నిర్గమకాండము 39 - గుడారము, వస్త్రముల పూర్తి



ప్రార్థన: ప్రధాన యాజకుడవైవ ప్రభువా! మేము మీ లక్షణములను ధరించి మీ సాక్ష్యులుగా ఉండుటకు, మీ ప్రణాళికలో ఉన్న సేవకు ఉపయోగకారులుగా ఉంచుమని, మీ సమీపమునకు చేరినకొలది మాకు దీనత్వమును, సాత్వికమును అనుగ్రహించి, మీయందు భయభక్తులతో మీ పనిని చేయుటకు మీ కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

నిర్గామకాండము 28వ అద్యాయములో దేవుడు యాజక వస్త్రముల కొరకు ఆజ్ఞాపించెను. నిర్గామ 28:2. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.
3. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.
4. పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.

ఈ అద్యాయములో ఆ పని నెరవేరినది. యాజక వస్త్రమునకు గల విశిష్టతను ఈ క్రింది పట్టికలో క్లుప్తముగా ఇవ్వబడినది.

వస్త్రము సూచన - చేసినది కారణము/వివరము
ఏఫోదు నిర్గమ 28:12 - నిర్గమ 39:7 ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రతినిధిగా దేవుని వేడుకొనుటకు
న్యాయవిధాన పతకము నిర్గమ 28:30/నిర్గమ 39:9 ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించుటకు
నడికట్టు(రోబ్) నిర్గమ 28:35 /నిర్గమ 39:29 యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు
అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడుటకు
పాగా నిర్గమ 28: 38/నిర్గమ 39:27 పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను(యాజకుడు) భరించుటకు

ఇప్పుడున్న యాజకులు నూతన నిబంధన పరిచర్యలు కొనసాగించుచున్నారు.
1 కోరింథీ 12:5 మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.
ఎఫెసీ 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
ప్రకటన 2:19 నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగు దును.

ఈ పరిచర్యలన్నియు దిగువ ఇవ్వబడిన సువార్తలను ఆధారము చేసుకొని కొనసాగుచున్నవి.
Gospel దేవుడు యాజకునికి పెట్టిన భాద్యత చాలా పెద్దదిగా కనబడుచున్నది.
యాజకుడు అనుదినము ఎన్నో విన్నపములతో దైవసన్నిధికి చేరుట ప్రపంచములో ఉన్నతాధికారుల కష్టము కంటే ఎక్కువ పని. 12 గోత్రములను 4 రకములుగా(లేతపచ్చములు, వాటిపై విడివిడిగా పేర్లు; రత్నములు, వాటిపై విడివిడిగా పేర్లు) మోయవలెను. సువార్త పనిలో కూడ అన్ని మినిస్ట్రీస్ లో ఉన్న విశ్వాసులను యాజకుడు భరించవలెను.

1. అన్ని సువార్త సమూహముల కొరకు ప్రార్థించుట (ఎఫోదు)
2. అన్ని మిషనులను భరించుట, దేశ క్రైస్తవ న్యాయవిధిని తెలుసుకొని గౌరవించుట (పతకము)
3. తన్ను తాను కాపాడుకొనుట (నడికట్టు)
4. పరిశుద్ధవాక్యమును వివరించుటకు అప్పుడప్పుడు లోకవిషయములు బోధను/సంఘమును తాకును. ప్రసంగ అపవిత్రతను కరెక్ట్ చేసుకొనుటకు దైవభారమును యాజకులు పాగాగా ధరించుట. చెడుగు/సణుగు/చాడీలకు చెవినిచ్చిన అపవిత్రత కొరకైన మారుమనసు. అపవిత్రతను సమర్థింపకుండుట(పాగా)

క్రొత్తనిబంధనలో గల ఆన్ని సువార్తలు క్రీస్తువద్దకు నడిపించును కావున యాజకులు దేవుడు తమకు అనుగ్రహించిన సువార్తను పట్టుకొని ప్రభువులో కొనసాగుట మేలు. మిగిలిన సువార్తలను భరించుట వారి ఆత్మీయ జీవితమునకు పునాది.

ప్రస్తుతము అంగీ అవసరమా? కోమలియైన ఒకామే 12 ఏండ్లనుండి రక్తస్రావముతో ఉన్న బాధను ప్రభువు అంగీ అంచు స్వస్థపరిచెను. ప్రభువు అంగీని చీట్లు వేసుకొని పంచుకొన్నపుడు అంగీ ఏ ప్రభావము చూపలేదు.

ప్రభువు సిలువపై రక్తమునే అంగీగా ధరించెను, ఆ రక్తమునకు విలువ. దేనిలోనైన ప్రభువు ఉంటే దానికి విలువ, ప్రభావము చూపును. యాజకుడు ప్రభువును ధరించి, వస్త్రపు అంగీని ధరించినచో అంగీకి విలువ. అయ్యగారు ప్రకటన 19 లో అంగీ గురించి వివరించిరి.

43. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.

ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చిత్తానుసారముగా జరుగు సేవను దీవించి ఆశీర్వాదించును గాక! ఆమేన్.




జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 39 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter