(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

22వ పాఠము(సహవాస విందు)



దా.కీ. 23:1-6; మత్తయి 26:26-80; 1కొరింథి 11:23,24.


ప్రార్ధన:- యేసుప్రభువా! మమ్ములను నీ సంఘములోనికి పిలిచినావు. నీ రాజ్యములోనికి పిలిచినావు. అలాగే మమ్ములను నీ బల్లయొద్దకు పిలుచుచున్న పిలుపును నేడు ధ్యానించబోవుచున్నాము. కాబట్టి నీకు వందనములు. ఈ విందు తరువాత పరలోకమునకు పిలువనైయున్నావు. ఈ నివాసములో నుండి నీ సహవానము చేయునట్లు ఆత్మ సహాయ మిమ్మని యేసు నామమున వేడుకొంటున్నాము ఆమేన్.


ప్రియులారా! ఈ ఉదయకాలమున ప్రభువుయొద్దకు వచ్చిన మనము మొదటి ఆజ్ఞలో రెండున్నవి

దేవుడు నీ దేవుడనన్నాడు. గాని ఈ మనిషి ఆ సహవాసమును కల్పించుకొనలేదు. నేడు బల్ల సహవాసమునకు మనము రావలెను. అలాగే రాకడ పెండ్లివిందులో పాల్గొనవలెను. ఆయన నహవాసములోనికి మనలను పిలుచుచున్నాడు. ఈ భోజనము సంతోషము, సహవాసము మరియు ఈ అనంతములోనికి తనను నమ్మిన శిష్యులను పిలుచుచున్నాడు. మన పాపముల నుండి యెడబాపు కలిగి ప్రభువు పిలిచె ఈ సహవాసములోనికి రావలెను. బలవంతముగానైన ఈ యెడబాపును కలిగించుకొనవలెను.

ఈ మూడు విందులుకూడ విశ్వాసికొరకు ఏర్పాటుచేయబడినవి. గాన ధ్యానించండి. రక్షణవిందు మానవుడు తన పాప జీవితములోనుండి రక్షణ విందులోనికి, సంస్కారవిందులోనుండి పెండ్లివిందులోనికి రావలెను. ప్రయాసపడి భారము మోసికొనిపోవుచున్న నమస్త జనులారా! నాయొద్దకు రండి. ప్రయాసమున్నది, భారము మోయుచున్నది గనుక వీటిని విడచి రక్షణ విందునకు రావలెననియున్నది.


ఈ మూడు మూడురీతులుగా యున్నవి. ఒక వరుసలో నున్నవైన కాలములను బట్టి వేరుగా నుండును. పాప జాబితాలోనున్న మనిషి శుభవార్త రావలెను. విందు, అనగా భోజనము కంటె విలువైనది రక్షణ. అనగా మనిషి తన చెడు నైజము విడిచి రక్షణానందమును పొందుటకు రావలెను. ఎప్పటికిని మనిషి తనలోని చెడునైజము తనంతటతాను తీసివేసికొనలేదు. ఒకవేళ తీసివేసికొనిన తల్లిదండ్రుల పాపనైజము గనుక అది పోదు. తల్లిదండ్రులు భక్తులైనయెడల తాత ముత్తాతలు పాపులైతే అట్టివారికి రక్షణభాగ్యమనుగ్రహించుట దుర్లభము. ఒకవేళ దేవా! నేను పాపిని నా నైజము చెడు నైజమని చెప్పగలముగాని దానిని తీసివేసికోలేము. ఇది ఒప్పుదల. ఈలాగుచేస్తే పాపస్థితి నుండి ఒక అడుగు ముందునకు వచ్చి రక్షణ మార్గములో పడినాడందుము. చెడు నైజమును తీసివేసికొనలేరు రెండవ పర్యాయము తండ్రి నాలో చెడు నైజమున్నది. విసర్జించుట అసహ్యించుకొనుట ఇష్టమని చెప్తే మంచిదే దారిలోపడ్డాడు గాని నైజము వానిలోనుండి పోలేదు అది ప్రభువు తీసివేయవలెను.


ఉదా:- రోగియున్నాడు. తన స్థితి అంతయు డాక్టరుగారితో చెప్పగలడు గాని తనంతటతాను తీసివేసికోగలడా? లేదు. అది డాక్టరుగారి పని అలాగే ఓ పాపి! పాపములన్నీ ఒప్పుకొనుట నీ పని పాపమును తీసివేయుట ప్రభువు పని. ప్రభువు నూతన సృష్టియనుకున్నాడు అది ఆయనివ్వగలడు. రక్షణవాదనకు రావచ్చునుగాని వారికి శక్తి లేదు. నన్నుబట్టి తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఆదాము అవ్వలదికూడ వారిలో దురితనైజము తీసివేసికొంటేనే గాని రక్షణ విందునకు సహాయపడదు. ప్రభువుయొద్దకు పాపిరాగానే కౌగలించుకొనును ఎలాగనగా తండ్రి తన కుమారుడు తప్పిపోయినప్పుడు కాగలించుకొనలేదా? ఆ పాపిని ముద్దు పెట్టు కొనలేదా? ఆయనను శుభ్రముచేసి ఆయనకు పాద రక్షకులను తొడిగించి నూతన వస్త్రములను ధరింపజేసి ఉంగరములనుబెట్టి తన యింటిలోనికి తన కౌగిటలోనికి చేర్చుకొనలేదా? అదే అనలైన రక్షణ విందు.

అంత ఉచితము సంతార్పణకు వచ్చిన వాడిదగ్గరేమియు పుచ్చుకొననట్లే అలాగే ఉచితముగా తన తండ్రి తన కుమారునికిచ్చెను. అలాగుననే చేయక తన కుమారుని గద్దించిన యెడల తండ్రి సముఖము నుండి పారిపోయేవాడు. అలాగున తండ్రి చేయలేదు. నా తండ్రి పనివారలతోపాటు సమానముగా కూర్చుండబెట్టి భోజనము పెట్టునననుకున్నాడు. యింత ఆధిక్యత తనకు లభించుననుకొనలేదు. సమస్తమైన వారలారా రక్షణ విందు ఆయన యిస్తే ప్రభువు రాత్రి భోజనపు విందనుభవించగలరు.


పాపముల జాబితాను విడువకపోతే రక్షణ విందులోనికి రాలేము. వారికి యీ అనుభవము తెలియదు. అనుభవించిన వారికర్థమగును. అప్పుడే రుచి, అనుభవము తెలియును. యీ పాపి పాపము చేసినందువలన యితడెంత విందులోనికి వెళ్ళిన తాను విడచిన దుష్ట గుణములు, తనదగ్గరనె తిరుగుచుండును. ఈ విందులో నుండి బయటకు వెళ్ళిన యెడల అవి అతనిని చేరుకొనును. రక్షణ విందులో స్థిరముగనుండె ఆత్మీయమైన భోజనము కలిగి ఆత్మీయానందములో నుండే సంస్కార బహిరంగ విందులోనికి రాగలము. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన విందు. గొప్ప ఆనందము విశ్వాసికి కలుగును.


ఈ ఆనందము ఆత్మీయముగా నుండును. ఈ విందు కంటికి కనబడదుగాని కంటికి కనబడునట్లు విందు ననుభవించుచున్నారు. అనగా వీరు తప్పిపోయిన కుమారుని జాబితాలోనివారు రక్షణవిందులో రక్షింపబడుచున్నారు. వారు విడచిన పాపములు, పందులు, పొట్టు, ఎరుకులవానియొద్దనున్న మనిషి (బురద), దుర్గంధము దరిద్రత వస్త్రహీనత నుండి రక్షింపబడినాడు. గాన రక్షణ విందు అనుభవించగలిగినాడు. సంస్కారపు విందులో ప్రభువు తన రక్తముననగా జీవము తన శరీరము నిచ్చుచున్నాడు.


మరియు తెల్లని వస్త్రములు, విందు, పాద రక్షలు, స్నానము, వస్త్రములు, భోజన తప్పిపోయిన కుమారునికి తండ్రి ఉచితముగా ఇచ్చినట్లు. తండ్రి తన రక్తమును, శరీరమును ప్రాణము తన బిడ్డలకు ఉచితముగా ఇచ్చుచున్నాడు. విందుచేసిన ప్రభువు ముఖము కనబడకపోయిన మనకు ఏమి సంభరము (సంతోషము). అలాగే ప్రభువు యిచ్చిన రక్షణ విందు సహవాసము ఆయన అంతరంగము బహిరంగముగా దొరుకును. సంస్కారపు విందును ఆయావిధములుగా పుచ్చుకొందురు. కొందరు మూడు నెలలకొక పర్యాయము పాదిరిగారిద్వారా దొరుకుచుండును.


మరి కొందరు నెలకొక పర్యాయము. అలాగే మరికొందరు వారమునకొక పర్యాయము. విశ్వాసులైతే అనుదినము పుచ్చుకొందురు. అంతరంగ, బహిరంగ సంస్కారపు భోజనము ప్రభువు ఇచ్చును. సాధుసుందర్ సింగుగారు అన్నారు రోజూ ఇచ్చు గురువులుంటే రోజు సంస్కారము పుచ్చుకొంటానన్నారు. ఈ విధముగా సంస్కారపు భోజనమున కలవాటుబడిన పరలోకపు పెండ్లి విందునకు అలవాటుపడుదురు. రెండవ రాకడలో ఎత్తబడినవారు ఏడేండ్లు విందు అనుభవించెదరు. అట్టి మహాభాగ్యము మీకు అనుహ్రింపబడునుగాక!