నిర్గమకాండము 15 - దేవునికి స్వతంత్రారాధన
ప్రార్థన: కృతజ్ఞతార్హుడవైన దేవా! మమ్మును రక్షించుచున్న దేవా! మీకు వందనములు. ఆనాడు ఇశ్రాయేలీయులంతా ఏకస్వరముతో, ఏక హృదయముతో మిమ్మును ఆరాధించినట్ట్లు మేమందరమును ఏకమనసుతో మిమ్మును అరాధించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ ఆమేన్.
1. చారిత్రత్మక కీర్తన
నిర్గమ 15:1-19 ఎర్రసముద్రము దాటిన ఇశ్రాయేలు తరములో మొదటిసారి ఆనందముతో ఈ కీర్తన పాడిరి. ఈ అద్యాయములోని కీర్తన ఒక దేశ జాతీయగీతమంత చరిత్ర కలిగినది. ఇశ్రాయేలు ఎర్రసముద్రము దాటిన వెంటనే ఉబికిన సంతోషం, వారి మహా శ్రమలవలన లోతుగా త్రవ్వచుండబడిన పునాదిలో నుండి ఉవ్వెత్తున ఎగసిపడిన మంచినీటివలే వీరిని సేదదీర్చినది. ఈ కీర్తన వారి హృదయాంతరంగములోనుండి వచ్చినది. ఈ కీర్తన, వారు అద్భుతముగా గట్టెక్కినందుకు క్షణికానందముతో కాక; దేవుని ఉనికి ఉన్న అన్ని కాలముల, అన్ని జనాంగముల హృదయములను పసిగట్టి పాడిన వాగ్ధాన సహిత కీర్తనగా పేర్కొనవచ్చు. ఈ అద్యాయములోని కీర్తనను డైరెక్ట్‌గా చదివి ధ్యానించుట మంచిది. దానిని ఏ వివరణ ఇచ్చినను దాని పరిమళము(flavour) తగ్గించినట్లే.2. మొదటి మహిళా హక్కు: దైవారాధన
నిర్గమ 15: 20, 21 ఏక హృదయముతో, ఏకకాత్మతో అందరినుండి వచ్చిన కీర్తనను మిర్యాము స్త్రీల మద్య వాయిద్యములతో, నాట్యములతో ఆనందించెను. ఇక్కడ మిర్యామును దేవుడు గుర్తుచేయుట తన 90సం.ల నిరీక్షణ ఫలము. మిర్యాము చిన్నప్పుడే ఎంతో దైర్యముతో మోషేను నదిలో కాయుట మాత్రమే కాకుండా, రాణితో మాట్లాడతెగించెను. ఇశ్రాయేలు దేశము ఏర్పడిన వెంటనే మొదటి హక్కుగా స్త్రీలకు "స్వేచ్చగా దేవుని ఆరాధించు స్వాతంత్ర్యమును" దేవుడు ఇచ్చెను.3. క్రీస్తు ప్రభువే మన జీవిత సారము
నిర్గమ 15:22-25 ఇశ్రాయేలు దేశము(ప్రజలు) రాజరికమో, ప్రజాస్వామ్యమో కాదని అది దేవరాజ్యము (theocratic) అని గత ధ్యానములలో తెలుసుకొన్నాము. దేవుడు తన ఆజ్ఞలచేత నడిపించును. శోధనలు, శ్రమలు వచ్చినను ఆయన ఘనకార్యమును చేయును కావున నిరీక్షణను కోల్పోవుట దైవ ప్రజలకు తగదు. దేవునికి మొరపెట్టి, ఆయన చూపిన పరిష్కారమును చేయుట దేవుడు వారికి నేర్పించెను. మనిషి బ్రతికి ఉన్నంత కాలము మానవనైజము ఉండును కావున వాక్యమును ఆనుకొని జీవించుట ఏకైక పరిష్కార మార్గము. చేదైన జీవితమును మంచిగ మార్చగల ఏకైక శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే.4. దైవాజ్ఞానుసారమైన జీవితము
నిర్గమ 15:26-27 దేవుడు మొదటిసారి "యెహోవా రాఫా" అను తన క్రొత్త నామము/లక్షణమును వెల్లడించెను. ప్రభువు ఈ లోకమునకు వచ్చినపుడు సువార్త పని నిమిత్తము 12మంది శిష్యులను ఏర్పాటు చేసుకొనుట ఆ తర్వాత 70మందిని నియమించుట సంపూర్ణ స్వస్థతను అందించుట స్వయముగా తానే చేసెను. దేవుని మాట శ్రద్ధగా విని అనుసరించిన యెడల; మన జీవితములో ఆరోగ్యము, స్వస్థత, సమృద్ధి ఉండును.విశ్వాసి ఎట్టి బంధకములలో(బాధ/శ్రమ/వ్యాది) ఉన్నను, చివరికి దేవుడు సంపూర్ణ విడుదల కలుగజేయునని ఈ నిర్గమకాండ చరిత్ర చెప్పుచున్నది.
దేవుడు మన జీవితములో స్వతంత్రతా సమృద్ధిని కలుగజేయును గాక!
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
పరిచయం |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
10 |
11 |
12 |
13 |
14
15
16 |
17 |
18 |
19 |
20 |
21 |
22 |
23 |
24 |
25 |
26 |
27 |
28 |
29 |
30 |
31 |
32 |
33 |
34 |
35 |
36 |
37 |
38 |
39 |
40 |
తైలాభిషేకపండుగ
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet