(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

18వ పాఠము(రక్షణ బల్ల)



వరుని మహిమ:-

అది రక్షణ బల్ల అందరికి గృహములోకాదు అది సంతుష్టిబల్ల. సంఘములో కాదు సంఘ బల్ల అందరికికాదు నా పాఠమేమంటే, ప్రభువు బల్ల సిద్ధముగా నున్నది. నీవు వచ్చినను రాకున్నను సరే అది సిద్ధముగానున్నది. మిషనెరీ బొట్లర్ ఏమిచేయును? అంతా సిద్ధముచేసి గంట వాయించును. అలాగే యేసుప్రభువు ఈ బల్ల సిద్ధము చేయించెను.

యేసుప్రభువు దేనిలో కనబడ్డారు? శరీర నేత్రములకు బోధకునికి కనబడెను గాని అవిశ్వాసికి కనబడడు గనుక హేళనచేయును. ఇంత దివ్యమైన భోజనం అనుభవించే విశ్వాసికి ఆ హేళన ఎందుకు? శరీర నేత్రములకు కూడా హేళనే. అవిశ్వాసికి ఆ హేళన ఎందుకు? తన తలంపు ఏమంటే యేసుప్రభువే ఇక్కడున్నాడు అనుకొనును. అది ఎప్పుడు సిద్ధముగా నున్నది. అది సోమవారమునాడే, మంగళవారము కూడా. బుధవారము, మరీ సిద్ధముగా నున్నది. ప్రభువు ఆనాడే అది మనకు తయారు చేసి యుండెను. శనివారము ఎందుకంటే ఆయన ఆదివారము కొరకు సిద్ధపడుచున్న దినము. శనివారము గనుక శనివారముకూడా సిద్ధముగానున్నది. ఆదివారము అయితే అసలే సిద్ధముగా ఉన్నది. గనుక ఎప్పుడైనా సరే. ప్రభువుబల్ల ప్రతిరోజూ సిద్ధముగా నున్నది.

పగలు సిద్ధముగానున్నది, రాత్రి, ఉదయం, సాయంకాలము, సోమవారమునుండి ఆదివారము వరకు సిద్ధముగానున్నది. సంవత్సరము పొడుగునా సిద్ధముగానున్నది. అది తీసివేయబడదు - ఎప్పుడో 2వేల సం॥ముల క్రిందట వేయబడిన బల్ల వేయబడి యున్నది. బల్ల తీసివేస్తే సంఘముకూడా తీసివేయబడవలసినదని సుందరసింగు అన్నారు. ఇచ్చేవారుంటే ప్రతిరోజు నేను ప్రభు భోజనము తీసికొంటాను అనెను. తిన్నా తినకపోయిన ప్రభువు బల్ల సిద్ధముగానేయున్నది. అయితే ప్రభువు బల్ల సిద్ధపర్చేదెవరు? ఆ ధనికుడు ఎంత గొప్పవాడు కాకపోతే అందరిని పిలుచును? అని ప్రజలు అనుకొన్నారు. ఈ బల్ల సిద్ధపరచినవాడు యేసుప్రభువు గనుక మనము తప్పకుండా శ్లాఘించవలెను యోహాను 15:13లో ఏమున్నది? ఒక స్నేహితుడు ఒక స్నేహితుని కొరకు ప్రాణమిచ్చుట కంటే గొప్పదేది? ప్రభువు తన శరీరము ఈ బల్ల రక్తము జీవము అని ఉన్నది. ఆయన తన ప్రాణము అర్పించెను గనుక అది మహా విలువైన భోజన సంస్కారము.

ప్రభువు ఈ కొద్ది మాటలను దీవించునుగాక!