నిర్గమకాండము 40 - గుడారము షెఖీనా మేఘముతో నింపబడుట



ప్రార్థన: సర్వోన్నతుడా! సర్వ శక్తిమంతుడా! మీకు వందనములు. మీ సృష్టి నమూనాను మాకు మరలా చూపి; మాకు అవసరమైనవి సృష్టించుటకు భక్తులకు తెలివిని దయచేసిన ప్రభువా! మాకు నేడు మీ సన్నిధి దూతను మా వృత్తి అంతటిలో తోడుగా ఉంచుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

చిరాకు, చింత, సణుగు, మాటిమాటికి చావును గుర్తుచేసుకుంటూ మొదలైన ఇశ్రాయేలీయుల ప్రయాణము ఒక్క సంవత్సరములో రూపురేఖలు పూర్తిగా మారిపోయి సంతోషముతో, సమర్పణతో, నైపుణ్యతతో మనఃపూర్వకముగా దేవుని సేవించిరి. ఐగుప్తులో పెద్ద కట్టడములు బానిసలుగా కట్టిరి. ఇక్కడ ఆశ్చర్యకరమైన, ఏకైక జ్ఞానముతో కూడిన ప్రత్యక్ష గుడారము స్వతంత్ర దేశములో నిర్మించిరి. ముఖ్యముగా తాము నిర్మించిన మందిరములో దేవుని మహిమను చూచిరి.

కొలిచి చూడగా ప్రతీ పనిలో దేవుని నమూనా, దైవ క్రమమే కనిపించినది. ప్రారంభమునుండి నేటి వరకు విశ్వాసి/సంఘ స్థితి దేవుడు బైలుపరిచిన క్రమములో అబివృద్ధి చెందినదా! దేవునికే మహిమ.

ఇక్కడ రెండు విషయములున్నవి, 1. ప్రత్యక్షగుడారము 2. యాజక వస్త్రములు. ఈ రెండునూ శరీర సంబంధమైనవే. అయినను దేవుడు వీటిని ప్రతిష్టించెను, మందిరములో నివసించెను. దీనిని బట్టి తెలుసుకొనవలసిన విషయమేమనగా ఆత్మ శుద్ధికి ప్రతిఫలము శరీరశుద్ధి. మన శరీరమును/సంఘమును ప్రభువు చెప్పిన క్రమములో నిర్మించుట తధ్యమైయున్నది. మందిరము, ఆవరణముల శుద్ధి ప్రాముఖ్యమైయున్నది.

ఉదా: ఒక పెద్ద పాష్టరు గారు ఒకసారి "చెప్పు" ప్రసంగము చేసిరి. స్టేజ్ ఫుల్‌పీఠ్ మీద తన బూటు చూపి మళ్ళీ కాళ్ళకు వేసుకొనిరి, మందిరములో చెప్పులు వేసుకొనుట తప్పుకాదని డెమో చేసిరి. వారు చెప్పిన చక్కని వాక్యము, దేవుడు హృదయములో ఉండును గాని శరీరము మీద కాదు అని సారాంశము. అంత్యక్రీస్తు ఎగ్జాట్‌గా(సరిగ్గా) ఇదే పాయింట్‌తో(కోణంలో) భక్తులను మోసము చేయును.

666 ముద్ర శరీరమునకు మాత్రమే వేయుచున్నాము, ఆత్మకు అసలు సంబంధము లేదని బోధించుట వలన పైన చెప్పిన పెద్ద పెద్ద పాదిరులు అంతిక్రీస్తును సన్మానించి క్రీస్తుస్వరూపియని భావించి శరీరసంబంధమైన ధనమునకు బానిసలగుదురు. జాగ్రత్త అవసరము. హృదయశుద్ధి, మందిర శుద్ధి అవసరము.

హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
యేసు రక్తమువలన కలిగిన విమోచనను బట్టి నూతనముగా పొందిన దైవానుసారమైన మంచి క్రియలు మనకు తెల్లని వస్త్రములుగా ఇవ్వబడును. క్రైస్తవుడు పనిచేయుట మానరాదు. దైవక్రియలే పరలోక అంతస్థును నిర్ణయించును.

దైవగ్రంధములోని దేనినీ కొట్టివేయుటకు వీలులేదు. నెరవేర్చుట ఒక్కటే విశ్వాసికి మార్గము. ఇక్కడ కనిపించిన ధూపస్తంభము, ప్రదీపములు, మందిరము, బలిపీఠము, ఆవరణము అన్నియు మళ్ళీ ప్రకటన గ్రంధములో కనిపించినవి. అందుచేత ఇది నిత్య నిబంధన.

ప్రభువు చెప్పిన ప్రకారము చేయుట వలన షెఖీనా మేఘములో దేవుడు ప్రత్యక్షమాయెను. ఆయన మనతో చెప్పినది చేయుటవలన మేఘారూఢుడై వచ్చుచున్న ప్రభువును కలుసుకొందుము.

ప్రభువు ఆజ్ఞలను నెరవేర్చుట అభ్యసించిన యెడల జీవితములో సమృద్ధి కలుగునని ఈ ధ్యానముల ద్వారా తెలుసుకొన్నాము. మనము రాకడ మేఘమెక్కువరకు ప్రభువు మనకు తోడై ఉండును గాక! ఈ 40 రోజుల ధ్యానములో ప్రభువునందు ఏకీభవించిన వారిని దేవుడు బహుగా దీవించును గాక! దేవుని ఘన కార్యములు చేయుటకు ఘనమైన నైపుణ్యమును దేవుడు మనకు దయచేయును గాక! అందరికి మరనాత!

నీకును నీ సంఘమునకు - నిత్యమును జయము జయము || రక్షకా ||
నీకును నీ శ్రమలకును నిత్యమును - జయముజయము || రక్షకా ||
నీకును నీ నిందలకును - నిత్యమును జయముజయము || రక్షకా ||
నీకును నీ బోధకును - నిత్యమును జయముజయము || రక్షకా ||
నీకును నీ పనులకును - నిత్యమును జయముజయము || రక్షకా ||
నీకును నీ కార్యములకు - నిత్యమును జయముజయము || రక్షకా ||
నీకును నీ సేవకులకు - నిత్యమును జయముజయము || రక్షకా ||
నీకును నీ రాజ్యమునకు - నిత్యమును జయముజయము || రక్షకా ||



జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 40 తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter