నిర్గమకాండము 34 - కొత్త ఒడంబడిక
ప్రార్థన: ప్రభువా! మీ రాకడ సామీప్యమును గ్రహించుటకు మాలో నివాసము చేయుచున్న విగ్రహములను తొలగించి మీ చిత్తమును ఆనుకొని జీవించు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.
దేవుని వ్రేలుతో వ్రాసిన పలకలను మోషే పగలగొట్టుట, ఈ 8వ సారి దైవ ప్రత్యక్షత తర్వాత హోరేబు కొండను విడిచిపెట్టుట అనునవి చాలా గొప్ప సూచనలు. దేవునివైపు మరలా తిరిగిన యెడల ఎన్ని సారులైనను మన హృదయములో దేవుడు తన దైవ వాక్యమును నింపును(2 కోరింథీ 3:3). అయితే దైవవర్తమానము విలువైనది; వర్తమానమిచ్చుటకు దేవుడు నిలిచిన ప్రదేశము(హోరేబు) ఆరాధనకు అనర్హము. ప్రభువు తాను రూపాంతరము పొందిన కొండను విడిచి శిష్యులను సత్యము(దైవ వాక్యము) నందు ప్రతిష్టించెను.
హోరేబు/సీనాయి కొండ: మోషేకు తన తల్లిదండ్రులు, సహూదరులు బ్రతికి ఉన్నారా! అనే బెంగను దేవుడు తీసివేసినది హోరేబు కొండ మీదనే. తన కర్రను దేవుని కర్రగా చేసి తన ప్రజలను విడిపించించుటకు కారణమయిన కొండ, దేవుడు ప్రజలకు ప్రత్యక్షమగుటకు ఆతిధ్యమిచ్చిన కొండ, ఇశ్రాయేలు దేశమును నిర్మించుటకు కావలసిన ఆజ్ఞలు, చట్టములు, విధులు, దైవకార్యములను దేవుడే స్వయముగా వ్రాసి ఇచ్చుటకు దేవుడు దిగిన కొండ. ఎన్నో గొప్ప వాగ్ధానములు ఇచ్చిన దేవుని కొండ హోరేబు కొండ.
మోషేకు ఎన్నో అనుభవములను ఇచ్చిన హోరేబుకు వీడ్కోలు పలుకుట భారమైన విషయమైనను హోరేబును ఒక విగ్రహముగా చేసుకొనక వాగ్ధాన దేశమునకు సాగిపోయెను.
నిర్గమ 34:5. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.
ఈ అద్యాయములో దేవుడు "యెహోవా" అను నామమును ఆఖరి సారిగా హోరేబుకొండపై పునరుద్ఘాటించెను (reiterated).మేఘములో యెహోవా దిగి దేవుని స్వరూపమును ఇంకనూ తెలియజేసెను. రెండవ రాకడలో ప్రభువు తన మహిమతో వచ్చును కావున నరులు చావకుండునట్లు ఇదే షెఖీనా మేఘములో ఆయన దిగును.
- దేవుని స్వరూపము:
- కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు
- వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును
- ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించును
- భూమిమీద ఎక్కడనైనను ఏజనములో నైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరియెదుట చేయును
ఏ మార్గము దేవుని చేరలేదు? పోతపోసిన దేవతలను చేసికొనవలదు - యేసుప్రభువు విగ్రహమునైనను పెట్టుకొనకూడదు. విగ్రహము ద్వారా యెహోవాను చేరుట ఆయనకు కోపము తెచ్చుటయే. యెహోవా నామమునైనను పోతవిగ్రహములు చేయుట వలన దేవునియందు భయము భక్తి తగ్గి; అహంకారము, ఆవేశము పెరిగి చివరికి దేవుని దూరము చేయును. విగ్రహం దేవునికి అడ్డుగా నిలిచి దేవుని వెలుగును అడ్డుకొనును.
దైవ సన్నిధినుండి దూరము చేయు ఏ సంబంధమైనను పెట్టుకొనకూడదు.
- Learning
- మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారము చేయుటకు గల కారణము దేవుని స్వరూపమును సమీపించుకొలది పెరుగుతూ వచ్చిన భయభక్తులు. దేవునియొద్ద చనువు పెరిగిన కొలది ఆయనను మరి ఎక్కువగా అరాధించుట నిజమైన సాన్నిహిత్యము.
- దేవుడు తన ఆజ్ఞలను మరలా మరలా చెప్పుటకు గల కారణము ఆయన ఆజ్ఞను గైకొని, ఆయన యెదుట మనము నిర్దోషులముగా నుండుటకే! క్రీస్తుప్రభువు ఆయన ఆజ్ఞను గైకొను సామర్ధ్యమును మనకు దయచేసెను. ఇదే నూతన నిబంధన.
-
ప్రభువు ఉనికిలో ఉండుటయే మనకు సమాధానము. కొలస్సీ 1:22 - తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.
ఎఫెసీ 1:6 మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
షరా! దేవుని ఆజ్ఞలు మారలేదు గాని వారి దోషమును పరిహరించి మళ్ళీ నూతనముగా నిబంధన చేసెను. కొత్త పలకలు/పగిలిన పలకల కంటే తన నిబంధన మీద ఆనుకొనువారియెడల దేవుడు కనికరము చూపును. ఒకసారి దారితప్పి తిరిగి ప్రభువువద్దకు వచ్చిన తర్వాత మరలా నూతన వాగ్ధానము పొందుట అవసరము.
ప్రభువు మనకు సమాధానమును కలుగజేయునుగాక! ఆమేన్.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet