నిర్గమకాండము 17 - బండనుండి నీరు



ప్రార్థన: మా రక్షణ కొరకు సిలువపై శ్రమపొంది మాకు జీవజలమును దయచేయుచున్న దేవా! దప్పిగొనుచున్న ఆత్మలను మీరే సేదదీర్చుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

పరిచయము

ఇశ్రాయేలు(దేశము=ప్రజలు) ఐగుప్తులో ఉన్నపుడు దేవుడు తప్పక విడిపించునన్న విశ్వాసముతో దేవునికి బహుగా మొరపెట్టినది. ఇప్పుడు దేవుడే దగ్గరుండి నడిపించుచుండగా నమ్మిక(విశ్వాసమునకు కార్యరూపము) కలిగి ఆయన చెప్పిన త్రోవలోనే నడుచుచుండిరి. అయినను వారు అడుగడుగున శోధనలలో పడి, వెనువెంటనే దైవకార్యము చూచుట జరుగుచుండెను. ఇశ్రాయేలు ఇన్ని అద్భుతకార్యములు చూచినందున దేవుని విశ్వసనీయతకు (Trust in God) తలవంచాలి, కాని "ఇశ్రాయేలు ఐగుప్తులో సమాధులు లేవా? అని సణుగుచుండిరి". యోసేపు తన యెముకలను కూడ ఐగుప్తులో ఉంచవద్దన్నాడు; హెబ్రీయులు మరలా దాసత్వమును కోరుకొనుట దేవునికి విచారము. దేవుడు శిక్షించాలనుకొంటే అక్కడే చంపివేయవచ్చు కదా! అను ముసలి(80% అంతా 80 దాటిన వారే) మూలుగుతో గొణుగుచున్నారు. సణుగు అనునది బలహీనపర్చు ఆత్మ.

చాడీలు చెప్పేవారివద్ద శక్తి ఉండదు, చాడీలు వినేవారివద్ద భక్తి ఉండదు - యం. దేవదాసు అయ్యగారు.

సాతాను అమాలేకీయ ఆత్మకు తోడై వారి విజయము కొరకు వీరిని బలహీనపర్చునట్లు కుతంత్రముతో సణుగుడు అను వల విసిరినది. అయితే దేవుడు ముందుగా సిద్ధపర్చిన "రక్షణ బండ" వారికి "అండగా" నుండెను.

మోషే కర్రతో బండను కొట్టుట

దేవుడు ప్రేమాస్వరూపి. భూమిమీద అన్ని జీవరాసులను మిక్కిలి ప్రేమించెను. ఇశ్రాయేలును బహుగా ప్రేమించి అన్ని సదుపాయములను మార్గములో ఉంచెను. అయితే ఇశ్రాయేలు దేవుని ముఖముపై ఉమ్మువేసినట్లు నిందలు వేసినా గాని దేవుడు వారిని వెంబడించి సేదతీర్చుటకు కదిలి వచ్చెను.

1 కొరింథీ 10:4. అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.

ఇక్కడ గమనించవలసిన కొన్ని ధ్యానాంశములు:

మొదటి యుద్దము

క్రైస్తవునికి, అమాలేకీయ దురాత్మకు తరతరములవరకు యుద్దము కావున, ఆ అమాలేకీయ దురాత్మను అంచనా వేయుటకు దాని లక్షణములను గమనిద్దాం.

నిరంతర యుద్దము

అమాలేకీయ ఆత్మ సంఘమునకు ముళ్ళులాంటిది కావున ఆ ముళ్ళును విరచుటకు దేవుడు గొప్ప నామముతో బైలుపడెను. యెహోవా నిస్సీ(దేవ సహాయము) ఎల్లప్పుడు మనమద్య ఉండును కావున సంఘమునకు జయము. శ్రమలు లేక మహిమ లేదు కావున దేవుడు సంఘమునకు శ్రమనిచ్చి పరీక్షించునపుడు నీరస పడక(బలహీనపడక) దేవుని బలము(నిస్సీ) తట్టుచూచు కృపను ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్.

జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 17 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter