నిర్గమకాండము 27 - బలిపీఠము - ఆవరణము



ప్రార్థన: లోకపాపములను మోసుకొనిపోయి, సిలువపై పరిహరించిన ప్రభువా! మీకు వందనములు. మీ చిత్తములో ఉన్నది మేము గైకొనుటకు మా ఇష్టమును మీకు సమర్పించుచున్నాము. మమ్మును అంగీకరించుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

1. పరిచయం

జలప్రళయమునుండి కాపాడి, శాకాహారమునకు తోడుగా మాంసాహారమును కూడ తినవచ్చునని దేవుడు సెలవిచ్చన తర్వాత మొట్టమొదటి సారిగా నోవాహు దేవునికి బలిపీఠమును కట్టి అర్పణను సమర్పించెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు మోషే కూడ ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టెను. ఇవన్నీ స్వేశ్చార్పణలు. అయితే ఇక్కడ దేవుడు సమర్పణ, పాప పరిహారార్థమై ఒకే ఒక్క బలిపీఠము కట్టమని అదేశించెను. మోషేకు ముందున్న భక్తులు బలిపీఠము వరకు వచ్చిరి. మోషేను దేవుడు సింహసన మహిమ వరకు తీసుకొని వెళ్ళెను.

2. బలిపీఠము

బలిపీఠము అనగా అర్పణలు అర్పించు స్థలము. మన మంచినైనను, చెడునైనను వదిలివేసి దేవుని చిత్తమునకు లోబడి నమస్కరించు మనోనిదానము అను మొదటి మెట్టు.


బలియర్పణ రెండు రకములు
Section A. దేవునికి ఇంపైన సమర్పణ
1. దహనబలి - త్యాగం; దేవుని పనికొరకు సంపూర్ణ సమర్పణ. వీరు నీతి క్రియలు అను వస్త్రము ధరించుదురు.
2. నైవేద్య హోమము - (గోధుమ)పిండి అర్పణము. మత్తయి 6:16. సత్క్రియ లతో దేవుని మహిమపరచుట. జీవిత త్యాగములతో కూడిన క్రైస్తవసంఘ ఘనకార్యములు
3. సమాధాన బలి - సువార్త సమర్పణ. మార్కు 16:15-20; అపొస్తలుల కార్యములు.

ప్రకటన 8:3 మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. ఎన్ని కష్టములు వచ్చినను, ప్రభువును ఇష్టముతో ఆరాధించుట, పాపంలో పడకుండుట దేవునికి ఇంపైన బలియర్పణ.

Section B. దేవునికి ఇష్టములేని పరిహారార్ధబలి.
4. పాపపరిహారార్థబలి
5. అపరాధ పరిహారార్థబలి

Section B లోని బలియర్పణ, చేసిన పాపముల ప్రాయచిత్తం. ఈ బలియర్పణలు(ఆదాయం) పెరిగినవి అనగా పాపములు పెరిగినవి అని అర్థం. శరీరాత్మ గల యాజకులకు పాప పరిహారార్థబలి ఆకర్షణీయముగా మారినది. ఇది మతము యొక్క సకల దుర్వ్యాపారమునకు కారణమగుట చేత యేసుప్రభువు ఒక్కసారే వీటిని సిలువపై కొట్టివేసెను.

అయితే విశ్వాసి నీతిక్రియలు, సత్క్రియలు, సువార్త పని విరివిగా చేయుటయను అర్పణలు దేవునికి ఎప్పటికి (రాకడ వరకు) ఇంపైన సువాసనగా నుండును. పాపము చేసి పరిహారార్థ బలి తప్పక ఇచ్చుట కంటే పాపము చేయక, దైవ క్రియలలో తమ అర్పణను వాడుట దేవునికి ఇష్టము.

పత్రికల గ్రంథములలో బలిపీఠము దగ్గర అర్పణలను పాప పరిహారార్థ "క్రియలుగా" పేర్కొని, నిషేధించుట వలన పెద్ద చిక్కువచ్చినది. "క్రియల వలన రక్షణ లేదు" అను గందరగోళమును నేడు అంతర్జాతీయ సువార్తికులు బోధించుచున్నారు.

యోహాను 6:29. యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.
మార్కు 16:15-20 వరకు గల వాక్యములను బట్టి బలిపీఠము సిలువ వద్దకు చేరి ఈ "బలియర్పణ క్రియలు"; సత్క్రియలు, నీతిక్రియలుగ రూపాంతరము చెందినవి. కావున క్రైస్తవుడు సత్క్రియలు, దైవచిత్తములో ఉన్న నీతి క్రియలు చేయుట మానరాదు అని తెలియబడుచున్నది.

పాప పరిహారార్థ బలి మహా పాపముగా మారిన విధానము:
ఒక్కడై ఉన్న దేవుని కల్వరి సిలువకు గుర్తుగా దేవుడు చెప్పిన ఏకైక బలిపీఠము చాలక సొలోమోను బంగారు బలిపీఠమును కట్టించెను. అప్పటినుండి బలిపీఠములు రాజుల గొప్పతనమును చాటుటకు కొలమానముగా మారిపోయినవి. చివరికి ఈ బలులు మందిరములో యేసుక్రీస్తు ప్రభువును గుర్తించలేని అంధకార పాపములో కూరుకొని పోవుటకు కారణమగుటచేత ప్రభువు వారిని తరిమివేసెను.

కోరహు తిరుగుబాటు వరకు బలిపీఠము తెరిచే ఉన్నది కాని కోరహు అవిధేయతనుబట్టి నాశనమైనప్పుడు అతని ఇత్తడి సామాగ్రి మూతకొప్పుగా మారెను. సిలువ సువార్త చేపట్టిన దైవజనుని పట్ల మన అవిదేయత పాప ప్రాయచిత్తమునకు అడ్డంకిగా మారును.

3. ఆవరణము

బలిపీఠము, మందిరమునకు ఆవరణము కూడ ఏర్పర్చుట మొట్టమొదటిసారిగా ఇక్కడే ఉన్నది.

మనము ఎక్కడున్నను దేవుని మాటలు చెప్పుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ, దైవ ఉనికిలో ఆనందించుటయే దేవుని ఆవరణములో నుండుట.

4. నిత్యమైన కట్టడ

నిర్గమ 27: 20. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము.
21. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.

ఈ అద్యాయములో గల ప్రాముఖ్యమైన విషయము: నిత్యము దీపము(అనగా ఆత్మ) వెలుగునట్లు శ్రేష్టమైన నూనెను (అనగా విశ్వాసం) సిద్ధము చేయుట. ఇది నిత్య నిబంధన కావున బుద్ధిగల కన్యకలవలే ఎల్లప్పుడు సత్యవాక్యమును సూక్ష్మముగా ధ్యానించెదము (దంచెదము) గాక!

మన హృదయంలో నివసించు వాక్యమను సిద్దెలలో, విశ్వాసమను నూనె పోసి, ఆత్మ అను దీపమును కాపాడుకొనుచు ప్రభువును ఎదుర్కొనుటకు మెళకువ కలిగి జీవించుదుము గాక!

తనువునాదిదిగో గై - కొనుమీ యో ప్రభువా నీ - పనికి ప్రతిష్టంపు
మీ = దినములు - క్షణములు - దీసికొని యవి నీదు వినుతిన్ ప్రవహింపజే - యను శక్తినీయుమీ



వాక్య పరిశీలన

ఆవరణము - ఇతర వాక్యాధారములు:
జెకర్యా 3:7 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువ బడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.

లూకా 11:21 బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.

ప్రకటన11:2 ఆలయ మునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను.

84:10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.

క్రింది వాక్యాధారములో బలిపీఠమా బలిపీఠమా అని 2 సార్లు రావడము అత్యవసర పరిస్థితి అని గతములో చూసాము.

1 రాజులు 8:64 ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠముఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.

1 రాజులు 13:1 అంతట దైవజనుడైన యొకడు యెహోవాచేత సెలవు నొంది యూదాదేశమునుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి యుండగా
13:2 ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనచేసెను బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా దావీదు సంతతిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.

జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 27 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter