యేసుప్రభువు చేసిన ఉపవాసము - 2
1తిమోతి 4:1-16; యోహాను 5:17.
ప్రార్ధన:
తండ్రీ! ఈ బలహీన మానవ శరీరమును ధరించుకొని, బలమైన ఉపవాసము చేసిన తండ్రీ! నీ దీక్ష పట్టుదల యెదుట సాష్టాంగపడు చున్నాము. మామిదున్నా ప్రేమచేతనే నీవు అన్నిటినీ సహించి, జయించినావు గనుక వందనములు. మేమును నీ మాదిరిని అవలంభించి, నీవలె జయించుటకు, మాకు కావల్సిన మనో నిదాన ధ్యానము అనుగ్రహించుము. ఈ సమయమును నీ సమయముగా చేసికొమ్ముని యేసు నామమున వందించుచున్నాము ఆమేన్.
యేసు ప్రభువు చేసిన ఉపవాసములో ఒక ముఖ్యాంశము శోధింపబడుట. ఈ వేళ చెప్పవలసిన అంశములు:
- 1) మనో నిదానము,
- 2) ధ్యానము,
- 3) గానము,
- 4) స్నానము,
- 5) లీనము.
- 1) మనోనిదానము లేక నిదానము: ఇది అన్నిటికంటె కష్టమైన విద్య. ఇదిగాని కుదిరితే అన్నీ కుదిరినట్టే.
- 2) ధ్యానము:- ఏ సంగతిని గురించి ఉపవాసముంటిమో, ఆ సంగతి మీదే ధ్యానముంచుట. ఇతర మంచి సంగతులుకూడ రాకుండా చూచుకొనుట. అంటే ఈ వేళ ఏ అంశముమీద ఉపవాసమును గురించి మాట్లడుకొంటే, అది తప్ప వేరొకటి రాకుండా చూచుకొనుట. అలాగు రానిస్తే ఉపవాసముకాదు. అలాగే వేరే మంచి తలంపులు వస్తున్నపుడు చూస్తూ ఉండుట మన ఉపవాసముకాదు.
-
3) గానము:
అనగా ప్రభువును గురించి కీర్తనలద్వారా స్తుతించుట. మనకు స్తుతి, కీర్తనలు తక్కువ. ఎందుకంటే మన
పూర్వికులు
తెలుగు జిల్లాలోని భక్తులు. వారికి స్తుతి కీర్తనలు వ్రాయవలెనను తలంపులేదు. వారు ఎంతసేపు క్రీస్తు
చరిత్ర,
సిలువ మరణ చరిత్రల తలంపు కలిగిఉండేవారు. గానము అనగా స్తుతిచేయుట. ఒక బ్రాహ్మణమత గురువు అయ్యగార్మి
బాల్యములో ఒక సలహా ఇచ్చిరి. ఏమిటది? “నీవు చిన్నతనములోనే కవిత్వము ఆరంభించితివి. కవిత్వములో ఎన్నో
తప్పులుండును. అందుచేత తప్పులు పట్టేవారుంటారు. అప్పుడు కష్టాలుంటాయి. అందుచేత దేవుని స్తుతించే
కీర్తనలు
కడితే, దేవుడు తప్పులు పట్టడు. గాని దానిలోని సంగతినిబట్టి సంతోషించును గనుక అట్టి స్తుతి
గొప్పది”
అని చెప్పెను.
"మొదట మనోనిదానము గొప్పది తరువాత స్తుతి గొప్పది. అనగా అన్ని అయిన తర్వాత వందనములు లేక స్తుతి. -
4. స్నానము: స్నానమనగా ఉపవాస
గదిలోనికి
వెళ్లకముందు స్నానము. అనగా శరీరస్నానము చేయవలెను, ఇది మొదటి కార్యము. గదిలోనికి వెళ్ళిన తరువాత
పాపములు ఒప్పుకొనుట, ఇక ముందుకు మరలా పాపము చేయకుండ విసర్జించుట, రక్తముతో కడుగుకొనుట చేయవలెను.
దీనికి
ఆత్మస్నానము అని పేరు.
- (1) బాహ్యస్నానమువల్ల శరీరశుద్ధి
- (2) ఆత్మస్నానమువలన హృదయ శుద్ధియగును. అది బైటస్నానము. ఇది లోపలిస్నానము.
-
5) లీనము: అనగా దేవునితో ఏకమై పోవలెను. దేవునితో ఏకమైపోవలెనంటే
ఏమిటో
తెలిసికొనవలెనంటే
- 1) యోహాను సువార్త 5వ అధ్యాయమంతయు చదువవలెను. అపుడు లీనమైపోవడము బాగా తెలుస్తుంది.
- 2) యోహాను 14, 16 అధ్యాయములుకూడా అంతే. "తండ్రి నేను ఏకమైయున్నట్లు మీరును నేనును ఏకమైయుంటాము" అని ప్రభువు చెప్పి; “ఇప్పుడు మీరు గ్రహించలేరు గాని మీరు అక్కడకు వచ్చిన తరువాత గ్రహిస్తారు” అని చెప్పిరిగదా!
-
3) యెహాను సువార్త 17వ అధ్యాయములో ప్రభువు ప్రార్థన చేసినారు.
- ఎ) తండ్రి తనలో (యేసుప్రభువులో), అసలు తానే తండ్రితో ఏకమైయున్నట్లు, అనగా భూమిమీదికి రాకముందే ఏకమైయున్నట్లు ప్రార్ధించిరి.
- బి) ఇక్కడ మనుష్యుడుగా ఉండియు, తండ్రిలో ఏకమై (లీనమై) ఉన్నట్లు
- సి) ఇక్కడనుండి వెళ్ళిన తరువాత పరలోకములోను తండ్రితో కలిసి పోయినాడు.
- డి) ఇక్కడ భూమిమీద ఉన్నప్పుడు మనిషిగా ఉండియు, మనిషి పక్షముగా ఉండియు, దేవునిలోకూడా ప్రభువు లీనమై ఉన్నాడు.
యేనుప్రభువుయొక్క చరిత్రలోని చిత్రమైన భాగములు.
- 1వ కథ:- అనాదిలోనే ప్రభువును దేవుడును, అనగా తండ్రిలో కుమారుడు కుమారునిలో తండ్రి ఒకటై యుండుట చిత్రము;
-
2వ
కథ:- ఆయన భూమిమీద మనిషైయుండియు, దేవునిలో లీనమైయుండుట మరొక కథ. ఇది భయంకరమైన కథ. మరీ భయంకరం. ఎందుకు
భయంకరము? ఆయనయొక్క 33 1/2సం॥ల జీవితములో రవ్వంతైనా లేక ఇసుక రేణువంతైనా పాపము లేకుండా
- 1) తలంవులోను,
- 2) మాటలోను,
- 3) చూవులోను,
- 4) వినికిడిలోను,
- 5) ప్రయత్నములోను,
- 6) క్రియలోను తండ్రిలోనే ఉండిపోయిరి. వీటిలో ఆయన ఇసుక రేణువంతకూడ తప్పిపోలేదు, ఇదే భయంకరం.
ఇసుక రేణువంత తండ్రిలోనుంచి తప్పితే అంతా సున్న; ఫలం ఉండదు. గాన ఆయన తండ్రితో ఏకత్వం మిక్కిలి భయంకరమైనది. "యేసుప్రభువుతో ఏకమైయుండుటకు కావల్సిన మనోనిదానము ఎట్లు పొందగలము?
- 1) సైతాను ప్రభువును శోధించుచుండగా,
- 2) మరొక దరినుండి లోకము అనగా మనుష్యులు శోధకులుగా ఉండగా, ఆయన తప్పిపోకుండా ఎలాగుండగలడు? అయినను ఆయన తప్పిపోలేదు.
యేసుప్రభువుకు శరీరమున్నది. ఇది ఆదాము హవ్వలదే. అనగా వారిలోనుండి వచ్చిన మరియమ్మదేగదా! ఆదాము హవ్వలు తప్పిపోయినట్లు పాపములో పడినట్లు, మరియమ్మ (క్రీస్తుతల్లి) తప్పిపోయినారు. మరియమ్మ పాపము చేసి ఉండకపోయినను ఆమె ఏదో ఒక రీతిని తప్పిపోయి ఉండును. ఆమె తప్పినట్లు బుజువులు.
- 1) ప్రభువు ఆమెతో “అమ్మా! నాతో నీకేమి పని?” అని అనుటను బట్టి ఆమె తప్పిపోయియున్నారు.
- 2) 'నీ తల్లి, నీ సహోదరులు వచ్చిరి' అన్నప్పుడు, ఆయన నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి, సహోదరులు అన్నారుగదా! దానినిబట్టి వారు లోపములు గలవారు అనేకదా అర్ధము. ఈలాగు ఆమె తప్పిపోయినారు.
- 3) యేసు తల్లి 120 మందితోకలిసి ఆత్మను పొందుటకు వెళ్ళెనుగాని ఆమె పరివూర్జురాలుకాదు.
షరా:- మానవుడు పరిపూర్ణుడు కావలెనంటే అతనికి ఒక పరిపూర్ణుడు కావలెను. మరియమ్మ పరిపూర్ణురాలైతే ప్రభువు ఎందుకు? ఒకవేళ ఆమె పరిపూర్ణురాలైతే అది ఆమెకొరకే గాని, లోకమంతటికి సరిపోయే రక్షణ ఇవ్వలేదు. అందుచేత యేసుప్రభువు రావలసివచ్చెను.
ప్రార్ధన:- తండ్రీ! హెబ్రీ సంఘమునకు కీర్తనలు కావలసివచ్చినప్పుడు ఒక కవీశ్వరుని పిలిచినావు. అతడు కవీశ్వరుడు, రాజులలో రాజు, అనుభవములో గొర్రెలకాపరి. అతనిని నీ ఆత్మతో నింపి కీర్తనలు వ్రాయించినావు. దావీదు ఎప్పటివాడో కాని ఏ కీర్తన చదివినా అది మాకు సంగీతమునకు సరిపోవును. రాబోయే కాలమువరకు అవి సరిపోవును. అట్టి నీ గొప్ప కృప దావీదుకు యున్నది. మాకు వేసవికాలములో మామిడి తోటలో కోయిలలు కూయును. ఇవన్నీ ఇంతకుముందు ఎక్కడున్నవి? అలాగే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క కవీశ్వరుని పిలచి, అతనిని నీ ఆత్మతోనింపి, కీర్తనలు వ్రాయించి అచ్చువేయించినావు.
వంద సం॥ల క్రిందట క్రైస్తవులకు కీర్తనలు అవసరమని చూచినావు. వెంటనే చౌదరి పురుషోత్తము గారిని పిలిచినావు. ఇప్పుడు అందరికీ ఆయన కీర్తనలు రుచిగానున్నవి. కారణమేమంటే నీవు రమ్మంటే వచ్చినాడు, నీవు కీర్తనలు కట్టమంటే కట్టినాడు. చౌదరి పురుషోత్తముగారి కీర్తనలు దావీదు కీర్తనలు, ఐరోపాలోని భక్తులు "వ్రాసిన కొన్ని కీర్తనలు, లూథరుగారు కట్టిన "మాకర్త గట్టి దుర్గము" మొదలగు కీర్తనలు దీవించినట్లు ఇప్పుడు మా కీర్తనలనుకూడా దీవించి ప్రజలకు ఉపకారము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాము.
ఓ తండ్రీ! మా బైబిలుమిషను బోధనుబట్టి కీర్తనలు కట్టుటకు కవీశ్వరులు కావలెను. ఆత్మ పూర్ణులైనవారు, బాగా కవిత్వముగలవారు కావలెను. క్రైస్తవులు ఎంతమంచి కీర్తనలుకట్టినా, హిందువులు ఎగతాళి చేయుదురు గనుక మంచి మాటలతో తప్పులు లేకుండా పాటలు కట్టేవారిని లేవనెత్తుము. ఆకర్షించే శైలితో, ఆకర్షించే మాటలతో, ఆకర్షించే ఆత్మతోను పాటలుకట్టే కవీశ్వరులను నీవు లేవనెత్తుము. లూథరుగారిని పిలిచినట్లు, చౌదరి పురుషోత్తముగారిని పిలిచినట్లు మా జైబిలుమిషనుకు పాటలు కట్టేవారిని పిలువుము.
ఓ తండ్రీ! పాటలేకాదు, పత్రికలు ఇచ్చుట, వ్రాయుట, అవి అచ్చుపడేటట్లు చేయుట ఇవన్నీ నీవు చేయగలవు. నీవు లూథర్ గారిని లేపినావు. మతోద్ధారణ జరిగించినావు. తండ్రీ! నీ రాకడ సమీపమైపోవుచున్నది. ఇక సమయములేదు. గనుక తండ్రీ! పత్రికలు వ్రాసేవారిని, అవి అచ్చుపడుటకు సొమ్ము ఇచ్చేవారిని, తర్జుమాచేసేవారిని లేపుము.
ఓ ప్రభువా! నీవు మాకు బూర ఇచ్చినావు. బూర ప్రసంగములు కొన్ని ఇచ్చినావు. కాని బూరలులేవు, చెప్పేవారులేరు. కాని తండ్రీ! మా కూటస్థులందరు బూరలు సంపాదించుకొని, ప్రతివారు ప్రసంగము చేసేటట్లు నీ కృప దయచేయుము. ఆమేన్.
దీవెన:
ఆలాగున పరిపూర్ణుడైన క్రీస్తు ప్రభువు నేటి దినమున పరిపూర్ణులనుగా మిమ్ములనుచేసి, తనలో లీనము చేసికొని లోకాకర్షణనుండి తప్పించును గాక! ఆమేన్.