(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
24వ పాఠము(గొర్రెపిల్ల విందు)
“గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులు” ప్రక 19:19.
ప్రార్థన: - యేనుప్రభువా! నీవు మాకు భూలోకములోను, పరలోకములోను సిద్ధపరచుచున్న విందు నిమిత్తమై నీకు వందనములు. భూలోకములో సంస్కార భోజనము, పరలోకములో నీ సహవాస భాగ్యమనుగ్రహించుచున్నందుకు వందనములు. మాకు సంస్కార భోజనమందించుమని త్వరగా రానైయున్న ప్రభువు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.
సంస్కార భోజన విశ్వాసులారా! ప్రభువు రాత్రి భోజనమును గూర్చి ధ్యానించుకొందము. ఈ దినము ప్రభువు రాత్రి భోజనము స్థాపించిన దినము గనుక సంఘములో సంస్కార భోజనమాచరించుచున్నాము.
- పస్కా గొర్రెప్లిల విందు:- నిర్గమ 12 అధ్యాయము. ఇశ్రాయేలీయులు 43 సం॥లు అన్యులమధ్య ఐగుప్తీయుల మధ్యనున్నారు. ఐగుప్తీయులు శత్రువులు. వీరిద్వారా శ్రమలు, శోధనలు, కష్టములు కల్గినవి. అయినను ప్రభువు వారితోనే యున్నారు. గొర్రెపిల్ల రక్తము అన్యులకు ఇశ్రాయేలీయులను వేరుపరచినది అనగా ప్రత్యేకింపబడినారు. గొర్రెపిల్ల రక్తమువలన ఐగుప్తు దాస్యమునుండి విమోచింపబడినారు. అలాగే దేవుని గొర్రెపిల్ల రక్తముద్వారా భూలోక దాస్యమునుండి విమోచింపబడినాము. ఐగుప్తీయుల శక్తికంటె ఇశ్రాయేలీయుల శక్తి గొప్పదని ఐగుప్తీయులు సాక్ష్యమిచ్చిరి నిర్గ. 8:19. వారికి దైవశక్తినిచ్చి మరణము లేకుండా చేసియున్నావు. ఇశ్రాయేలీయుల ప్రత్యేకత ఐగుప్తీయులకర్థము కానట్లు యేసునందున్న వారి ప్రత్యేకత లోకమునకర్థముగాదు.
-
2. శరీరాహారము:- యోహాను 6:54 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కానానుకు వెళ్ళిపోయె సమయము వచ్చినది (పస్కావిందు).
అలాగే
లోకమునుండి సంఘము పరలోకమునకెళ్ళిపోవును గనుక ప్రభువు శరీర రక్తముల విందు. గొర్రెపిల్ల రక్తము వారిని మరణములేకుండ
రక్షించిన
రీతిగానే ప్రభువు మనలను మరణము లేకుండ మోక్షమునకు నడిపించును.
- 1) శరీరాహారము తినకపోయిన యెడల చనిపోవుదము
- 2) వాక్యాహారము లేకపోయిన ఆత్మ నశించిపోవును.
- ౩) సంస్కార భోజనమును పుచ్చుకొనకపోతే పరలోక రాజ్యములో ప్రవేశింపలేము.
- 3. వాక్యాహారము:- దా.కీ. 19:10 1పేతరు 2:3. పాపముపోయిన తరువాత బలమును పొందవలెను. బోధన అనగా వాక్యోపదేశమును వినడమే తినడముతో సమానము. వాక్యాహారము తిని బలమును పొందవలెను. వాక్యము అనుదిన దీపము, ఆహారము. శక్తి బలము, ఆశీర్వాదము. మరియు (వాక్యాహారము తిననియెడల బలమాత్మకు లభించుటెట్లు) ఆకలి వేసినపుడు ఆహారమునకు తొందరపడినట్లు వాక్యాహారము కొరకు తొందరపడుచున్నామా? ఈవేళంత పనులు పనులు, ఉదయమునుండి పరుండబోయే వరకు పనులు. ఈవేళ బైబిలు చదవలేదు చూడలేదనుకుంటారు. ఎన్ని పనులున్న కునుకుపాట్లు వచ్చిన ఆశతీర బైబిలు అనుదినము చదువవలెను. అనుదినము ఎవరు బైబిలు చదివెదరో వారు వాక్యానుభవముగలవారగుదురు. అట్టివారు ప్రభువు బల్లయొద్దకు రాగలరు. ఎవరు బోధలను శ్రద్ధతో విందురో వారే బల్లయొద్దకు రాగలరు. వాక్యము చదవనివారు వాక్యార్ధము తెలియనివారు ఏ ముఖము పెట్టుకొని తగుదునాయని బల్లయొద్దకు రాగలరు. ఇటువంటి ప్రశ్నలు మరియొకరు మనకు వేయకుండగానే సిద్ధపడి బల్లయొద్దకు రావలెను.
- 4. సంస్కారాహారము:- కొరింథి 11:24 సృష్టికర్తను ఆహారముగా అనుభవించుట అనగా సృష్టిలో నుండుటకాదుగాని సృష్టికర్తలోనే లీనమైపోవుట అనగా ఏక శరీరము (ఏకత్వము) యేసులో మనము అలాగే మనలో ప్రభువు ఏకమయ్యే విందు (కుమారుని విందు). తండ్రి అరణ్యములో చేసిన విందుకంటె కుమారుని స్వరక్తముల విందు అద్భుతకరమైన విందు. ప్రభువు భోజనము అనగా ప్రభువుయొక్క శరీర రక్తము ఆయన నోటనుండి బయలుదేరినది. దీనివలన ఆయననే మనము కలిగియుందుము. గనుక ఈవేళ వచ్చి రొట్టెను యే ప్రకారముగ తిందుమో ద్రాక్షరసము త్రాగుదుమో ఆ విధముగానే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుదుము. ఇట్టి అనుభవస్థితిలేని యెడల పరలోకమునకు ఆయన పిలిచినపుడు వెళ్ళలేము. అయోగ్యముగా పుచ్చుకొనుటకంటె మానివేయడము చాలమంచిది. ఆకలిగల్గియుంటేనే పుచ్చుకొనుటకు రండి. ఆయన శరీరము రక్తము కావలెననెడి ఆత్రుత ఆశ లేకపోతే రావద్దుగాని నేను తీసికొనవలెననెడి వేగిరబాటుండవలెను. అప్పుడు ఆయన శరీర రక్తములు మన అనుభవములోనికి వచ్చును.
- 5. జీవాహారము:- యోహాను 6:51. లోకమునుండి సంఘము ప్రత్యేకింపబడి మేఘములోనికి వెళ్ళును. సజీవముగా మేఘములోనికి అనగా రెండవ రాకడ తలంపు కలిగినవారు మాత్రమే వెళ్ళగలరు. లోకములో ఎవరికిని లేని ఇవ్వని మహిమ భోజనము నరులకివ్వబడినది. ఇది పరిశుద్ధాత్మ తండ్రి విందు. శ్రమలలో విమోచింపబడినవారే వెళ్ళగలరు. పరలోకపు విందు ఏడేండ్ల విందు. భూలోకములో ఏడేండ్లు శ్రమల విందు అనగా ఎత్తబడిన వారికి పప్పలు. ఎత్తబడని వారికి తిప్పలు. కాబట్టి పెండ్లికుమార్తె సంఘముగా నుండవలెను. ఎవరైతే సంస్కా భోజనము పొందెదరో మరియు కృతజ్ఞతతో పైవన్నీ చేస్తారో కృతజ్ఞతతో ఎవరు సిద్ధపడగలరో వారు లవొదికయ సంఘ తరగతికి తయారగుదురో వారికి ఆ విందు భాగ్యము దొరుకును. ఈ లోకములో మరణము మనకు రాకముందె మనము సిద్ధపడవలెను. మరణము మన దగ్గరకు వచ్చిన తరువాత నిరుకు చెప్పలేము. జీపహాహారమును పుచ్చుకొని మరణము లేకుండ మోక్షమునకెళ్ళగలము.
- 6. పెండ్లి విందు:- ప్రకటన 19:9. పెండ్లికుమార్తె పెండ్లి కుమారునికి కలిగిన సమస్తము ననుభవించుటకు హక్కు గలదు. పెండ్లి సమయమందు పెండ్లి కుమారునినే పెండ్లికుమార్తె అనుభవించును. పెండ్లికుమారునికి కలిగిన సమస్తమును పెండ్లికుమార్తె పెండ్లి సమయమందు సంపాదించుకొనును. అలాగే రేపు మహిమలో క్రీస్తును క్రీస్తునకు కలిగిన సమస్తమును సంఘము అందుకొని అనుభవించును. అందుకే పెండ్లివిందైనది. మరి గొర్రెపిలయని ఎందుకన్నారు. ప్రభువు పెండ్లి విందుయని యెందుకు లేదు. పస్కా విందప్పుడు గొర్రెపిల్ల లేకపోతే విమోచన లేదు. మన్నా లేదు. అలాగే భూమిమీద లోకపాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల లేకపోతే మానవునికి గతిలేదు. అనగా దేవుడులేడు. దేవుడిచ్చు స్వాస్థ్యములేదు. ఈ గొర్రెపిల్ల దేవునిని దేవుడిచ్చు స్వాస్థ్యమును సంపాదించినది. గనుకనే ఆ గొర్రెపిల్లకు ఈ పేరు. వధింపబడడానికి ఒప్పుకొనదు. గనుక ఆ గొర్రెపిల్లకు ఘనత ప్రభావము. అందుచేత ఆ గొర్రెపిల్ల పెండ్లివిందు అని వ్రాసినారు. ఈ గొర్రెపిల్లయే ఆ దేవుని గొర్రెపిల్ల.
- 7. పిలువబడినవారి విందు:- మత్తయి 11:28. గొర్రెపిల్ల లేకపోతే విమోచనలేదు. మన్నాలేదు. సాధువైన గొర్రెపిల్ల సింహాసనము దగ్గర లవొదికయ సంఘము పెండ్లికుమార్తెను పెండ్లికుమారుడైన ప్రభువు పిలుచును. ఈ విందునకు పిలువబడినవారే పెండ్లికుమార్తె. పెండ్లికుమార్తె. రక్షితులను పిలుచును. ప్రభువు 70 మంది సువార్తికులను సేవకొరకు పంపించెను. వారు తిరిగి వచ్చినపుడు వారి సేవా రిపోర్టును విని మీ పేర్లు పరలోక జీవ గ్రంథమందు ఉన్నవని వ్రాయబడియున్నవని చెప్పెను. లూకా 18:20. అలాగే ప్రభువు కొరకు పరిచర్య చేసిన వారిపేర్లు జీవగ్రంథమందు ఉన్నవని పౌలు చెప్పెను ఫిలిప్పీ 4:3 జీవగ్రంథమందు పేర్లు కలిగినవారె పరలోక విందునకు అర్హులు. ఎవరైతే ప్రతిదినము ఒకగంట దైవసన్నిధిలోయుందురో వారికి రెండవ రాకడ సూచన కనబడును. బైబిలు చదువుట, ప్రవర్తన, బోధ వీటన్నిటి సహాయమున్నదిగాని దైవసన్నిధిలోనుంటే సమస్తము సరియగును. అప్పుడు రెండవ రాకడకు సిద్ధపడుదుము. భూలోకములో ఆయన శరీర రక్తములలో పాల్గొనినరీతిగానే ఏడేండ్ల విందునకు అనగా పెండ్లివిందునకు సిద్ధపడగలము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక!