నిర్గమకాండము 37 - ఉపకరణముల తయారీ



ప్రార్థన: మా పోషకుడవైన దేవా! మీకు వందనములు. మాకు ఇచ్చిన ఏ పనినైనను మీ మహిమార్థమై చేయులాగున సమస్తమును సమకూర్చి జరిగించుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

Execution of God's plan

గుడార మందిర సామాగ్రి నిర్మాణమును అందరు పట్టుదలతో, సమన్వయముతో(coordination), అత్యధిక ప్రామాణిక నిర్వహణతో అందరు దైవాత్మ పూర్ణులై తమ నైపణ్యతతో(high standard quality of work) కొనసాగించుట మోషే కొలిచి చూచినపుడు అంతా దేవుడు చెప్పినట్లే ఉన్నదని(మంచిదని) మళ్ళీ దృవీకరించుటకు ఈ అద్యాయము సాక్షిగా నిలిచెను(100% conformance).

ఈ అద్యాయములో వెలుగులోనికి వచ్చిన విషయములు: వృత్తినైపుణ్యత(skillset profile), నిర్వహణ(execution); దైవాధికారియైన మోషే జ్ఞానాత్మతో నిండిన దైవ సేవకులకు తమ నైపుణ్యతను బట్టి ఇచ్చిన స్వాతంత్ర్యము(task delegation). ఈ దైవ బృందమును దేవుడే తయారు చేసెను. దేవుడు చెప్పిన పనిని ఏ చిన్న తేడా లేకుండగా(perfectly in compliance with God's plan) చేయుచుండిరి.

సామెతలు 22:29. తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.
13. సోమరిబయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును - దైవాత్మకు విధేయత చూపక, వృత్తినైపుణ్యము తగ్గిన యెడల సామెతలలో చెప్పిన సోమరితనమంతా వచ్చును.

కొలస్సయులకు 3:24. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.

Profiles of Ministries

బంగారము, వెండి, ఇత్తడి పనులు చేయువారు; నకిషీ పని, మేళకుని పని, కర్ర పని, వడ్రంగి పని, నూలు ఉడుకు పని, తెరలు, పోతపోయువారు ... మొదలగు జ్ఞానాత్మ కలిగిన నాయకులు క్రొత్తగా ఏర్పడిన ఇశ్రాయేలు దేశమునకు ఆయా డిపార్ట్‌మెంట్‌లకు(మినిస్ట్రీస్) మినిష్టర్స్ వంటివారు. దేశములో అన్నిరకముల నాయకత్వమును ఏర్పరిచెను.

నేటి సంఘములో అన్ని వృత్తులవారు ఉందురు. ప్రతి ఒక్కరి వృత్తిని సంఘము గౌరవించవలెను. సంఘములో కూడ పని ఉన్నది. అందరికి దేవుడు వారికిచ్చిన పాత్రను బట్టి క్రైస్తవ సంఘము చేయవలసిన ఘనమైన కార్యములు జరిగించుటకు ప్రభువు ఎల్లపుడు, తన జ్ఞానాత్మను ప్రతీ ఒక్కరికి తోడుగా ఉంచును.

ఆది నుండి రాకడవరకు గల అంశములు ఒక ఆర్డర్‌లో కీర్తన, పద్య, గద్య(మిత్ర), దండక రూపములో దేవుడు మనకు అందించెను. ఈ తరములో దేవుని పనిని(మిషన్) అందుకొని చేయగల అంతస్థును దేవుడు మనకు దయచేయును గాక!

క్రైస్తవ సంఘమా - ఘనకార్యములు చేయు - కాలము వచ్చును
తెలుసునా - క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగ - కీర్తిపొందు
నని తెలుసునా - కీడు నోడింతువు తెలుసునా - కిటుకు విడ గొట్టుదువు తెలుసునా



జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 37 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter