నిర్గమకాండము 24 - సీనాయిపై మోషేకు సూచన
ప్రార్థన: ప్రభువా! మీ స్వరూపమందు మమ్మును సృజించి, మమ్మును కాయుచున్న దేవా! మీకు వందనములు. మీ నిబంధనలో మేము కొనసాగు కృపను దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.
1. పరిచయం
మొదట ఆదాము దేవునితో నిత్య సహవాసము కలిగి పరదైసునుండి ఏదేను వరకు హాయిగా సంచరించెను. తర్వాత దైవ లోక సంగతులు ఎవరికిని తెలియదు. కాని దైవ ఉనికి ప్రత్యక్షతలో తరచుగా ఒక నమూన అనగా క్రమపట్టిక(Pattern) కనబడును. 1. సింహాసనం ఉన్న అతిపరిశుద్ధస్థలము 2. పరిశుద్ధస్థలము ... మొదలగునవి. అదేవిధముగా పండ్రెండు స్తంభముల నమూనా కూడ పరలోక వైభవమును సూచించుచున్నది. ఇప్పటివరకు దేవుడు మోషేతో తప్ప ఎవరితోను మాట్లాడలేదు కాని ఇక్కడ ఇశ్రాయేలు పెద్దలకు కూడ ప్రత్యక్షమాయెను; కాని దేవుడు ఉన్న స్థలము వేరు, మోషే ఉన్న స్థలము వేరు, పెద్దలు ఉన్న స్థలము వేరు.
హెబ్రీయులను ఐగుప్తు నుండి విడిపించి, వారిని వాగ్ధాన దేశమునకు దేవుడే (అడుగడుగున ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ) నడిపించుచున్న సంగతి ఇపుడు పెద్దలందరికి తెలిసినది.
దేవుడు తన భక్తులకు చెప్పకుండ ఏదియు చేయడని అయ్యగారి అనుభవమును బట్టి చెప్పిరి. ఇశ్రాయేలు ఏర్పడిన వెంటనే దేవుడు పరలోక నమూనాను వారి మద్య నిలబెట్టెను(Nation aligned as per heavenly pattern). అదేవిధముగా దైవాత్మ సంచరించు సంఘములో క్రమము, దైవ భీతి తప్పక ఉండును; సహవాసంలో దైవసన్నిధి వైభోగము కనిపించును.
2. పరలోక స్పృహ
సర్వ సమాజము మోసుకొచ్చిన అన్ని వ్యాజ్యములకు పరిష్కార చట్టమును దేవుడు దయచేసెను. కాని వారి సమస్యలలో ఏ ఒక్కటి కూడ, మొదటి 5 ఆజ్ఞలకు సంబంధించినది కాకుండా; అన్ని భౌతికపరమైన చివరి ఆజ్ఞలైనందున దేవుడు దైవలోక నమూనాను చూపించుటకు 6వ సారి మరలా మోషేను కొండకు పిలిచెను (6th of 8 times).ఇశ్రాయేలీయులు తమ కఠినత్వమునుండి మారుమనసు పొందిరి కాని ఇంకను రూపాంతరము చెందలేదు. వారి మారుమనసుకు తగిన ఫలము ప్రజలందరు ధర్మశాస్త్రమును అంగీకరించి అనుసరించెదమని నిబంధన చేసిరి. దీనినే మోషే నిబంధన అందురు(Mosaic Covenant). సిలువ రక్తముచేత ఏర్పడిన క్రొత్తనిబంధనకు సూచనను దేవుడు ఇక్కడ మోషేకు అందించెను.
పైన పటములో చూపినట్లు, బైబిలులో 7 ప్రాముఖ్యమైన నిబంధనలు ఉన్నవి.
ప్రభువు ఏర్పరిచిన ఏదేను నిబంధన(1వ) మరియు యేసుక్రీస్తు నిబంధనలు(7వ) ఆత్మానుసారమైనవి. రెండవ నిబంధన కేవలం శరీర సంబంధమైనది. మిగిలిన నిబంధనలు(3,4,5,6) ఆత్మ ప్రేరణచేత దైవప్రజల రక్షణార్ధముగా ఇవ్వబడెను.
మన సిద్ధబాటును బట్టి దైవ మహిమ అంతస్థు ప్రత్యక్షమగునని ఈ అద్యాయము తెలియజేయుచున్నది.
మారుమనసు, రక్షణ దగ్గరే అగిపోకుండ ప్రభువు కాడిని/శ్రమను ఎత్తుకొని మహిమ నుండి పరలోక మహిమ స్థానము వైపు చేరుటకు రూపాంతరము చెందుదుము గాక!
పదజాలము:
1. మారుమనసు: దైవ ఉనికి గ్రహింపు, మనసార అంగీకరించుట.
రెండు శబ్దముల(సౌండ్స్) లేదా రెండు వాసనల బంధము లాంటిది; ఏది ఎక్కువగా(ఉదా: మంచి వాసన) ఉంటే అదే ఉన్నట్లు ఉండును కాని తక్కువగా(ఉదా:చెడు వాసన) ఉన్నది కూడ సహజీవనం చేయుచుండును. మంచి తగ్గినపుడు చెడు కనిపించును.
2. రూపాంతరము: అనవసరమైనవి వదిలివేసి, దైవ మార్గంలో ప్రయాణించుట. వెలుగు చీకటి బంధము; వెలుగు వస్తే చీకటి ఉండదు. దైవలక్షణము వచ్చిన వెంటనే చెడు మనసు మాయమైపోవును. నూతనసృష్టిలో ఆనందము. నిర్గమ 23:28-30 - దుష్టశక్తి పెరికివేయబడినపుడు వాక్యము మనలో నివసింపకపోతే మనకు విరోదముగా మృగములు లేచును. మనలోని ఆత్మ బలము పెరుగుకొలది శత్రువులను దేవుడు తరిమికొట్టును. యోహాను 14:26,27 లో ఉన్నది పట్టుకొనకపోతే మత్తయి 12:44,45 కు దారితీయును.
ఇశ్రాయేలు మారుమనసుకు పరిమితమౌట వలన మోషే దేవునితో ఉన్న 40రోజుల ఎడబాటులో వారిమద్య దైవ ఉనికి తగ్గి, ఐగుప్తు ఆత్మ పైకి లేచినది.
జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు ప్రతిరోజు నిర్గమకాండములో ఒక అద్యాయమునందు గల విశేషములు ధ్యానించుటకు ప్రభువు కృప దయచేయును గాక! ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగ.
Social Presence
ఈరోజు ధ్యానములో ప్రభువు అందించిన విషయమును క్లుప్తముగా ఇక్కడ వ్రాయండి.
-
Like this page on Facebook
-
Tweet this page on Twitter
Tweet