దేవుని గుడారము - ప్రభువుతో సహవాసము
కీర్తన. 15:1; నిర్గమ. 39:32-43.
ప్రార్ధన:
ఓ కనికరముగల తండ్రీ! నీవు మానవ శరీరము ధరించి, మానవ లోకమునకు వచ్చి, మానవులతో సహవాసము చేసితివి. పరమ దేవుండవైన నీవే మాతో సహవాసము చేయగా, మేమెందుకు మీతో సహవాసము చేయకూడదు. నీవు మానవులతో సహవాసము చేయడమునుబట్టి, నీకు మానవులతో సహవాసముచేయుట చాలా ఇష్టమని మాకు తెలియుచున్నది. నీవు మానవులతో సహవాసము చేయుటకు భూలోకమును ఏర్పాటు చేసితివి, నరలోకమును ఏర్పాటు చేసితివి. గనుక నీకు స్తోత్రములు. నేను నీతో సహవాసము చేయనలెనంటే అన్ని కష్టములే. మేము వీటన్నిటిని దాటి, నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసము చేసే భాగ్యము అనుగ్రహించుము. మేము నీ సహవాసములో ఉంటే వీటన్నిటిని జయించగలము. పిల్లలకు, తల్లిదండ్రులదగ్గర ఉండుట చాలా ఇష్టము. స్నేహితులకు స్నేహితుల దగ్గర ఉండుట చాలా ఇష్టము. వారు మంచివారైనా, చెడ్డవారైనా వారికి అనుకూలమైన వారైతే సరి. వీటన్నిటిని మించినది నీ నవావానము. నీ సహవాసమునుగూర్చి వివరించితే సంతోషమేగాని, అది అనుభవించినపుడే మేము దానిని సరిగా గ్రహించగలము, సంతోషించగలము. నీ సహనాసమే మొదటిది. దాని తరువాతది మోక్షము. లోకము మొదట వెదకవలసినది ఇదేగాని ఇప్పుడు దానిని విడిచిపెట్టివేసినది. మేము కనిపెట్టుగంట చదివినాము. దానిలో నీ సన్నిధిలోనుండుటను గూర్చి ఉన్నది. సన్నిధిలో ఉన్నప్పుడే మేము దర్శనములు చూడగలము, మీ మూటలు వినగలము. మా ఓపికను తర్ఫీదు చేయగలము. కష్టములను జయించగలము. సహవాసము అడిగితే మూత్రము చాలదు. అడిగి దానిని పొంది అనుభవించే కృప దయచేయుము. మేము బయటికి వెల్ళి పొందుట కాదు. ఇప్పుడే ఇక్కడే నీ సవావాస భాగ్యము పొంది అనుభవించే కృప దయచేయుము. ప్రభుయేసుద్వారా ఈ కోరికను నెరవేర్చుమని నేడుకొనుచున్నాము. ఆమేన్.
"యెహోవా నీ గుడారములో అతిధిగా ఉండదగిన వాడెవడు". దా.కీ. 15:1. పూర్వము ఇశ్రాయేలీయులు 40 సంలు అరణ్యములో ఉన్నప్పుడు గొప్ప డేరా (గుడారము) వేసినారు. దానిలోనికి ప్రభువు వచ్చి మాట్లాడినారు. తన ప్రజలతో మాట్లాడినారు. అయితే గుడారములోనికి వెళ్ళుటకు ఎవరు యోగ్యులు? ఆ గుడారములో దేవుడు మాట్లాడుచున్నాడు. గనుక మనిషి మాట్లాడకూడదు. ఒకవైపు దేవుడు మాట్లాడుచుంటే, మరొకవైపు మనిషికూడా మాట్లాడితే ఆయన మాటలు ఎట్లు వినబడును? దేవుడు కొన్ని మాటలు చెప్పుచుంటే మోషే వ్రాసినాడు.
దేవునియొక్క గుడారములో నివసింపదగిన వాడెవడని ఈ వాక్యములో ఉన్నది. మోషే తగినవాడు. ఎందుకంటే మోషే దేవునియొక్క స్వరూపమును చూచినవాడు. ఆయనయొక్క స్వరము వినగలిగినవాడు. అంతేగాక వినగలిగినవి, వ్రాయగలిగినవాడు. వ్రాయగలిగి తన ప్రజలకు బోధింవగలవాడు. బోధింవగలిగి, ఇశ్రాయేలీయులను అరణ్యములో నడిపింపగలవాడు. ఈ కీర్తనలో ఏమున్నదంటే తన నాలుకతో పాపము చేయనివాడు యెహోవా గుడారములో నివసింపదగినవాడని ఉన్నది. ఇంకా ఏమున్నదంటే నాలుకతో చేయు పాపములు రెండు విధములు అని ఉన్నది.
- 1) అబద్ధములాడుట,
- 2) పొరుగు వానిమీద కీడు మాట్లాడుట.
ఈ రెండునూ నాలుకతో చేయు పాపములు. దేవుడు పలికే మాటలు వినేవాడు, మంచి మాటలు పలికేవారైయుండవలెను. బయట అబద్ధములాడి, ఇతరులమీద కూడా చెడుగు మాట్లాడినవాడు, దేవుని గుడారములోనికి వచ్చి దేవునితో ఎట్లు మాట్లాడగలడు? దేవుడు పలికేమాటలు ఎట్లు వినగలడు? ఆ గుడారము అరణ్యములో వేసినగుడారము. అది ఆరాధన స్థలము. అది దేవుడును, మనుష్యుడును ఉండే గుడారము. అనగా దేవాలయ గుడారము, గుడి గుడారము. గుడి గుడారమనగా ప్రయాణము చేసే దేవాలయము. మనము ఆదివారము వెళ్ళే గుడి, ప్రయాణము చేయక ఉన్నచోటనే ఉండిపోవును. దేవునికి ఒక గుడారమున్నది. అది భూమిమీద 40సం॥లు ఉన్నది. ప్రకటనలో నరుడు దేవుని గుడారములోనికి వచ్చెను అని ఉన్నది. 7సం॥ల శ్రమలలో రక్షింపబడినవారు పెండ్లికుమార్తె విందులోనికి ముసుగువేసికొని వచ్చి వారితో విందు అనుభవింతురు. అతిధి అనగా ఎవరు?
- 1) ఇంటిలో లేనివాడు,
- 2) పరస్థలమునుండి వచ్చినవాడు,
- 3) వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళుపోవువాడు.
మంచివారే, సజ్జనులే రేపు 7సం॥ల విందులో పెండ్లికుమార్తెయొక్క సరసన కూర్చుండి, విందు అనుభవించుటకు పిలువబడిన రక్షితులుగా అతిధులైయుందురు. ఈ కీర్తనలో చెప్పబడిన అతిధులెవరంటే దిగువ వచనములలో ఉన్నవారు. అనగా అబద్ధములాడనివారు. అబద్ధికులనగా ఎవరు? ఈ కీర్తనలో అబద్ధికులు దేవుని గుడారములోనికి రారు అని ఉన్నది. క్రీస్తును ఒప్పుకొననివారు, అసలైన గడ్డైన అబద్ధికులు వీరే. "ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి" అని బైబిలులో ఉన్నది గదా! (ఫిలిప్పీ 4:4). శ్రమలయందు విసుక్కొంటూ దేవుడు నా ప్రార్ధన వినలేదు అని ఎవరైతే అంటారో, అట్టివారు అబద్ధికులు. నేను నా కుమారుని పంపితే అంగీకరింపలేదు. వారిని రక్షించుటకు పంపితే వారు అంగీకరించలేదు. అనగా ఆయనను ఒప్పుకొనలేదు. వీరే అసలైన అబద్ధికులు అని తండ్రి సాక్ష్యమిచ్చును.
భూమిమీద కొన్నివందల ఏండ్లకు దేవుడు ఒక గుడారము వేసినాడు. అది క్రైస్తవ సంఘము. ఆ సంఘము క్రైస్తవులకు దేవాలయము వంటిది. ఆ ఆలయములోనికి దేవుడు వచ్చి మాట్లాడవలయును. ఈ దేవాలయములోకూడా దేవుడు మాట్లాడవలసిందే గాని పాదిరిగారు మాట్లాడుచున్నారు. ఇద్దరూ మాట్లాడితే బాగానే ఉండును. దేవుడు మాట్లాడేస్థితి సంఘములోనుండి పోయినది గనుక క్రైస్తవ సంఘము 850 మిషనులక్రింద చీలిపోయినది. అందుచేత ప్రభువు మాట్లాడుటకు వీలులేదు. నాస్వంత అభిప్రాయమేమనగా (యం. దేవదాసు అయ్యగారు) 860 మిషనులు స్థాపింపబడినట్లుగా జైబిలుమిషనును స్థాపించకూడదు. ఏలాగంటే జీతములు మొదలగున్నవి ఉండవలెనుగదా! అవి ఇందులో ఉండకూడదు. అవి ఉంటే జీతములు పుచ్చుకొని పనిచేయరు. బైబిలుమిషనును పైకెత్తి చూపుమని ప్రభువు చెప్పినారు గనుక బైబిలుమిషనునుగూర్చి అందరికి చెప్పవలెను. అందుచేతనే పత్రికలు వేస్తున్నాను. ఇంకా వేస్తాను. అప్పుడు ఈ సంగతి అందరికి తెలియును. ప్రభువు చెప్పారు గనుక అందరికి తెలియచేయుట నాపనియై యున్నది. అది మీ పనికూడ అయియున్నది.
దీవెన:
ఈలాగున ఆయన పెండ్లికుమార్తె కొరకు ఏర్పాటుచేసిన సన్నిధి గుడారములో మీరు స్థిరపరచబడి, ఏడేండ్ల పెండ్లివిందులో పాల్గొనే ధన్యత పెండ్లి కుమారుడు నేడు మీకు దయచేయును గాక! ఆమేన్.