37. నిర్గమకాండ ధ్యానము

ఇశ్రాయేలీయుల విమోచన కీర్తన



నిర్గమ. 15:1-18.

ప్రార్దన:

తండ్రీ! నీ పిల్లలను అన్ని గండములనుండి గట్టెక్కించినావు. మమ్మునుకూడ ఈ లోకములోని అన్ని ఆపదలనుండి రాకడ మేఘమనే గట్టెక్కించుటకు నేటిదిన వర్తమానమిమ్ము ఆమేన్.

ప్రసంగము:

ధవళేశ్వరములో ఒక పేటపేరు గట్టు. ఇప్పుడు చివరి వాక్యములో గట్టున్నది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రముదాటి అవతల గట్టు ఎక్కిరి. సముద్రములో నడచివెళ్ళిరి. గట్టు ఎక్కిరి. గట్టెక్కినారని ఒప్పుకొని ఆనందించుటకు పాత సం॥ము చివరి గట్టు మొదలు క్రొత్త సం॥ము ఆరంభము గట్టు ఎక్కవలెను. గట్టు ప్రసంగమున్నదా? అంటే వెంటనే గ్రహింపురావలెను. అవతలగట్టు ఎక్కునప్పుడు వెనుకకు తిరిగి చూస్తే ఏమి కనబడును? వారు ఎక్కడనుండి ప్రయాణముచేసిరో అక్కడనుండి ఇక్కడవరకు కనబడును. ఐగుప్తులోనుండి బయలుదేరి, అరణ్యముదాటి, సముద్రముదాటి, ఇవతల గట్టు ఎక్కగా ఐగుప్తు అరణ్యము, సముద్రము, పాయ గట్టు కనబడును. నీలగిరి కొండ క్రింద మెట్టు కొండలలో ట్రైన్ వంకరొంకరగా తిరిగి తిరిగి చాలా దూరమునుండి వెళ్ళి కొండమీదనున్న పట్టణము చేరగలదు. అచ్చటనుండి వెనుకకు తిరిగిచూస్తే చాలా భయంకరముగా ఉన్నది. కొడైకెనాల్ అనే స్థలమున్నది. కొండక్రింద ఒక ఊరు ఉన్నది. అక్కడనుండిచూస్తే ఎంత భయంకరము. అలాగే ఐగుప్తు నుండి ఈ గట్టు వరకు చూస్తే ఎంత భయంకరము. పోయిన జనవరి నుండి డిసెంబర్ 31 వరకు 12 రాళ్ళు దాటివచ్చినాము. అన్ని సం॥లు దాటి వచ్చినాము. తుదకు నూతన సం॥లో ప్రవేశపెట్టెను. గనుక వెనుకకు తిరిగిచూస్తే చాలా భయంకరము. అట్లే ఇశ్రాయేలీయులు గట్టు ఎక్కిరి. వారు పాట పాడిరి. స్తుతి అంటే మాటలు. కీర్తన అంటే ఆ మాటకే కీర్తన కట్టుకొని పాడుదురు. ఆ కీర్తన కట్టినవారు మోషే, పాడినవారు ఇశ్రాయేలీయులు. మోషే అక్క మరియు చెలికత్తెలు స్తుతికీర్తన పాడిరి. ఐగుప్తులో 1వ గండం, 2వ గండం, 3వ గండం తరువాత సముద్రము దగ్గర ఒక గండం. ఇవన్నీ దాటుతూ వచ్చిరి. గనుక దేవుని స్తుతించారు.

1వ గండము:

ఐగుప్తులో 400సం॥లు ఇశ్రాయేలీయుల బానిసత్వములో ఉండిరి. స్వదేశము రాలేదు. గనుక ఫరోచేతిలోయున్నారు. ఆ గండము తప్పించిరి. గనుక దేవునికి దండంపెట్టిరి.

2వ గండము :

మోషే అహరోనులు మిద్యానునుండి మోషే వచ్చినప్పుడు రాజుతో మాట్లాడిరి. మా దేవుని సెలవు తీసికొని వచ్చుటకు ఫరో దర్భారులోకి వెళ్ళి అడుగగా ఫరోకు కోపము వచ్చి మీరు వచ్చినందున ప్రజలు బద్ధకస్తులై పనులు చేయము అనుచున్నారు. గనుక పనులు రెట్టింపు చేసిరి. గనుక మోషే అహరోనులవలన ఈ గండము వచ్చినది. వీరంతా వారిద్దరిని తిట్టిరి. గాని వారికి సమాధానము చెప్పిరి. అయినను వారి కష్టములు ఎక్కువాయెను.

3వ గండము:

ఇశ్రాయేలీయుల పిల్లలందరిని చంపవలెనని మంత్రసానులకు ఆజ్ఞయాయెను. తరువాత పిల్లలను గొంతు పిసికి చంపి నైలునదిలో పడవేసిరి. రామాలోని అంగలార్పువలె, ప్రభువు జన్మించిన కాలములోని అంగలార్పువలె జరిగెను. రేపు వీరు ఎదిగి మా మీదకు యుద్ధమునకు వస్తారని ఈలాగున చేసిరి. చంపడానికి బదులు ఇంకా 400సం॥లు దాసత్వమైనా చేయింపవచ్చు. ఎంత గండం. మగపిల్లలను చంపి ఆడపిల్లలను ఐగుప్తీయులకు ఇచ్చుటవలన ఇశ్రాయేలీయుల సంతతి నశించి పోవును. గనుక ఇప్పుడు ఎన్ని కీర్తనలైనా పాడగలరు.

4వ గండము:

ఐగుప్తు దాటుచుండగా ఫరోవద్దనుండి సైన్యము వస్తున్నది. వారిని పట్టుకొని తీసికొని రండి అని పంపిరి. 6 లక్షల జనమును కొద్దిమంది తేగలరా? ఆయుధములున్నవి. ముందు సముద్రమున్నది. గనుక ఈ గండము గొప్పది.

5వ గండము:

సముద్ర గండము: ఆడవారు, మగవారు, ఆస్తి తుదకు పిండి పిసికే తొట్లను సహా ఎత్తుకొనివెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోషేమీద మూల్గుకొనిరి. మొదట గోషేనులో, తరువాత అరణ్యములో మూల్గుకొనిరి. శత్రువులు వస్తున్నారు. రథ సేనలు ఊడిపోతున్నవి. ఇది సర్దుకొనేటప్పటికి వీరు దాటిపోతారు. కాబట్టి ఇశ్రాయేలీయులు సముద్రము దాటిరి. కొండల గండము, సముద్ర గండము దాటిపోయిరి. ఐగుప్తీయులకు విశ్వాసము కలిగినది. ఇశ్రాయేలీయులకు కాదు. గొప్ప విశ్వాసము. వారు వెళ్ళారు. మనమెందుకు వెళ్ళలేము. మనము తప్పకుండా వెళ్ళతామని చెప్పుకొనిరి. ఒక రథము దిగినది. తరువాత మరియొకటి దిగినది. వారు గట్టు దిగిరి. వీరు దేనినిబట్టి విశ్వాసముంచిరి? పాయనుబట్టి విశ్వాసముంచిరి. విశ్వాసులు నడచిపోగలరా? అరణ్యములోని పాయలోనికి పటాలము వచ్చినది. మోషే నీ కర్ర "మరియొక పర్యాయము చాపుమనగా" సీసపు గుండు నీటిలో వేసితే ఎంత త్వరగా తేలునో అంత త్వరగా మునిగిపోయిరి. వీరు వట్టి పాయమీద విశ్వాసముంచిరి. గాని ఇశ్రాయేలీయులు దేవునిమీద, మోషే మీద విశ్వాసముంచిరి. గనుక వీరికి రక్షణ. ఈ కాలములోకూడ మంచి క్రైస్తవులున్నారు. లోకసంబంధమైన వాటిమీద విశ్వాసముంచిరి. కాని దేవునిమీద, దైవభక్తులమీద విశ్వాసముండదు. ప్రకటన 6 చివరిలో కొండ బండలమీద అనుచరణము.


ఆ ప్రార్ధన కొండలకు వినబడినదా? విశ్వాసముతో చేసిరి. గొప్ప విశ్వాసము. అటువంటి విశ్వాసము ఐగుప్తీయులకున్నది. నిజమేకాని రక్షణలేదు. దేవునియందు విశ్వాసముంచితే రక్షణ. వీరు పాయమీద, సృష్టిమీద విశ్వాసముంచిరి. గనుక నశించారు.

  • 1) బానిసత్వ గండము
  • 2) ఫరో కోప గండము
  • 3) శిశుహత్య గండము
  • 4) అరణ్య గండము
  • 5) సముద్ర గండము
  • ఈ 5 గండములు తప్పించుకొని కీర్తన కట్టుకొని పాడిరి.

ఐగుప్తీయులు ఏ ప్రకారముగా మునిగిరంటే సీసపుగుండు మునిగితేలునంత సులువుగా మునిగిరి. ఇశ్రాయేలీయులు గడచి గట్టెక్కిరి. గనుక పాట పాడిరి. ఐగుప్తు దేశమునుండి వచ్చిన గండముల జాబితా.


ఈ కీర్తనకు విమోచన కీర్తన అని ఉన్నది. ప్రకటనలో పరలోకములో చేరిన విశ్వాసులు మోషే కీర్తన పాడిరి అని ఉన్నది. ఈ కీర్తన కాదు. ఇట్టిది

  • 1) గండముల వరుస,
  • 2) ఉపకారముల వరుస.
    • (1) మిద్యాను దేశమునుండి మోషేను తీసికొని వచ్చిరి.
    • (2) ఉపకారము ఏదంటే ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళిరి. వారితో మాట్లాడి వారిని సంతోషపెట్టిరి.
  • (3) పస్కాను ఆచరింపవలెనని చెప్పిరి. పాపి విమోచన భోజన సంస్కారము ఇదివరకు ఎక్కడాలేదు. ఎందుకంటే ఇంకెవ్వరు మమ్మును ఏమి చేయరు. ఎందుకంటే మేము పస్కా బలి కలిగియున్నాము. గొర్రెపిల్ల రక్తము పూసినాము. ఏ కీడు రాదు అని పస్కాయొక్క ఉద్దేశ్యము. అపరిమితమైన సంతోషము.
  • (4) ఉపకారము:- ఎరువుతెచ్చుకొన్న నగలు స్త్రీలు ఏదైనా ధర్మము చేస్తారు. కాని నగలు ఇవ్వరు. అన్నీ ఇచ్చివేసిరి. పెండ్లి కుమార్తెను అలంకరించినట్లు అది ఎంత గొప్ప ఉపకారము.
  • (5) చీలలు వదులై ఊడడం.
  • (6) మోషేద్వారా చెప్పించడము. అందరును చెప్పిరి. ఊరక నిలుచుండి చూడండి. మరేమి ఫరవాలేదు. పాయకావడము ప్రజలు దాటటము ఈ రెండు ఉపకారములు అంతకుముందు మోషేమీద సణుగుకొని రాగాలు తీసిరి (సణుగుకొనుట).

గట్టు ఎక్కిన తరువాత క్రొత్త కీర్తన పాడిరి. అదే క్రొత్త సం॥ము. అదే దాటుతూ వచ్చిరి. గనుక క్రొత్త కీర్తన పాడిరి. ఈ క్రొత్త సం॥లో దేవుని స్తుతించిరి. అప్పుడు వారంతా పాడగలిగిరి. పాడితే ఐగుప్తీయులు పారిపోవుదురు. పాయదాటితేగాని పాటరాదు. పాయదాటాలంటే మాయ దాటాలి. వారి సంతోషము వివరించలేము. అందరును పాడిరి. అవతలకు వెళ్ళిన తరువాత ఐగుప్తీయుల శవములు ఒడ్డుకు వచ్చెను. యోనావలె సముద్రనైజము. అది మనలను హింసించిన ఐగుప్తీయుల గతి అని పాడిరి. మోషే పాడినరాగము మానవులకున్నదా? ఎంతమందికి దర్శనవరమున్నదో వారు ప్రార్ధించితే అది వినబడును.

దీవెన:

మీరును మీ నూతన యెరూషలేము ప్రయాణములో వచ్చిన సకల గండములను దాటుకొని, రాకడ మేఘమెక్కి ఆనందగానములు చేయు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక! ఆమేన్.