26. నిర్గమకాండ ధ్యానము

మోషేయొక్క సన్నిధి పట్టు



నిర్గమ. 24:12-18.

ప్రార్ధన:

తండ్రీ! మోషే గుడారము వేయించి, అందులోనుండి మోషేతో మాట్లాడిన తండ్రీ! వందనములు. మోషేవంటి కుదురు మాకును కల్గించి, మమ్మును నీ సహవాసములో కూర్చుండ బెట్టుకొనుటకు మాతో మాట్లాడుమని, సన్నిధిపట్టు దయచేయుమని వచ్చివేసిన యేసు నామమున వందించుచున్నాము తండ్రి ఆమేన్ .


పూర్వము ఇశ్రాయేలీయులు గుడారముకట్టి పరిశుద్ధ స్థలమును, యజ్ఞవేదికను ఏర్పాటుచేసిరి. మనము ఈ రెండుకాదు. అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. అప్పుడు మోషే ఒక్కడే ఆ అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయనతో సహవాసమందు గడిపారు. ఇప్పటివరకు అలాగు అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి, ప్రభువుతో సహవాసమందు గడిపినవారు ఒక్కరు లేరు. మోషే కొండమీద సన్నిధిలో ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములో ముఖాముఖిగా ప్రభువును చూస్తూ యున్నాడు. ప్రభువు చెప్పుచుండగా వ్రాసినాడు.

కొండమీద భయంకర విషయము; అన్నములేదు, నీళ్ళులేవు. 40 దినములు దేవునియొద్ద ఉన్నాడు. దేవుడు చెప్పింది వ్రాసినాడు. ప్రభువా! మళ్ళీ చెప్పు అంటే "చెప్పేవారు". ఆయనే చెయ్యిపట్టి వ్రాయించెడివాడు. ఆ నలుబది దినాలు మోషే ఏలాగు బ్రతికినాడో ఎవరికి తెలియదు. దేవుడంటే ఆ కాలములో అగ్నివంటి మహాభయంకరుడు. అటువంటి ఆయననే మోషేకు ప్రియమైన తండ్రిగా ఉండి వ్రాయించినాడు. ప్రభువా! నీవు ఉన్నావా అని (అయ్యగారు) అడుగగా, త్రియేక దేవుడు ఉన్నామని చెప్పిరి. ఆ భయంకర దేవునియెదుటకు మోషేకు భయముంటే రాడు, ఉండలేడు. క్రింద ఉన్న ఇశ్రాయేలీయులు హడలిపోతున్నారు. కొండతాకితే పశువులు చచ్చిపోతున్నాయి. అట్టి స్థలములో మోషే ఎలాగుండగలడు?

జవాబు: నైలునదిలో చనిపోయినాడా, మోషే ఇక్కడ చావడానికి! ఆ గుడారములోనికి అయ్యగారు వెళ్ళి కళ్ళగంతలతో చూచినారు.


ప్రభువు తన్ను ఏర్పాటు చేసికొన్నారని మోషే మనస్సులో ఉన్నది. అయినను నేను నత్తివాడను ప్రభువా! అన్నాడు. అది మోషేయొక్క తగ్గింపు. అయ్యగారి శరీరము ప్రార్ధనకు ఒప్పుకోనందున ఆయన నడుముకు పంచె కట్టుకొని సన్నిధిలో ఉన్నారు అది అయ్యగారి తగ్గింపు. గుడారము, కొండ, సన్నిధి మూడు వేర్వేరుగాని ఒకదానికొకటి సంబంధమున్నది. అనగా అందులోని పని ఒకటిగానే ఉన్నది.


ఈ దినమే ఎవరైనా ఆయన సన్నిధిలో ఉండుటకు మోషేవలె వస్తే ప్రభువు వాడుకొనును.

  • 1. సీనాయికొండ అనగా మనుష్యులకు సంబంధములేదు, జంతువులకు సంబంధము లేదుగాని కేవలము మోషేను మాత్రమే సమీపించిన భయంకరుడైన దేవుడు.

  • 2. గుడారము - ఆయన ఎదుట కూర్చొని ప్రభువును మాట్లాడించి, ఆయన చెప్పినవి వ్రాసుకోవడము. మనలో ఈ అనుభవము కొందరికి ఎక్కువ. క్రియలో కొంత తక్కువ, సత్తువలో ఎక్కువ.

  • 3. సన్నిధి - అనగా ఫిర్యాదు చేసికొనుట. ప్రతి ఉదయము 2-5గం॥వరకు చేయవలెను.

ఒక దినము ఉండగలముగాని రోజు చేయలేరు. స్కూలుకు రోజు ఎలాగు సమయమునకు వెళ్ళుదుమో, అలాగే దీనికి టైము ఉండాలి. ఉదయం 8గం॥1నుండి 12గం॥ల వరకు, మరలా మధ్యాహ్నం 2గం॥ నుండి సాయంకాలము 5గం॥ల వరకు చేయవలెను. ఇది మన ఏర్పాటు సమయము. అయితే, ప్రభువు చెప్పితే ఉదయము మొదలు సాయంత్రము వరకు వంకలు, ఆటంకాలు, పనులు ఏమీ యుండరాదు. మోషే దగ్గరకు సైతాను, దయ్యములు రాలేదు. వచ్చినట్లయితే అవి రావడము, చావడము కూడా అప్పుడే జరిగియుండేది. పై టైం ప్రకారము కష్టమేగాని దినములో ఒక గంట చొప్పున ఒక్కొక్కరు ఉండుట సుళువు. 8-10 గం॥లు, 2-5 గం॥లు, రాత్రి 8-10గం॥ వరకు ఒక్కరే ఉండుట చాలా కష్టము. రాత్రి అంతా ఉండుట మరీ కష్టము. ఈలాగు సమర్పించుకొనే మనిషి ఏడి? సన్నిధివపని ఆడవారే చేయగలరు.

  1. ఆడవారివలన పాపము వచ్చెను.
  2. ఆడవారివలన రక్షణ వచ్చెను.
  3. ఆడవారి పేరుమీదే పెండ్లికుమార్తె సంఘము. గనుక
  4. ఆడవారికే రాకడ దినాలలో విశ్వాస శక్తి ఎక్కువగా ఉండును.

  • 1) మోషే మొదటి 40సం॥లలో లోకవిద్య నేర్చుకొనెను, జ్ఞానాభివృద్ధి వచ్చెను. ఈ విద్యనుబట్టి ముందుకు పుస్తకములు రాయవలసి వచ్చునుగాన సకలవిద్యలు ఐగుప్తులోనే నేర్చుకొనెను. ఐగుప్తులోనే శ్రమలు పొందుటకూడ తర్ఫీదు అయ్యెను.

  • 2) 40సం॥లు గొర్రెలుకాయుటద్వారా వినయవిద్య నేర్చెను. నాకక్కరలేదు నీవెవరినైనా ఇశ్రాయేలీయుల కొరకు పంపుమనెను. ఇది తగ్గింపుతోకూడిన వినయము.

  • 3) 40 సంలు నరప్రజలను నడిపించెను. ఇంత చదువు చదివిన మోషేను ప్రజలు ఎదిరించినారు, అయినను మోషే ఓపికతో వారి భారముమోసెను.

మోషే - అరామియ, కల్దియ భాషలను నేర్చెను. ఐగుప్తీయుల విద్యలన్నీ నేర్చుకొనెను. అవియుగాక, సకలవిద్యలును మోషే నేర్చెను. మోషే యిత్రో అను తన మామ సలహా తీసికొన్నట్లు, మాకు అంతా తెలుసు అనుకొని, ఇతరుల సలహాలు తీసికొనకూడదు. అది మోషే విషయము విచారము. అది కూడ మోషే దేవునియొద్దనే నేర్చుకొనవలెను.


ఉదా:- తన సేవకులచేత చేయింపవలసిన పని ఉన్నా తన కుమారుడు వచ్చే వరకు చేయమని చెప్పి, తన కుమారుడు రాగానే తండ్రి కుమారుని పిలిచినట్లుండును.

దీవెన:

ఆలాగున దేవుని గృహములో నమ్మకమైన పనివారై ఆయన సహవాసములో పట్టు కలిగి, ఆయన చెప్పు సంగతులు కుదురుగా నేర్చుకొని ఆయన కొరకు ప్రయానపడు భాగ్యమును పెండ్లికుమారుడు మీకు దయచేయును గాక! ఆమేన్.