33. నిర్గమకాండ ధ్యానము

ఎన్నిక జనాంగము - 2



నిర్గమ. 33: 1-16.

ప్రార్ధన:

తండ్రీ! నీ ఏర్పాటును నీ పిల్లలైన ఇశ్రాయేలీయులతో నీవు స్థిరపర్చినావు. గనుకనే వారిని అన్ని కష్ట స్థితులలోనుండి విడిపించి, కనానుకు చేర్చినావు. మేమును ఆ ఎన్నిక జనుల అంతస్థులోనుండుటకు వారికి కలిగించిన భాగ్యములను మాకును కలిగించి, నూతన యెరూషలేమునకు ఆయత్తపరచుటకు నేటిదిన వాక్య వర్తమానమునందించుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.


యోహాను 14:2లో యేసుప్రభువు మనకు స్థలము సిద్ధపర్చ వెళ్ళుచున్నానని చెప్పెను.

  • 1. ఆదాము మొదలు అబ్రాహామువరకు మిశ్రమ జనాంగము.
  • 2. ఆ తరువాత క్రీస్తు వరకు ఎన్నిక జనాంగము యూదులు.
  • 3. క్రీస్తునుండి కాలాంతమువరకు ఎన్నికజనము క్రైస్తవులు.
  • 4. యేసుప్రభువు తరువాతనుండి ఇప్పటివరకు ఉన్న క్రైస్తవ మతములోని వారందరు మిశ్రమ జనము.
  • 5. ఆ మిశ్రమ జనములో కొందరు, అనగా క్రైస్తవులలో కొందరు, ఎన్నికజనము. అనగా "పెండ్లికుమార్తె సంఘముగా" ఎన్నిక జనాంగమైనారు.

పిలువబడినవారిలో దేవునికి ఇష్టమైనవారు అనగా పెండ్లికుమార్తెగా ఉండుటకు ఇష్టమైనవారు పై జనములో ఉన్నారు. పిలువబడిన వారు అనేకులుగాని ఏర్పరచబడినవారు కొందరే. మొదటివారు కడపటి వారగుదురు. కడపటివారు మొదటివారగుదురు. ఈ వ్రాతలు జాగ్రత్త ఇవి మీకు నోటీసుబోర్డులు. వారిని రకరకములుగా తయారుచేయుచున్నారు. ఎందుచేతననగా అందరు ఒకే విధముగా లేరు. ఈ మూడు జనములలో మధ్య ఎన్నిక జనమైన యూదులున్నారు. ఈ యూదులను ప్రభువు ఏలాగు సిద్ధపరచునో? వారి కొరకేమి సిద్ధపరచెనో తెలుసుకుంటే, ప్రభువు మన కొరకేమి సిద్ధపరచెనో తెలియగలదు. మనకు క్రైస్తవులు ఏమి చేసెనో తెలియును. మిశ్రమ జనములో ఒకరకమైన ఎన్నిక జనము. ఎన్నిక జనములో ఒకరకమైన జనము, క్రైస్తవులలో ఒకరకమైన జనము తయారైనను; ఈ మూడు జనములో భక్తులు మోక్షమునకు పోవుదురు. మూడు జనములలో నశించినవారును గలరు. మన జాగ్రత్త కొరకు రోడ్డుమీద ఉంచబడిన నోటీసు బల్లను మనము చదవకపోతే, ఎవరిది తప్పు? ఆలాగే నోటీసు బోర్డువలె ఉన్న బైబిలంతా చదవకపోతే ఎవరిది తప్పు? గనుక బైబిలు అంతా చదువవలెను. పౌలు సీలను జైలరు అయ్యలారా! రక్షింపబడుటకు నేను ఏమి చేయవలెను? అని అడుగగా అప్పుడు పౌలుగారు ప్రభువునందు విశ్వాసముంచుము అని చెప్పెను. బైబిలంతా చెప్పుచున్నందున నన్ను (అయ్యగారిని) ఇతరులు నిందించుచున్నారు. భక్తులు, “రక్షణ సంకల్పన అక్కరలేదు. పౌలు అంతయు చెప్పలేదు. ఒక్కమాటే పౌలు చెప్పెను” అప్పుడు రక్షింపబడినవారికి మిశ్రమ జన చరిత్ర. ఎన్నిక జన చరిత్ర గలదు. మనుష్యునికి ఒక్కమాటేగాని బైబిలంతా నేర్చుకొనునా అని అంటున్నారు.


ఉదా:- మనము పై మూడు ఏర్పాటులు దేవుడు వ్రాయించిపెట్టినవి అని గమనించవలెను. అవి ఎవరికొరకు? దేవుడు మనకొరకు ఏమి సిద్ధపర్చినాడు? మూడు జనాంగముల చరిత్రను సిద్ధపర్చెను. అవి తెలుసుకొని మనము సిద్ధపడుటకై దేవుడేర్పాటు చేసెను. మన కొరకు సిద్ధపర్చినది మనము నేర్చుకొనకపోతే, ఏమి ప్రయోజనము ఎవరికైన కూడా బాప్తిస్మమునకు ముందు కొంచెము చెప్పి, తర్వాత మిగతా అంతయు చెప్పుతాము. మనకు ఉద్దేశించి వ్రాయబడినది. గనుక మనము సిద్ధపడవలెను. మూడు జనాంగముల వారికి ఏమి తెలుసునో, దీనినిబట్టి వారికి రక్షణ. అందరికన్నా మనకెక్కువగలదు గనుక అందరికంటే మనమే ఎక్కువ నేర్చుకొనవలెను.


మిశ్రమ జనముకొరకు దేవుడు ఏమి సిద్ధపర్చెను? ఆదామునకిచ్చిన వాగ్ధానము, షేముకిచ్చిన వాగ్ధానము దీపములవలెనున్నవి. వాటినిబట్టి రక్షణ. అరణ్యములో మోషే ఎత్తిన ఇత్తడి సర్పమును చూచి బ్రతికినట్లు ఆ రెండు వాగ్ధానములద్వారా రక్షణ. నోవహు చరిత్ర, నోవహు వాగ్ధానము, షేము వాగ్ధానము. ఇవన్నియు చూచినందున అనగా ఈ దీపస్థంభములనే వాగ్థానములద్వారా వారిని తయారుచేసి పరమునకు తీసుకొనిపోయెను. దీనికి వర్షదర్శిని అనిపేరు. దానిని చూడగానే (ధనస్సు) యేసుప్రభువును స్తుతింపవలెను.


యేసుప్రభువా! ఈ అద్భుతకరమైన దర్శనము కనబర్చితివి, స్తోత్రము. జలప్రళయము మాకు రాదు. ఏడేండ్లలో మరణము, గోగు మాగోగులో మరణము అనగా రక్షణలేని మరణము. పై మరణములు మాకు రానివ్వని నీ కృపగల వాగ్ధానమునకు అనేక వందనములు. దానిని చూచిన వారు కృపా వాగ్ధానములను జ్ఞాపకము చేసికొనవలెను. కృపాదానము పొంది కృపానందము పొంది, పోగొట్టుకొనరాదు. నిలుపుకొన్నయెడల కృపావరము అగును. ఈ మూడు పేర్లు, మరియొక పేర్లు తెలియజేయును.


దేవుడు ధనస్సులో తన కృపను బయలుపరచెను. కృప రెండు అక్షరములమాట గనుక రెండు భాగములు.

  • 1) నేను నాశనము చేయను.
  • 2) నేను రక్షించెదను.

దేవుడు నోవహుతో నీకు సిద్ధపర్చుచున్నానని చెప్పెను. గనుక కృపకు పై రెండు ఉద్యోగములు. ఆ రెండు కలిపితే నీ కృప. అందుచేత కృప ఇవ్వబడెను. ఈ విధముగా దేవుడు మిశ్రమ జనమును సిద్ధపర్చిను. దేవుడు ఎన్నిక జనమును ఐదు విధములుగా సిద్ధపర్చిను.

  • 1. అబ్రాహాముతో వాగ్ధానము చేసెను. ఇది నోవహు వాగ్ధానమునకన్నా గొప్పది. “నిన్నుబట్టి సమస్త జనమును ఆశీర్వదింతును” అనుమాట, ప్రభువు చెప్పిన “సమస్త జనాంగములకు సువార్త చెప్పుడి.” అన్న దానికి సరిపోయినది. మిశ్రమ భక్తులందరికంటె ఎక్కువైన అంతస్థులో దేవుడు తన ఏర్పాటు జనాంగమును స్థిరపర్చెను.

  • 2. నాలుగు వందల ఏండ్లు ఖైదులోవేసి తర్ఫీదు చేసెను. అట్లు చేయునప్పుడు వారికి ఒక్కమాట నేర్పెను. ప్రభువా! మమ్మును ఎప్పుడు విడుదల చేయుదువు? అప్పుడు దేవుడు మోషేను పంపించి మీ మొర వినబడినదని చెప్పెను. నాలుగు వందల సం॥లకు కావల్సిన పని, ఆహారము కలదు. జైలు ట్రైనింగు అయిన తరువాత అరణ్యములో ట్రైనింగు కావలెను. నోవహు కాలములోని ధనస్సును చూచి స్తోత్రము చేసెను. నాలుగు వందల ఏండ్లు ఐగుప్తు జైలులో మహాప్రభూ అని అనునట్లు సిద్ధపర్చెను. ఈలాగు దేవుడు ఇశ్రాయేలీయులను అన్ని విధములుగాను సిద్ధపర్చెను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. చిన్నపిల్లల పద్ధతివేరు, పెద్ద పిల్లల పద్ధతివేరు. అలాగే మిశ్రమ జనమునకు వేరు. ఎన్నిక జనమునకు వేరు.

ఎన్నిక జనమునకు కఠిన బానిసత్వము అవసరము. వాగ్ధానమున్నవారికి జైలు ఎందుకు? వారి పితామహులు యోసేపును అమ్మిరి గనుక ఎన్నిక జనాంగమంతటికి ఆరు లక్షలమందికి శిక్ష 10మందిని తర్వాత యోసేపు జైలులో వేయించిన తర్వాత ఆ జైలులో వారు యోసేపు ద్విభాషి అని చెప్పుకొనిరి. వారికేగాదు. అందరిలోను ఆ తమ్మునిమీద అసూయపోలేదు. తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పింతును. అన్నది తండ్రుల దోషమును కుమారులు కాపి చేసిరి. అందుచేత అందరికి శిక్ష; ఆకాను దొంగతనము చేయగా అందరు శిక్షపాలైరి. గనుక “పరుల పాపములో పాలి వారైయుండకుడి” అని వ్రాసెను. జైలులో బుద్ధి వచ్చెనుగాని ఇంకా సిద్ధపర్చవలెనని 10 అద్భుతములను చేసెను. మన దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించుటకు అద్భుతములు చేసి సిద్ధపర్చెను. ఐగుప్తులో 10 అద్భుతములు చేసి, అరణ్యములో 10 ఆజ్ఞలనిచ్చుటకు సీనాయి కొండకు నడిపించెను. ముందే ఆజ్ఞ ఇవ్వలేదు 400 సం॥లు ఖైదులో ఉంచకపోతే 4గురైన రక్షింపబడరు. వారికి శిక్ష రానిచ్చెను గాని నాశనము రప్పించలేదు. ఈ ప్రకారముగా వారిని సిద్ధపర్చెను.

  • (1) బుద్ది తెచ్చుకొనుటకే జైలులో వేసెను.
  • (2) నమ్ముటకు అద్భుతములు చేసెను.

సిద్ధపర్చెను:- అన్నిటికంటె గొప్పదేది? వారిచేత ప్రార్ధన చేయించెను. ఎందుకు? జవాబిచ్చుటకును, రక్షించుటకును, వారి పితామహులైన 10మందిని గదిలో సిద్ధపర్చెను. అరణ్యములో 40 సం॥లు వారికి పాఠము చెప్పెను. వారికి మోషే పంతులుగారు. మోషే పంతులుగారి వెనుక దేవుడు ఉండి వారికి చెప్పెను. ఆరు లక్షలమందికి ఒక్కడే ముఖ్యుడైనాడు. ఆయన దేవునియొద్ద నేర్చుకొని పాఠము అందరికి చెప్పెను. వారు వినలేదు. గనుక శిక్ష. అక్కడనుండి కానానుకు నడిపించెను. దీనికి పాలు, తేనెలు ప్రవహించు దేశమనిపేరు.

  • 1. ఐగుప్తులో జైలు
  • 2. అరణ్యములో పాఠము
  • 3. కానానులో పాలు తేనెలు అను తాయములు
  • యెహోషువా పంచిపెట్టెను. ఆలాగు దేవుడు అబ్రాహాముతో నీ సంతానమునకు పాలస్తీనా దేశమిస్తానని చెప్పిన వాగ్ధానము నెరవేరెను.

అబ్రాహాము సొంత ఊరు “ఊరు”. మరలా అబ్రాహాము కనాను దేశము చేరుకొనెను. అప్పటికి దానిని పాలు తేనెలు ప్రవహించే దానిగా సిద్ధపర్చెను. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, శారా, రిబ్క లేయా. వీరు ఎన్నిక జనముయొక్క తల్లిదండ్రులు. మా తండ్రులు దూతలు అని ఎన్నిక జనాంగమనిరి. లేయాను దేవుడు యాకోబుకు ఏర్పరచెను. రాహేలును దేవుడు యాకోబుకు ఏర్పరచెను. రాహేలు వంశములోనుండి ప్రభువురాడు. గాని లేయా వంశములోనుండి రావలెను. యాకోబు సంతోషించవలెను గాని విచారపడెను. దేవుడు ఎన్నిక జనమునకు తల్లులుగా శారా, రిబ్కలను ఏర్చరచినట్లు, లేయానుకూడా ఎన్నిక జన తల్లిగా చేసెను. ఎన్నిక జనమునకు పైన చెప్పినట్లుగాక ముగ్గురు తండ్రులను, ముగ్గురు తల్లులను ఏర్పరచెను. దేశమునుకూడా సిద్ధపర్చెను.

  • 1. తండ్రులను
  • 2. తల్లులను
  • 3. అద్భుతములను
  • 4. ఆజ్ఞలను
  • వీటన్నిటిని దేవుడు ఎన్నిక జనమునకు ఏర్పర్చెను, అనగా సిద్ధపరచెను.

ఏ విధముగా సిద్ధపరచెను?

  • 1) జైలులోవేసి,
  • 2) సముద్రమువద్ద ఏడ్పించి,
  • 3) ఊరిలో చెడితే ఊరికొని పిల్లలవలె ఏడ్పించెను.

ఇశ్రాయేలీయులకు పాలుతేనెలు ప్రవహించే తాయము పెట్టుటకు ఇదంతయు చేసెను. ఇదంతయు మొదట అబ్రాహాముకు చెప్పెను. అలాగే మనకొరకు దానికంటె గొప్పదగు పరమ కనాను నూతన యెరూషలేమును ఇవ్వనైయున్నాడు గాన సిద్ధపడండి.


దీవెన:

ఆలాగు అన్ని స్థితులలో ఆయన మిమ్మును కాపాడి, నడిపించి, మహిమ మేఘమెక్కుటకు ఎన్ని అనుభవములు అవసరమో, అన్ని అనుభవ అంతన్థులు అనుగ్రహించి, ఆయన రాకడకు ఆయత్త పర్చుకొనునుగాక! ఆమేన్.