నిర్గమకాండము 29 - యాజకుల పవిత్ర సమర్పణ
ప్రార్థన: ప్రభువా! మీరిచ్చు బహుమానమును స్వీకరించుటకు తగిన సమర్పణను మాకు దయచేయుము. మీ కృప ద్వార మమ్మును శుద్ధీకరించుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.
ఆనందము
యాజకుని అభిషేకము ఒక పండుగ లాంటిది. దేవుని టీంలో పనిచేయుట ఒక శ్రేష్టమైన జీవితము. ఈ అద్యాయములో దేవుడు మోషేకు ఉపదేశించుట/ఆజ్ఞపించుట గలదు. దీని నెరవేర్పు లేవీకాండము 8వ అద్యాయములో ఉన్నది. యాజక ప్రతిష్ట యొక్క ప్రధాన ఉద్దేశము దేవుడు వారిని పరిశుద్ధపరచుట.
నిర్గమ 29:43. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును. 44. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను.
అభ్యాసము
యాజకులు ప్రత్యేకముగా నుండుట దేవుని చిత్తమైయున్నది కావున నేటికిని అంగీ అభ్యాసములో ఉన్నది. దేవుని మహిమను కనబర్చు సేవకులకు అలంకారము వారి పరిశుద్ధతయే!
అభిషేకము
క్రీస్తుప్రభుని సంఘాభివృద్ధి నిమిత్తమై ఒక వాక్య బోధకుని బాహాటముగా దైవసన్నిధిలో నియమించునట్టి యొక గొప్పపని. త్రియేక దేవుడగు తండ్రియు, పరలోక పరిశుద్ధులును, దేవదూతలును మన మధ్యకు వచ్చియున్నారను విశ్వాసముతో అభిషేకారాధనలో ఏకీభవించవలెను.
దేవునితో పనిచేయు ప్రతీ అభిషేకము వెనుక దైవశక్తి హస్తము తోడుగానుండును.
దైవసేవలో మన జీవితం ఉపయోగపడునట్లుగా దేవుడు మనకు ప్రత్యేక అభిషేకమును దయచేయును గాక! ఆమేన్.
Read More
దేవుడు పనిచేయు విధానము(ఆపరేషన్స్) , అపవాది తంత్రములు, యేసుక్రీస్తు అను ప్రధాన యాజకుని త్యాగము వలన కలిగిన వాగ్ధాన నెరవేర్పు యొక్క సూత్రమును అయ్యగారు తన రచనలలో ఈ క్రింది విధముగా కనబరిచిరి.
అనాది రక్షణమహాసంకల్పము->దైవ వాగ్ధానము->సమర్పణ->సాతాను ఎదురింపు->నెరవేర్పు->దైవలక్షణ స్తుతి. దేవుడు చేసిన ప్రతీ గొప్ప కార్యము వెనుక తన దైవలక్షణము బైలుపడును. ఈ అద్యాయములో దేవుడు యాజక సమర్పణ కొరకు వాగ్ధానము చేయుచుండెను. ఉదాహరణ క్రింది పట్టికలో.
అనాది రక్షణ మహాసంకల్పము | వాక్కు/ఆజ్ఞ | గైకొనుట | దైవలక్షణము |
---|---|---|---|
ఇశ్రాయేలు విడుదల | హోరేబు కొండపై మోషేకు వాగ్ధానము | మోషే అహరోను దైవోపదేశమును ఐగుప్తులో గైకొనుట | సర్వశక్తి |
యాజకత్వము | సీనాయి కొండపై దైవ సూచన | లేవీ 8లో నెరవేర్పు | పరిశుద్ధత |
యాజకుడు దైవాజ్ఞను పొందుకొని దానిని నెరవేర్చుటకు/గైకొనుటకు ముందు సాతాను శోధించును. దైవశక్తిని పొందుటకు మొదట సాతానును ఎదురించవలెను. లేనిచో అహరోను అభిషేక ప్రణాళిక; పైన సిద్ధమగుచుండగా, క్రింద దూడను చేయుటకు లొంగిపోయినట్లు సర్వశక్తిని ఆశ్రయించనివారగుదుము. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను ప్రతిష్టించు సమయములో ఒక్క యూదా ఇస్కరియోతు తప్ప ఎవరును సాతానుకు సందు ఇవ్వలేదు(యోహాను 13). తర్వాత ప్రభువు శిష్యులను వాక్యాభిషేకములో ప్రతిష్టించెను(యోహాను 14,15,16,17 అద్యాయములు).
అభిషేక ఆరాధన
బైబిలుమిషను అభిషేక ఆరాధన లోని ప్రతిజ్ఞతో కూడిన ప్రార్థన:... ఈ మిషను పనిని సర్వలోక రాష్ట్రముల పరిశీలనా దృష్టియెదుటను అన్నిమిషనుల విభేధముల దృష్టిపథము యెదుటను, అంధకార రాజ్యముయొక్క ద్వేషభావనేత్రములయెదుటను, సంఘము యొక్క ఆమోద ముఖబింబము నెదుటను, నీ వాగ్ధానసిద్ది కనుబరచుచు సాగింతునని ముందుగానే నమ్మి నీకు వందనము లాచరించుచున్నాను. ఆమెన్.
పైన ఇవ్వబడిన ప్రార్థనలోని అంశములు లోతుగా ధ్యానించి, గైకొనుటకు ప్రభువు తగిన శక్తిని దయచేయును గాక! ఆమేన్.
పదజాలము:
గైకొనుట: దేవుని పిలుపునుబట్టి దైవాజ్ఞను స్వీకరించి(భాద్యత వహించి) దైవ చిత్తానుసారముగా క్రియజరిగించుట - యాజకత్వము.
నెరవేర్పు: దైవాజ్ఞను దేవుడే తన సృష్టి, ప్రజల వల్ల జరిగించుట. యాజకుడు దైవాజ్ఞను గైకొనుట వలన జరిగిన అద్భుత క్రియ.
వధువు సంఘ విశ్వాసికి దేవుడిచ్చిన బహుమాన అభిషేకము - ప్రకటన 3:5. జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
ఆనంద తైలముతో నిన్ను - అభిషేకించి యున్నాను = స్నానము ప్రభు భోజనము ప్రజలకు - జరుపుట సరియని అనుచున్నాను || మనో ||
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet