(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
14వ పాఠము(సృష్టి బల్ల)
కీర్తన 119:103; లూకా 22:14 1కొరింధి.. 11:23-26
సంస్కార భోజన ప్రియులారా! మీకు ఈ భోజనముయొక్క ఉద్దేశము తెలియునుగాక! దీనివలన మీకు ఎప్పటికప్పటికే మితానుభవము కలుగునుగాక!
నిన్న భోజనము చేసిన మనము ఈవేళ నాకు భోజనము అక్కరలేదని ఎవ్వరు చెప్పరు. అలాగే ఇదివరకు ప్రభుభోజనము అనుభవించిన మనము ఈవేళ అక్కరలేదని చెప్పము.
సాధుసుందర్ సింగ్ అను పరమభక్తుడేమన్నాడనగా ఇచ్చేవారుంటే ప్రభు భోజనము ప్రతిదినము తీసికుంటానన్నాడు. శరీరాహారము ప్రతిదినము తీసికొనుట లేదా? అన్నము ప్రతిదినము తిన్నట్లు ఇది ఆత్మకు అన్నము. ఈవేళ సంస్కార భోజనము వంకమీద ఇతర భోజనములుకూడా జ్ఞాపకము చేస్తాము. నేనెన్ని చెప్పబోవుచున్నానో వాటన్నిటికి బల్లభోజనము అనిపేరు. వాటన్నిటికి ఒకటేపేరు. సంతర్పణ. వాటన్నిటికి ఒకటేపేరు విందు. వాటన్నిటికి ఒకటేపేరు బంతి భోజనము. బల్లభోజనము మనకంటికి కనబడనిగాలి మీదిబల్ల, ఈ గాలి బల్లమీద రెండు పాత్రలు, అవి ఏవనగా
- 1) ఖగోళపాత్ర
- 2) భూగోళపాత్రలని రెండున్నవి.
ఖగోళ శాస్త్రములో మనమనుభవించవలసిన కాంతులున్నవి. ఇవి తినవలసినవి కాదుగాని అనుభవించవలసినవి.
-
1. వర్షధార:- ఇది శరీరములోనికి అన్నముతోపాటు వెళ్ళవలసినదే. ఇది తినవలసినది కాదుగాని త్రాగవలసినది. గాలిబల్లమీద
ఖగోళ,
భూగోలున్నవి. భూగోళపాత్రలో
- 1) మనము తినవలసిన పండ్లు చాలా ఉన్నవి.
- 2) మనకు సహాయముచేసే పశ్వాదులున్నవి. మనకవసరమైన జలరాసులు, సముద్రము, నదులు, కాలువలు, చెరువులు గుంటలున్నవి.
- 2వ బల్ల:- ప్రభు భోజన సంస్కారబల్ల గాలి బల్లమీద ఈ బల్ల ఎందుకు గొప్పదనగా ప్రభుయేసుయొక్క రక్తమాంసములకు సూచన. ఇది అనుభవించుట వల్ల శరీరాత్మలకు బలము. ఈ గాలి బల్లలో ఉన్నవి. శరీరానికి ఎలాగో సంస్కార బల్లలోనివి ఆత్మకు అలాగున్నవి.
- 3వ బల్ల:- దీనినిగూర్చి బోధించుట చాలాకష్టము. దీనినిగూర్చి విన్నవారు వందమంది ఉంటే ఇద్దరికే అర్ధమగును. ఈ బల్ల దగ్గరకు స్వయముగా యేసుప్రభువు దర్శనములోనికి వచ్చి పాదిరిగారివలె రొట్టె ద్రాక్షరసము ఇచ్చును.
ఈ దినం గుడిలో మీరు పొందు రొట్టెవంటిదికాదు. అట్టి ద్రాక్షరసమును కాదు. అది ఆత్మీయమైన రొట్టెబిళ్ళ ఆత్మీయమైన ద్రాక్షరసము. ఆ మూడవ బల్లమీద ఉన్నది పుచ్చుకున్నవారికే తెలియును. ఇతరులకు తెలియదు కనబడదు.
సన్నిధి కూటములలోనికి ప్రభువు వచ్చి ఈ రొట్టె ద్రాక్షరసము దర్శనములో ఇచ్చేది తీసికొనవలయునని చెప్పుచున్నారు. ప్రభువు ఇస్తూ ఇట్లు చెప్పుచున్నారు. సన్నిధిలో నేనిస్తున్నానని పాదిరిగారి ఇచ్చేది మానివేస్తారేమో మానవద్దని చెప్పుచున్నారు. అప్పుడడిగాము గుడిలో తీసికోమంటున్నారు. మీరెందుకిస్తున్నారని అడుగగా పాపనైజము, పాపేచ్చను పూర్తిగా క్రమముగా మీలోనుండి అంతరింపజేయుటకై నేనిస్తున్నానన్నారు.
ప్రభువు ఇచ్చేటప్పుడు క్రమముగా పాపములొప్పుకొనుట, పాపేచ్చ ఉండదు. గుడిలో ఇచ్చేదానికి ఉండును. సన్నిధిలోని అంతరంగ సంస్కార భోజనము వల్ల రెంటిని తొలగించినారు.
రేపు ప్రపంచములో శత్రువులవల్ల క్రైస్తవులకు అన్ని రకములుగా శ్రమలు రానైయున్నవి. అట్టి హింసలురాగా గృహము విడిచి ఆలయమునకు శత్రు భీతివలన రాలేము. ఈ హింసలవలన దేవాలయములో పుచ్చుకొన వీలుండదు.
ఆ కాలములో క్రైస్తవులు పాదిరిగారు గుడికిరారు. అప్పుడు సన్నిధిలో పుచ్చుకొనుటకు అలవాటుపడిన మనకు మన యింటిలోనే ఒక్కరున్నా ఇద్దరున్నా ఇస్తాడు. ఎంతో కృప మీ గృహములో అంతరంగ భోజనము తీసికొనుట అనేది అలవాటు చేసికొండి. ప్రభు భోజనము అనగా అంతరంగ భోజనము. మీ ఇంటిలో నలుగురున్నా ఇద్దరికే ఇస్తారు. నలుగురుంటే ఇద్దరికే ఇచ్చారు. అందుచేత ఇంటిలో ఎందరుంటే అందరు పుచ్చుకొనుటకు ఇప్పటి నుండే సిద్ధపడండి. అయ్యగారికి అలవాటు. ఏది త్రాగుచున్న మూడు దృశ్యాలు జ్ఞాపకము తెచ్చుకొంటారు.
- 1) సిలువపైవున్న ప్రభువును
- 2) అంతరంగ సంస్కార భోజనమును
- 3) పాపము చేయడానికి ముందు త్రిత్వ దేవుడున్నాడు.
ఆ ముగ్గురిని తలంచుటకాదు. ఎప్పుడైతే పాపము ప్రవేశించినదో ఈ ఒక్కటైయున్న త్రిత్వము వేర్వేరుగా అయిపోయి మనిషిని రక్షించుటకు మూడు పనులు చేసిన స్థితిని జ్ఞాపకము చేసికొంటూ ఉన్నారు. అలాగుచేసినందున ఎప్పటికైన గొప్ప మహిమ స్థితి లభించును. ఎంత మహిమ అనగా
1) సిలువెంత గొప్ప మహిమగలదో, అంతరంగ భోజనమెంత గొప్ప మహిమగలదో రక్షణార్థమై ఈ ముగ్గురు వేరగుట ఎంతగొప్ప మహిమగలదో, అంత గొప్ప మహిమ. ఆ తలంపు వలన ఎప్పటికైనా లభించును.
యెషయాలోని ఉపమానములో (యెషయా 27:3). తోటమాలి ప్రతి మొక్కకు ప్రతి నిమిషము నీళ్లు పోస్తున్నారు. దానినిబట్టి అయ్యగారి ప్రార్ధన ప్రతి మనిషిని, ప్రతి మొక్కను, ప్రతి జంతువును ప్రతి నిమిషము దీవించుము. అన్నియు మరొక క్రొత్త మాట ప్రభువే చెప్పిరట. మనకర్ధము కాకపోయినా ప్రతినిమిషము అంతరంగ సంస్కారము పుచ్చుకొంటున్నారు.
దేవా! నీవు ప్రతి నిమిషము ఇచ్చుచున్నట్టు ప్రతినిమిషము పుచ్చుకొనే శక్తి ప్రార్ధన చేయాలి. అయ్యగారన్నారట ౩ నెలలు లేక ఒక నెలకొకసారి పుచ్చుకొంటాము, ప్రతినిమిషము ఎక్కడ పుచ్చుకొను అన్నారట. “యేసు నీ తలపె నాకు”.
మీరే ఆలాగు పుచ్చుకొనుట మీకే కష్టమైతే యేసు నీ తలపె నాకు అనే పాట ఏలాగు పాడుతున్నారు. నాతలంపు కలిగియుండునుటద్వార ప్రతి నిమిషము పుచ్చుకొన్నట్టే. ఈ మాట చెప్పినందుకై అధైర్యపడవద్దు ఆ తలంపు కలిగియుంటే పుచ్చుకొన్నట్టె.
ఈ దేవాలయము అన్నదాన సమాజముగా అన్ని వినిపించును. పరలోకములో రెండవరాకడ తరువాత 7 సం॥లు విందు జరుగును. వాటన్నిటికంటే గొప్ప విందు పరలోకములోని విందే. 7 సం॥రాలు విందు రెండవ రాకడకు సిద్ధమైన వారికేగాన మీరందరు ఆ విందుకు తయారుకావలెనని హెచ్చరించు చున్నాము. ఆమేన్.