నిర్గమకాండము 20 - పది ఆజ్ఞలు
ప్రార్థన: ప్రభువా! మీ ఆజ్ఞ నిత్యజీవము గనుక(యోహాను 12:50) వాటిని ఎల్లపుడు తలంచుచు మీ సత్యమార్గములో నడుచు కృపను దయచేయుమని, మా ఆత్మను శుద్ధీకరించుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
ఈ రోజు ధ్యానము ఉపవాస ప్రార్థన ప్రకరణము అను పుస్తకములో శుద్ధిప్రకరణము అను బాగములో 10 ఆజ్ఞల వివరము ఉన్నది.
దేవుడు తన ప్రజల కొరకు మోషేను అభిషేకించెను. దేవుడిచ్చిన అధికారమును బట్టి మోషే తన ప్రజలకు ఈ క్రింది వాటిని అందించెను.
- ఆజ్ఞలు - దైవప్రజలు తు.చ. తప్పకుండా అనుసరించవలసినవి. పాపముల నిర్వచనము. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలలో మనకు జీవము ఇమిడియున్నది.
- కట్టడలు - ఇవి సంఘముగా అభ్యసించవలసినవి. వీటివలన సంఘ సహవాస ఆనందము కలుగును
- విధులు - కష్టమైనను, ఒంటరిగా వున్నను ఆచరించవలసినవి. వీటివలన శరీర స్వస్థత, సమాజ సౌఖ్యము కలుగును
- పౌర హక్కులు - ప్రతీ జీవికి దేవుడిచ్చిన స్వాతంత్ర్యము
- న్యాయ చట్టములు - శిక్షల జాబితా. భౌతిక లోక సంబంధమైనవి. పైన పేర్కొన్నవి పాటించకపోవుట వలన కలుగు శిక్షలు. వీటివలన వచ్చు రాబడి ప్రభువుకు ఇష్టము లేనిది.
- ధర్మశాస్త్రము - సంఘము దేవునిలో జీవించు క్రమము, నీతి సంబంధమైనవి. పైన పేర్కొన్న వాటి సంక్షిప్త గ్రంధము
కొంతమంది పొరబడి, పాతనిబంధన కొట్టివేయబడెను గనుక ఆజ్ఞలు పాటింపనవసరములేదు అని తప్పుగా చెప్పుదురు. ధర్మశాస్త్రమునకు మూలము ఈ 10 ఆజ్ఞలు. ఇవి దైవాజ్ఞలు. రాకడవరకు పాటించవలసినదే. అయితే క్రీస్తుప్రభువు ఈ ఆజ్ఞల అనుసరణను, క్రియలనుండి తీసి; మనసువద్ద పెట్టెను. ఇప్పుడు ఆజ్ఞకు వ్యతిరేకముగా మనసులో తీర్మానించుకొంటే = అది పాపము.
మిగిలిన శరీర చట్టమైన(Law of Body) ఆచారములు, విధులు, కట్టడలు, సున్నతి, బలులు కొట్టివేయబడెను. ఆత్మానుసారమైన మనసు ఒక్కటే ఇప్పుడు మార్గము. దీనికి కాపల "దైవాత్మ" మరియు "మనస్సాక్షి".
దేవుడిచ్చిన ఈ పది ఆజ్ఞలను ఏ దేశమైతే తృణీకరించునో ఆ దేశమునకు/జనమునకు గొప్ప విపత్తు సంభవించును. ఎప్పుడైతే ఈ పది ఆజ్ఞలను బట్టి ప్రజలు శుద్ధీకరించుకొని మారుమనసు పొందుదురో ఆ దేశము/ప్రజలు విపత్తు/తెగులునుండి విడుదల పొందుదురు.
ఈ ఆజ్ఞలు జీవవృక్షము యొక్క ఆకులు అనగా జీవాధిపతియైన యేసుప్రభువును యదార్ధతో ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన ఆచారములు. ఈ పది ఆజ్ఞల ఆచారము వలన దేశమునకు స్వస్థత కలుగును.
బైబిలులో మిగిలిన అద్యాయములన్నీ ఈ పది ఆజ్ఞలను ఆచరించుట వలన కలుగు మేళ్ళు, ఆచరింపకపోవుట వలన కలుగు ఆపదలు వివరించుచున్నవి.
ప్రభువే ఈ పది ఆజ్ఞలను ఇశ్రాయేలుకు దయచేసెను. మతాధికారులు ఈ ఆజ్ఞలకు అనవసరమైన అనుబంధములను ఆపాదించి పాపము చేయుట వలన ప్రభువే స్వయముగా సిలువపై ప్రాయచిత్తము చెల్లించి, మనకు నిర్మలమైన మనస్సాక్షిని దయచేసి, ఈ ఆజ్ఞలను ఆచరించు కృపను దయచేసెను.
ప్రభువైన యేసుక్రీస్తు అందించిన కృపాశాస్త్రము వలన జీవములో జీవించు కృపను దేవుడు మనకందించును గాక!
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
పరిచయం |
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
9 |
10 |
11 |
12 |
13 |
14 |
15 |
16 |
17 |
18 |
19
20
21 |
22 |
23 |
24 |
25 |
26 |
27 |
28 |
29 |
30 |
31 |
32 |
33 |
34 |
35 |
36 |
37 |
38 |
39 |
40 |
తైలాభిషేకపండుగ
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet