36. నిర్గమకాండ ధ్యానము

నిర్గమకాండము 20-40 అధ్యా॥లు



ప్రార్ధన:

తండ్రీ! మరొకమారు నీ ఏర్పాటు ప్రజల ప్రయాణ పుస్తకము దగ్గరకు మేము వచ్చియున్నాము. మాకు నేర్పించవల్సిన సంగతులు నేర్పించుమని యేసు నామములో వందించుచున్నాము. ఆమేన్.

20వ అధ్యాయము

20. దశాజ్ఞలు - మెరుపులు బూరధ్వనియు ప్రజలు విని నీవు మాతో మాటలాడుము దేవుడు మాటలాడిన యెడల మేము చనిపోవుదుమనిరి. నా కొరకు మంటి బలిపీటముకట్టి బలుల నర్పించుమని దేవుడు చెప్పెను. రాళ్లతో యజ్ఞవేదిక కట్టుట.

21వ అధ్యాయము

21. దాసుని 7సం॥లకు విడిచిపెట్టవచ్చును - పంటికి పన్ను కంటికి కన్ను - యజమానుడు ఎద్దు భద్రము చేయకుంటే పొడచునదని ఎరిగి అతడు మరణశిక్షకు పాత్రుడు. కప్పులేని గోతివలన నష్టముపెట్టుకొనవలెను.

22వ అధ్యాయము

22. పశువులను దొంగిలింపరాదు. దానికి బదులియ్యవలెను. కన్నపు దొంగవస్తే కేసులేదు. పరులచేలు మేయనీయకూడదు. చేనికి అగ్గి తగలనీయకూడదు, వ్యాజ్యము దేవునియొద్దకు తేవలెను. పెండ్లి నిబంధనలు శకునముకూడదు. పరదేశస్తులను బాగుగా చూడవలెను. దిక్కు లేనివారిని నిందింపవద్దు. అధికారులను నిందింపకూడదు. జ్యేష్టకుమారుని నాకు అర్పింపవలెను.

23వ అధ్యాయము

23. లేనివార్తను పుట్టింపకూడదు. అన్యాయ సాక్ష్యముకూడదు. శత్రువు పశువును అప్పగించుము, లంచముకూడదు, పరదేశిని బాధింపకూడదు. 6 ఏండ్లు పండించి 7వ సం॥ము బీడుగా వదలవలెను. పులియని రొట్టెలపండుగ ఆచరింపవలెను. గుడికి వెళ్ళునపుడు చందా తీసికొనివెళ్లవలెను. 16వ కోతపండుగ ఆచరింపవలెను - సంవత్సరమునకు 3 సార్లు పురుషులు మందిర దర్శనము చేయవలెను. దూతనుగురించి ఈ కాపాడే దూతకు కోపము పుట్టించకు (నానామము ఆయనకున్నది) అన్యుల విగ్రహములను పగులగొట్టి వారిని నిర్మూలము చేయవలెను. దేవుడు నీ అన్నపానాదులను దీవించును. నీ శత్రువులను వెళ్లగొట్టెను బలిమి చేత దేశవిగ్రహారాధికులను వెళ్లగొట్టవలెను (మనము సువార్త చేత వెళ్లగొట్టవలెను).

24వ అధ్యాయము

24. దేవునిమాట మోషే అహరోను, నాదాబు, అబీహును మరియు 70మంది వినుటకు దేవుని సన్నిధికి రావలెను. దేవునిమాట ప్రకారము చేసెదమని ప్రజలు చెప్పిరి. మోషే రక్త బలిచేసి దేవుని గ్రంథమును వివరించెను. నిబంధన రక్తమును ప్రజలమీద చల్లెను. దేవుని చూచిరి. దేవుడు రాతి పలకల శాసనములు ఇచ్చుటకు మోషేను పిలిచెను. సీనాయికొండను మేఘము ఆరురోజులు కమ్మెను. మోషే కొండమీద 40 దినములుండెను.

25వ అధ్యాయము

25. దేవుడు (మోషేతో) ప్రజలవద్ద కానుకలు తీసికొనవలెను. మీరు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను కనపరచిన రూపమును ఉపకరణ రూపమును నిర్మింపవలెను. మందసము చేయవలెను. కెరూబూలను చేయవలెను. కెరూబులమధ్య నుండి దేవుడు మాట్లాడును. సన్నిధి రొట్టెల బల్ల చేయవలెను. దీప వృక్షమును చేయవలెను.

26వ అధ్యాయము

26. దైవాజ్ఞ - తెరల మందిరము కట్టవలెను.

27వ అధ్యాయము

27. తుమ్మకర్ర బలిపీఠము చేయవలెను (కొమ్ములుగలది) ఆవరణము ఏర్చరచుట - 20 ఒలీవనూనె. (4. రక్తవర్ణపు రాయి, సులిమానిరాయి, సూర్య కాంతము).

28వ అధ్యాయము

28. అహరోను, తన కుమారుల యాజకత్వము వారికి వస్త్రములు కుట్టించవలెను. ఆ పనికి జ్ఞానాత్మపరులు రావలెను - ఎఫోదు మీద దట్టిపాగా -

  • 1) మాణిక్య, గోమేధిక, మరకతము
  • 2) పద్మ రాగము, నీలము, సూర్యకాంతము
  • 3) గారుత్మతము, యిష్మురాయి, ఇంద్రనీలము
  • 4) రక్తవర్ణపురాయి, సులిమాని రాయి, సూర్యకాంతము.

29వ అధ్యాయము

29. యాజకులను ఏర్పర్చు పద్ధతులు. దూడ, పొట్టేళ్ళు అప్పడములు తేవలెను. నూనెతో అభిషేకించవలెను. పాపపరిహారార్థమైనబలి (కోడెలోని గత్తరకాల్చివేయుట) జంతు రక్త ప్రోక్షణ (అహరోను అతని కుమారుల అభిషేకము) నా మహిమవలన పరిశుద్ధపరచబడును.

30వ అధ్యాయము

30. ధూపవేదిక - దానికి కొమ్ములు - దానికి మోతకర్రలు చేయుట, అక్కడ నేను నిన్ను కలిసికొందును. ప్రాణ పరిక్రయధనము

  • 1) ప్రొద్దుట,
  • 2) సాయంకాల ధూపములు.
    • ఎ) అన్య ధూపము కూడదు.
    • బి) ద్రవ్య నైవేద్యము లర్పింపరాదు.
    • సి) పానీయము పోయకూడదు.
కొమ్ములకై ప్రాయచిత్తబలి చేయవలెను. గంగాళము పీటము. తైలము - అహరోను కుమారులకు అభిషేకము. దూపద్రవ్యము - అది యెహోవాకు ప్రతిష్టితము. మందసము నెదుట నుంచవలెను.

31వ అధ్యాయము

31. బెసలేలు:- ఈయన జ్ఞానాత్మ గలవాడు. చిత్రకార్యములు చేయగలడు. అహోలీయాబు ఆయనకు జత (దాను గోత్రీకుడు) విశ్రాంతి దినము ఆచరించుట నాకును. మీకును గుర్తు. దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతిపలకలు మోషేకిచ్చెను (కొండమీద).

32వ అధ్యాయము

32. బంగారపు దూడనుచేయుట - యెహోవాకు పండుగ చేయుట - కొండమీద దేవుడు మోషేతో దిగి వెళ్ళుము - నా ప్రజలు చెడిపోయిరి అని చెప్పెను. దేవుడు - "నీవు ఊరుకొనుము వారిని నాశనము చేసి నిన్ను గొప్ప జనముగా చేతును" మోషే అందుకు సమ్మతింపడాయెను. మోషే యెహోషువ కొండదిగిరి. పలకలు పగులగొట్టెను. దూడను కాల్చి వారిచే త్రాగించెను. ఏర్పర్చబడిన వారు దుర్మార్గులు - మోషే అహరోనును ఎందుకు ఈలాగుచేసితివనుట - అహరోను జవాబు - లేవీయులు మోషే ఆజ్ఞ చోప్పున ౩వేల మందిని చంపిరి. మోషే పాప క్షమాపణ నిమిత్తము ప్రార్ధన వారిని క్షమించకపోతే జీవగ్రంథమునుండి నా పేరు కొట్టివేయుము.

33వ అధ్యాయము

33. దేవుడు - "నేను దూతనంపి అన్యజనులను వెళ్ళగొట్టెదను" మీరు పాలెస్తీనాకు వెళ్ళండి. నగలు తీసివేసిరి. ఇశ్రాయేలీయులు తమ డేరాలు ద్వారములయొద్ద నిలువబడగా వెలుపటనున్న గుడారములోనికి దేవుడు వచ్చి మోషేతో మాట్లాడెను. ప్రత్యేకింపబడిన జనము బండసందులలోనుండి దేవుని సన్నిధికి రావలెను. మోషే దైవమహిమ చూచెను.

34వ అధ్యాయము

34 రెండు రాతిపలకలు - సీనాయి శిఖరము మీద మోషేతో మాటలు - దేవుని నిబంధన - ఇశ్రాయేలీయుల యెదుట ఎవ్వరు నిలువరు. అన్యుల విగ్రహముల యెడల జాగ్రత్త. పరజనులతో నిబంధన చేసికొనవద్దు. పొంగని వాటి పండుగ. ఏడు దినములు పొంగని వాటినే తినవలెను. పశువులలో మొదటిది నాది. దేవుని సన్నిధి వట్టి చేతులతో రాకూడదు. విశ్రాంతి దినము ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు పురుషులు దేవుని సన్నిధిని కనబడవలెను. ప్రధమఫలము తేవలెను. కొండ దిగునప్పుడు మోషే ముఖచర్మము ప్రకాశించెను. ధూపవేదిక. నాలుగు పంక్తులు

35వ అధ్యాయము

35. విశ్రాంతి దినము కట్టడలు - అర్పణములు అన్ని విధములైనవి తీసికొని రండి. వివేక హృదయుల పని. గుడారమునకు కావలసినవన్నియు ప్రోగుచేయవలెను. హృదయ ప్రేరేపణనుబట్టి ప్రజలు అర్పించిరి. స్త్రీలు తాము వడికిన నూలు తెచ్చిరి. బెసలేలు చిత్రమైన పనికి దైవాత్మ పూర్ణుడాయెను.

36వ అధ్యాయము

36. నానావిధములైన గుడారపు పని చేయుటకై బెసలేలు వంటివారిని మోషే పిలిచెను. కానుకలు అత్యధికమైనవి గనుక మానిరి. తెరలు, కొలుకులు, గుండీలుచేసెను. (తెర= 112 మూరలు). కప్పు తెర 120 మూరలు (మేక వెంట్రుకలతో)- పలకలు చేయుట (20)- అడ్డుతెరలు.

37వ అధ్యాయము

37. మందసము చేసెను - కరుణాపీఠము - బల్లను చేయుట - దీపవృక్షము -

38వ అధ్యాయము

38 దహనబలిపీఠ నిర్మాణము - ఇత్తడి జల్లెడ - ఇత్తడి గంగాళము ఆవరణ నిర్మాణము - యవనికలు - స్థంభములు.

39వ అధ్యాయము

39. ప్రతిష్టిత వస్త్రములు కుట్టుట - ఏఫోదు చేయుట, భుజఖండములను చేయుట - లేతపచ్చలు చేయుట - ఇశ్రాయేలీయుల పేర్లు వాటిమీద చెక్కబడెను. పతకములోని

మాణిక్యము గోమేధికము మరకతము
పద్మరాగము నీలము సూర్యకాంతము
గారుత్మతము యిష్ము ఇంద్రనీలము
రక్తవర్ణము సులిమాని సూర్యకాంతము

దానిమ్మపండ్లను చేయుట - గంటలను చేయుట - అహరోను వాని కుమారులకు దుస్తులు - కిరీటము - దానిమీద యెహోవా పరిశుద్దుడు - గుడారపు పని పూర్తియాయిను. దైవాజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయులు చేసినందున దీవించబడిరి.

40వ అధ్యాయము

40. ప్రత్యక్షపు గుడారము నిలువబెట్టుట (మొదటి నెల మొదటి దినము). గుడారములోని వస్తువులు :

  • 1. సాక్ష్యపు మందసము
  • 2. బంగారు ధూపవేదిక
  • 3. అడ్డు తెరదానిని కప్పియుండుట
  • 4. బల్ల (దానిమీద వస్తువులు)
  • 5. దీపవృక్షము
  • 6. మందిర ద్వారము
  • 7. గంగాళము, దహన బలిపీఠము.
  • 8. ఆవరణము.


అభిషేక తైలముతో మందిరమును వాటిలోని సమస్తమును ప్రతిష్టించి అభిషేకించవలెను. దహనబలిపీఠమునుకూడ ప్రతిష్టింపవలెను. గంగాళమును కూడ అహరోను ప్రతిష్టించవలెను. ఆయన కుమారులకును అభిషేకము - రెండవ సం॥ము మొదటి నెలలో మందిరము నిలువబెట్టవలెను. మందసములో శాసనపు పలకలనుంచెను. దానిమీద కరుణాపీఠము, మందసము కప్పెను. లోపటిబల్లమీద సన్నిధి రొట్టెలుంచెను. బంగారు ధూపవేదికమీద పరిమళ ద్రవ్యధూపము - దహనబలిపీఠము మీద నైవేద్య సమర్పణ చేసెను. గంగాళములో నీళ్ళు పోసెను.


షరా: ఆవరణద్వారపు తెరవేసెను. మోషే తన పని సంపూర్తిచేసెను. మేఘము గుడారమును కమ్మెను. అప్పుడు దైవమహిమ మందిరములో వ్యాపించెను. యెహోవా ఉన్నందున మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘముపైకి వెళ్ళునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్ళిరి. పగలు మేఘము, రాత్రి అగ్ని ఆ గుడారముమీద ఉండెను.


దీవెన:

ఆలాగు దైవ ప్రసన్నత, సన్నిధి మీలో నిత్యము ఉండి, ఈ 40 దినములు ఆయన సన్నిధి కాంతిలో మిమ్మును సంచరింపచేయునుగాక. ఆమేన్.