నిర్గమకాండము 28 - యాజక వస్త్రములు
ప్రార్థన: ప్రభువా! మేము మీ యందు నిసించునంత కాలము మంచి క్రియలతో మమ్మును అభిషేకించుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
1. పరిచయము
ఈ రోజు నుండి దేవుని బృందమును(God's Team) ప్రతిష్టించుట కొరకు దైవాత్మ పూర్ణులు చేయు దైవపనినిగూర్చి వివరింపబడినది. దైవజనాంగము, వారు ఆరాధించుటకు ఉన్న మందిరము ఒక ఎత్తైయితే, దేవుని సముఖమున సేవచేయు యాజకుని ప్రతిష్ఠత కూడా అంత ముఖ్యమని దేవుడు ఈ అద్యాయములో ప్రత్యక్షపరిచెను. అంతకుముందు యాజకుడు అవసరమును బట్టి కనిపించుచుండెను కాని ఇప్పుడు దేవుడు యాజకధర్మమును దైవవృత్తిగా(సంపూర్ణ సమర్పణ) అభిషేకించెను.2. దేవుడు అహరోనును పిలుచుట
యాజకత్వము జన్మ హక్కుగా వచ్చునా లేదా దేవుని పిలుపు వలన కలుగునా? లేదా మన ఇష్ట ప్రకారము స్వసమర్పణతో చేయవచ్చునా?
యాజకత్వమునకు 1. జన్మ హక్కు 2. దేవుని పిలుపు; ఈ రెండూ అవసరమని ఇక్కడ తెలియుచున్నది. జన్మ హక్కు, దేవుని పిలుపు; బండికి రెండు చక్రముల వంటివి. దేవుని కార్యములు తరము వెంబడి తరమునకు ఆయన చేసిన వాగ్ధానమును బట్టి ఉండును. పితరులతో దేవుడు చేసిన వాగ్దానమును బట్టి ఆ సంతానములో ఒకరిని దేవుడు పిలుచును. జన్మతః యాజకుడైనను దేవుడు పిలవకపోతే స్వయిష్టముతో యాజకత్వము చేయుటకు వీలులేదు. దేవుడు ఏలీ కుమారులను తీసివేసి సమూయేలుకు యాజక హోదా నిచ్చెను.
దేవుడు మోషేను పిలిచినపుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని మాత్రమే చెప్పక నీ తండ్రి దేవుడను అని చెప్పుటవలన దేవుడు అమ్రామునకు వాగ్దానము చేసెనని అర్థమగుచున్నది. అమ్రాము మొర విన్న దేవుడు అహరోనును మోషే వద్దకు పంపెను. శరీరానుసారులైన కోరహు కుమారుల వాదన ఏమనగా, మేము ఇప్పుడు ఎవరి బానిసత్వములోని లేము; దేవుడు మిమ్మలనే ఎన్నుకొనెనా? అని. అవును దేవుడు మోషే, అహరోనులను ఎన్నుకొనెను. వారే ఫరోను ఢీకొట్టిరి.
పితరులకు దేవుడిచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు ఈ తరములో దేవుని ఆత్మ పిలిచిన యెడల నిర్లక్ష్యము చేయరాదు. మన కాలములో దేవుడు అందరిని యాజకులుగా యేసు అను బండమీదికి పిలుచుచున్నాడు.
1 పేతురు 2:4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై,
5. యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
3. యాజక వస్త్రములు
దేవుని పిలుపు ఒక్కొరికి ఒక్కొక రకముగా ఉండును; ఎవరి పిలుపు వారిది. ఇక్కడ దైవాత్మ పూర్ణులైనవారిని యాజక వస్త్రములు చేయుటకు పిలిచెను. ఇదియు దేవుని సేవయే. 1 కొరింథీ 12.
యాజక వస్త్రము దైవాధికారమునకు, ప్రజలకు న్యాయము తీర్చుటకు, దైవప్రజల ప్రాతినిధ్యమును తెలియజేయుటకు, వారు ఏ పునాదిపై కట్టబడినవారో గుర్తుచేయుటకు ఆయా వస్త్ర భాగములను కూర్చిరి.
నేటి యాజకులు తమ సంఘ వాగ్ధానమును, పునాదిని మాటిమాటికి వెలుగులోనికి తెచ్చువారిగా ఉండవలెను - నిత్యనిబంధన.
4. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు
- పాగా, బంగారు పరిశుద్ధ ముద్ర - ప్రభువు జీవితము = దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని తన ద్వారా ప్రత్యక్షపరిచెను. ప్రభువులో జీవించుచున్న మనకు ఆయన పరిశుద్ధతయే పాగా.
- వస్త్రములు - ప్రభువు కార్యములు = మహత్కార్యములు, సత్క్రియలు, దైవ నీతి, సంఘ సేవ మనకు వస్త్రాలంకరణలు.
- భుజఖండములు - ప్రభువు రాజ్యము = భారమును తన భుజస్కందములపై మోయుచుండెను. దైవరాజ్యమును వెదికి దానిలో ప్రవేశించి సుళువైన ప్రభువు కాడిని మోయవలెను.
- నడికట్టు - ప్రభువు విజయము = సదాకాలము మనతోనున్న ప్రభువు ఈ లోకమును జయించెను.
- న్యాయవిధాన పతకం - ప్రభువు రక్షణ = ఆత్మలను పట్టి రక్షించుట. జీవ వాక్యమను పునాది రాళ్ళ మీద తన సంఘమును కట్టెను.
- ఊరీము తుమ్మీము - ప్రభువు సిలువ = మరణము వరకు చూపిన ప్రేమ సంఘ సహవాసమును కట్టి ఉంచును
- ఎఫోదు - ప్రభువు నూతన నిబంధన = మనలను చక్కగా నిలబెట్టును. క్రైస్తవ సంఘ విజయ చిహ్నం.
- బంగారు గంటలు - ప్రభువు సంఘములు = సర్వలోక సువార్త.
- బంగారు దానిమ్మ పండ్లు - ప్రభువు వాక్యము = అధిక సత్యవాక్య విత్తనములిచ్చు దానిమ్మ పండ్లుగా ప్రపంచములో పెరుగుచున్నవి. ఆయనను గూర్చి సిగ్గుపడవలసినది ఏదియు లేదు.
- దీర్ఘకాల మన్నిక - ప్రభువు నిత్యజీవము = నిత్యమైన పరలోకమును అనుగ్రహించును.
ఘనతయు కీర్తియు గలుగును నీకు - గానము చేయుము గానము చేయుము = వినయమును భూషణముగ దాల్చి - ఘనపర్చుము నా నామమంతట || మనో ||
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet