(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

2వ పాఠము(శత్రువులయెదుట భోజనము)



దా.కీర్త. 23:1; మార్కు 14:22; 1కొరింధి. 11:23-29


పాపశుద్ధి:- శరీరబలము కొరకు నీ శరీర రక్తములు సిద్ధపర్చినందుకు వందనములు, అయోగ్యులము. పాపులము నీ శరీరాహారము పుచ్చుకొనుటకు మాకు నేర్పించుము, నీవాక్య వర్తమానము అందించుము. జ్ఞానము, విశ్వాసము, ప్రత్యక్షతను, వాక్యమును దీవించుము అయోగ్యంగా పుచ్చుకొనకుండా యోగ్యంగా పుచ్చుకొనే కృప దయచేయుము. దయ్యములను వెళ్ళగొట్టుము. దూతలను కావలి ఉంచుము మాకు నీ భోజనముయెడల అపేక్ష శ్రద్ధ, గౌరవము, అభిమానము దయచేయుము అని వేడుకొంటున్నాము ఆమేన్.


సంస్కారమును జ్ఞాపము తెచ్చుకొను విషయములు చివరముగా సువార్తలలోను పాతనిబంధన క్రొత్తనిబంధనలలోను ముఖ్యంగా ప్రకటనలోను యున్నది. వాటిని తలంచి బల్లయొద్దకు రావలెను. వాటిలో ఒకటి తలంచవలెను. దా.కీ. 23:5 వాక్యము మనకు కంఠత వాక్యం; దానిని వివరించుకొందాము.


ఈ వాక్యములో రూపం ఎలాగు తలంచాలి. నా శత్రువులు అనగా బైట మన శత్రువులున్నారని తలంచండి భోజనము ఈ బల్లపై యున్నవని తలంచండి. శత్రువులు మనవైపు చూస్తున్నట్లును ప్రభువు బల్లవద్ద నిలువబడి యున్నాడు. ప్రభువు నాకు సిద్ధపరచియున్నాడు. పుచ్చుకొనువారు బల్లయొద్ద కూర్చుండియుందురు. సిద్ధపర్చిన ప్రభువు పుచ్చుకొను విశ్వాసి, శత్రువులైన సైతాను ముగ్గురున్నారు. ప్రభువు బల్ల, భోజనము, సైతాను, విశ్వాసి, భోజనము ఎన్ని సం॥ల నుండి సిద్ధపర్చుచున్నారో ఆ కళలన్నీ ఉన్నవి. దేనికళ దానిదే. అన్నిటిలో కష్టమైనది. ప్రభువు మన నిమిత్తమై ఈ భోజనము సిద్ధపరచుట కష్టమైన పని.


మన భోజనము:- వడ్లు దంచి బియ్యంచేసి బజారుకు వెళ్ళి కూరలు తెచ్చి సిద్ధపర్చుట కష్టమని స్వంత అనుభవమువల్ల ఈలోక భోజనంవల్ల తెలిసికొంటున్నాము. ఇది అశాశ్వత భోజనము ప్రభువిచ్చే శాశ్వత భోజనము.

పాపి, బీదవాడు, అయోగ్యుడు లోకస్తుని మార్చి సిద్ధపర్చి బల్లకు చేర్చే యింతగొప్ప పని నమ్ముటకు వీలులేదు. జ్ఞానం ఒప్పుకోదు. మనస్సాక్షికి వీలులేదు. అయినను నమ్మే విశ్వాసము ప్రభువు మనకు ఇచ్చినాడు. ఇది ఆయన కృప సిద్ధపరచుట నిలువబడుట మనలను రానిచ్చుటయొక కృప. మనలను రానిచ్చుట రెండవ కృప ఆయన అన్నియు సిద్ధపర్చినను మనము యోగ్యులముగా పుచ్చుకోకపోతే లాభమేమిటి? మేము అయోగ్యులముగాను. గౌరవములేనివానిగాను శ్రద్ధలేనివానిగాను వచ్చియున్నానని ఒప్పుకొని బల్లయొద్దకు పోవలెను.


శత్రువు సిద్ధపర్చుట, ప్రభువు నాకు, నన్ను పిలుచుట నేను అనుభవించుటకు అన్ని సిద్ధపర్చి నన్ను పిలుచుచున్నాడు. నేను వెళ్ళకపోతే ప్రయోజనమేమి? మోక్షం చాలా విశాలమైనది. ఇంకా స్థలమున్నది నన్ను పిలిచుచున్నాడు.

మీరు నమ్మిన నమ్మకపోయినా గౌరవించినా, గౌరవించకపోయినా ఆయన పిలుచుచున్నాడు. పై రెండు గుణములతో బల్లయొద్దకు రండి ప్రభువు అంతా సర్దుకొని బల్లయొద్ద కూర్చున్న ప్రభువు దయారస ముఖము. భోజనము. ఆయన మనకు పడిన శ్రమ అంతాచూచి సంతోషిస్తూ రావలెను.

జ్ఞానం:- కుదరకపోయినా పరవాలేదు. ప్రభువెందుకివ్వాలనే మనస్సు వస్తే ఎంత చెప్పిన అర్ధముకాదు, నమ్మండి. “నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము”.


పేతురు నీకు, యోహాను నీకు ప్రభువు ఎదుకిలాగిచ్చెను తెలుసునా, యాకోబు నీ మాట మరెందుకు పుచ్చుకోవడం ప్రభువు యిస్తున్నాడు గాన పుచ్చుకుంటున్నాము. విశ్వాసం వల్ల అంత గ్రహిస్తాము జ్ఞానంవల్ల కొంత గ్రహిస్తాము విశ్వాసము గొప్పది.


సాదృశ్యము:- డొంక ఉన్నది. పొద ఉన్నది, చెట్లున్నవి, మొక్కలు ముండ్ల కుప్పలున్నవి. దూరంగా పెద్దపులి ఉన్నది. ఎలుగుబంటి ఉన్నది. నక్క ఉన్నది. ఇక్కడ గొర్రెపిల్ల ఇక్కడ గొల్లబోయాడు చేతిలో డొంకి కర్ర ఉంది. పొద యొద్దకు వెళ్ళి చెట్లు కర్రతో వంచి గొర్రెపిల్లకు ఆహారం పెట్టెను. క్రూర జంతువులన్నిటికి గొర్రెపిల్ల కనిపిస్తుంది. వాటి కండ్లు గొర్రెపిల్లను చూస్తున్నవి. గొల్లటోయవాడు మెత్తని మేతవేయగా గొర్రెపిల్ల తినగలదా? తినకుండ అవి చేయగలవా? తిన్న తరువాత గొర్రెపిల్ల క్రూర జంతువులు తినగలవా?


దుడ్డు కర్ర:- శత్రువులను కొట్టుటకు వచ్చేవు సుమా నా చేతిలో కర్ర ఉన్నదనగలడు.


దండము:- గొర్రెపిల్లను వెనుకకు లాగుటకు ఏ భయములేకుండా గొర్రెపిల్ల బాగా చూస్తు మేస్తు ఆకలి తీర్చుకొనుము, గొల్లవాడు మేపుచున్నాడు గాన క్రూర జంతువులు ఏమి చేయలేవు. గొర్రెపిల్ల సంతుష్టి పొందవలెను. నేను గొర్రెపిల్లకు ఉత్తమ కాపరిని నా గొర్రెలు నా శబ్ధము వినును అనగా

యిట్టి విశ్వాసులే ఈ బల్లయొద్దకు రండి. విశ్వాసం కుదుర్చుకొండి. సైతాను దయ్యాలు అంతిక్రీస్తు అబద్ధ బోధకులు మన శత్రువులు స్వంత ఇంటిలోనే శత్రువులుందురు. ఎక్కడబడితే అక్కడే శత్రువులు ఈ కాలంలో ఉన్నారు గాన శత్రువులయెదట మనకు భోజనం సిద్ధపర్చియున్నాడు. శత్రువులు, సైతాను, దయ్యాలు, జబ్బులు పాపాలవైపు నరకం, హేడెస్సు 7 సం॥ల పరిపాలనవైపు నీకేమి పని నావైపు నా భోజనం వైపుచూచి కడుపునిండా భోజనంచేయుము. అది ప్రభువుయొక్క దయారస రూపకళ “నీకును నీ సంఘమునకు”.


బైబిలులో ఏదెను తోట హేబెలు, నోవహు, అబ్రాహాము కథలు ఐగుప్తులో ఉన్న యోసేపు కథ పాలెస్తీనా కథ షద్రకు, మేషాకు, అబెద్నెగోలు రాజగృహములో భోంచేసిన కథలన్నియు ప్రభువు భోజనమును జ్ఞాపకము చేయుచున్నది. పై కథలన్నిటిలో యీ భోజనముయొక్క మూలములు దొరకకమానవు.


ఐగుప్తులో యున్నవారు ఇశ్రాయేలీయులైన దేవుని జనులకు శత్రువులై యున్నారు. అనేక హింసలు హింసుల పొందిరి. తిండికి వారికేమి కష్టములేదు. వీరు ఫలవంతమైన గోషెనులో యున్నారు. ఐగుప్తు శత్రువుల యెదుట ఎన్నిక జనమునకు భోజనం సిద్ధపర్చెను. ప్రయాణములో నదులు నీళ్ళు, వీధులు, వ్యాపారులు లేకపోయినను 40 సం॥లు సమృద్ధిగా తిన్నారు. నాగిన్నె నిండి పొర్లుచున్నది.

అరణ్యందాటి పాలెస్తీనా వెళ్ళండి. కట్టని ఇండ్లు, వేయని తోటలు ఉన్నవి. అనుభవించండి. అరణ్యములో ఎదిరించి ఐగుప్తులో 400సం॥లు చెరలో ఉన్నవారికి ఎంత రాజభోగము ఈ కథ మనకు ఆదరణ కలుగజేయుచున్నది.


ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దేశ శత్రువుల యెదుట గోషెనుదేశము వచ్చెను. అరణ్యములో 40 సంలు వారికి శత్రువులయెదుట భోజనపు బల్లవేసెను. ఎంత ఆశ్చర్యము.


గలిలయ ప్రక్కన పచ్చిక బయళ్ళు, గలిలయులు, సమరయులు అంతా విరోధులే యేసుప్రభువు 5వేల మందికి భోజనము పెట్టినాడు. మనందరమునూ తన యెరూషలేము వెళ్ళితే పెండ్లి కుమారుడు ఎవరిని పిలుచునో వారికిన్నీ పెండ్లి కుమార్తెకు విందు దేవదూతలయెదుట విందు జరుగును. అన్నిటికంటే మహా గొప్పది.


పాతాళములో:- అంతెక్రీస్తు, అబద్ధ ప్రవక్త సైతాను చూస్తుండగానే సిద్ధపరచియున్నాడు. ఈ విందు శక్తి పరలోకము వరకును అనంతకాలం వరకును విందుయొక్క శక్తి అక్కడక్కడ వరకు వస్తూనేయుండును.


ప్రార్ధన:- దయగల ప్రభువా! శరీరమునకు లోకాహారం, ఆత్మకు శరీరానికి సంస్కారవిందున్నూ నూతన యెరూషలేములోను మహాగొప్ప పెండ్లి విందు సిద్ధపర్చినావు. మూడుబల్లల గూర్చి మూడు విందులనుగూర్చి నీకు స్తోత్రములు ఆమేన్.