(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

4వ పాఠము(యోగ్యతా బలము)



1కొరింథి. 11:27. దయగల ప్రభువా! మేము నీ బల్లయొద్దకు రాబోవుచున్నాము. గనుక మేమెట్లు సిద్ధపడవలెనో అది మాకు నేర్పించుము. రావలసినవారిని రప్పించి రాకూడని వారిని రానియ్యకుము. దూతలను కావలియుంచి దయ్యములను వెళ్ళగొట్టి మనస్సాక్షి జ్ఞానం ప్రత్యక్షము, విశ్వాసము, ధైర్యమును వెలిగించుము నామకముగా గాక సమస్తమును నీ దృష్టికి అనుకూలమైన రీతిగా జరిగించుమని వేడుకొంటూయున్నాము. ఆమేన్.


I. రెండు ముఖ్యమాటలు: అయోగ్యముగా పుచ్చుకొనుటనుబట్టి అపరాధియగుదుము, అయోగ్యముగా పుచ్చుకొనకూడదు. అట్లు పుచ్చుకొనిన యెడల అతడు నేరస్థుడగును.

ఈ రెండు నేరములుంటే నాశనమే. పాపమేమైన యున్నదా? అని చెప్పనుగాని అయోగ్యము యున్నదా అని చెప్పుచున్నాము. పౌలు పాపములనుగూర్చి ఈ సందర్భములో చెప్పలేదు. పాపము అసలే పనికిరాదు.


అయోగ్యత అనగా : మనిషి ఉన్నాడు అతనికి జబ్బు ఉన్నది. అప్పుడు భోంచేయలేడు. జబ్బు తీసివేసికొనవలెను. మనిషి ఉన్నాడు పాపము తీసివేసికుంటాడు శుభ్రమైపోయాడు. జబ్బు తీసివేసి శుభ్రమైన తరువాత ఇంకా భోజనము మామూలుగా తినుటకు యోగ్యుడు కాడు. అదే యోగ్యత. పాపము పోయిన తరువాత ప్రభువు భోజనము పుచ్చుకొనుటకు వీలులేదు. ఎందుకనగా అయోగ్యత ఇంకా యుండును. ప్రభువు భోజనము కాదుగాని అది విందు ఎక్కువ పాపశుద్ధి పొందనివాడు విందు ఆరగించుటకు యోగ్యుడుకాడు. జబ్బు పోయినవాడు భోంచేయగలడు. భోజనములో ఒకటి రెండు కూరలుండును. ఇతడు విందుకు తగడు. జబ్బు పోయిన మనిషి బలపడి మామూలు భోజనానికి అలవాటు పడినగాని విందుకు వెళ్ళలేడు. పాపము పోయిన పిదప మనిషికి నీరసముండును. వాక్యం ద్వారా బలపడి విందులోనికి వెళ్ళవలెను. బలపడకుండ విందులోనికి వెళ్ళుటే అయోగ్యత. కొందరు పాపాలు ఒప్పుకొనరు, విసర్జించరు, పాపపరిహారము పొందరు అది యోగ్యత అయితే పాపాలు ఒప్పుకొని, విసర్జించి, పరిహారము పొంది ప్రార్థించి, తీర్మానాలుచేసి వాక్యంవల్ల బలపడి ప్రభువు బల్లయొద్దకు రాగా అయోగ్యత పోవును.

II. అయోగ్యత అనగా ఇంకా ఏమిటి? అయోగ్యముగా పుచ్చుకొనకూడదని పౌలు చెప్పెను.

ఏమిటి నిబంధన? ఇశ్రాయేలీయులారా? నేను మీ దేవుడను అనగా ఇశ్రాయేలీయుల ప్రభువా! నీవే మా దేవుడవు అని అంటే అదే నిబంధన.


క్రొత్త నిబంధన: ప్రభువు + శిష్యులు ఈ భోజనమువల్ల ఒకటే అవుదురు. పాతనిబంధనలో దేవుడు+ప్రజలు నిబంధన వలన ఒకటైపోయిరి.


ఉదా:- హరిజనులు భోజనము సిద్ధముచేయగా బ్రాహ్మణులు తినిన భోజనమువల్ల ఒకటే అగుదురు.


III. జ్ఞప్తి:- ప్రభువు మరణమును జ్ఞప్తి తెచ్చుకొనుటే యోగ్యత. ఈ మూడింటిని గౌరవించుట యోగ్యత గౌరవించకపోవుట అయోగ్యత ఆహా యేసుప్రభువా! పాపపరిహారం అనుగ్రహించినావుగదా యని ప్రభువా! నాకు రావలసిన మరణము నీవు పొందినావు గదాయని గౌరవము కలిగి రెండవ రాకడ వచ్చు పర్యంతము.

ఆయన రాకడ:- ప్రకటన గ్రంథములో 7సం॥రాలుండేది నిత్యమైన విందు.

ప్రార్ధన:- దయగల ప్రభువా! మేము బల్లయొద్దకు వచ్చుచున్నాము. గనుక రక్తబలము, శరీరబలము అనుగ్రహించుము. యోగ్యతగా పుచ్చుకొనుటవల్ల మేము ని బలమును పొందగలము. ఆవిధంగా పుచ్చుకొనుటకు మమ్మును సిద్ధపర్చుమని ప్రభువుద్వారా వేడుకొంటుటూయున్నాము. ఆమేన్.