నిర్గమకాండము 30 - పాప ప్రాయశ్చిత్త సమర్పణలు


ప్రార్థన: ప్రభువా! మా ప్రార్థనలు, స్తుతులు, సమర్పణలు అన్నియు మీ పరిశుద్ధ నామములో అంగీకారమగునట్లు మీ కృపలోను, సత్యములోను దాయుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.

నిర్గమకాండములో దేవుడు ఆజ్ఞాపించిన ప్రత్యక్షగుడారములోనివన్నీ ప్రకటన గ్రంథములో పరలోకములో మరలా కనిపించుచున్నవి. పరలోకములో ఉన్న నమూనాను దేవుడు భూమికి తెచ్చెను.

1. ధూపపీఠము

మందిరము వెలుపల ఆవరణములో బలిపీఠమున్నది. అక్కడ అర్పిచు బలులు పాపమునకు కొలమానము. ఎక్కువ బలులు అర్పించుట అనగా సమాజములో ఎక్కువ పాపమున్నదని అర్థము. మందిరము లోపల ధూపపీఠమున్నది. ఇది స్తుతికి దైవానుకూలతకు కొలమానము. ధూపస్థంభము ఎత్తుకి పెరిగితే సమాజములో దేవునియెడల భయము, భక్తి, ప్రార్థనలు, స్తుతులు పెరిగినాయని అర్థము. ప్రకటన 5:8. ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

మందిరము వెలుపల బలులు శరీరానుసారమైన(ఆకర్షణీయమైన) పాతనిబంధన; మందిరము లోపల ఏడు సంఘములు(ప్రదీపములు) వాటి మధ్యనుండి లేచు ధూపము(మహిమ) క్రొత్తనిబంధన.

మందిరము లోపల "కొమ్ములనిమిత్తము పాప ప్రాయచిత్తము చేయవలెను" అనగా 7 సంఘములు వారి తప్పును బట్టి జాగురూకతతో మారుమసు పొందుట. దేవునియందు భయభక్తులతో ప్రకటనలో చెప్పిన ప్రకారము మారుమనసు పొంది కొమ్ములను(అతిశయమును) శుద్ధీకరించుటవలన ప్రభువు వద్ద మెప్పు కలుగును.

దైవసమాజములో పాప ప్రాయచిత్త బలులు తగ్గి; స్తుతి పెరిగినపుడు ధూప స్థంభము ఎత్తు పెరుగును. ఇశ్రాయేలు దైవానుకూలతను బట్టి ధూపస్థంభము పైకి లేచినపుడు వారు ప్రయాణము కొనసాగించిరి. దైవప్రజలలో స్తుతి తగ్గి సణుగు, అవిధేయత పెరిగినపుడు ధూపస్థంభము మాయమై వారు ప్రయాణము కొనసాగించలేకపోయిరి. మనము శరీరానుసార అశీర్వాదములకు పరిమితమై అర్పించు కానుకలు దేవుని మహిమను, ఆయనకిచ్చు స్తుతిని తగ్గించును కావున వధువు సంఘము చతికిలపడి భక్తిహీనుల చేతిలో పడును. వధువు సంఘ వరుసలోని వారు(సీయోను కుమార్తె) తమ పరిమళ సువార్త స్తుతిని వెదజల్లవలెను. వెలుపల బలిపీఠమువద్ద బలిని కోరు అనేక తోడేళ్ళను తరిమి కొట్టవలసిన బాధ్యత వధువు సంఘముపై ఉన్నది.

2. దైవప్రజల లెక్కింపు

దేవుడు చేసిన ప్రతీ సృష్టి ఖచ్చితమైన కొలతలతో నున్నది(యోబు 38:5). ప్రభువు చెప్పిన చిన్న చిన్న ఉపకరణములకు కూడ కొలత ఏర్పరిచెను. అయితే జనులను మాత్రము సృష్టితో కొలుచుట దేవునికి నచ్చని విషయము. ప్రజలు దేవునికి సంబంధించినవారు. ప్రజలను దైవ ప్రజలుగా మాత్రమే లెక్కించుట దైవ చిత్తము. మనిషి జన్మమును బట్టియు, నైజమును బట్టియు పాపియాయెను గనుక విమోచన క్రయధనము తప్పనిసరి అయినది.

తనప్రజలుగా జనాభా లెక్కగట్టు ప్రతీ ఒక్క భూరాజులను(ఉదా: దావీదు) దేవుడు శిక్షించెను. అంత్యకాలములో అంతిక్రీస్తు మాయోపాయము చేత ప్రజలందరిని తన ముద్రతో లెక్కించి గొప్ప పుండు(క్యాన్సర్) చేత బంధించును. కావున అంత్యకాలంలో విశ్వాసికి మెళకువ అవసరమైయున్నది.

3. సుగంధ తైలము

ఇది క్రీస్తుప్రభువు యొక్క సువర్ణ సువార్త సువాసనకు గుర్తు. కలపబడిన ఆయా సుగంధ ద్రవ్యములు ఆయా ఆత్మ వరములను సూచించుచున్నవి. వెదజల్లు పరిమళము ఆత్మ ఫలములు. కావున విశ్వాసి తన వేరులను(శ్రమలను) చూపవలసిన అవసరములేదు. రుచికరమైన ఫలము యొక్క పుష్టి, పరిమళము తమ వేరు యొక్క లోతును సూచించును. క్రైస్తవుడు తన ఫ్లేవర్(పరిమళమును) వెలుగులోనికి తేవలెను.

ప్రభువా! మమ్మును లోకమునకు పరిమళ తైలముగా ఉంచుమని వేడుకొనుచున్నాము. మా శ్రమయందు మిమ్మును స్తుతించగా వచ్చు ధూపస్థంభము వలన సరైన దారిలో మమ్మును నడిపించుమని వేడుకొనుచున్నాము పరమ తండ్రీ! ఆమేన్.


బహిరంగముగ ఫలితములు కన - బడకున్నవని అనవద్ధు = బహుగ అంతరంగమునందలి - ఫలములు నాకు కనబడుచున్నవి || మనో ||



జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 30 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter