్రలో జీవములేదు. పట్టుకొనువానిలో జీవములేదు. షునేమోయురాలు ఎలీషా కర్ర
పెట్టగా
బ్రతుకలేదు. ఎందువలన పట్టుకొనేవానిలో జీవములేదు. మనము స్వతంత్రత కావాలని కోరము. ఫరో దాసత్వము
చేయించుకొనుటకు ఉంచుకొంటాడు. 10 అద్భుతములకు లొంగలేదు. మనము లొంగకపోతే మనకు కష్టము వస్తుంది.
విడుదల పస్కాపండుగ చేయుటవలన క్రీస్తుయొక్క రక్తము మనలను సకల పాపములనుండి విడిపించును. రక్తమువలన పాప
పరిహారము, రక్తమువలన జయము కలుగును.
పగలు మేఘస్థంభము, రాత్రులు అగ్నిస్థంభములో నుండి మోషే ద్వారా దేవుడు
నడిపించాడు.
ఈ 40 సంలు దైవసంబంధమైన చరిత్ర వాక్యభోజనము పెట్టాడు.
ఐగుప్తులో శరీర సంభంధమైన కట్టడ, ధర్మశాస్త్రము మోషేద్వారా కలిగెను. కృపయు, సత్యమును
క్రీస్తుద్వారా కలిగెను. ఆయన దేవుని దగ్గరకు వెళ్ళి దేవునిపని చేస్తుంటే సైతాను క్రింద తన పని
చేయును.
మోషే దేవునిదగ్గర ఉన్నాడు అతడు దేవుని రూపము వచ్చింది గనుక చావలేదు. దేవుడు జీవముగలవాడు గనుక దేవుని
ఆత్మ
అగ్ని. ఆ అగ్నితో మన పాపములు కాల్చివేయును. యేసుప్రభువు పరిశుద్దాత్మపొందాడు. అగ్ని అతనికి
అవసరములేదు. అగ్ని బాప్తిస్మము మనకు అవసరము. వారు తినటానికి ఏమియు తీసికొని వెళ్ళలేదు. వెండి,
బంగారము
తీసికొని వెళ్ళారు. యోసేపు ప్రార్ధనవలన వారు బాగుపడ్డారు. వారు నగలు తెచ్చుకొనుట వారి భాగ్యము. వారు
కష్టపడి పనిచేసారు. వారి బట్టలు మాయలేదు. చెప్పువారుకూడా అరిగిపోలేదు.
అగ్నితో మోషే ఆ బొమ్మను కాల్చి పొడిచేసి నీళ్ళ పైచల్లి ఇశ్రాయేలీయులచేత త్రాగనిచ్చెను. మోషే దగ్గర యెహోషువ ఆయన సేవకుడున్నాడు. ఆయనను మోషే దీవించాడు. యెహోషువా = రక్షకుడు. యేసు, యెహోషువా, కాలేబు వారి సంతానము మాత్రము వాగ్దాన దేశమునకు వచ్చారు. ఈ మనిషి నూతనము చెంది పునరుత్ధాన పర్చబడి ఆరోహణమగును. పునరుత్ధానములేనిదే ఎత్తబడుటలేదు. యేసు - మృతులు తమ మృతులను పాతిపెట్టనిమ్ము. కాని మోషేను జీవముగలవాడైన దేవుడే పాతిపెట్టెను (జీవముగలదానిని). గొర్రెపిల్ల వలన విడుదల, యెహోషువా వలన నడిపింపు, మన్నావలన పోషణ. కర్రవలన గొప్ప పనులు. యెహోషువా = యేసు అనే ఆయనవలన వాగ్ధాన దేశమునకు వెళ్ళుట. మోషే, ఏలీయాలు రూపాంతరము పొందినపుడు మోషే గొప్ప కానానును పరమ కానాను ముందే చూపించాడు. తరువాత ఈ కానాను.
దీవెన:
పెండ్లికుమారుని జీవమును ఈ 40 దినముల ధ్యానములద్వారా మీరు నిండుగా సంపాదించుకొని మోషేవంటి వ్రత్యేక అనుభవములు పొందుట మాత్రమేగాక రాకడ వధువుకు కావల్సిన కళలన్నియు ధరించుకొనుటకు పెండ్లికుమారుడైన క్రీస్తు ప్రభువు మిమ్ములను తన ఆత్మతో సంపూర్ణముగా అఖిషేకించునుగాక! ఆమేన్.