నిర్గమకాండము 19 - సీనాయికొండ


ప్రార్థన: స్త్రోత్రార్హుడవైన ప్రభువా! మిమ్మును ఆరాధించుటకు త్వరపడు సిద్ధమనసును మాకు ఎల్లప్పుడును దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

పరిచయము

కొన్ని నెలల క్రితము మోషే ఇదే కొండపై ఒంటరిగా ఉన్నపుడు దేవుడు "ఈ కొండ వద్ద నన్ను ఆరాధింతురు" అని వాగ్ధానము చేసెను. ఇప్పుడు ఆ వాగ్ధానము నెరవేరెను. అయితే మూడు దినముల ప్రయాణమంత దూరము మూడు నెలలు పట్టెను. నూతన దేశమైన (The Moving Country) "కదిలే ఇశ్రాయేలు" లో ఈ వందరోజుల పాలనలో దేవుడు అనేక అసాధ్యమైన సమస్యలను పరిష్కరించెను. ఐగుప్తు జాఢ్యము అంతరించి, వారు స్వస్థపరచబడుటకు దేవుడు "యెహోవా రాఫా" గా; అన్ని వేళల సహకారిగా ఉండుటకు "యెహోవా నిస్సీ" గా దేవుడు ప్రత్యక్షమై, వారిని ఆరాధనకు అర్హులుగా తీర్చిదిద్దెను.

ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో దిగిరి. ఈ అరణ్యము ఆ దేశస్థితిని సూచించుచున్నది. ఆదియందు దేవుడు భూమిని సృజించినపుడు నిరాకారముగాను, శూన్యముగాను ఉండినట్లు ఇశ్రాయేలు దేశము అరణ్యముగా నుండెను. దేవుని దృష్టిలో అనేక విషయములు ఉన్నవి. ఆయన శాసనములు కేవలము అక్కడున్న ప్రజలకు మాత్రమే కాదు గాని విశ్వమంతటి రక్షణ, నీతి, శాంతి, సమాధాన సువార్త ప్రణాళిక అక్కడ జరిగెను.

ఈ అద్యాయంలో దేవుని ప్రత్యక్షత, ఉనికి కేవలం మోషే, అహరోనులకు మాత్రమే కాకుండా; ఇశ్రాయేలు ప్రజలందరికి అనుభవములోనికి వచ్చినది. దేవుని చేరుటకు హృదయశుద్ధితో పాటు కంటి, వంటి, ఇంటి శుద్ధి కూడ అవసరమని తెలియుచున్నది.

స్మరించవలసిన విషయములు

నిర్గమ 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.
నిర్గమ 19:5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు.

దేవుని కోరిక

నిర్గమ 19: 6. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము.
ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

అనగా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి విశ్వాసిని ఒక యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధ జనముగాను చేసెను.

దేవుడు మనలను మిక్కిలి ప్రేమించి సీనాయి(శిక్ష) కొండనుండి సీయోను(సువార్త) కొండకు పిలిచెను. సీయోను కొండకు చేరనివారు సీనాయి(sin) కొండకు పంపబడుదురు. హెబ్రీ 12:18-24:

సీనాయి సీయోను
శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది
ఎండిపోయిన అరణ్యము జీవముగల పట్టణము
ధర్మము, చట్టము, శిక్షలకు అప్పగించును కృపలో దాచును
ప్రవేశము నిషిద్దము మన హృదయములోనే నివసించు దేవుని ఆత్మ
దేవుడు వేరు, కొండ వేరు: స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధ కారమునకును, తుపానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికి భయపడి జనులు వచ్చిరి ప్రభువే ఆ బండ: క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు
దేవుడు బహిరంగముగా ప్రత్యక్షపరచబడినను గ్రహింపు రాదు ఆత్మను తాకు కరుణ, క్షమాపణ, ప్రేమ వలన విశ్వాసి దైవ ఉనికిని గ్రహించును

దేవుడు మనలను పరిశుద్ధపర్చి ఆయన సన్నిధిలో నిలుచు కృపను మనకందరికిని దయచేయునుగాక! ఆమేన్.



జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 19 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter