నిర్గమకాండము 21 - నైతిక న్యాయ నిషేధాలు
ప్రార్థన: మహా పరిశుద్ధుడవైన ప్రభువా! మీరిచ్చిన ఆజ్ఞలలో ఉన్నతమైన ఆజ్ఞ ప్రకారము నడుచుకొనుటకు సమర్పించుకొని ఆనందించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
ప్రాధమిక అంశములు
పాపము ఏదేనులో దూరముగా, దేహమునకు అవతల ఉన్నది. ఆదాము హవ్వలు దైవాజ్ఞను మీరిన తర్వాత దేహములోనికి పాపము వచ్చినది. నోవాహు కాలం నాటికి మనసులోనికి, హృదయములోనికి వచ్చినది. మోషే కాలములో పాపము ఇంకను ఆత్మకు చేరలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రత్యక్షతకు విధేయులైరి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకమును స్వయముగా దర్శించినప్పటికి పాపము ఆత్మను పట్టివేసినది. క్రీస్తు ప్రభువు అందరి ఆత్మలనుండి పాపమును పరిహరించి తన చెంతకు చేరిన వారిని పరిశుద్ధులుగా చేసెను.ఉపోద్ఘాతము
దేవుడు ఆజ్ఞలను మూడు స్థాయిలలో ఇచ్చెను. 1. ఆత్మపూర్ణులైన వారికి(ఉదా:మోషే,బెసలేలు) 2. నీతిపూర్ణులైనవారికి(ఉదా: యెహోషువ, కాలేబు) 3. భూలోక శరీరానుసారులకు(ఉదా:జనాంగము). మనం ప్రేమించు ఆజ్ఞను బట్టి మన పరలోక అంతస్థు ఉండును.యిత్రో యాజకుని సూచన మేరకు మోషే న్యాధిపతులను నియమించి వారివద్ద నుండి అన్ని రకముల వ్యాజ్యములను సేకరించి అత్యవసర న్యాయ విధులను దేవుని ముందు ప్రస్తావించెను. అయితే వారి న్యాయవిధులు ఇంకా బానిస బ్రతుకులకు సంబంధించినవై ఉండుట దురదృష్టకరము. ఈ అద్యాయములో భౌతిక సంపదకు నైతిక విలువల చట్టములు; కట్టుబడి ఉండవలసిన పద్దతులు, నిషేధాజ్ఞలు రూపింపబడెను. దేవుడు ఆత్మానుసార ఆజ్ఞలనుండి మొదలుపెట్టెను. ప్రజల అత్యవసరముల మేరకు న్యాయాధిపతులు భౌతికమైన వాటితో మొదలుపెట్టిరి.
ఉదా: ఒక ఊరిలో అందరి గుడిసెలు వర్షాకాలములో మునిగి చాలా ఇబ్బందికరముగా మారెను. మంత్రిగారు ఆ వూరు దుర్బర పరిస్థితి చూచి, ఎత్తైన పక్కా డాబాలు, ప్రహారి గోడలు, మంచి రోడ్లు వేయుటకు ప్రభుత్వ యంత్రాంగముతో ఆ ఊరికి వచ్చెను. అయితే ఆ ఊరిలోని జనము గొడవలు గొడవలుగా ఉండెను. వారినందరిని సమావేశపర్చి, పక్కా డాబాల ప్లాన్ వివిరించి ఒక్కక్క ఇంటికి మంజూరు చేసిన అధిక మొత్తమును ప్రజలకు పంచుటకు ఆయత్తపడెను. వెంటనే ఆ వూరి ప్రజలు మొదట మాకు చాలా పెద్ద పెద్ద ప్రోబ్లంస్ ఉన్నాయి వాటిని పరిష్కరింపమని వేడుకొనిరి. ఒకరు నా తాటాకులు వీడు ఎత్తుకుపోయాడు అని, ఒకరు మట్టి కొట్టుకొనిపోవుచున్నది, ఏదైనా అడ్డుకట్ట వేయమని, వాడి దడికమ్మ నా స్థలములోకి రెండించులు వచ్చిందని ... మొదలగు సమస్యలతో మంత్రిగారి పనికి అడ్డుతగిలి యంత్రాంగమును ఉపయోగించుకొనలేకపోయిరి. మంత్రిగారి ప్లాన్ ప్రకారము పోతే వారి సమస్యలు మాయమైపోతాయి కాని వారికి ఆ ఎండిపోయిన తాటాకు మీద ఉన్న ఆశ కంటే ఎక్కువ ఉన్నత స్థితికి చేరే మనసు లేదు.
చట్టముయొక్క బాహ్యరూపము
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నేర్చుకొన్న పద్ధతిని(సిష్టం) విడుచుటకు మనసు లేదు. ఇందును బట్టి వారి మనసు కఠినమాయెను గనుక యేసుప్రభువు మార్కు 10:5 లో చెప్పినట్లు వారి "హృదయ కాఠిన్యమును బట్టి" ఈ విధులకు న్యాయాధికారులకు స్థిరపర్చెను.యోహాను యాకోబు తమ వలలు వదిలినట్లు, పేతురు తన వృత్తిని వదిలినట్లు ఇశ్రాయేలు తమ బానిస మనసును వదలలేకపోవుట వలన వారు వాగ్ధాన దేశము చేరలేకపోయిరి. అయితే దేవుని కోరిక అపోస్తలులు స్థాపించిన ఆది సంఘము అన్నిటిని సమిస్టిగా పంచుకొని సహోదర ప్రేమను చాటుటద్వారా నెరవేరెను.
చట్టముయొక్క అంతరంగ రూపము
సర్వోన్నతుడైన దేవుడు మన అతి చిన్న చిన్న విన్నపములను శ్రద్ధగా విని సమాధానమిచ్చును. దీనిలో దేవుని ప్రేమ బైలు పడుచున్నది. దేవుడు చేసిన ఎన్నో అద్భుతములు చూసిన తర్వాత కూడ; నరహత్యలు, పశునాశనము, పగ/ద్వేషం, దొంగతనములు వంటి పెద్ద తప్పులు చేయు మనసు ప్రభువునకు ఆయాసకరమైనను దీర్ఘశాంతముతో దేశ చట్టమును నిర్మించెను. ఇట్టి రాజ్యాంగము క్రీస్తు శకములో అన్నిదేశములకు అవసరమైనది కావున మొదట ఇశ్రాయేలు దేశమునకు ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. సత్యము, ప్రేమ, జీవమును ప్రేమించి వధువు సంఘవరుసలోనికి వచ్చు వారు దేవుని పరిశుద్ధాజ్ఞకు లోబడి దైవ ఉనికి కలిగిన సంఘములో ఫలించుట ద్వారా శరీర ఆజ్ఞాతిక్రమమునకు, భౌతికాశీర్వాదములకు పరుగు పెట్టరు.ప్రభువా! మీ సంకల్పములోనున్న ఘనకార్యములపై మనసు నిల్పి మిమ్మును మహిమ పర్చు హృదయమును దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్. మరనాత!
అనాటి సంఘటన:
ఒక భక్తుడు పొలము విషయమై దేవదాసు అయ్యగారి ప్రార్థన కొరకు వెళ్ళెను. అక్కడ కూటము జరుగుచున్నది. అయ్యగారి వర్తమానము విని దేవుని స్తుతించుచు ఇంటికి వచ్చి అందరికి అక్కడ జరిగిన దైవ కార్యములను గూర్చి సాక్ష్యమిచ్చెను. అయ్యగారు పొలము విషయమై ఏమైనను చెప్పిరా అని అడిగినపుడు, అయ్యో ఆ విషయము ఇప్పటివరకు గుర్తుకు రాలేదని బదులిచ్చెను. పరలోక మహిమ ముందు పొలము వెనక్కి పోయినది.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
పరిచయం |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
10 |
11 |
12 |
13 |
14 |
15 |
16 |
17 |
18 |
19 |
20
21
22 |
23 |
24 |
25 |
26 |
27 |
28 |
29 |
30 |
31 |
32 |
33 |
34 |
35 |
36 |
37 |
38 |
39 |
40 |
తైలాభిషేకపండుగ
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet