నిర్గమకాండము 14 - ఎర్రసముద్రములో రక్షణ మార్గము



ప్రార్థన: రక్షణకర్తవైయున్న మా ప్రభువా! మందస్థితిలో ఆగిపోయిన మా జీవితములను "మీయొక్క గొప్ప అద్భుతములతో నడిపించుచున్న మీ మహత్కార్యములను" మేము గ్రహించి మీ యందు భయభక్తులతో జీవించు కృపను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.

క్రీస్తుప్రభువుయెక్క పునఃర్వాక్కు: నీ బలహీనత తట్టు చూడకు నా బలము తట్టిదిగో చూడుము = నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా చేయవలసెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులె కావలెను.

హెబ్రీయులు తాము వెట్టి పనులనుకొని చేసిన గట్టి కట్టడములు ప్రపంచములోకెల్లా అద్భుతమైనవి. అయితే దేవుడు ఎర్ర సముద్రమును రెండుపాయలుగా చేయుట అనునది ప్రపంచ చరిత్రలో ఏకైక మహాద్భుతము. ఈ అద్యాయములో చాలా ఆసక్తికర విషయములు ఉన్నవి. దేవుని ఆలోచననెరిగి నడుచుకొనుటవలను జీవితములో ఆశ్చర్యకార్యములు చూడగలమని ఇందును బట్టి తెలియుచున్నది.

గమనిక: ఈ అద్యాయములో దేవుడు, మోషే, ఫరో, దైవజనులు, ప్రజలు తమ చిరకాల స్వభావమును పూర్తిగా కనబర్చిరి కావున నైజము (instinct) అను పదము వాడబడినది.

1. పరిశుద్ధనైజము

నిర్గమ 14:1-4; దేవుడు తన రక్షణ మహాసంకల్పమును బట్టి కార్యములు చేయును. దేవునినైజము దైవప్రజల రక్షణార్థమైన పరిశుద్ధనైజము. తాను చేయుచున్న రక్షణ మహత్కార్యమునెరిగి ప్రజలను నడిపించెను. దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. తన తర్వాత అధికారము నరునిదే. నరుని కొరకు ఈ సృష్టి అంతా చేయబడినది. నరుడు దేవుని మాటకు అందుబాటులో లేని హీనస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు తీర్పు తీర్చుటకు తన సృష్టిని( ఇక్కడ ఎర్రసముద్రము ) వాడును.

2. రాజనైజము

నిర్గమ 14: 5-7; రాజనీతి పాపము కాదు గాని, తన ముందు చేయబడిన అనేక దైవకార్యములను తృణీకరించి "యెహోవా వారిని రక్షించునా" అను రాజనైజమే - ఫరో పాపమునకు పరిపక్వత. ఫరో ఇశ్రాయేలీయులను మాత్రమే ఐగుప్తు విడిచిపొమ్మనెను. కాని దైవకార్యములకు ప్రత్యక్ష సాక్షులైన అనేక ఐగుప్తీయులు(ఇంచుమించు 6లక్షలు, వీరినే అన్యులు అందురు) ఇశ్రాయేలీలతో కలిసి పారిపోయిరి. తన ప్రజలు కూడ వెళ్ళిపోవుట ఫరోకు అవమానమే. దేవుని ప్రభావ సైన్య సమూహములు ఐగుప్తును, ఫరోను వదిలివేసిరి. అయినను "హెబ్రీయులు నాకు దాసులు, నాకు సేవచేయవలెను" అను ఫరో రాజనైజము మేల్కొనెను. పశ్చత్తాపము దేవుని శాసనములను మార్చగల శక్తిగలది; కఠినత్వము పాతాళమునకు ఈడ్చుకొనిపోవు దురితనైజశక్తి.

3. మానవనైజము

నిర్గమ 14:8-10; 40సం.ల కఠిన బానిసత్వములో నలిగిన ప్రజలకు వెనుక నుండి ఎవరైన బలవంతము చేస్తే గాని ముందుకు కదలని జడత్వమును(అయ్యగారి పదము మందస్థితిని) వదిలించుటకు దేవుడు ఐగుప్తు సైన్యమును వాడుకొనెను. సంఘము మందస్థితిలో ఉండి శత్రుసమూహముల చేత బలవంత పెట్టబడుటకంటే దేవుని సన్నిధిలో చురుకుదనముతో పరుగెత్తుట మంచిది.

కష్టనష్టములు కలిగినపుడు దేవునికి మొరపెట్టుట మానవనైజము. ఏకష్టము లేకున్నను దేవుని ఆరాధించుట, స్తుతించుట భక్తినైజము. భక్తినైజము భారమైనపుడు కష్టములు కదిలి వచ్చును. దేవునికి మొరపెట్టే మానవనైజమును నడిపించు యంత్రము మనస్సాక్షి. మన మనస్సాక్షి జ్ఞానము యొక్క మాటను నిర్ల్యక్షపెట్టినపుడు మనిషిని బానిసనైజము పట్టుకొనును.

4. దురితనైజము

నిర్గమ 14:11; కష్టాల కొలిమిలోనుండి దేవునికి మొరపెట్టినను; వెంటనే అవిశ్వాస స్వభావముతో నిరీక్షణను కోల్పోవుట దేవదూషణకు దారితీసి చివరకు దురితనైజములో పడవేయును. విశ్వాస నిరీక్షణ సమయములో దేవునికిచ్చు ఓపిక/సహనమును ఈ దురితనైజము హరించివేయును. ఈ దురితనైజపు వేరును పెరికివేయుటకు దేవుని పరిశుద్ధనైజము ఇక్కడ పనిచేయవచ్చినది.

6. బానిసనైజము

నిర్గమ 14: 12; ఎంతగొప్ప విశ్వాసి అయినను దైవసహవాస సన్నిధిలోకంటే ఈ లోకముతోనే ఎక్కువ సమయము గడుపును. దేవుని ప్రణాళికను బట్టి ప్రత్యేకపరచబడి, పరిశుద్ధనైజమును కలిగివుండుటచేత లోకము నుండి విడిపింపబడి; సంఘములో ఎక్కువ ఆనందమును, ఆశీర్వాదమును కలిగినను, మనము ఇంకనూ చురుకుగా ముందుకు దూసుకుపోవుటకు దైవానుసారమైన శ్రమలు కలిగిన వెంటనే మనలోనున్న బానిసనైజము బైటికి వచ్చును. దీనిని జయించుటకు నాయకనైజము అవసరమైయున్నది.

7. నాయకనైజము

నిర్గమ 14:13-30; దేవుని శిక్షణలో పొదిగిన మోషే నాయకనైజము ఇక్కడ బయటపడినది. సమన్వయకర్తలైన(Interfacing with many departments) నాయకుల ముఖ్య లక్షణములు


8. భక్తినైజము

నిర్గమ 14:31; తాము ఎన్ని శోధనలు/శ్రమలగుండా వెళ్ళినను దైవకార్యములను చూచినవెంటనే దేవునివైపు మరలి, దైవ ఉనికిని గ్రహించి, దేవునియందు నిరీక్షణ ఉంచి, ఆయనను స్తుతించు హృదయ పరివర్తనే భక్తినైజము. భక్తినైజము గలవారు మత/మిషను/సంఘ భేదము లేక సువార్త సువాసన ఎక్కడున్నను ఆ పరిమళమును గ్రహించి వారు తమ స్వస్థలములో(సొంత సంఘము) నుండియే దేవుని స్తుతించెదరు. ఎన్ని సార్లు తప్పిపోవుచున్నను దేవుడు మానవులను వదలకుండుటకు గల కారణము మనిషిలోని భక్తినైజము.


దేవుడు తన పరిశుద్ధనైజ సంపదను మనలో ఉదయింపజేసి దైవకార్యములు చూడగల్గు భక్తినైజమును వెలిగించి, నాయక నైజమును వృద్ధి చేయును గాక! ఆమేన్.



జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.

పరిచయం | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 14 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | తైలాభిషేకపండుగ

Social Presence Facebook G+ Twitter

ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.

  • Like this page on Facebook

  • Tweet this page on Twitter